
ఫ్లోరిడా: 2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్ యూనివర్స్) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా (26) గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి.
పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా అడ్‌లైన్ కాస్టెలినో(22) విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. ఫస్ట్ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్ యువతి జూలియా గామా(28), సెకండ్ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి జనిక్ మాసెటా(27) నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment