జూన్ నాటికి 7 వేల మంది ఉద్యోగుల ఫిట్‌మెంట్ పూర్తి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్‌లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment