భారతీయ దిగ్గజ ఐటి కంపెనీలు టీసీఎస్) ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌టెక్ ఈ వారం తమ క్యూ2 ఎఫ్‌వై24 ఫలితాలను ప్రకటించాయి. లాభాలు, ఆదాయాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నింటిలో ప్రధాన ట్రెండ్‌లో హెడ్‌కౌంట్ సంఖ్య గణనీయంగా తగ్గడంచర్చకు దారి తీసింది. దీనికి తోడు దాదాపు కొత్త హైరింగ్‌పై ఆశాజనక అంచనాలను ప్రకటించలేదు. ఇదే ఐటీ ఉద్యోగార్థులను కలవరానికి గురిచేస్తోంది.
ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న వారి ఉద్యోగాలపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవడంతోపాటు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవైపు ఏఐ విధ్వంసంపై ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు జాబ్ మార్కెట్‌లో అనిశ్చితి వేలాదిమంది లేఆఫ్స్ ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు పడుతుందని, అత్యధిక రిస్క్ గ్రూపులో వారే ఉంటారని ఇండస్ట్రీ నిపుణుల మాట. (IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ)
టీసీఎస్
టీసీఎస్‌లో త్రైమాసిక ప్రాతిపదికన 6,333 మంది ఉద్యోగుల సంఖ్య నికరంగా క్షీణించింది. జూన్ త్రైమాసికంలో 615,318 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య,సెప్టెంబర్ 30 నాటికి 608,985 వద్దకు చేరడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే గత ఏడాది 616,171 ఉద్యోగు 7,186 మంది తగ్గిపోయారు. తమ నియామక లక్ష్యాలను రీకాలిబ్రేషన్ చేయడం దీనికి కారణమని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.
తెలివైన ఫ్రెషర్‌లను ముందస్తుగా నియమించుకోవడం, సరైన నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడి పెట్టడం అనే తమ వ్యూహం ఫలిస్తోంది. ఆ టాలెంట్ స్ట్రీమ్‌లోకి రావడంతోపాటు తగ్గిన అట్రిషన్‌ను తగ్గించి, స్థూల జోడింపులను రీకాలిబ్రేట్ చేయగలిగా మని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ప్రాజెక్ట్ ఫలితాలను పెంచడమే లక్ష్యమని లక్కాడ్ వివరించారు.
ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ తన హెడ్‌కౌంట్‌లో వరుసగా 7,530 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల ప్రకారం క్రితం త్రైమాసికంలో కంపెనీలో 3,36,294 మందితో పోలిస్తే సెప్టెంబర్ 2023 నాటికి 3,28,764 మంది ఉన్నారు. గత ఏడాది త్రైమాసికంతో పోల్చినా కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యాంపస్‌లలో మాస్ రిక్రూటింగ్ డ్రైవ్‌లను నిర్వహించబోని కూడా సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ ఫలితాల విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కంపెనీ గణనీయ మైన బెంచ్ పరిమాణాన్ని కలిగి ఉందన్నారు. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకున్నాం, డిమాండ్ కంటే ముందుగానే నియమించుకున్నాం, ముఖ్యమైన ఫ్రెషర్ బెంచ్ ఇంకా ఉందని ఆయన చెప్పారు. (Infosys: షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్!)
హెచ్‌సీఎల్‌టెక్
కొత్త నియమాలను ప్రకటించినప్పటికీ హెచ్‌సిఎల్‌టెక్ నికర హెడ్‌కౌంట్ మాత్రం క్షీణించింది. క్యూ1లో కంపెనీ హెడ్‌కౌంట్ 2,506 తగ్గా, Q2 FY 24లో 2,299 తగ్గింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,139గా ఉంది. ఈ క్షీణత ఇది వరుసగా రెండో త్రైమాసికం. బెంచ్ లేదా శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు ప్రాజెక్ట్‌లలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నందున కంపెనీలో హెడ్‌కౌంట్ తగ్గిందని సీఎండీ విజయకుమార్ వివరించారు.గత 18 నెలల్లో నియమించుకున్న చాలా మంది ఫ్రెషర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే అట్రిషన్‌ను బ్యాక్‌ఫిల్ చేయలేదు. ఈ కారణంగానే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 1 శాతం తగ్గిందని చెప్పారు.
సెక్టార్ వ్యూ
మూడు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఫలితాలను విడుదల చేశాయి.ఫైనాన్షియల్‌తో పాటు, నియామకాల విషయానికి వస్తే Q2 త్రైమాసికంలో స్వల్పంగా తగ్గాయి.సంవత్సరం క్రితం త్రైమాసికంలో టీసీఎస్ 9,840 మందిని నియమించుకుంది; ఇన్ఫోసిస్ 10,032 మందిని నియమించుకుంది. HCLTech 8,382 మందిని నియమించుకుంది. ఈ మూడు కంపెనీల సంయుక్త హెడ్‌కౌంట్ వృద్ధి 28,254గా ఉంది. అదే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, మొత్తం మూడు కంపెనీల నికర ఉద్యోగుల చేరిక 16,162 వద్ద ప్రతికూలంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment