world cities
-
విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నిండా మునకేస్తోంది మన గ్రేటర్ సిటీ. ఈ దుస్థితిని నివారించేందుకు విశ్వనగరాల్లో అమలవుతున్న అత్యున్నత శాస్త్రీయ విధానాలు భాగ్యనగరంలోనూ అమలుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో లండన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పారిస్ నగరాల్లో భారీ వర్షం, విపత్తులు సంభవించినపుడు ప్రధాన రహదారులు, కాలనీలు మునగకుండా వరద, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు ఉండడం విశేషం. ఆయా నగరాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను నగరంలోనూ అమలు చేస్తే ముంపు సమస్యలను నివారించడం సాధ్యపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బార్సిలోనాలో.. బెంగళూరులో ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఇలా.. బెంగళూరు నగరంలో ప్రధాన రహదారులను ముంచెత్తుతున్న వరద నీటిని అరికట్టేందుకు భారీ సంఖ్యలో అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారులపై ఇంజెక్షన్ వెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భూమిపైనుంచి బోర్వెల్ యంత్రంతో 150 నుంచి 200 అడుగుల లోతు వరకు బోరుబావి(ఇంజెక్షన్ వెల్) తవ్వుతారు. ఈ బావిలోకి 12 ఎంఎం పరిమాణం చిల్లులున్న కేసింగ్ పైపును దింపుతారు. పైపులోనికి రాళ్లు చేరకుండా చుట్టూ సన్నటి జాలీని ఏర్పాటు చేస్తారు. ఈ బోరుబావి చుట్టూ రెండు మీటర్ల లోతు, మరో 1.5 మీటర్ల పొడవు, వెడల్పుతో గుంత ఏర్పాటు చేస్తారు. ఈ గుంతలో ఒక మీటరు మందం వరకు 40 ఎంఎం పరిమాణం ఉన్న బెందడి రాళ్లు వేస్తారు. మరో 0.5 మీటర్ల మేర 20 ఎంఎం పరిమాణం ఉన్న గులకరాళ్లను నింపుతారు. మరో 0.3 మీటర్ల మేర మందం ఇసుకతో నింపుతారు. పార్కు లేదా కమ్యూనిటీ హాలు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి వర్షపునీరు వచ్చి ఈ ఇంకుడు గుంతపై కొద్దిసేపు నిలిచే ఏర్పాటు చేస్తారు. ఈ నీరు ఇంకుడు గుంత నుంచి, దానికి మధ్యలో రంధ్రాలున్న కేసింగ్ పైపు ద్వారా దశలవారీగా భూమి లోపలి పొరల్లోకి ఇంకుతుంది. దీంతో వర్షపునీరు భూమి అంతరాల్లో ఉన్న ఆయా పొరల్లోకి పాకుతుంది. దీంతో ఆయా పొరల్లోకి సమృద్ధిగా నీటి ఊట చేరి సమీపంలో కిలోమీటరు పరిధిలో ఉన్న బోరుబావులు త్వరగా రీఛార్జీ అవుతాయి. సాధారణ ఇంకుడు గుంత కంటే ఇంజెక్షన్ వెల్ సాంకేతికత ఆధారంగా నిర్మించే రీఛార్జి పిట్స్‌తో ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఒక్కో ఇంజెక్షన్ వెల్‌కు సుమారు రూ.40 వేల అంచనా వ్యయం కానుందని అంచనా. మన నగరంలోని కుత్బుల్లాపూర్ ఉమామహేశ్వర కాలనీ దుస్థితి ఇదీ.. విశ్వ నగరాల్లో చర్యలివే.. ఆయా నగరాల్లోని అన్ని ప్రధాన, సర్వీసు రహదారులకు ఇరువైపులా వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా వరదనీటి కాల్వలను ఏర్పాటు చేశారు. కాల్వల్లో మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ. ఆయా రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో రెయిన్‌గేజ్, స్మార్ట్‌బాల్ టెక్నాలజీ ఆధారంగా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రీయ అంచనాతో ముంపు నివారణ. వరద నీటి కాల్వలపై ఆక్రమణలు పూర్తిగా నిషిద్ధం. లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు కొలనుల ఏర్పాటుతో వరదనీరు నేలగర్భంలోకి సులువుగా ఇంకేలా చర్యలు. పార్కులు, ఫుట్‌పాత్‌లు, రహదారులకు ఇరువైపులా, నగరంలో ఖాళీస్థలాల్లో భారీగా గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయడంతో కాంక్రీట్ విస్తీర్ణం తగ్గి వర్షపు నీరు నేలగర్భంలోకి చేరుతుండడంతో తప్పుతున్న ముంపు అవస్థలు. ప్రతి ఇల్లూ, భవనం, కార్యాలయం, వాణిజ్య సముదాయంపై కురిసిన వర్షాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో విధిగా రీఛార్జింగ్ పిట్. దీంతో రహదారులపైకి వచ్చే వరద సుమారు 60 శాతం తగ్గుతోంది. భవన విస్తీర్ణంలో సగభాగం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడటంతో వరద ముప్పు తప్పుతోంది. ఇక ఫిలడెల్ఫియా (అమెరికా), బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపడుతున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతున ఇంకుడు గుంత ఏర్పాటు. గుంత పూడకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలీ ఏర్పాటు. జాలీకి ఉన్న పెద్ద రంధ్రాల నుంచి వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మి.లీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. వర్షపునీటిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రహదారులను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలో తరచూ వరదనీరు నిలిచే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వరదనీరు నేలగర్భంలోకి చేరి భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్లు టీఎస్‌డీపీఎస్ గుర్తించింది. ఈ నమూనా గ్రేటర్ పరిధిలోనూ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
ఆ నగరాల జాబితాలో హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 నుంచి 2035 మధ్య అత్యంత వేగంగా ఎదిగే టాప్ 20 నగరాల జాబితాలో 17 భారతీయ నగరాలకు చోటు దక్కింది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించిన ఈ జాబితాలో సూరత్ అగ్రస్ధానంలో నిలవగా వరుసగా ఆగ్రా, బెంగళూర్, హైదరాబాద్, నాగపూర్, తిరుపూర్, రాజ్‌కోట్, తిరుచిరాపల్లి, చెన్నై, విజయవాడలు నిలిచాయి. అయితే 2035 నాటికి ఈ నగరాల మొత్తం జీడీపీ చైనా నగరాల జీడీపీతో పోల్చితే తక్కువగానే ఉంటుందని వార్షిక ప్రపంచ నగరాల పరిశోధన నివేదికలో ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్ నగరాల కంటే అధికంగా చైనా నగరాలే 2035 నాటికి అత్యధిక ఉత్పత్తులు సమకూరుస్తాయని అంచనా వేసింది. ఇక 2018-2035 మధ్య సూరత్ 9.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత నగరాల జాబితాలో నెంబర్ వన్‌గా నిలిచింది. భారత్ వెలుపల కంబోడియా రాజధాని ఫెమ్ ఫన్ అత్యధికంగా 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో ఎదుగుతాయని ఈ అథ్యయనం పేర్కొంది. ఆసియా నగరాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నా 2035 నాటికి సైతం అమెరికా నగరం న్యూయార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్టను నిలుపుకుంటుందని అంచనా వేసింది. -
ఈ నగరాలు ఏం చేస్తున్నాయి?
30 లక్షలు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపిన వివరాల ప్రకారం, వాయుకాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 30 లక్షల మంది మరణిస్తున్నారు. 98 % పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 98 శాతం నగరాల్లో వాయు నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే దిగువ స్థాయిలో ఉంది. 56 % అభివృద్ధి చెందిన దేశాల్లోని 56 శాతం నగరాల్లో వాయునాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. నగరాల్లోని వాయు కాలుష్యం ఇంతకుముందు కూడా సమస్యే గానీ, అదేదో పర్యావరణవేత్తలకు పరిమితమైన చర్చలా కనబడేది. ఇప్పుడు సామాన్యుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు వాయుకాలుష్యం కారణమవుతోంది. మనిషి వెంట్రుక వ్యాసం సుమారు 100 మైక్రోమీటర్లు అనుకుంటే, దానిలో పదోవంతుండే కాలుష్య కణాలు (పీఎం 10) మనిషి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. మరింత చిన్నవి (పీఎం 2.5) నేరుగా రక్తప్రవాహంలో కలిసిపోవచ్చు. కొన్ని మెదడులోకి కూడా వెళ్లే ప్రమాదముందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలో చాలా నగరాలు దీనిమీద స్పందిస్తున్నాయి. ఒకవిధంగా యుద్ధమే చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అమలు చేసిన, చేస్తున్న, చేయనున్న విధానాలు: పారిస్ (ఫ్రాన్స్): దేశం నడిబొడ్డున ఉన్న జిల్లాల్లో వారాంతాల్లో కార్లను నిషేధించారు. సరి-బేసి వ్యవస్థను అమలుచేశారు. కార్లనూ, బైకుల్నీ పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సీన్ నది కుడి గట్టుమీద అత్యధిక భాగం కార్ ఫ్రీ జోన్ చేశారు. అధిక కాలుష్య రోజుల్లో ప్రజారవాణా వ్యవస్థను ఉచితంగా వినియోగించుకునేలా ఏర్పాటుచేశారు. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): సైకిళ్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అక్కడి జనం కంటే సైకిళ్ల సంఖ్య ఎక్కువ. నగరంలోని చాలా ప్రదేశాల్లో పెద్ద వాహనాలను కొన్ని దశాబ్దాలుగా అనుమతించడం లేదు. 2025 నాటికి కర్బన రహిత నగరంగా దీన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్): సైకిళ్ల వినియోగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను నిషేధించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ కార్లను ప్రవేశపెట్టే యోచన చేస్తున్నారు. ఓస్లో (నార్వే): 2020 నాటికి కాలుష్యాన్ని సగానికి సగం తగ్గించేలా నగరంలోని అత్యధిక ప్రదేశాల్లో 'నో కార్ జోన్' ప్రవేశపెడుతున్నారు. కార్ పార్కింగ్ ప్రదేశాలను తొలగించి, సైకిళ్ల మార్గాలను నిర్మిస్తున్నారు. రష్ అవర్లలో మోటారిస్టుల మీద అధిక పన్ను వసూలు చేయనున్నారు. లండన్ (బ్రిటన్): 2017 నుంచి అధిక కాలుష్యానికి కారణమయ్యే వాహనాలు నగరం మధ్యలోకి ప్రవేశించాల్సివస్తే 10 పౌండ్ల సర్‌చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. 2019 నుంచి సిటీ సెంటర్లో అతి తక్కువ కాలుష్య ఉద్గారాల జోన్‌ను ప్రవేశపెట్టనున్నారు. జ్యూరిక్ (స్విట్జర్లాండ్): పార్కింగ్ స్థలాలను తగ్గించారు. నగరంలోకి కార్ల ప్రవేశాన్ని నిర్ణీత సంఖ్యలో అనుమతిస్తారు. ట్రాముల లేన్లు వేస్తున్నారు. కార్ ఫ్రీ జోన్లు, పాదచారులకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. కురిటీబా (బ్రెజిల్): 'గ్రీనెస్ట్ సిటీ ఆన్ ఎర్త్'గా పిలిచే ఈ నగరంలో 70 శాతం మంది ప్రజారవాణా వ్యవస్థనే ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ట్రాఫిక్ జాముల బెడద కూడా తప్పింది. బస్సులకు ప్రత్యేకంగా లేన్లను కేటాయించడం, ఎక్కువమందిని తీసుకెళ్లేలా పెద్ద బస్సులను ప్రవేశపెట్టడం చేస్తున్నారు. ఫ్రైబెర్గ్ (జర్మనీ): 500 కిలోమీటర్ల సైకిల్, ట్రామ్ రూట్లను నిర్మించారు. ప్రజారవాణా వ్యవస్థను అతి చౌక చేశారు. ఇళ్ల దగ్గర కార్ల పార్కింగ్‌ను నిషేధించారు. పట్టణ శివార్లలో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. దానికిగానూ ఏడాదికి దాదాపు రూ. 13 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. హెల్సింకి (ఫిన్లాండ్): పార్కింగ్ ఫీజులను భారీగా పెంచనున్నారు. ఇన్నర్ సిటీ రింగ్ రోడ్లను వాకింగ్ జోన్లుగా మార్చనున్నారు. 2050 నాటికి ఎవరూ ప్రత్యేకంగా కారును కోరుకోవాల్సిన పనిలేనంతగా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు చేపడుతున్నారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టాప్-20 విశ్వనగరాల్లో హైదరాబాద్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు టిమ్ క్యాంప్‌బెల్ సాక్షి, హైదరాబాద్: ‘వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా ప్రపంచంలోని టాప్- 20 నగరాల జాబితాలో హైదరాబాద్ ఉంది. వ్యవస్థీకృత పరిపాలన, వ్యాపారాల విస్తరణకు అవకాశాలు, టెక్నాలజీ పురోగమనం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణ, యువత భాగస్వామ్యం వంటి అత్యుత్తమ లక్షణాలు పుష్కలంగా ఉండడం ఈ నగరం ప్రత్యేకత..’ అని అమెరికాకు చెందిన పట్టణాభివృద్ధి రంగ నిపుణుడు, ‘బియాండ్ స్మార్ట్‌సిటీస్’ పుస్తక రచయిత టిమ్ క్యాంప్‌బెల్ తెలిపారు. సోమవారం మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: విశ్వవ్యాప్తంగా వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా హైదరాబాద్ స్థానం ఏమిటి? టిమ్: ఇప్పటివరకు ఐదుసార్లు భారత్‌లో పర్యటించాను. వ్యాపార అవకాశాల విస్తరణ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొదటి 20 నగరాల జాబితాలో ఉంటుంది. వ్యవస్థీకృత నగరంగా హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ప్రత్యేకతను చాటుకుంటోంది. భవిష్యత్‌లో డిజిటల్ టెక్నాలజీలో యువత భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చన్నది నా నిశ్చితాభిప్రాయం. ప్రశ్న: ఉత్తమ స్మార్ట్‌సిటీ లక్షణాలు ఏమిటి? టిమ్: అందరికీ అందుబాటులో డిజిటల్ టెక్నాలజీ, అందరికీ భద్రత, మెరుగైన పారిశుధ్యం, ప్రజారవాణా, తీరైన పట్టణ ప్రణాళిక, ఈ-గవర్నెన్స్, స్మార్ట్ పాలన, ట్రాఫిక్ నియంత్రణ, అందరికీ తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు.. స్మార్ట్‌సిటీ ప్రాథమిక లక్షణాలు. ్రప్రశ్న: భారత్ వంటి వర్ధమాన దేశాలు స్మార్ట్‌సిటీల నిర్మాణానికి అధిక నిధులు వెచ్చించలేవన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కదా? టిమ్:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో స్మార్ట్‌సిటీలను నిర్మించడం కష్టమేమీ కాదు.