అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల ఫ్రీ వై-ఫై అందజేస్తామని విస్తారా ప్రకటించింది. ఈ సర్వీస్ అందిస్తున్న మొదటి భారతీయ విమానయాన సంస్థగా విస్తారా రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్ అన్ని క్యాబిన్‌లలో ప్రయాణీకులకు 20 నిమిషాల వై-ఫై యాక్సెస్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ఈ ఫ్రీ వై-ఫై సర్వీస్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ321 నియో విమానాల్లో మాత్రమే లభించనున్నాయి. ఈ వై-ఫై మరింత సమయం కావాలనుకున్నప్పుడు ప్లాన్స్ పొందాల్సి ఉంటుంది. విస్టారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఈ సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, దీపక్ రజావత్ వెల్లడించారు.
బిజినెస్ క్లాస్, ప్లాటినం క్లబ్ విస్తార సభ్యులకు మరో 50 ఎంబీ డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ వాట్సప్, ఫేస్‌బుక్ సేవల కోసం రూ. 372.74 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రూ.1577.54 + జీఎస్టీ చెల్లిస్తే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్ లభిస్తుంది. రూ.2707.05 + జీఎస్టీ చెల్లిస్తే అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు.
Don’t miss out on important updates even at 35000 ft. ! Get 20 minutes of complimentary in-flight Wi-Fi, a first in Indian Aviation. Now you can purchase the selected plans using Indian credit/debit card in addition to internationally issued credit cards. pic.twitter.com/NTYCOJFY5N
— Vistara (@airvistara) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment