సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బాధితులను ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్‌ను ట్విటర్‌లో కోరారు. (చదవండి: ఒకే ఇంట్లో ముగ్గురు కోవిడ్‌తో మృతి)
అదే విధంగా ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి అంబులెన్స్‌లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.
జెండా ఊపి అంబులెన్స్‌లు ప్రారంభిస్తున్న కేటీఆర్
అదే విధంగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 44,572 మంది కోలుకొని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 13 మంది కరోనాతో మృతి చెందగా,మొత్తం మృతుల సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15, 640 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 521 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారిగా రంగారెడ్డి 289, వరంగల్ అర్బన్ 102, మేడ్చల్ 151, కరీంనగర్ 97, నల్గొండ 61 మహబూబ్‌నగర్ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఊరట : పది లక్షలు దాటిన రికవరీలు)
Comments
Please login to add a commentAdd a comment