Vistara airline
-
24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. -
విస్తార కీలక ప్రకటన.. 20 నిమిషాలు ఫ్రీ వై-ఫై
అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల ఫ్రీ వై-ఫై అందజేస్తామని విస్తారా ప్రకటించింది. ఈ సర్వీస్ అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా విస్తారా రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్ అన్ని క్యాబిన్లలో ప్రయాణీకులకు 20 నిమిషాల వై-ఫై యాక్సెస్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఈ ఫ్రీ వై-ఫై సర్వీస్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ321 నియో విమానాల్లో మాత్రమే లభించనున్నాయి. ఈ వై-ఫై మరింత సమయం కావాలనుకున్నప్పుడు ప్లాన్స్ పొందాల్సి ఉంటుంది. విస్టారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఈ సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, దీపక్ రజావత్ వెల్లడించారు.బిజినెస్ క్లాస్, ప్లాటినం క్లబ్ విస్తార సభ్యులకు మరో 50 ఎంబీ డేటాను పొందవచ్చు. అన్లిమిటెడ్ వాట్సప్, ఫేస్బుక్ సేవల కోసం రూ. 372.74 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రూ.1577.54 + జీఎస్టీ చెల్లిస్తే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ లభిస్తుంది. రూ.2707.05 + జీఎస్టీ చెల్లిస్తే అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు.Don’t miss out on important updates even at 35000 ft. ! Get 20 minutes of complimentary in-flight Wi-Fi, a first in Indian Aviation. Now you can purchase the selected plans using Indian credit/debit card in addition to internationally issued credit cards. pic.twitter.com/NTYCOJFY5N— Vistara (@airvistara) July 27, 2024 -
ప్యారిస్–ముంబై విమానానికి బాంబు బెదిరింపు
ముంబై: పారిస్ నుంచి 306 మందితో ముంబై బయల్దేరిన విస్తారా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ‘బాంబు పెట్టాం’ అని రాసిన నోట్ ఎయిర్ సిక్నెస్ బ్యాగ్‌లో కనిపించింది. దాంతో ముంబైలో లాండవగానే అందరినీ హుటాహుటిన దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు సహా అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్ర క్రియ వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఇ రు సంస్థలకు చెందిన 7 వేల మంది ఉద్యోగుల ఫిట్ మెంట్ (ప్రస్తుత ఉద్యోగులను విలీన సంస్థలో వారికి అప్పగించే బాధ్యతలు) ప్రక్రియ జూన్ కల్లా పూర్తి కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రెండు సంస్థల ఉద్యోగులతో దాదాపు గంటన్నర పా టు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయాలు వి వరించినట్లు పేర్కొన్నాయి. ఇరు కంపెనీల్లో ప్రస్తుతం 23,500 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో తమకు జాయింట్ వెంచరుగా ఉన్న విస్తారను, ఎయిరిండియాను విలీనం చేయనున్నట్లు 2022 నవంబర్‌లో ప్రకటించింది. ఈ డీల్ పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు 25.1% వాటా ఉంటుంది. అలాగే ఎయిరిండియా అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది. -
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. -
పైలెట్ల రాజీనామా.. విస్తారా ఎయిర్‌లైన్స్ సేవల్లో అంతరాయం
విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నేపథ్యంలో వేతనాల సవరణ అంశంపై పైలట్లు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫలింతగా విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరో 38 విస్తారా విమాన సేవలు నిలిచిపోయాయి. ముంబయి నుంచి 15, దిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమాన సర్వీసులు రద్దయినట్లు విస్తారా ప్రకటించింది. ఈ తరణంలో ఆ సంస్థకు చెందిన 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకు ముందు వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం విస్తారా పైలెట్లు శిక్షణ పొందారు. ట్రైనింగ్ తర్వాత సుమారు సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడంతో కలవరం మొదలైంది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు అందించే విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడు పైలెట్ల కొరత మరిన్ని ఇబ్బందులు గురి చేస్తోంది. -
ఎయిరిండియా– విస్తారా విలీనం వేగం!
న్యూఢిల్లీ: విమానయాన దిగ్గజాలు ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ వేగమందుకోనుంది. ఇందుకు సింగపూర్ నియంత్రణ సంస్థ కాంపిటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్(సీసీసీఎస్) షరతులతోకూడిన అనుమతులు ఇచి్చనట్లు ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. దీంతో రెండు సంస్థలూ తమ షెడ్యూళ్లు, కాంట్రాక్టులు తదితర సవివర సమాచారాన్ని ఇచి్చపుచ్చుకునేందుకు అనుమతి లభించినట్లు తెలియజేశారు. 2022 నవంబర్‌లో ఎయిరిండియాలో విస్తారా విలీన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకోనుంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలసి సంయుక్త సంస్థ(జేవీ)గా విస్తారాను ఏర్పాటు చేసిన విషయం విదితమే. -
బస్ టికెట్ రేటుతో ఫ్లైట్ జర్నీ..
ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 'విస్తారా ఎయిర్‌లైన్స్' ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విస్తారా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ సేల్‌లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. Discover the beauty of India! Enjoy discounted fares across all three cabin classes on our domestic network. Hurry, book until 23-December-2023 for travel until 30-September-2024. Blackout dates apply. T&C Apply. Book now: https://t.co/nJjfTemsjM ⁰#VistaraChristmasSale pic.twitter.com/VsebvAJoKG — Vistara (@airvistara) December 21, 2023 -
ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్‌కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ పై చేసిన ఒక పోస్టింగ్‌లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన) ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. -
విస్తారా విమానంలో బాలికపై పడిన హాట్ చాక్లెట్.. తీవ్ర గాయాలు
ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా మరో ఘటన జరిగింది. అయితే ఈసారి ప్రయాణికురాలైన 10 ఏళ్ల చిన్నారిపై విమనయాన సిబ్బంది హాట్ చాక్లెట్ ఒలకబోసింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి ఫ్రంక్ఫర్ట్కు వెళ్తున్న విస్తారా విమానంలో ఆగస్టు 11 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆసల్యంగా వెలుగులోకి వచ్చాయి. రచనా గుప్తా అనే మహిళా తన కూతురితో కలిసి ఫ్రంక్ఫర్ట్కు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఓ కప్పు హాట్ చాక్లెట్‌ని ఆర్డర్ చేసింది. దీనిని తీసుకొచ్చిన సిబ్బంది ప్రమాదవశాత్తూ చిన్నారి ఎడమ కాలుపై పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి, విమానం ల్యాండ్ అయ్యాక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌హోస్టెస్ తప్పిదం కారణంగాబాలికకు గాయాలైనట్లు గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే జరిగిన ఈ పరిణామానికి విమానయాన సంస్థ కనీసం క్షమాపణలు చెప్పలేదని, వైద్య ఖర్చులు కూడా చెల్లించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ బిల్లు 503 యూరోలు, ఆసుపత్రి బిల్లు కూడా మేమే కట్టున్నామని గుప్తా తెలిపారు. అంతేగాక ఈ ఘటన ద్వారా లిస్బన్‌కు వెళ్లాల్సిన తమ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యామని ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్‌లైన్స్ ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే, తమ బృందాలు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాయని, వారిని భారత్‌కు తిరిగి వచ్చేందుకు వీలు కల్పించామని, వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాయని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్ట ఘటనలు ఎదురవ్వకుండా చూసుకుంటామని తెలిపింది. చదవండి: మణిపూర్ హింసపై 53 సభ్యులతో సీబీఐ దర్యాప్తు.. బృందంలో 29 మంది మహిళా అధికారులు -
ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?
Best Airlines In 2023: ఆధునిక ప్రపంచంలో విమాన ప్రయాణం సర్వ సాధారణమైపోయింది. అందులో కూడా చాలా మంది ప్రయాణికులు ఉత్తమ సేవలను అందించే బెస్ట్ ఎయిర్ లైన్స్‌ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఏడాది టాప్ 20 అత్యుత్తమ విమానయాన సంస్థలు ఏవి? ఇందులో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్.. చివరి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్ ఏది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో బెస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత ఖతార్, ఆల్ నిప్పన్, ఎమిరేట్స్ వంటివి ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 ఎయిర్ లైన్స్‌కు ఈ ర్యాంకింగ్స్ అందిస్తుంది. ఇందులో ఖతార్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక బడ్జెస్ట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత లో కాస్ట్ లాంగ్ హాల్ కేటగిరిలో డెల్టా ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత క్లీనెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు ఏఎన్ఏ (ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్)కు దక్కింది. 2022 సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించారు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) టాప్ 20 బెస్ట్ ఎయిర్ లైన్స్ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్ వేస్ ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) ఎమిరేట్స్ జపాన్ ఎయిర్ లైన్స్ టర్కిష్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఫ్రాన్స్ కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్ ఇవా ఎయిర్ కొరియన్ ఎయిర్ హైనన్ ఎయిర్ లైన్స్ స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ ఐబేరియా ఫిజి ఎయిర్ వేస్ విస్తారా క్వాంటాస్ ఎయిర్ వేస్ బ్రిటిష్ ఎయిర్ వేస్ ఎయిర్ న్యూజిలాండ్ డెల్టా ఎయిర్ లైన్స్ -
ఎయిరిండియా, విస్తారా విలీనంపై ముందడుగు
న్యూఢిల్లీ: ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను విలీనం చేసేందుకు అనుమతుల కోసం కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ), టాటా సన్స్ (టీఎస్పీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన టాటా సియా ఎయిర్‌లైన్స్ (టీఎస్‌ఏఎల్).. విస్తారా బ్రాండ్ కింద విమానయాన కార్యకలాపాలు సాగిస్తోంది. టీఎస్‌ఏఎల్‌లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 49 శాతం వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమకు వాటాలు ఉన్న విస్తారాను కూడా అందులో విలీనం చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత డీల్ ప్రకారం విలీనానంతరం ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటాలు ఉంటాయి. అటు ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా)ను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్టోబర్ గణాంకాల ప్రకారం ఎయిరిండియా, విస్తారా మార్కెట్ వాటా 18.3 శాతంగా (రెండింటిదీ కలిపి) ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ కూడా కలిస్తే దేశీయంగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ మొత్తం మార్కెట్ 25.9 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఎయిరిండియా భారత్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌గాను, దేశీ రూట్ల విషయానికొస్తే రెండో పెద్ద విమానయాన సంస్థ గాను నిలుస్తుంది. -
ఎయిరిండియాకు అపార అవకాశాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు అపార అవకాశాలున్నట్లు కంపెనీ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజాగా పేర్కొన్నారు. వెరసి ఎయిరిండియా గ్రూప్‌ను అంతర్జాతీయ దిగ్గజంగా రూపుదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో విస్తారాను కంపెనీతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఇదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిరేషియా ఇండియా)లను సైతం కంపెనీలో విలీనం చేసే కార్యాచరణకు ఇప్పటికే తెరతీసినట్లు తెలియజేశారు. ఎయిరిండియా గతంలో ఎన్నడూచూడని భారీ వృద్ధిని అందుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నెల 14న ఎయిరిండియా 70 వైడ్‌బాడీ మోడల్సహా 470 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు విల్సన్ తెలియజేశారు. వీటిలో ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను పొందనుంది. ఎయిరిండియాను గతేడాది జనవరిలో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. -
ఎయిరిండియా, విస్తారా విలీనానికి అనుమతులపై కసరత్తు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఎయిరిండియా, విస్తారా విలీనంపై టాటా గ్రూప్ కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ జరుగుతోందని ఎయిరిండియా చీఫ్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో విలీనానంతరం ఏర్పడే సంస్థ అదే పేరుతో కొనసాగుతుందని ఆయన వివరించారు. అయితే, ’విస్తార’ వారసత్వంగా కొన్ని అంశాలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని విల్సన్ చెప్పారు. ‘గ్రూప్‌లో ఒక ఫుల్–సర్వీస్ ఎయిర్‌లైన్, ఒక చౌక సర్వీసుల విమానయాన సంస్థ ఉండాలన్నది మా ఉద్దేశం. ఎయిరిండియా, విస్తార విలీనంతో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ ఏర్పాటవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ గతేడాది టేకోవర్ చేసింది. అందులో విస్తారను, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీనం చేయాలని భావిస్తోంది. ఎయిరిండియా, విస్తార విలీనం 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. ప్రస్తుతం విస్తారలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. -
విమానంలో ‘బొద్దింక భోజనం’
ఎయిర్ విస్తారా ఎయిర్‌లైన్ సదుపాయాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము తినే ఆహారంలో బొద్దింక ఉందంటూ విస్తారా ఎయిర్‌లైన్ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన నికుల్ సోలంకి ఎయిర్ విస్తారా ఎయిర్‌లైన్‌లో ప్రయాణించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే ప్రయాణ వివరాల్ని వెల్లడించని సోలంకి..ఫ్లైట్ జర్నీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ఎయిర్ విస్తారా ఫ్లైట్ జర్నీలో తాను ఆర్డర్ పెట్టిన ఇండ్లీ, సాంబార్, ఉప్మాలో చిన్న సైజు బొద్దింక ఉందని.. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Small cockroach in air Vistara meal pic.twitter.com/SHxFxB4qWv — NIKUL SOLANKI (@manikul008) October 14, 2022 ఆఫోటోల్ని షేర్ చేసిన పదినిమిషాల్లో ఎయిర్ విస్తారా యాజమాన్యం స్పందించింది. ‘హలో నికుల్, మా భోజనాలన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాల్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాం. మీ విమాన ప్రయాణ వివరాల్ని తెలపండి. తద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎయిర్ విస్తారా ట్వీట్ చేసింది. Hello Nikul, all our meals are prepared keeping the highest standards of quality in mind. Please send us your flight details over DM so we can look into the matter and address the issue at the earliest. Thank you. ~Badri https://t.co/IaDysdIxJS — Vistara (@airvistara) October 14, 2022 విస్తారాపై టాటా గ్రూప్ కన్ను విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమాచారం ఇచ్చింది.కాగా, విస్తారాలో టాటా గ్రూప్‌కు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. చదవండి👉 ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరింది -
ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా
DGCA Fines Vistara, సాక్షి, ముంబై: విమానయాన సంస్థ విస్తారాకు భారీ షాక్ తగిలింది. సరియైన శిక్షణ లేని పైలట్‌కు విమాన ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చినందుకుగాను సంస్థకు భారీ జరిమానా విధించింది. రూ. 10 లక్షల పెనాల్టీ విధిస్తూ ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. సిమ్యులేటర్ శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విస్తారా విమానాన్ని ల్యాండ్ చేశారనేది ఆరోపణ. అయితే ఈ విమానం ఎక్కడ నుండి బయలుదేరింది, ఎప్పుడు జరిగింది అనేది స్పష్టత లేదు. ఇండోర్ విమానాశ్రయంలో సరైన శిక్షణ లేని పైలట్ ప్రయాణీకుల విమానాన్ని ల్యాండింగ్‌కు అనుమతించినందుకు విస్తారాపై రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు డీజీసీఏ అధికారులు గురువారం తెలిపారు. విమానంలో పైలట్, సిమ్యులేటర్‌లో అవసరమైన శిక్షణ పొందకుండానే ఇండోర్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారని పేర్కొన్నారు. ఇది విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అంటూ అధికారులు మండిపడ్డారు. ప్రయాణీకులతో కూడిన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందుగా సిమ్యులేటర్‌లో పైలట్‌కు శిక్షణ ఇవ్వాలి. విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించే ముందు కెప్టెన్ కూడా సిమ్యులేటర్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. కెప్టెన్, పైలట్ ఇద్దరికీ శిక్షణ లేదనీ, ఇది చాలా తీవ్రమైన విషయమంటూ, నిబంధనలు ఉల్లఘించిన విస్తారాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
మీ అంచనాల్ని అందుకోలేకపోయాం, ఏం చేస్తాం చెప్పండి..అంతాకరోనా ఎఫెక్ట్
ముంబై: కస్టమర్ల అంచనాలను గత కొన్ని నెలలుగా అందుకోలేకపోయినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ సీఈవో వినోద్ కన్నన్ అంగీకరించారు. అంతరాలను పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కస్టమర్లకు ఆయన ఒక లేఖ రాశారు. సేవల్లో ఇటీవలి నెలకొన్న అవాంతరాలతో ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి రావడాన్ని, ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌ను చేరుకునేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉండాల్సి రావడాన్ని అంగీకరించారు. ‘‘విమాన ప్రయాణం అన్నది ఒక లావాదేవీ కాకుండా, సంతోషరమైన ఒక మరపురాని అనుభూతిగా మిగల్చాలని మేరు కోరుకుంటాము. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా మేము అంచనాలను అందుకోలేని విషయం నిజమే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వెబ్సైట్ కానీ, యాప్ కానీ నిర్ధేశిత పరిష్కారాలను చూపించడం లేదని తెలుసు. విమానాశ్రయాల్లో ఆన్‌గ్రౌండ్ సేవల పరంగా కొన్ని సందర్భాల్లో మీ అంచనాలను అందుకోలేకపోతున్నట్టు అవగాహన ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. కస్టమర్ల ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో కొన్ని సేవలను తాత్కాలికంగా కుదించాల్సి వచ్చినట్టు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం
ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాను కొద్ది రోజుల క్రితం టాటా సన్స్ కొనుగోలు చేసిన సంగతి తేలిసిందే. టాటా సన్స్‌కు దీనితో పాటు విస్తారా, ఎయిర్ ఆసియా ఇండియా సంస్థలలో వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియాఎక్స్‌ప్రెస్‌ను తమకు 84 శాతం వాటా కలిగిన ఎయిర్ ఆసియా ఇండియాతో విలీనం చేయాలని టాటా సన్స్ చూస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకునే సమయం దగ్గర పడటంతో కార్యాచరణ ఖర్చులను తగ్గించాలని చూస్తోంది. విస్తారా, ఎయిర్ ఇండియాను కలిపి వేయడానికి సింగపూర్ ఎయిర్ లైన్స్(ఎస్ఐఎ)తో టాటా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. విస్తారాలో టాటాకు 51శాతం వాటం ఉండగా, మిగతా వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిగి ఉంది. మొత్తం మీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్ కంపెనీ కిందకు తెచ్చేందుకే టాటా సన్స్ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. సిబ్బంది ఏకీకరణ, విమానాల నాణ్యత, భద్రతా తనిఖీల గురించి చర్చించడానికి టాటా సన్స్ కొద్ది రోజుల క్రితం ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా సీనియర్ మేనేజ్ మెంట్ తో అనేక సమావేశాలు నిర్వహించింది. ఒకే విధంగా కార్యకలాపాలు కొనసాగించే సంస్థలను విలీనం చేయడం వల్ల ఇబ్బందులు రావని, పైగా వ్యయాలు తగ్గుతాయని టాటా సన్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియాలు రెండూ చౌక విమానయాన సంస్థలే. యాజమాన్య వాటాల దృష్ట్యా చూసినా, వీటిని ఒకే సంస్థగా మార్చడం టాటా సన్స్‌కు సులభమే అని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి 4 రోజులే పని..!) -
యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను
ముంబై, సాక్షి: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా.. యూఎస్‌కు నాన్‌స్టాప్ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ) త్వరలో యూఎస్‌కు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ నేపథ్యంలో నాన్‌స్టాప్ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలోగా సర్వీసులను ప్రారంభించాలన్న అంశాన్ని నిర్ణయించుకోలేదని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినోద్ కన్నన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 20-30 శాతం వరకూ నాన్‌స్టాప్ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్ తెలియజేశారు. ఇందుకు విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యంలో 20-30 శాతం వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) చివరికల్లా విమానాల సంఖ్యను 70కు పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశాయి. -
1200 మంది విస్తారా ఉద్యోగులకు షాక్
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో విమానయాన సంస్థల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం ఆయా విమానయాన సంస్థల ఉద్యోగులపై భారీగా పడుతోంది. తాజాగా విస్తారా ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సీనియర్ గ్రేడ్ ఉద్యోగులను 3 రోజులపాటు నిర్బంధ సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. జీతంలేని తప్పనిసరి సెలవు తీసుకోవాల్సిందిగా దాదాపు 1200 మంది సీనియర్లను కోరింది. నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సంస్థ జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని విస్తారా ఉద్యోగులను కోరడం ఇది రెండోసారి. లాక్ డౌన్ పొడిగింపుతో కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశామనీ, ఇది తమ న గదు లభ్యతపై గణనీయంగా ప్రభావం చూపిందని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్ సమాచారంలో విస్తారా సీఈవో లెస్లీ థంగ్ చెప్పారు. కరోనా వైరస్ ముప్పు.. లాక్డౌన్ కష్టాల మధ్య సంస్థ ఆర్థిక వనరులను పరిరక్షించే చర్యగా ఏప్రిల్ 15 - ఏప్రిల్30 మధ్య మూడు రోజుల వరకు వేతనం లేకుండా తప్పనిసరి సెలవుపై వెళుతున్నట్లు లెస్లీ థంగ్ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 -ఏప్రిల్ 14 మధ్య మూడు రోజుల వరకు జీతం లేకుండా తప్పనిసరి సెలవు తీసుకోవాలని మార్చి 27న ప్రకటించింది. ఈ సెలవు నుంచి 2800 మంది ఉద్యోగుల (క్యాబిన్, గ్రౌండ్ సర్వీసు)కు మినహాయింపు నిచ్చింది. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం. కరోనా ముప్పు కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) (అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచ్) -
వైరల్: విస్టారా, ఇండిగోలపై కామెడియన్ కామెంట్
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై విస్టారా, ఇండిగో, గోఎయిర్, స్పెస్‌జెట్ భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు సోషల్ మీడియాలో సరదాగా చర్చించిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్టాండ్ అప్ ఇండియన్ కమెడియన్ కునాల్ కమ్రా విస్టారా ఎయిర్‌లైన్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రేండింగ్‌గా మారింది. ‘‘హే @airvistara నేను విన్నాను లాక్డౌన్ కారణంగా నిన్ను ఎత్తుకు ఎగరకుండా నిలిపివేశారంట కదా. ఎక్కడికి ఎగరకుండా పార్కింగ్‌లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇండిగో, స్పెస్‌జెట్, గోఎయిర్‌లు కూడా.. స్టేపార్కింగ్.. స్టేసేఫ్. ఇప్పటు మీకు అర్థం అవుతుంది నా బాధ’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆయన సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెజన్లు తెగ ఆకట్టుకుంటోంది. (ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం) Now you know how I feel... https://t.co/oZcXqUIEeh — Kunal Kamra (@kunalkamra88) April 10, 2020 కాగా మార్చిలో విస్టారాతో పాటు ఇండిగో ఎయిర్ లైన్ అధికారుల లాక్డౌన్ అమలును అనుసరిస్తూ.. ఆయన ప్రయాణాన్ని నిషేధించినట్లు గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఏప్రిల్ 27వరకూ ఎయిర్ విస్టారాతో పాటు మరో నాలుగు విమానా ఎయిర్‌లైన్ సంస్థలు నా ప్రయాణాన్ని నిషేధించాయి. అంతేగాక అధికారుల ఆదేశాల మేరకు ఎవరూ కూడా ప్రయాణించడాకి వీలు లేదని చెప్పారు’’ అంటూ కునాల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. (కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్) -
ఆ విమానంలో ప్రయాణించిన వారికి..
పనాజీ: ఓ ప్రయాణికుడి అజాగ్రత్త, నిర్లక్ష్యం తోటి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. ముంబై నుంచి గోవా వెళ్లిన విమానంలో ప్రయాణించిన వ్యక్తికి ఆదివారం కరోనా సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన గోవా ఆరోగ్య శాఖ మార్చి 22న యూకే861 విస్తారా విమానంలోని మిగతా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కోవిడ్-19 సోకిందని, దీంతో అందులోని ప్రయాణికులందరూ వెంటనే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేసుకోవాలని, లేని పక్షంలో 0832-2421810/2225538 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది. విమాన సిబ్బందిని సైతం స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరింది. (రెండు లక్షల వరకు కరోనా మృతులు) కాగా కరోనా సోకిన వ్యక్తి బహమాస్ నుంచి న్యూయార్క్ మీదుగా ముంబైకు చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి గోవాకు పయనమయ్యాడు. అక్కడ కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన అతనికి పరీక్షలు నిర్వహించగా ఆదివారం పాజిటివ్ అని తేలింది. పైగా ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ నాడే అతను ప్రయాణానికి పూనుకోవడం గమనార్హం. కాగా అతని కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగినవారు ప్రస్తుతం గోవాలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా గోవాలో ఇప్పటివరకు ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. (కోవిడ్: విస్తారా ఆ విమానాలు బంద్) -
విస్తారా పండుగ సేల్: 48 గంటలే..
సాక్షి, న్యూఢిల్లీ: విస్తారా విమానయాన సంస్థ దీపావళి పండుగ సేల్‌ను ప్రకటించింది. దేశీయ నెట్ వర్క్‌లో 48 గంటల సేల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ రోజు (అక్టోబర్ 10వ తేదీ, గురువారం) నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. అంటే 48 గంటలు మాత్రమే ఈ సేల్ లభ్యమవుతుంది. ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రధాన మార్గాల్లో ఢిల్లీ - ముంబై, ముంబై - బెంగళూరు, ముంబై - గోవా, ఢిల్లీ - చెన్నై, ఢిల్లీ - బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోద్పూర్, ఉదయ్‌పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తిస్తుంది. ప్రధానంగా జమ్మూ-శ్రీనగర్ మార్గంలో1199 లకే(ఎకానమీ క్లాస్) టికెట్ ను అందిస్తోంది. వివిధ మార్గాల్లో ప్రీమియం ఎకానమీ రూ. 6 2,699 , బిజినెస్ క్లాస్ టికెట్ రూ. 6,999 నుంచి ప్రారంభం. ఈ ఆఫర్లో ఎన్ని టికెట్లను ఆఫర్ చేస్తున్నదీ కంపెనీ ప్రకటించలేదు గానీ, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ కింద టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. పండుగ సీజన్‌ను మరింత ఆనందంగా మలించేందుకు, అలాగే తమ వ్యాపార అభివృద్ధికి ఈ డిస్కౌంట్ సేల్ దోహదం చేస్తుందన్న విశ్వాసాన్ని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ వ్యక్తం చేశారు. Announcing Vistara’s Festive Season Sale with fares starting at ₹1,199 all-in for travel until 28th March 2020. Book your tickets today. Hurry, limited seats available. https://t.co/TbAEPrGMYJ pic.twitter.com/dLgZxDtNpB — Vistara (@airvistara) October 10, 2019 -
ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య సంస్థ విస్తారా... ఇక నుంచి అంతర్జాతీయ సర్వీసులను కూడా నడపనుంది. వచ్చే నెల (ఆగస్ట్) 6 నుంచి ప్రప్రథమంగా సింగపూర్‌కు ఢిల్లీ నుంచి రోజువారీ విమాన సర్వీసులను ఆరంభిస్తోంది. ఆ మరుసటి రోజే ఆగస్ట్ 7న ముంబై నుంచి కూడా సింగపూర్‌కు డైలీ సర్వీసులను ప్రారంభించనుంది. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి ఒకటి మొత్తం రెండు ఫ్లయిట్లను నడపనుంది. అంతర్జాతీయంగా మరిన్ని కేంద్రాలకు త్వరలోనే సర్వీసులను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇరువైపుల ప్రయాణానికి అన్ని చార్జీలతో కలిపి ప్రారంభ ధరలను ప్రకటించింది. ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లి, తిరిగి ఢిల్లీకి వచ్చేందుకు ఎకానమీ క్లాస్‌లో రూ.21,877, బిజినెస్ క్లాస్‌లో రూ.76,890గా నిర్ణయించింది.అలాగే, ముంబై నుంచి సింగపూర్‌కు, సింగపూర్ నుంచి ముంబైకి రానుపోను చార్జీని ఎకానమీ క్లాస్‌కు రూ.20,778, బిజినెస్ క్లాస్‌కు రూ.63,331గా నిర్ణయించింది. చాలా ముఖ్యమైన మార్కెట్ అయినందునే తొలుత సింగపూర్‌కు సర్వీసులు ఆరంభిస్తున్నట్టు విస్తారా సీఈవో లెస్లీథాంగ్ తెలిపారు. -
గుడ్ న్యూస్ చెప్పిన విస్తారా
దేశీయ విమానయాన సంస్థ విస్తారా గుడ్ న్యూస్ చెప్పింది. వందమందికి పైగా పైలట్లను, 400 మందికి పైగా క్యాబిన్ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించినట్టు సమాచారం. ఈనియామకాల్లో ముఖ్యంగా రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుందట. తద్వారా అప్పుల సంక్షోభంలో చిక్కుకుని, కార్యకలాపాలను నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. అలాగే విస్తారా నిబంధనలు, స్టాండర్డ్స్‌కు అనుగుణంగా వీరికి (జెట్ ఎయిర్వేస్కు చెందిన పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి) సంబంధిత విక్షణను కూడా ఇవ్వనుందని ఇండస్ట్రీకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అంతేకాదు జెట్ ఎయిర్వేస్కు చెందిన 737 బోయింగ్ విమానాలను కూడా విస్తారా తన ఖాతాలో చేర్చుకోనుంది. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నియమకాలని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై విస్తారా అధికారికంగా స్పందించాల్సి ఉంది.