Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్‌ | Miss Universe 2023: Sheynnis Palacios from Nicaragua crowned Miss Universe 2023 | Sakshi
Sakshi News home page

Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్‌

Published Mon, Nov 20 2023 4:40 AM | Last Updated on Mon, Nov 20 2023 8:25 AM

Miss Universe 2023: Sheynnis Palacios from Nicaragua crowned Miss Universe 2023 - Sakshi

విశ్వసుందరిగా నిలిచిన క్షణంలో పలాసియోస్‌ హర్షాతిరేకాలు

న్యూఢిల్లీ:  నికరాగ్వా సుందరి షెన్నిస్‌ పలాసియోస్‌ ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌–2023 కిరీటం దక్కించుకుంది. నికరాగ్వా నుంచి ఒకరికి ఈ అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. 72వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌ పోటీలు శనివారం రాత్రి ఎల్‌ సాల్వెడార్‌లోని శాన్‌ సాల్వెడార్‌లో జోస్‌ అడాల్ఫో పినెడా ఎరేనాలో ఘనంగా జరిగాయి. ఫస్ట్‌ రన్నరప్‌గా మిస్‌ థాయ్‌లాండ్‌ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్‌ రన్నరప్‌గా మిస్‌ ఆ్రస్టేలియా మొరాయా విల్సన్‌ నిలిచారు.

విశ్వ సుందరిగా నిలిచిన న షెన్నిస్‌ పలాసియోస్‌కు గతేడాది మిస్‌ యూనివర్స్‌ అమెరికా సుందరి ఆర్‌ బోనీ గాబ్రియెల్‌ కిరీటం అలంకరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. నికరాగ్వాలోని మనాగ్వాకు చెందిన 23 ఏళ్ల పలాసియోస్‌ మానసిక ఆరోగ్య కార్యకర్తగా బాధితులకు సేవలందిస్తున్నారు. ఆడియో విజువల్‌ ప్రొడ్యూసర్‌గానూ పని చేస్తున్నారు. ఈసారి మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో 84 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. భారత్‌ నుంచి  మిస్‌ ఇండియా శ్వేత శారద పోటీపడ్డారు. ఆమె టాప్‌–20 జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement