top 20
-
Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్
న్యూఢిల్లీ: నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకుంది. నికరాగ్వా నుంచి ఒకరికి ఈ అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. 72వ ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీలు శనివారం రాత్రి ఎల్ సాల్వెడార్‌లోని శాన్ సాల్వెడార్లో జోస్ అడాల్ఫో పినెడా ఎరేనాలో ఘనంగా జరిగాయి. ఫస్ట్ రన్నరప్‌గా మిస్ థాయ్‌లాండ్ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్ రన్నరప్‌గా మిస్ ఆ్రస్టేలియా మొరాయా విల్సన్ నిలిచారు. విశ్వ సుందరిగా నిలిచిన న షెన్నిస్ పలాసియోస్‌కు గతేడాది మిస్ యూనివర్స్ అమెరికా సుందరి ఆర్ బోనీ గాబ్రియెల్ కిరీటం అలంకరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. నికరాగ్వాలోని మనాగ్వాకు చెందిన 23 ఏళ్ల పలాసియోస్ మానసిక ఆరోగ్య కార్యకర్తగా బాధితులకు సేవలందిస్తున్నారు. ఆడియో విజువల్ ప్రొడ్యూసర్‌గానూ పని చేస్తున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో 84 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా శ్వేత శారద పోటీపడ్డారు. ఆమె టాప్–20 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. -
ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్!
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్‌ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్‌డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్‌లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్‌ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్‌లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. లిస్ట్‌లో ఇండియన్ కంపెనీలు అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్‌డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్‌లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 20 లిస్ట్ ఇదే.. 1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ 2. H&R బ్లాక్ 3. డెల్టా ఎయిర్ లైన్స్ 4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5. యాక్సెంచర్ 6. IBM 7. L3 హారిస్ 8. విప్రో 9. ఇన్ఫోసిస్ 10. నైక్ 11. వ్యాన్స్ 12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్ 13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 14. హాల్ మార్క్ 15. మైక్రోసాఫ్ట్ 16. నార్త్రోప్ గ్రుమ్మన్ 17. FedEx ఫ్రైట్ 18. డచ్ బ్రదర్స్ కాఫీ 19. వాల్ట్ డిస్నీ కంపెనీ 20. యాపిల్ Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo — IBM (@IBM) September 21, 2023 -
ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?
Best Airlines In 2023: ఆధునిక ప్రపంచంలో విమాన ప్రయాణం సర్వ సాధారణమైపోయింది. అందులో కూడా చాలా మంది ప్రయాణికులు ఉత్తమ సేవలను అందించే బెస్ట్ ఎయిర్ లైన్స్‌ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఏడాది టాప్ 20 అత్యుత్తమ విమానయాన సంస్థలు ఏవి? ఇందులో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్.. చివరి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్ ఏది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో బెస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత ఖతార్, ఆల్ నిప్పన్, ఎమిరేట్స్ వంటివి ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 ఎయిర్ లైన్స్‌కు ఈ ర్యాంకింగ్స్ అందిస్తుంది. ఇందులో ఖతార్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక బడ్జెస్ట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత లో కాస్ట్ లాంగ్ హాల్ కేటగిరిలో డెల్టా ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత క్లీనెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు ఏఎన్ఏ (ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్)కు దక్కింది. 2022 సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించారు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) టాప్ 20 బెస్ట్ ఎయిర్ లైన్స్ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్ వేస్ ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) ఎమిరేట్స్ జపాన్ ఎయిర్ లైన్స్ టర్కిష్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఫ్రాన్స్ కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్ ఇవా ఎయిర్ కొరియన్ ఎయిర్ హైనన్ ఎయిర్ లైన్స్ స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ ఐబేరియా ఫిజి ఎయిర్ వేస్ విస్తారా క్వాంటాస్ ఎయిర్ వేస్ బ్రిటిష్ ఎయిర్ వేస్ ఎయిర్ న్యూజిలాండ్ డెల్టా ఎయిర్ లైన్స్ -
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ఖరీదైన ఇళ్లు
-
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 20 మ్యూజియంలు
-
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ప్రసిద్ధమైన పెయింటింగ్స్
-
Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్
న్యూఢిల్లీ: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్ 14, డెకథ్లాన్ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. టాప్–100లో రిలయన్స్ ఒక్కటే ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 137, బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్అండ్టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్‌సీఎల్ టెక్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ర్యాంకులతో నిలిచాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. -
ధర అదిరే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. గతేడాది జూలై –సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9% వృద్ధి చెందాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించగా..హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ధరల వృద్ధి 24%గా ఉంది. ఆ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9%, 14.9% ధరల వృద్ధి ఉంది. ఇండియాలో ఏకైక నగరం హైదరాబాదే టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే. జూలై – సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ధరలు వృద్ధిలో ఉంటే..మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో గృహాల ధరలు క్షీణించాయి. ధరల వృద్ధిలో హైదరాబాద్ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడ 3.2 % ధరల వృద్ధి ఉంది. 2% రేట్ల అప్రిసియేషన్‌తో బెంగళూరు 94వ స్థానంలో, 1.1% వృద్ధితో అహ్మదాబాద్ 108వ స్థానంలో నిలిచింది. 2% క్షీణతతో కోల్‌కతా 130వ స్థానంలో, 3% క్షీణతతో 135వ స్థానంలో ముంబై, 3% క్షీణతతో 136వ స్థానంలో చెన్నై, 3.5% క్షీణతతో 138వ స్థానంలో పుణే నగరాలు నిలిచాయి. హైదరాబాద్‌లోనే వృద్ధి ఎందుకంటే? ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సగటున 3.2% ధరలు పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం నుంచి ఇదే అత్యంత బలహీనం. ఇండియాలోని నగరాల్లో గృహాల ధరల వృద్ధి అనేది రిటైల్ ద్రవ్యోల్బణం కన్నా దిగువలోనే ఉంది. ఈ అంతరం 2016 హెచ్1 నుంచి పెరుగుతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం స్థాయిని మించి గృహాల ధరల వృద్ధి ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. పైగా ఇక్కడ కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధం గా ఉన్న ఇళ్లను, ఇన్వెంటరీ గృహాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇదే డెవలపర్లకు లాభసాటిగా మారిందని పేర్కొన్నారు. -
టాప్-20 విశ్వనగరాల్లో హైదరాబాద్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు టిమ్ క్యాంప్‌బెల్ సాక్షి, హైదరాబాద్: ‘వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా ప్రపంచంలోని టాప్- 20 నగరాల జాబితాలో హైదరాబాద్ ఉంది. వ్యవస్థీకృత పరిపాలన, వ్యాపారాల విస్తరణకు అవకాశాలు, టెక్నాలజీ పురోగమనం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణ, యువత భాగస్వామ్యం వంటి అత్యుత్తమ లక్షణాలు పుష్కలంగా ఉండడం ఈ నగరం ప్రత్యేకత..’ అని అమెరికాకు చెందిన పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు, ‘బియాండ్ స్మార్ట్‌సిటీస్’ పుస్తక రచయిత టిమ్ క్యాంప్‌బెల్ తెలిపారు. సోమవారం మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: విశ్వవ్యాప్తంగా వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా హైదరాబాద్ స్థానం ఏమిటి? టిమ్: ఇప్పటివరకు ఐదుసార్లు భారత్‌లో పర్యటించాను. వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొదటి 20 నగరాల జాబితాలో ఉంటుంది. వ్యవస్థీకృత నగరంగా హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ప్రత్యేకతను చాటుకుంటోంది. భవిష్యత్‌లో డిజిటల్ టెక్నాలజీలో యువత భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చన్నది నా నిశ్చితాభిప్రాయం. ప్రశ్న: ఉత్తమ స్మార్ట్‌సిటీ లక్షణాలు ఏమిటి? టిమ్: అందరికీ అందుబాటులో డిజిటల్ టెక్నాలజీ, అందరికీ భద్రత, మెరుగైన పారిశుధ్యం, ప్రజారవాణా, తీరైన పట్టణ ప్రణాళిక, ఈ-గవర్నెన్స్, స్మార్ట్ పాలన, ట్రాఫిక్ నియంత్రణ, అందరికీ తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు.. స్మార్ట్‌సిటీ ప్రాథమిక లక్షణాలు. ్రప్రశ్న: భారత్ వంటి వర్ధమాన దేశాలు స్మార్ట్‌సిటీల నిర్మాణానికి అధిక నిధులు వెచ్చించలేవన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కదా? టిమ్:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో స్మార్ట్‌సిటీలను నిర్మించడం కష్టమేమీ కాదు.