Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్‌ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్‌డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది.
అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్‌లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది.
(Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!)
లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్‌ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్‌లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం.
లిస్ట్‌లో ఇండియన్ కంపెనీలు
అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్‌డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్‌లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి.
టాప్ 20 లిస్ట్ ఇదే..
1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్
2. H&R బ్లాక్
3. డెల్టా ఎయిర్ లైన్స్
4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
5. యాక్సెంచర్
6. IBM
7. L3 హారిస్
8. విప్రో
9. ఇన్ఫోసిస్
10. నైక్
11. వ్యాన్స్
12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్
13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్
14. హాల్ మార్క్
15. మైక్రోసాఫ్ట్
16. నార్త్రోప్ గ్రుమ్మన్
17. FedEx ఫ్రైట్
18. డచ్ బ్రదర్స్ కాఫీ
19. వాల్ట్ డిస్నీ కంపెనీ
20. యాపిల్
Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo
— IBM (@IBM) September 21, 2023
Comments
Please login to add a commentAdd a comment