టాప్-20 విశ్వనగరాల్లో హైదరాబాద్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు టిమ్ క్యాంప్‌బెల్
సాక్షి, హైదరాబాద్: ‘వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా ప్రపంచంలోని టాప్- 20 నగరాల జాబితాలో హైదరాబాద్ ఉంది. వ్యవస్థీకృత పరిపాలన, వ్యాపారాల విస్తరణకు అవకాశాలు, టెక్నాలజీ పురోగమనం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణ, యువత భాగస్వామ్యం వంటి అత్యుత్తమ లక్షణాలు పుష్కలంగా ఉండడం ఈ నగరం ప్రత్యేకత..’ అని అమెరికాకు చెందిన పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు, ‘బియాండ్ స్మార్ట్‌సిటీస్’ పుస్తక రచయిత టిమ్ క్యాంప్‌బెల్ తెలిపారు. సోమవారం మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: విశ్వవ్యాప్తంగా వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా హైదరాబాద్ స్థానం ఏమిటి?
టిమ్: ఇప్పటివరకు ఐదుసార్లు భారత్‌లో పర్యటించాను. వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొదటి 20 నగరాల జాబితాలో ఉంటుంది. వ్యవస్థీకృత నగరంగా హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ప్రత్యేకతను చాటుకుంటోంది. భవిష్యత్‌లో డిజిటల్ టెక్నాలజీలో యువత భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చన్నది నా నిశ్చితాభిప్రాయం.
ప్రశ్న: ఉత్తమ స్మార్ట్‌సిటీ లక్షణాలు ఏమిటి?
టిమ్: అందరికీ అందుబాటులో డిజిటల్ టెక్నాలజీ, అందరికీ భద్రత, మెరుగైన పారిశుధ్యం, ప్రజారవాణా, తీరైన పట్టణ ప్రణాళిక, ఈ-గవర్నెన్స్, స్మార్ట్ పాలన, ట్రాఫిక్ నియంత్రణ, అందరికీ తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు.. స్మార్ట్‌సిటీ ప్రాథమిక లక్షణాలు.
్రప్రశ్న: భారత్ వంటి వర్ధమాన దేశాలు స్మార్ట్‌సిటీల నిర్మాణానికి అధిక నిధులు వెచ్చించలేవన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కదా?
టిమ్:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో స్మార్ట్‌సిటీలను నిర్మించడం కష్టమేమీ కాదు.