KTR: మాండ్యా మహిళను ఆదుకుంటాం | DSK Tweet To KTR After Hyderabad Hospital Releases Mandya Patient Body | Sakshi
Sakshi News home page

KTR: మాండ్యా మహిళను ఆదుకుంటాం

Published Mon, May 31 2021 1:30 PM | Last Updated on Mon, May 31 2021 1:30 PM

DSK Tweet To KTR After Hyderabad Hospital Releases Mandya Patient Body - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక రాష్ట్రం మాండ్యా ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుటుంబానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆపన్నహస్తం అందించారు. శశికళ మంజునాథ్‌ అనే ఆ మహిళకు సాయం చేస్తామని ఆయన కర్ణాటక కాంగ్రెస్‌ నేత డి.కె. శివకుమార్‌కు హామీ ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. మాండ్యాకు చెందిన మహిళ భర్త హైదరాబాద్‌లోని మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఆస్పత్రి యాజమాన్యం రూ.7.5 లక్షల బిల్లు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పింది. కానీ ఆమె రూ.2 లక్షలు మాత్రమే చెల్లించగలరని, ఈ విషయంలో సాయం చేయాలని డి.కె.శివకుమార్‌ ఆదివారం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పోస్ట్‌ చేశారు. తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు. శివకుమార్‌ అభ్యర్థనపై 36 నిమిషాల్లోనే కేటీఆర్‌ స్పందించారు. శశికళకు సాయం చేస్తామని భరోసా ఇస్తూ శివకుమార్‌కు రీ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement