టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్‌లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్‌మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ముందంజలో టీసీఎస్
ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.
ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకం
దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్‌రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.
తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టి
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.
విప్రో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment