సినిమాల్లోకి విశ్వసుందరి హర్నాజ్ సంధూ, అప్పడే 2 చిత్రాలకు సైన్‌ | Miss Universe Harnaaz Sandhu Set to Make Acting Debut With Punjabi Film | Sakshi
Sakshi News home page

Harnaaz Sandhu: సినిమాల్లోకి విశ్వసుందరి హర్నాజ్ సంధూ

Published Wed, Dec 15 2021 1:51 PM | Last Updated on Wed, Dec 15 2021 3:06 PM

Miss Universe Harnaaz Sandhu Set to Make Acting Debut With Punjabi Film - Sakshi

రెండు దశాబ్ధాల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధూ ‘మిస్‌ యూనివర్స్‌ 2021’ కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇజ్రాయెల్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీలో మొత్తం 80 దేశాలను చెందిన సుందరిమణులు పాల్గొనగా వారిందరిని వెనక్కి నెట్టి విశ్వ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది హర్నాజ్‌. రెండు దశాబ్ధాల తర్వాత భారత్‌ విశ్వసుందరి కిరీటం తెచ్చిపెట్టిన హర్నాజ్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.  

చదవండి: ఆ సీన్లో సాయి పల్లవిని చూసి నటించడం మర్చిపోయా: నాని

సాధారణంగా మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ లాంటి అందాల పోటీల్లో సత్తాచాటిన తర్వాత వారందరూ సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించారు. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్‌ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు. కానీ హర్నాజ్‌ ఈ పోటీలో పాల్గొనడానికి ముందే రెండు వెండితెర ఎంట్రీకి రెడీ అయ్యిందట. సుమారు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్ కిరీటం దక్కేలా చేసింది హర్నాజ్‌ సంధూ. తన అందం, అంతకుమించిన తెలివితేటలతో సుస్మితా సేన్‌, లారాదత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీక్వీన్‌గా గుర్తింపు పొందింది.

చదవండి: నాకు ‘పుష్ప’ కథ తెలియదు: రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌

ఏమాత్రం అంచనాలు లేకుండా ఇజ్రాయెల్‌ వెళ్లిన హర్నాజ్‌ 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ ‘మిస్ యూనివర్స్ 2021’ సొంతం చేసుకుంది. దీంతో చాలామంది ఆమె గురించి తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ లాంటి అందాల పోటీల్లో సత్తాచాటిన వారందరూ సిల్వర్‌స్ర్కీన్‌పై అడుగపెడతారు. ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారాదత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్‌ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement