న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ వేగమందుకోనుంది. ఇందుకు సింగపూర్ నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్(సీసీసీఎస్) షరతులతోకూడిన అనుమతులు ఇచి్చనట్లు ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు.
దీంతో రెండు సంస్థలూ తమ షెడ్యూళ్లు, కాంట్రాక్టులు తదితర సవివర సమాచారాన్ని ఇచి్చపుచ్చుకునేందుకు అనుమతి లభించినట్లు తెలియజేశారు. 2022 నవంబర్‌లో ఎయిరిండియాలో విస్తారా విలీన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకోనుంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి సంయుక్త సంస్థ(జేవీ)గా విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment