Telangana Minister KTR Corona Positive Went Under Home Isolation - Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌

Published Fri, Apr 23 2021 9:37 AM | Last Updated on Fri, Apr 23 2021 12:43 PM

Telangana Minister KTR Tested Covid Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకు కరోనా సోకినట్లు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవలే కోవిడ్‌ బారిన పడి తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం పూర్తిస్థాయిలో చక్కబడిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎం.వి.రావు గురువారం మీడియాకు తెలిపారు.

ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలియజేశారు. బుధవారమే ఆయనకు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించగా, గురువారం వాటన్నింటినీ పరిశీలించినపుడు అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందన్నారు. సీఎంకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని ఇదివరకే వెల్లడి కాగా, రక్తనమూనాలు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని డా.ఎం.వి.రావు తెలిపారు.


చదవండి: లక్షల్లో అడిగితే వేలల్లో ఇస్తారా? కేంద్రంపై ఈటల ఫైర్‌
వెంటిలేటర్‌పై 30% యువకులే.. జాగ్రత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement