Miss Universe title
-
Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్
న్యూఢిల్లీ: నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకుంది. నికరాగ్వా నుంచి ఒకరికి ఈ అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. 72వ ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీలు శనివారం రాత్రి ఎల్ సాల్వెడార్‌లోని శాన్ సాల్వెడార్లో జోస్ అడాల్ఫో పినెడా ఎరేనాలో ఘనంగా జరిగాయి. ఫస్ట్ రన్నరప్‌గా మిస్ థాయ్‌లాండ్ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్ రన్నరప్‌గా మిస్ ఆ్రస్టేలియా మొరాయా విల్సన్ నిలిచారు. విశ్వ సుందరిగా నిలిచిన న షెన్నిస్ పలాసియోస్‌కు గతేడాది మిస్ యూనివర్స్ అమెరికా సుందరి ఆర్ బోనీ గాబ్రియెల్ కిరీటం అలంకరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. నికరాగ్వాలోని మనాగ్వాకు చెందిన 23 ఏళ్ల పలాసియోస్ మానసిక ఆరోగ్య కార్యకర్తగా బాధితులకు సేవలందిస్తున్నారు. ఆడియో విజువల్ ప్రొడ్యూసర్‌గానూ పని చేస్తున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో 84 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా శ్వేత శారద పోటీపడ్డారు. ఆమె టాప్–20 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. -
ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ!
మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్ యూనివర్స్' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు. MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m — Miss Universe (@MissUniverse) November 19, 2023 -
ప్రపంచ సుందరి కిరీటం ఈసారి అగ్రరాజ్యం సొంతం
-
మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న అమెరికా సుందరి
మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈసారి అగ్రరాజ్యం సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది. విన్నర్ గాబ్రియల్‌కు భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది విశ్వసుందరి టైటిళ్లను దక్కించుకోగా.. పోటీ చరిత్రలో అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్ఏ రికార్డు సృష్టించింది. ఇక మిస్ వెనిజులా ఆమంద డుడామెల్ తొలి రన్నరప్‌గా నిలవగా.. మిస్ డొమిన్‌కన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్‌గా నిలిచింది. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన మిస్ ఇండియా దివిట రాయ్ టాప్ 5లో సైతం చోటు దక్కించుకోలేకపోయింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది. అమెరికా లూసియానాలో వైభవంగా జరిగిన ఈ పోటీలో దాదాపు 80కుపైగా చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 మరోవైపు 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు చివరి సారిగా వేదికపై ర్యాంప్ వాక్ చేశారు. హర్నాజ్ ర్యాంప్ మీదకు వస్తుండగా పోటీదారులందరూ చప్పట్లతో ఉత్సహంగా ఆమెకు గ్రాండ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. వేదికపై నడుస్తూ కంటి నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం తన చేతుల మీదుగా కొత్త మిస్ యూనివర్స్‌కు కిరిటాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక విశ్వ సుందరి స్టేజ్‌పై హర్నాజ్ రెండు డిఫరెంట్ గౌన్లతో మెరిసిపోయారు. కాగా ఆమె ధరించిన స్పెషల్ గౌనుపై 1994 లో మిస్ యూనివర్స్‌గా గెలిచిన సుష్మితా సేన్ ఫోటో ఉండటం విశేషం.. కాగా హర్నాజ్ సంధు దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ టైటిల్‌ను అందించిన విషయం తెలిసందే. తన కంటే ముందు 1994లో సుష్మితా సేన్.. 2000 సంవత్సరంలో లారా దత్తా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw — Miss Universe (@MissUniverse) January 15, 2023 -
తన గౌను తానే కుట్టుకుని మిసెస్ యూనివర్స్ టైటిల్ నెగ్గిన మధ్యప్రదేశ్ మహిళ
పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అయితే అ అననుకూలతలనే అవకాశాలుగా మార్చుకుని ఏకంగా మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది డాక్టర్ దివ్యా పాటిదార్ జోషి. గతేడాది జరగాల్సిన ‘మిసెస్ యూనివవర్స్ సెంట్రల్ ఏషియా–2021’ పోటీలను కరోనా కారణంగా ఇటీవల సియోల్‌లో నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న దివ్య 120 దేశాల అందాల రాశులను వెనక్కు నెట్టి మిసెస్ యూనివర్స్ సెంట్రల్ ఏషియా కిరీటాన్ని దక్కించుకుంది. కిరీటమేగాక తన ప్రతిభాపాటవాలతో ‘మిసెస్ యూనివర్స్ ఇన్స్పిరేషన్’ పురస్కారాన్ని కూడా గెలుచుకుని ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన దివ్య చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి. డిగ్రీ చదివిన దివ్య హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. గిటార్‌ను చక్కగా వాయించడమేగాక, మంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్, సామాజిక కార్యక్రమాలు, నటన, సంగీతం పోటీలలో ఎంతో చురుకుగా పాల్గొనేది. సరిగమపా టీవీషో, ఇండియన్ ఐడల్లలో పాల్గొని టాప్ –100 జాబితాలో కూడా నిలిచింది. అత్తమామల ప్రోత్సాహంతో... రత్లాంకు చెందిన మర్చంట్ నేవీ అధికారి ప్రయాస్ జోషితో 2013లో దివ్యకు పెళ్లయ్యింది. ముందు నుంచి దివ్యకు ఉన్న ఆసక్తి, ప్రతిభా నైపుణ్యాలు తెలుసుకున్న భర్త, అత్తమామలు పెళ్లి తరువాత మోడలింగ్, అందాల పోటీలలో పాల్గొనమని ప్రోత్సహించడంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మోడలింగ్‌లో రాణిస్తూనే...‘మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ–2018’ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పోటీలో పాల్గొనే సమయంలో దివ్యకు ఏడాది బాబు ఉన్నాడు. ఈ టైటిల్ తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం...‘‘మధ్యప్రదేశ్‌లో అత్యంత ప్రభావవంత మహిళ ’’గా నిలిచింది. మరుసటి ఏడాది ‘మిసెస్ యురేషియా’ టైటిల్‌ను గెలుచుకుంది. మోడలింగ్‌లో రాణిస్తూనే, పెళ్లి తరువాత ఇంగ్లిష్ సాహిత్యం, మ్యూజిక్‌లో మాస్టర్స్‌తోపాటు, మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎమ్బీఏ, సోషల్ వర్క్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్‌ను పొందింది. గౌను డిజైన్ చేసుకుని.. కరోనా సమయంలో దివ్య తండ్రి మరణించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న కూతుర్ని ఓదార్చే క్రమంలో ఆమె తల్లి రాధా పాటిదార్ ‘ఇవన్నీ మర్చిపోయి, అందాల పోటీలపై మనసుపెట్టు’ అని చెప్పింది. దీంతో తన మూడేళ్ల కొడుకు ఆర్యమన్‌ను చూసుకుంటూనే ఎంబ్రాయిడరీ, మిషన్ కుట్టడం బాగా తెలిసిన దివ్య.. మిసెస్ సెంట్రల్ ఏషియా పోటీలకు వేసుకోవాల్సిన గౌనును తనే స్వయంగా డిజైన్ చేసి కుట్టుకుని దానినే ధరించి, టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఎన్జీవోలను నడుపుతూ... మహిళలు, పిల్లల అభ్యున్నతే లక్ష్యంగా ‘ద గ్రోయింగ్ వరల్డ్ ఫౌండేషన్, ద గ్రోయింగ్ ఇండియా ఫౌండేషన్’ల పేరిట దివ్య ఎన్జీవోలను నడుపుతోంది. ఇవేగాక ఇతర ఎన్జీవోలతో కలిసి సామాజిక సేవ చేస్తోంది. బాలికల విద్యపై వివిధ కార్యక్రమాలు చేపడతూ బాలికల్లో అవగాహన కల్పించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తోంది. పదకొండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికోసం పనిచేస్తోంది. గృహహింసపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల్లో ధైర్యం నింపుతోంది. ఇవేగాక వివిధ రకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా, రత్లాం మున్సిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛభారత్ మిషన్’కు అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఇన్ని కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ తన కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తోంది. వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగడంతోపాటు, ఎన్నోవిజయాలు సాధిస్తూనే, సామాజికసేవలోనూ ముందుండి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది దివ్య. నమ్మకం ఉంటే రోజూ అద్భుతమే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వారిలో అమ్మ తొలివ్యక్తి. ఆమెకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎవరైనా తమ కలలను నిజం చేసుకునేందుకు కనిపించే ప్రతిదారిలో వెళ్లవచ్చు. కానీ ఆ దారి ఇతరులెవరికి హాని చేయనిదై ఉండాలి. దేనిని ప్రతిబంధకంగా భావించకూడదు. అది జీవితంలో ఒక భాగం. ఇక్కడ అందరం విద్యార్థులమే. మొదట మనం నేర్చుకుని తరువాత మనమే ఇతరులకు టీచర్లుగా మారి నేర్చుకున్నది పాఠాలుగా చెప్పగలగాలి. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నమ్మకం ఉన్నప్పుడు ప్రతిరోజూ అద్భుతాలు చూడగలుగుతాము. – డాక్టర్ దివ్యాపాటిదార్ జోషి. -
మిస్ యూనివర్స్‌కు బాడీ షేమింగ్.. ‘నేను ఆ వ్యాధితో బాధపడుతున్నాను’
బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఏ ఒక్కరు కొంచెం లావు అయినా కొంచెం సన్నపడినా బాడీ షేమింగ్ పేరుతో విమర్శలు చేస్తుంటారు. అయితే అందరూ ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ‘మిస్ యూనివర్స్ 2021’ కీరిటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి, మోడల్ హర్నజ్ సంధు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. తను బరువు పెరిగానంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. కెరీర్ మొదట్లో చాలా సన్నగా ఉన్నారని, ఇప్పుడేమో లావుగా తయారయ్యారని వేధిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె సెలియాక్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఎవరికీ తెలియదన్నారు. సెలియాక్ వ్యాధి వల్ల గోధుమ పింటి లాంటి ఇతన అనేక ఆహార పదార్థాలను తినలేనని తెలిపారు. అయితే తన శరీరంపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎప్పుడూ నమ్మకంగా ఉంటానని , ఆత్మ విశ్వాసం సన్నగిల్లదని స్పష్టం చేశారు. చదవండి: హిజాబ్: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కామెంట్లు వైరల్ బొద్దుగా కనిపిస్తున్నావ్ కాగా ఇటీవల ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో హర్నాజ్ కౌర్ సంధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ షోలో హాల్టర్ నెక్‌తో కూడిన ఆరెంజ్ గౌను ధరించి జాన్ జాకబ్స్ సన్ గ్లాసెస్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు. వీడియోలు నెట్టింటా వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది హర్నాజ్ బొద్దుగా కనిపిస్తోందని, బరువు పెరిగిందంటూ ట్రోల్ చేశారు. చదవండి: Viral Video: వైరల్‌గా మిస్ యూనివర్స్ 2021 డాన్స్ వీడియో.. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse) అయితే హర్నాజ్ సంధు శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా కొందరు నెటిజన్స్ హర్నాజ్ ఆమెపై నెగిటివ్ కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇంకొందరు మాత్రం 20 సంవత్సరాల తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు అందించిన యువతిని ఇలా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు ఏమిటీ సెలియాక్ వ్యాధి ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. దిన్నే ఉదరకుహార వ్యాధి అని కూడా అంటారు. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ గ్లూటెన్ తీసుకోవడం పట్ల తీవ్రంగా స్పందిస్తుంది. ఇందులో గ్లూటెన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. వీళ్లు గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గోధుమలు, రై, బార్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. -
హర్నాజ్ తళుకులకు ఆమే కారణం.. క్రౌన్ గౌన్ బై షిండే!
ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ వేదికపై విశ్వసుందరి కిరీటంతో మెరిసింది మన హర్నాజ్ సంధు. గ్రాండ్ ఫినాలేలో సిల్వర్ గౌనులో వచ్చి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెను వరించిన విశ్వసుందరి కిరీటానికే వన్నె తెచ్చినట్టుగా కనిపించింది ఆ గౌను. దీంతో ఇనుమడించిన అందంతో వెలిగిపోయింది హర్నాజ్. మన భారతీయ అందాన్ని ప్రపంచ అందాల వేదికపై చూపు తిప్పుకోనియ్యకుండా చేసింది డిజైనర్ సైషా షిండే. నలభై ఏళ్ల సైషా షిండే ఇండియాలో ఉన్న కొద్దిమంది ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. గత పదిహేనేళ్లుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే హర్నాజ్ కోరిక మేరకు సిల్వర్ గౌన్‌ను ఎంతో ప్రత్యేకంగా రూపొందించింది సైషా. ఫుల్కారీ ప్యాటర్న్‌కు ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్స్‌లను జోడించి పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా గౌన్‌ను రూపొందించింది. ముంబైకి చెందిన సైషా షిండే.. ఎనిమిదో తరగతిలో ఉండగా గియన్ని వెర్సేస్ ఫ్యాషన్ షోను టీవీలో చూసింది. ఆ ఫ్యాషన్ షో బాగా నచ్చడంతో..అప్పుడే ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నప్పటికీ, ముందు చక్కగా చదువుకోవాలని కండీషన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చదువుకుంటూ ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. తరువాత మిలాన్ లో ఫ్యాషన్ డిప్లొమా చేసింది. ఫ్యాషన్ షోలలో డిజైనర్‌గా పనిచేస్తోన్న సమయంలో.. మధుర్ భండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. దీంతో సినిమాలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్‌లన్నీ షిండే రూపొందించి మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ల్యాక్మే ఫ్యాషన్ హౌస్’ టీవీ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ఆరునెలల ఇంటర్న్‌షిప్ చేసింది. ప్రముఖ డిజైనర్లు పాల్గొనే అమెరికన్ టీవీ సిరీస్ ‘ప్రాజెక్ట్ రన్‌వే’ సీజన్ 14లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. ఐశ్వర్యారాయ్, సన్నీలియోన్, కరీనా కపూర్ ఖాన్, కియరా అడ్వాణీ, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, తాప్సీ పొన్ను, మాధురీ దీక్షిత్ వంటివారికి డిజైనర్‌గా పనిచేసిన షిండే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాల కోసం పోటీపడే మోడల్స్‌ను మరింత అందంగా కనిపించేలా డ్రెస్‌లు రూపొందించడంలో విశేషం ఏముంది? వీటితోపాటు అనేక ఫ్యాషన్ షోలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తూ మంచి డిజైనర్‌గా రాణిస్తోంది. ఇలా మారింది సైషా షిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పెరిగిన షిండేకు .. అమ్మాయిల్లా తయారవాలని అనిపించేది. ఈ ఇష్టం కూడా ఫ్యాషన్‌ను కెరియర్‌గా ఎంచుకునేందుకు ప్రేరేపించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తను అబ్బాయి కాదు అమ్మాయిని అని అర్థమైంది. ఇరవై ఏళ్ల వయసులో తెలిసిన ఆ నిజాన్ని జీర్ణించు కోవడానికి షిండేకు కొన్నేళ్లు పట్టింది. తర్వాత బాగా ఆలోచించుకుని తన నిజమైన రూపంతోనే మిగతా జీవితాన్ని గడపాలనుకుంది. నేను ‘గే’ని కాను .. ట్రాన్స్ ఉమెన్ను అని ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి ప్రకటించింది. ఇక నుంచి తన పేరు స్వప్నిల్ షిండే కాదు సైషా షిండే అని స్పష్టం చేసింది. అప్పటి నుంచి సైషా షిండేగా పిలవబడుతోంది. ఇరవై ఏళ్ల నాటి కల.. ఎన్ఐఎఫ్టీలో సైషా ఫ్యాషన్ డిగ్రీ చదువుతోన్న సమయంలో లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. అది చూసిన షిండే ‘‘ఇలా మిస్‌యూనివర్స్ కిరీటం దక్కించుకునే విన్నర్‌కు నేను ఏదోక రోజు డ్రెస్ డిజైన్ చేస్తాను’’ అని మనసులో అనుకుంది. అప్పటి కల ఇప్పుడు హర్నాజ్ రూపంలో తీరింది. హర్నాజ్.. తన గ్రాండ్ ఫినాలే డ్రెస్ ఎలా ఉండాలో చెప్పినప్పుడు ఈమె తప్పకుండా విన్నర్ అవుతుందని షిండే అనుకుంది. హార్నాజ్ కోరుకున్నట్లుగా సిల్వర్ గౌన్ రూపొందించింది. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’ గౌన్ రూపొందించినందుకు ఎంతో సంతోషంగానూ గర్వంగానూ ఉందని షిండే సంబరపడిపోతోంది. -
సినిమాల్లోకి విశ్వసుందరి హర్నాజ్ సంధూ, అప్పడే 2 చిత్రాలకు సైన్
రెండు దశాబ్ధాల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధూ ‘మిస్ యూనివర్స్ 2021’ కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీలో మొత్తం 80 దేశాలను చెందిన సుందరిమణులు పాల్గొనగా వారిందరిని వెనక్కి నెట్టి విశ్వ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది హర్నాజ్. రెండు దశాబ్ధాల తర్వాత భారత్ విశ్వసుందరి కిరీటం తెచ్చిపెట్టిన హర్నాజ్ గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చదవండి: ఆ సీన్లో సాయి పల్లవిని చూసి నటించడం మర్చిపోయా: నాని సాధారణంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి అందాల పోటీల్లో సత్తాచాటిన తర్వాత వారందరూ సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించారు. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు. కానీ హర్నాజ్ ఈ పోటీలో పాల్గొనడానికి ముందే రెండు వెండితెర ఎంట్రీకి రెడీ అయ్యిందట. సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ కిరీటం దక్కేలా చేసింది హర్నాజ్ సంధూ. తన అందం, అంతకుమించిన తెలివితేటలతో సుస్మితా సేన్, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా గుర్తింపు పొందింది. చదవండి: నాకు ‘పుష్ప’ కథ తెలియదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ ఏమాత్రం అంచనాలు లేకుండా ఇజ్రాయెల్ వెళ్లిన హర్నాజ్ 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ ‘మిస్ యూనివర్స్ 2021’ సొంతం చేసుకుంది. దీంతో చాలామంది ఆమె గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లాంటి అందాల పోటీల్లో సత్తాచాటిన వారందరూ సిల్వర్‌స్ర్కీన్‌పై అడుగపెడతారు. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: తోటి మహిళలు ఆరోగ్యం, పరిశుభ్రతపై తమకున్న ఆందోళనలను స్వేచ్ఛగా బయటకు వెళ్లడించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే తన ధ్యేయమని మిస్ యూనివర్స్–2021 కిరీటధారి హర్నాజ్ సంధు(21) చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తోపాటు రుతుక్రమ సమయంతో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తన తల్లి, గైనకాలజిస్ట్ రవీందర్ కౌర్ సంధుయే తనకు ఆదర్శమన్నారు. ‘మహిళలు తమ ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా బయటకు చెప్పుకోగలగాలి. మా వర్గీయుల్లో చాలామంది మహిళలు ఇప్పటికీ తమ శరీరం, ఆరోగ్యం గురించి ఏదైనా మాట్లాడటం అసౌకర్యంగా భావిస్తారు. ఇలాంటి అంశాలపై వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. సరైన సమయంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను కూడా నయం చేయవచ్చు’అని ఆమె చెప్పారు. పలు పంజాబీ సినిమాల్లో నటించిన హర్నాజ్ సంధు..బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్–2021గా తన ఎంపిక దేశానికే వేడుక వంటిదన్నారు. సాధ్యమైనంత త్వరలో స్వదేశం వచ్చి విజయోత్సవం జరుపుకునేందుకు, తన తల్లిని కౌగలించుకునేందుకు తహతహలాడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె ఇజ్రాయెల్‌లోని ఐలాత్ నుంచి ఫోన్ ద్వారా పీటీఐ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుస్మితాసేన్, లారాదత్తాల తర్వాత మిస్ యూనివర్స్‌ను సొంతం చేసుకున్న మూడో భారతీయ యువతిగా హర్నాజ్ సోమవారం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ నుంచి ఆమె నేరుగా న్యూయార్క్ వెళతారు. అక్కడ ఆమె మిస్ యూనివర్స్ సంస్థతోపాటు పలు సంస్థలకు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
21 ఏళ్ల తరువాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం.. వైజాగ్ మోడల్స్ స్పందన
130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారతీయ యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో మోడల్ సిటీగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో మోడల్స్ మురిసిపోయారు. జయహో హర్నాజ్ అంటూ అభినందనలు తెలిపారు. 21 ఏళ్ల తరువాత భారత్‌కు ఈ అరుదైన కిరీటం దక్కడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇప్పటికే ర్యాంప్‌పై మెరిసిపోతున్న ఎందరో మోడల్స్‌కు సంధు ఓ ధైర్యం..స్ఫూర్తి నింపిందని నగరానికి చెందిన ప్రముఖ మోడల్స్ తమ అభిప్రయాలను వ్యక్తం చేశారు. –బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు)/ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) గర్వంగా ఉంది విశ్వసుందరిగా హర్నాజ్ కిరీటం దక్కించుకోవడం భారతీయ ఫ్యాషన్ రంగం గర్వపడేలా చేసింది. అందం, అభినయం, వాక్చాతుర్యంతో ఆమె ప్రపంచాన్ని జయించింది. కంగ్రాట్స్.. – మిస్ శిల్పానాయక్, మిస్ ఇండియా చార్నింగ్ విన్నర్–2021 ప్రపంచం మురిసింది ఫ్యాషన్ ప్రపంచంలో ఇండియా మరోసారి మురిసింది. ర్యాంప్‌పై హర్నాజ్ మెరిసి ప్రపంచాన్ని జయించింది. 21 ఏళ్ల తరువాత మళ్లీ భారత్‌కు విశ్వసుందరి కిరీటం దక్కడం మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది. – సంధ్యారాణి, మిసెస్ ప్రిన్సెస్ ఆంధ్ర వావ్ హర్నాజ్ మాటల్లేవ్..ఆమె విజయం మాలో ఎంతో ఉత్సాహం నింపింది. ఓ భారతీయ మహిళకు విశ్వసుందరి కిరీటం ఎప్పుడు దక్కుతుందా అని ఎదురు చూసేదాణ్ని. 21 ఏళ్ల తరువాత ఆ కల హర్నాజ్‌తో తీరిపోయింది. గ్రేట్ సంధు. – సునీత, మిస్ ఆంధ్రప్రదేశ్–2021 ఎందరికో ఆదర్శం ప్రోత్సాహం అందిస్తే ప్రపంచం మెచ్చేలా సత్తా చాటుకుంటామని హర్నాజ్ విజయంతో మరోసారి రుజువైంది. తను మాట్లాడే మాటలు అందరికీ ఆదర్శం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్‌లో మాస్టర్స్ చేస్తూ ఇండియా జెండాను రెపరెపలాడించడం ఆనందంగా ఉంది. – లీలావతి, శ్రీమతి తెలుగు మహిళా విన్నర్ దేశం గర్వించదగ్గ రోజు దేశం గర్వించదగ్గ రోజిది. హర్నాజ్ అటు చదువులోనూ, ఇటు మోడలింగ్‌లోనూ రాణించడం గొప్ప విషయం. ప్రతి మోడల్‌కు మిస్ యూనివర్స్ అనేది ఓ డ్రీమ్. అది కొందరికే సాధ్యం. భారత్‌కు చెందిన హర్నాజ్ ఈ ఫీట్‌ను 21 ఏళ్ల తరువాత సాధించడం చాలా గర్వంగా ఉంది. –వీరుమామ, ఇంటర్నేషనల్ ఈవెంట్ డైరెక్టర్ సూపర్ విజయం దాదాపు 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌కు దక్కడం చాలా గర్వంగా ఉంది. మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనే యువతకు హర్నాజ్ విజయం స్ఫూర్తి నింపింది. – సృజిత, మిస్ వైజాగ్ విన్నర్–2021 -
ప్రపంచాన్ని ఫిదా చేసిన ‘విశ్వ’సుందరి హర్నాజ్ కౌర్ సంధు.. ఫొటోలు
-
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది. ‘విశ్వసుందరి’ మిస్ ఇండియా హర్నాజ్ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్ పరాగ్వేకు చెందిన మిస్ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్ లలేలా డిసెంబర్ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్ మొదటిసారి ఈ టైటిల్ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక మూడోసారి టైటిల్‌కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్ రేవు పట్టణం ఐలత్లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే హోస్ట్‌గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఎర్రసముద్రం మురిసిపోయింది ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్ పట్టణంలో హర్నాజ్ విజయంతో భారత్ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్ వెర్షన్‌ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్ 16లో ఆ తర్వాత టాప్ 10లో ఆపైన టాప్ 5లో వెళ్లి టైటిల్ మీద ఆశలు రేపింది. టాప్-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్ రన్నర్ అప్‌గా సౌత్ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది. సౌందర్యంతో పాటు చైతన్యం కూడా అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్ వార్మింగ్’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం. కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్‌కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్‌లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్ తెర మీద చూడొచ్చు. మధ్యతరగతి విజయం ‘హర్నాజ్ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్ తల్లి రవిందర్ సంధు. ఆమె గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. హర్నాజ్ తండ్రి పేరు పి.ఎస్.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్. వీరి కుటుంబం చండీగడ్‌లోని మోహలీలో ఉంటుంది. ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్‌లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్ టైటిల్ గెలవడం చూసి సోదరుడు హరూన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు. ‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్ ద సాగ్’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్‌లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్ పంజాబ్’ టైటిల్ గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు. కుటుంబ సభ్యులతో హర్నాజ్ The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
-
మిస్ యూనివర్స్‌గా భారత యువతి
సాక్షి, న్యూఢిల్లీ: 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్‌గా నిలిచింది మిలీనియం గర్ల్ హర్నాజ్. (చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?) 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించని హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 చదవండి: దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్ పాప్ సింగర్.. మిలీనియం గర్ల్ హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. నటిగానూ.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పడమే కాక.. ఆ మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్. -
Miss Universe 2020: విశ్వసుందరి ఆండ్రియా మెజా
ఫ్లోరిడా: 2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్ యూనివర్స్) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా (26) గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో(22) విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. ఫస్ట్ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్ యువతి జూలియా గామా(28), సెకండ్ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి జనిక్ మాసెటా(27) నిలిచారు. -
మిస్ యూనివర్స్‌గా మిస్ దక్షిణాఫ్రికా.!
లాస్ వేగాస్: ఈ ఏడాది విశ్వ సుందరిగా దక్షిణాఫ్రికా యువతి డెమీలే–నెల్ పీటర్స్(22) ఎంపికయ్యారు. కొలంబియా సుందరి లౌరా గోంజాలెజ్, జమైకా యువతి డావినా బెన్నెట్ వరసగా మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్ యూనివర్స్ ఇరిస్ మిటెనారె.. డెమీలేకు కిరీటం తొడిగారు. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్రద్ధా శశిధర్ తుది 16 మందిలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. నవంబర్ 18న మానుషి ఛిల్లర్ ప్రపంచ సుందరిగా ఎంపికవడంతో ప్రపంచ అందాల వేదికపై భారత్ మరో విజయాన్ని ఆశించినా ఈసారి నిరాశే ఎదురైంది. ఈ పోటీలో కీలకమైన ప్రశ్న–జవాబు రౌండ్లో జ్యూరీ అడిగిన ప్రశ్నకు డెమీలే ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. ‘మీలో ఉన్న ఏ గుణం పట్ల మీరు గర్వంగా ఫీలవుతున్నారు? మిస్ యూనివర్స్‌గా దాన్ని ఎలా ఉపయోగిస్తారు?’ అని ప్రశ్నించగా...అందుకు డెమీలే బదులిస్తూ ‘మిస్ యూనివర్స్ వ్యక్తిగతంగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ఎన్నో భయాలు, బలహీనతలను అధిగమించిన మహిళే ఈ స్థాయికి చేరుకుంటుంది. అలాగే సాటి మహిళలు తమ భయాలను తొలగించుకునేలా మిస్ యూనివర్స్ వారికి సాయం చేసే స్థితిలో ఉంటుంది’ అని చెప్పారు. మొత్తం 92 మంది అందగత్తెలు పోటీ పడిన ఈ కార్యక్రమంలో మిస్ వెనెజులా, మిస్ థాయిలాండ్‌లు కూడా తుది ఐదుగురిలో ఉన్నారు. Congratulations to Demi-Leigh Nel-Peters, the winner of the 2017 #MissUniverse competition! pic.twitter.com/JYuQYc3Lvo — Miss Universe (@MissUniverse) 27 November 2017 -
విశ్వసుందరి పౌలినా వెగా
-
విశ్వసుందరి పౌలినా వెగా
డోరాల్: కొలంబియాకు చెందిన పౌలినా వెగా ఈ ఏడాది విశ్వసుందరి (మిస్ యూనివర్స్)గా నిలిచింది. మియామీలో జరిగిన ఈ పోటీలో 22 ఏళ్ల మిస్ కొలంబియా వెగా 87 దేశాలకు చెందిన సుందరీమణులతో పోటీపడి ఈ టైటిల్ గెలుచుకుంది. బిజినెస్ విద్యార్థిని అయిన వెగా అమెరికా, ఉక్రెయిన్, జమైకా, నెదర్లాండ్స్ అందగత్తెలతో పోటీపడి ఈ విజయం సాధించింది. మిస్ యుఎస్ఏ నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కుసాలు రన్నరప్‌లుగా నిలిచారు. గతంలో మిస్ కొలంబియాగా ఎంపికైన ఈ బ్యూటీ కొలంబియా నుంచి విశ్వసుందరిగా నిలిచిన రెండవ అందగత్తె. సుదీర్ఘ కాలం తరువాత ఆ దేశ సుందరి ఈ కిరీటం గెలుచుకుంది. 1956లో ఈ దేశానికి చెందిన మారినా ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇదిలా ఉండగా, భారత్ తరపున ఈ పోటీల్లో పాల్గొన్న నొయోనిత లాధ్ టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటి లారా దత్తా 2000లో విశ్వసుందరిగా ఎంపికయింది. ఆ తరువాత మన దేశ అందగత్తెలెవరికీ ఈ కిరీటం దక్కలేదు.