Best Airlines In 2023: ఆధునిక ప్రపంచంలో విమాన ప్రయాణం సర్వ సాధారణమైపోయింది. అందులో కూడా చాలా మంది ప్రయాణికులు ఉత్తమ సేవలను అందించే బెస్ట్ ఎయిర్ లైన్స్‌ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఏడాది టాప్ 20 అత్యుత్తమ విమానయాన సంస్థలు ఏవి? ఇందులో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్.. చివరి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్ ఏది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
2023లో బెస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత ఖతార్, ఆల్ నిప్పన్, ఎమిరేట్స్ వంటివి ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 ఎయిర్ లైన్స్‌కు ఈ ర్యాంకింగ్స్ అందిస్తుంది. ఇందులో ఖతార్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది.
ఇక బడ్జెస్ట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత లో కాస్ట్ లాంగ్ హాల్ కేటగిరిలో డెల్టా ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత క్లీనెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు ఏఎన్‌ఏ (ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్)కు దక్కింది. 2022 సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించారు.
(ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!)
టాప్ 20 బెస్ట్ ఎయిర్ లైన్స్
- సింగపూర్ ఎయిర్ లైన్స్
- ఖతార్ ఎయిర్ వేస్
- ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ)
- ఎమిరేట్స్
- జపాన్ ఎయిర్ లైన్స్
- టర్కిష్ ఎయిర్ లైన్స్
- ఎయిర్ ఫ్రాన్స్
- కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్
- ఇవా ఎయిర్
- కొరియన్ ఎయిర్
- హైనన్ ఎయిర్ లైన్స్
- స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్
- ఎతిహాద్ ఎయిర్ వేస్
- ఐబేరియా
- ఫిజి ఎయిర్ వేస్
- విస్తారా
- క్వాంటాస్ ఎయిర్ వేస్
- బ్రిటిష్ ఎయిర్ వేస్
- ఎయిర్ న్యూజిలాండ్
- డెల్టా ఎయిర్ లైన్స్
Comments
Please login to add a commentAdd a comment