విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నేపథ్యంలో వేతనాల సవరణ అంశంపై పైలట్లు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫలింతగా విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరో 38 విస్తారా విమాన సేవలు నిలిచిపోయాయి. ముంబయి నుంచి 15, దిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమాన సర్వీసులు రద్దయినట్లు విస్తారా ప్రకటించింది.
ఈ తరణంలో ఆ సంస్థకు చెందిన 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్‌డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంతకు ముందు వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం విస్తారా పైలెట్లు శిక్షణ పొందారు. ట్రైనింగ్ తర్వాత సుమారు సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడంతో కలవరం మొదలైంది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు అందించే విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడు పైలెట్ల కొరత మరిన్ని ఇబ్బందులు గురి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment