బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఏ ఒక్కరు కొంచెం లావు అయినా కొంచెం సన్నపడినా బాడీ షేమింగ్ పేరుతో విమర్శలు చేస్తుంటారు. అయితే అందరూ ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ‘మిస్ యూనివర్స్ 2021’ కీరిటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి, మోడల్ హర్నజ్ సంధు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు.
తను బరువు పెరిగానంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. కెరీర్ మొదట్లో చాలా సన్నగా ఉన్నారని, ఇప్పుడేమో లావుగా తయారయ్యారని వేధిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె సెలియాక్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఎవరికీ తెలియదన్నారు. సెలియాక్ వ్యాధి వల్ల గోధుమ పింటి లాంటి ఇతన అనేక ఆహార పదార్థాలను తినలేనని తెలిపారు. అయితే తన శరీరంపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎప్పుడూ నమ్మకంగా ఉంటానని , ఆత్మ విశ్వాసం సన్నగిల్లదని స్పష్టం చేశారు.
చదవండి: హిజాబ్: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కామెంట్లు వైరల్
బొద్దుగా కనిపిస్తున్నావ్
కాగా ఇటీవల ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో హర్నాజ్ కౌర్ సంధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ షోలో హాల్టర్ నెక్‌తో కూడిన ఆరెంజ్ గౌను ధరించి జాన్ జాకబ్స్ సన్ గ్లాసెస్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు. వీడియోలు నెట్టింటా వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది హర్నాజ్ బొద్దుగా కనిపిస్తోందని, బరువు పెరిగిందంటూ ట్రోల్ చేశారు.
చదవండి: Viral Video: వైరల్‌గా మిస్ యూనివర్స్ 2021 డాన్స్ వీడియో..
అయితే హర్నాజ్ సంధు శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా కొందరు నెటిజన్స్ హర్నాజ్ ఆమెపై నెగిటివ్ కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇంకొందరు మాత్రం 20 సంవత్సరాల తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు అందించిన యువతిని ఇలా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు
ఏమిటీ సెలియాక్ వ్యాధి
ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. దిన్నే ఉదరకుహార వ్యాధి అని కూడా అంటారు. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ గ్లూటెన్ తీసుకోవడం పట్ల తీవ్రంగా స్పందిస్తుంది. ఇందులో గ్లూటెన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. వీళ్లు గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గోధుమలు, రై, బార్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment