merger process
-
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో మూడు సంస్థల విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో (టీసీపీఎల్) మూడు అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఇతరత్రా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడంతో దీన్ని పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. విలీనమైన వాటిల్లో టాటా కన్జూమర్ సోల్‌ఫుల్, నరిష్ కో బెవరేజెస్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్ ఉన్నాయి. వ్యాపారాన్ని క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు టీసీపీఎల్ తెలిపింది. టీసీపీఎల్‌కు రూ. 15,206 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవరు ఉంది. టీ, కాఫీ, ఉప్పు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, స్నాక్స్, మినీ మీల్స్ లాంటివి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ గ్రాండ్ తదితర కీలక బెవరేజ్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. -
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్‌లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. -
ఎయిరిండియా– విస్తారా విలీనం వేగం!
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ వేగమందుకోనుంది. ఇందుకు సింగపూర్ నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్(సీసీసీఎస్) షరతులతోకూడిన అనుమతులు ఇచి్చనట్లు ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. దీంతో రెండు సంస్థలూ తమ షెడ్యూళ్లు, కాంట్రాక్టులు తదితర సవివర సమాచారాన్ని ఇచి్చపుచ్చుకునేందుకు అనుమతి లభించినట్లు తెలియజేశారు. 2022 నవంబర్‌లో ఎయిరిండియాలో విస్తారా విలీన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకోనుంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి సంయుక్త సంస్థ(జేవీ)గా విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. -
జీఎంఆర్ ఇన్ఫ్రాలో ‘ఎయిర్‌పోర్ట్స్’ విలీనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో (జీఐఎల్)లో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ (జీఏఎల్) విలీనం కానుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా పటిష్టంగా ఎదిగేందుకు ఇది దోహదపడగలదని జీఐఎల్ వివరించింది. ఎయిరోపోర్ట్స్ డి పారిస్ (గ్రూప్ ఏడీపీ)తో జీఎంఆర్ భాగస్వా మ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయపడగలదని పేర్కొంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రా 2020లో గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తాజా విలీనానంతరం జీఐఎల్‌లో జీఎంఆర్ గ్రూప్‌నకు అత్యధికంగా 33.7 శాతం, గ్రూప్ ఏడీపీకి 32.3 శాతం, పబ్లిక్ వాటాదారుల దగ్గర 34 శాతం వాటాలు ఉంటాయి. 10 ఏళ్ల విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల జారీ ద్వారా గ్రూప్ ఏడీపీ నుంచి 331 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,900 కోట్లు) సమీకరించనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. -
జీ, సోనీ విలీనం దిశగా మరో ముందడుగు
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడింది. విలువ మదింపునకు సంబంధించి చర్చల ప్రక్రియకు గడువు ముగియడంతో నెట్‌వర్క్‌లు, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రోగ్రాం లైబ్రరీలు మొదలైన వాటిని విలీనం చేసే విధంగా ఇరు సంస్థలు నిర్దిష్ట ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జీల్, ఎస్పీఎన్ఐ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎస్‌పీఎన్‌ఐలో జీల్ విలీన డీల్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ (ఎస్పీఈ) 1.575 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. దానికి ప్రతిగా 50.86 శాతం వాటాలు దక్కించుకుంటుంది. జీల్ ప్రమోటర్లకు (వ్యవస్థాపకులు) 3.99 శాతం, ఇతర జీల్ షేర్హోల్డర్లకు 45.15 శాతం వాటాలు ఉంటాయి. డీల్ పూర్తయ్యాక విలీన సంస్థను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేస్తారు. జీల్ సీఈవో పునీత్ గోయెంకా ఎండీ, సీఈవోగా కొనసాగుతారు. ‘భారతీయ వినియోగదారులకు మెరుగైన వినోదం అందించేందుకు.. మీడియా రంగంలో అత్యంత పటిష్టమైన 2 టీమ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, ఫిలిమ్ లైబ్రరీలను ఒక తాటిపైకి తెచ్చే దిశగా మా ప్రయత్నాల్లో ఇది కీలక అడుగు‘ అని ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఎస్పీఈ చైర్మన్ (గ్లోబల్ టెలివిజన్ స్టూడియోస్) రవి అహుజా తెలిపారు. వినియోగదారులకు విస్తృత స్థాయిలో కంటెంట్ అందించేందుకు ఈ డీల్ దోహదపడగలదని పునీత్ గోయెంకా పేర్కొన్నారు. -
యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సమస్యలు ఉన్నప్పటికీ .. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ యథాప్రకారంగానే కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విలీనాలు అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా బ్యాంకుల విలీనానికి డెడ్‌లైన్ పొడిగించే అవకాశముందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ .. ‘ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు‘ అని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డెడ్‌లైన్‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలంటూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండటంతో బ్యాంకింగ్ సేవలపైనా ప్రతికూల ప్రభావం ఉంటోంది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు భారీ బ్యాంకర్లుగా విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. విలీన ప్రక్రియ పూర్తయితే ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న బ్యాంకులు ఉంటాయి. ప్రణాళిక ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్.. కార్పొరేషన్ బ్యాంకును విలీనం చేస్తున్నారు. -
రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్ఎల్ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండగా.. గత పదేళ్ల నుంచి ఎంటీఎన్ఎల్ నష్టాలను ప్రకటిస్తోందని చెప్పారు. ఇరు సంస్థల రుణ భారం రూ. 40,000 కోట్లుగా ఉందన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్)కు 77,000 మందికి పైగా, ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్కు 13,532 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. -
3 బీమా సంస్థల విలీన ప్రక్రియ షురూ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన మూడు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల విలీన ప్రక్రియపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీనిపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయని, అయితే ఇవింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విలీనానికి సంబంధించి పూర్తి మార్గదర్శక ప్రణాళిక ఇంకా రూపొందించాల్సి ఉందని వివరించాయి. 2018–19 బడ్జెట్లో ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థల విలీన ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు బీమా సంస్థలు కలిసి 2016–17లో మొత్తం రూ. 44,000 కోట్ల ప్రీమియం వసూళ్లు సాధించాయి. సాధారణ బీమా రంగంలో ఈ మూడింటి వాటా 35 శాతం దాకా ఉంటుంది. వీటిని విలీనం చేసిన పక్షంలో భారీ జనరల్ ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ ఏర్పాటు అవుతుంది. 2018–19లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ. 80,000 కోట్ల నిధుల సమీకరణలో ఈ విలీనం కీలక పాత్ర పోషించనుంది. గతేడాదే ప్రభుత్వ రంగానికి చెందిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థలు లిస్టయ్యాయి. -
విలీన ప్రక్రియ కొనసాగుతోంది: ఎస్బీఐ
నోట్ల రద్దు ప్రభావం ఉండదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ సరైన దిశలోనే కొనసాగుతోందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత నోట్ల రద్దు కార్యక్రమం వల్ల విలీనంలో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేసింది. అధిక విలువ కలిగిన నోట్లను వెనక్కి తీసుకునే కార్యక్రమం కారణంగా విలీనంలో జాప్యం ఉంటుందా? అని సోమవారమిక్కడ విలేకరులు ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను అలా అనుకోవడంలేదన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధానం గురించి మాట్లాడుతూ... వడ్డీ రేట్లను తగ్గించకుంటే అదే అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయంగా పేర్కొన్నారు. ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను తగ్గిస్తే ఆ మేరకు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తామని రజనీష్ చెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు, భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం అవుతున్న విషయం తెలిసిందే. తుది విలీన ప్రణాళికకు ఆర్బీఐ, ప్రభుత్వ ఆమోదం కోసం ఎస్బీఐ వేచి చూస్తోంది. ఆర్బీఐ అదనపు సీఆర్ఆర్ తగ్గించాలి: ఎస్బీఐ అంతర్గత నివేదిక బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక్కసారిగా వచ్చిన నగదును లాగేసేందుకు పెంచిన నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) రిజర్వ్ బ్యాంక్ వెంటనే తగ్గించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని ఎస్బీఐ తన అంతర్గత నివేదిక ఎకోరాప్లో పేర్కొంది. సీఆర్ఆర్ అదనంగా పెంచడం వల్ల బ్యాంకులపై మరింత భారం పడుతోందని, ఇలాంటపుడు లిక్విడిటీని తగ్గించడం కోసం వ్యవస్థను కుదిపేయకుండా ఉండేటువంటి విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
విలీన బాటలో మరో అడుగు!
త్వరలో ఆర్బీఐకి ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల వాటాదారులు ధ్రువీకరించిన స్కీమ్ న్యూఢిలీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఐదు అనుబంధ బ్యాంకులు త్వరలో తమ వాటాదారులు ధ్రువీకరించిన విలీన స్కీమ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి సమర్పించనున్నాయి. విలీన బ్యాంకుల షేర్‌హోల్డర్ల లిఖితపూర్వక అభ్యంతరాల పరిశీలనకు ఎస్బీఐ ఏర్పాటు చేసి న నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను తన బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు సోమవారం పరిశీలించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. విలీనం విషయమై ఆగస్టు 18 స్కీమ్‌ను యథాతథంగా బోర్డ్ ఆమోదించినట్లు కూడా పేర్కొంది. షేర్‌హోల్డర్ల అభ్యంతరాలపై ఎస్బీఐ నిపుణుల కమిటీ నివేదికను, అలాగే బోర్డ్ ఆమోదించిన ఆగస్టు 18 స్కీమ్‌ను పరిశీలన, ఆమోదాల నిమిత్తం త్వరలో ఆర్బీఐకి సమర్పించడం జరుగుతుందని వివరించింది. పరిశీలన, ఆమోదం తరువాత వీటిని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆయా అంశాలకు అనుగుణంగా 1955 ఎస్బీఐ యాక్ట్ 35వ సెక్షన్ కింద కేంద్రం విలీన ఉత్తర్వు జారీ చేస్తుంది. ఎస్బీబీజేతోపాటు మరికొన్ని అనుబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ) లు కూడా సోమవారం ఈ తరహా ప్రకటనలనే చేశాయి. వీటితోపాటు మరో రెండు అనుబంధ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా అలాగే భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. స్వాప్ రేషియోల మార్పు! కాగా ఎస్బీఐ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్కెట్లో లిస్టయిన ఎస్బీటీ, ఎస్‌బీబీజే, ఎస్‌బీఎంలకు సంబంధించి షేర్‌హోల్డర్ల కీలక అభ్యంతరాన్ని పరిశీలనలోకి తీసుకుని మిగిలిన వాటిని తిరస్కరించినట్లు ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ (అసోసియేట్స్ అండ్ సబ్సిడరీస్) నీరజ్ వ్యాస్ తెలిపారు. షేర్ల మార్పిడి (స్వాప్ రేషియో)లో మార్పులు చేయాలన్నది పరిశీలనలోకి తీసుకున్న కీలక అంశంగా వివరించారు. రేషియోను తిరిగి ధ్రువీకరించాలని నేటి సమావేశాల్లో ఎస్బీటీ, ఎస్‌బీబీజే, ఎస్బీఎం బోర్టులు కూడా నిర్ణయించడం గమనార్హం. ‘ఈ ప్రతిపాదనను ఎస్బీఐ బోర్డ్‌కు రెండు, మూడు రోజుల్లో పంపడం జరుగుతుంది. తుది నిర్ణయం తరువాత దీనిని ఎస్బీఐ బోర్డ్ ఆర్బీఐకి పంపుతుంది. దీనిని ధ్రువీకరించి కేంద్రానికి ఆర్బీఐ సమర్పిస్తుంది. తదనుగుణంగా తదుపరి నిర్ణయం ఉంటుందని’ స్వాప్ గురించి తాజా ప్రక్రియను వ్యాస్ వివరించారు. ఎస్బీఐ బోర్డ్ ఆగస్టు 18న చేసిన ప్రకటన ప్రకారం, ఎస్బీబీఐ షేర్హోల్డర్లు తమ ప్రతి 10 షేర్లకూ (రూ.10 ముఖవిలువ) ఎస్బీఐకి చెందిన 28 షేర్లను (రూ.1 ముఖవిలువ) పొందుతారు. ఎస్బీఎం, ఎస్బీటీ షేర్‌హోల్డర్ల విషయంలో ఈ షేర్ల సంఖ్య 22గా ఉంది. ఇక భారతీయ మహిళా బ్యాంక్ ప్రతి 100 కోట్ల ఈక్విటీ షేర్లకు (రూ.10 ముఖవిలువచొప్పున) రూ.1 ముఖ విలువ కలిగిన 4,42,31,510 ఎస్బీఐ షేర్లు పొందుతుంది. మార్చి నాటికి విలీన ప్రక్రియ పూర్తి విలీన ప్రక్రియ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమై, వచ్చే ఏడాది మార్చినాటికి ముగియాలన్నది ప్రణాళిక అని ఇటీవల ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ విలీన ప్రక్రియ వల్ల ఎస్బీఐ బ్యాంక్ అసెట్ బుక్ విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. 24,000 బ్రాంచీలు, 58,000 ఏటీఎం నెట్‌వర్క్‌తో కస్టమర్ల సంఖ్య 50 కోట్లకు పెరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద 50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ అవతరిస్తుంది. అతిపెద్ద భారత ప్రైవేటు దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌తో పోల్చితే అసెట్ బేస్ ఐదు రెట్లు పెరుగుతుంది. 36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలుసహా ప్రస్తుతం ఎస్బీఐ 16,500 బ్రాంచీలను కలిగిఉంది. 2008లో ఎస్బీఐలో మొదటిసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర విలీనమైంది. అటుతర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇం డోర్ విలీనం జరిగింది. -
మెగా ఎస్బీఐకి తొలి అడుగు!
* అనుబంధ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ కసరత్తు షురూ * కార్యాచరణ కోసం 15-20 మంది సభ్యులతో బృందం * 3-4 నెలల్లో విలీన ప్రక్రియ మొదలు..! ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపాదిత విలీనంపై కొన్ని రాజకీయ పక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం.. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర రావాల్సి ఉన్నప్పటికీ ఎస్బీఐ మాత్రం ఈ దిశగా చర్యలు ప్రారంభించడం గమనార్హం. అయిదు అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి కార్యాచరణను సిద్ధం చేయడం కోసం 15-20 మంది అధికారులతో ఒక బృందాన్ని ఎస్బీఐ ఏర్పాటు చేసింది. జనరల్ మేనేజర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తున్నారని.. ఇందులో ఇంకొందరు డిప్యూటీ జనరల్ మేనేజర్లు కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అసోసియేట్ అండ్ సబ్సిడరీస్ విభాగం ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనుంది. ఈ విభాగం బ్యాంక్ ఎండీ వి.జి కన్నన్ నేతృత్వంలో పనిచేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3-4 నెలల్లో విలీన ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదమే తరువాయి... భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను(స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, హైదరాబాద్, మైసూర్, ట్రావన్‌కోర్, పాటియాలా) విలీనం చేసుకునే ప్రతిపాదనను ఎస్బీఐ డెరైక్టర్ల బోర్డు గత నెలలో ఆమోదించడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించిన సంగతి తెలిసిందే. అన్ని అనుబంధ బ్యాంకులను ఒకేసారి విలీనం చేసుకోవాలనేది ఎస్బీఐ యోచన. ఇవన్నీ టెక్నాలజీ పరంగా ఒకే ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తున్న నేపథ్యంలో విలీనానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, విలీన ప్రతిపాదనను ప్రభుత్వం మదింపు చేస్తోందని.. త్వరలోనే దీనిపై తాము నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే పేర్కొన్న విషయం విదితమే. త్వరలోనే కేబినెట్ ఆమోదం ఉండొచ్చని... విలీనాలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ విధానమని కూడా ఆయన చెప్పడం గమనార్హం. ఇప్పుడున్న అయిదు అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావెన్కోర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్నాయి. రాజకీయ పార్టీలు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత... కాగా, ఎస్బీఐ ఈ ప్రతిపాదనను ప్రకటించిన వెంటనే దీనికి వ్యతిరేకంగా అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు గత నెల 20న దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు. ఈ నెల 28న, జూలై 29న కూడా సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కేరళలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్(ఎస్బీటీ) విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ విలీన ప్రతి పాదనలపై తొలిసారి నిరసన గళం విప్పిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే. ‘తమ ప్రజలు ఎస్‌బీటీని కేరళ బ్యాంకుగానే చూస్తున్నారు. ప్రభుత్వానిది కూడా ఇదే అభిప్రాయం. అందుకే దీన్ని విలీనం చేయకుండా విడిగానే కొనసాగించాలి’ అని ఆ రాష్ట్ర కొత్త సీఎం పి. విజయన్ తాజాగా వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి బ్యాంక్ ఆవిర్భావం! విలీనం పూర్తయితే ప్రపంచస్థాయి బడా బ్యాంకులతో పోటీపడేవిధంగా మెగా ఎస్బీఐగా ఆవిర్భవిస్తుంది. దీని ఆస్తుల(బ్యాలెన్స్ షీట్ పరిమాణం) విలువ 555 బిలియన్ డాలర్లకుపైగానే(దాదాపు రూ.37 లక్షల కోట్లు) ఉంటుంది. ఇక అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపి చూస్తే... గతేడాది డిసెంబర్ నాటికి ఎస్బీఐకి 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో ఎస్బీఐ ఒక్కదానికే 16,500 శాఖలు(36 దేశాల్లో 198 విదేశీ కార్యాలయాలు సహా) ఉన్నాయి. తొలిసారిగా ఎస్బీఐ తన అనుబంధ బ్యాంకుల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను 2008లో విలీనం చేసుకుంది. ఆతర్వాత రెండేళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను కూడా కలిపేసుకుంది. -
పెద్ద బ్యాంకులుగా మిగిలేవి పదే!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయం ♦ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయంత్ సిన్హా వ్యాఖ్య బెంగళూరు: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీనం, పెద్ద బ్యాంకుల ఏర్పాటుపై ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మొండిబకాయిల సమస్య పరిష్కారం తక్షణ ప్రాధాన్యతగా పేర్కొన్న ఆయన... తదుపరి బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారిస్తుం దన్నారు. చివరకు పోటీపడే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 నుంచి పదే ఉంటాయని అన్నారు. మిగిలినవి ‘డిఫరెన్షియేటెడ్’ (నిర్దిష్ట కార్యకలాపాలు నిర్వహించే) బ్యాంకులుగా మిగులుతాయని వివరించారు. ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌కు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటు అవసరమన్నారు. ‘‘ప్రస్తుతం 27 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారం అయిన తర్వాత, కేవలం 8 నుంచి 10 పోటీ పూర్వక బ్యాంకులే ఉంటాయని నేను భావిస్తున్నాను. వీటిలో కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులుగా అవతరించే వీలుంది. మరికొన్ని డిఫెరెన్షియేటెడ్ బ్యాంకులుగా కొనసాగుతాయి’’ అని అన్నారు. -
బ్యాంకింగ్ విలీనాలను ప్రోత్సహిస్తాం..
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ♦ భారత్‌కు ప్రపంచస్థాయి బ్యాంకింగ్ సంస్థలు అవసరం ♦ ప్రభుత్వ విధానం ప్రకారమే ఎస్బీఐ ‘విలీన’ ప్రక్రియ న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీన ప్రక్రియ ప్రభుత్వ విధానమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి బ్యాంకింగ్ సంస్థలు భారత్‌లో ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియ ప్రభుత్వ విధానం ప్రకారమే జరుగుతోందని అన్నారు. బ్యాంకింగ్ రంగం పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన ఇంద్రధనస్సు ప్యాకేజీలో బ్యాంకింగ్ విలీనం కూడా ఒక భాగమని అన్నారు. ఫిబ్రవరి బడ్జెట్లోనూ బ్యాంకింగ్ విలీన అవసరాన్ని పేర్కొన్నట్లు ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రభుత్వ రంగంలో అనేక బ్యాంకులు అవసరమా? అన్న ప్రశ్న గురించి తాను ఆలోచిస్తుంటానని అన్నారు. బ్యాంకుల సంఖ్య తగ్గాల్సి ఉందనీ ఈ సందర్భంగా అన్నారు. ఎస్బీఐతో బ్యాంకుల విలీనానికి సంబంధించిన ప్రతిపాదన తమ వద్దకు వచ్చినప్పుడు దీనిని చాలా సానుకూల అంశంగానే పరిశీలిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. అయితే అదే సందర్భంలో ఏదైనా బ్యాంక్ తన సొంత అభిప్రాయాన్ని వెల్లడిస్తే.. ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఎస్బీఐ విలీన ప్రక్రియ నేపథ్యంలో అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) మంగళవారం ఒక ప్రకటన చేస్తూ... అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కాకుండా, తమలో తాము ఒకటిగా విలీనం కావాలని ఈ ఏడాది మార్చి 23, ఏప్రిల్ 25వ తేదీల్లో సంఘం ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారని తెలిపింది. . ఆర్థికమంత్రి అభిప్రాయాలను సైతం పట్టించుకోకుండా తనలో విలీనమయ్యేలా ఐదు అనుబంధ బ్యాంకులపై ఎస్బీఐ ఒత్తిడి తెచ్చినట్లు కనబడుతోందని విమర్శించింది. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియపై జైట్లీ ఒక స్పష్టమైన ప్రకటన చేయడం గమనార్హం. తక్షణ దృష్టి ఎన్పీఏల పరిష్కారమే... విలీనానికి మరిన్ని బ్యాంకులు ముందుకు వచ్చే వీలుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్ రుణ బకాయిల పరిష్కారమే ప్రస్తుత ప్రధాన ధ్యేయమని అన్నారు. బ్యాంకుల పటిష్టత, లాభదాయకతలు ప్రభుత్వ ప్రధాన ద్యేయమని తెలిపారు. అటు తర్వాతే విలీన ప్రక్రియ గురించి పూర్తిస్థాయిలో ఆలోచించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మెజారిటీ వాటాల విక్రయ ప్రణాళికలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, నీతి ఆయోగ్ సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. -
బ్యాంకు విలీనాలకు వేళాయెనా..!
♦ విలీన ప్రక్రియపై కేంద్రం కసరత్తు షురూ ♦ ఏ బ్యాంకును ఎందులో కలపాలనే బాధ్యత బ్యాంక్స్ బోర్డ్‌కు; ♦ సెప్టెంబర్ నాటికి స్పష్టత వస్తుందంటున్న బ్యాంకు ఉన్నతాధికారులు ♦ ఉద్యోగులకు షేర్లను కేటాయించడం ద్వారా బుజ్జగింపులు ♦ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనమంటూ ప్రచారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నో ఏళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమయ్యింది. ఇందుకోసం వినోద్‌రాయ్ నేతృత్వంలో తాజాగా బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) కూడా సమావేశమయ్యింది. త్వరలోనే విలీన కార్యాచరణకు సంబంధించి బీబీబీ ఒక రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వానికి సమర్పించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పుడున్న 27 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి... 6 నుంచి 10 బ్యాంకులుగా మార్చవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. మొండి బకాయిల పుణ్యమా అని అత్యధిక బ్యాంకులు నష్టాల్లోకి జారుకోవడం, లోక్‌సభలో అధికార పార్టీ పూర్తిస్థాయి మెజారిటీలో ఉండటంతో బ్యాంకుల విలీనానికి ఇదే సరైన తరుణమని, ఇప్పుడు కాకపోతే ఇక ఇది ఎప్పటికీ సాధ్యం కాదన్న ఆలోచనలో కేంద్ర ఆర్థిక శాఖ ఉంది. ఈ మధ్యనే బ్యాంకు ఉన్నతాధికారులతో జరిగిన ‘జ్ఞాన్ సంగమ్’ సమావేశంలో బ్యాంకు విలీనాలపైనే ప్రధానంగా చర్చించారు. ఏ బ్యాంకును ఎందులో విలీనం చేస్తే బాగుంటుందనే విషయాన్ని అధ్యయనం చేసి బీబీబీ ఒక నివేదిక ఇస్తుంది. నాల్గవ త్రైమాసిక ఫలితాల తర్వాత బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనా వస్తుందని, దీని ప్రకారం ఎన్ని బ్యాంకులు మిగులుతాయనే దానిపై స్పష్టత వస్తుందని ఈ విషయాలతో నేరుగా సంబంధం ఉన్న అధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. అంతేకాదు... విలీనాలను వ్యతిరేకిస్తున్న బ్యాంకు యూనియన్లను ప్రసన్నం చేసుకోవటానికి కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలీనాలపై యూనియన్ల అభిప్రాయాన్ని అడిగినట్లు ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘విలీనాల వల్ల ఉద్యోగుల తొలగింపు ఉండదని, విలీనాల తర్వాత కూడా ప్రభుత్వానికే మెజార్టీ వాటా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే భారీగా మొండి బకాయిలున్న ఐడీబీఐ బ్యాంక్‌ను మాత్రం ప్రైవేటీకరించనున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారు’’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు. మొండి బకాయిల సాకు..: నిజానికి ‘బ్యాలెన్స్ షీట్ క్లీన్ అప్’ పేరిట పీఎస్‌యూ బ్యాంకుల చేత తప్పనిసరిగా ఎన్పీఏలను ప్రకటింప చేయడం వెనుక కూడా విలీనాల ఎజెండా ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ‘‘బలహీన బ్యాంకులుగా ముద్ర వేసి డిపాజిట్‌దారులు, ఉద్యోగుల రక్షణకు విలీనమే శరణ్యమని చెప్పటమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. లేకపోతే మొన్నటి వరకు ప్రభుత్వానికి భారీ డివిడెండ్లు ఇచ్చిన బ్యాంకులు ఒక్కసారిగా నష్టాల్లోకి జారడమేంటి?’’ అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత త్రైమాసికంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నాలుగైదు తప్ప మిగిలినవన్నీ నష్టాలే ప్రకటించాయి. మార్చి 2015 నాటికి పీఎస్‌యూ బ్యాంకుల ఎన్పీఏలు 5.43 శాతంగా ఉంటే అదే ఏడాది డిసెంబర్ నాటికి 7.30%కి పెరిగిపోయాయి. వీటి విలువైతే రూ. 4.3 లక్షల కోట్లు. ఈ ఎన్పీఏల దెబ్బకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడంతో బ్యాంకులు నడవడానికి వచ్చే మూడేళ్లలో కనీసం రూ.1.80 లక్షల కోట్ల మూలధనం కావాలని అంచనా. కానీ వచ్చే ఏడాదికి బడ్జెట్లో కేటాయించింది రూ. 25,000 కోట్లే. అదనపు నిధులివ్వలేమనే సాకుతో బలమైన బ్యాంకుల్లో బలహీనమైనవి విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులకు షేర్ల ఎర... విలీనాలపై ఉద్యోగుల్లో మునుపటంత వ్యతిరేకత లేదు. దీన్ని తగ్గించడానికి ఆర్థికశాఖ... ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమన్న హామీని గట్టిగానే వినిపిస్తోంది. దీంతోపాటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ (ఈసాప్స్) కింద బ్యాంకు షేర్లను జారీ చేయనున్నట్లు కూడా ఆర్థికమంత్రి చెప్పారు. 27 పీఎస్‌యూ బ్యాంకుల్లో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీలీనాలతో ప్రమోషన్లు, సర్వీస్ లెక్కలు వంటి చిన్న చిన్న సమస్యలుంటాయని, వాటిని ఈజీగానే పరిష్కరించుకుంటామని యూనియన్ల నాయకులు చెబుతున్నారు. మరోవంక విలీనాలపై ఆర్థికశాఖ నుంచి లీకులు కూడా వెలువడుతున్నాయి. 27 బ్యాంకుల్ని 6 బ్యాంకులుగా కుదిస్తారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులన్నీ చట్ట సవరణ ద్వారా ఒకేసారి విలీనం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అనుబంధ బ్యాంకుల విలీనంపై ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదని, సెప్టెంబర్ తర్వాత దీనిపై స్పష్టత రావచ్చని ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ చెప్పారు. విలీనం వల్ల లాభమా నష్టమా అనేది నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.