no jobs
-
నిరుద్యోగం, అధిక ధరలే కారణం
న్యూఢిల్లీ: ఈ నెల 13వ తేదీన పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న ‘పొగ’ అలజడికి దేశంలో తీవ్రమైన నిరుద్యోగం, పెరుగుతున్న ధరలే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగాలు లభించని యువతే లోక్‌సభలో అలజడి సృష్టించిందని చెప్పారు. యువతలో ఎంతో కాలంగా పెరుగుతూ వస్తు న్న ఆగ్రహం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ‘దేశంలో అత్యంత తీవ్రమైన అంశం నిరుద్యోగం. దేశమంతటా ఈ సమస్య తో యువత రగులుతోంది. మోదీ జీ విధానాల ఫలితంగానే యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు’అని ఆయన మీడియాతో అన్నారు. పార్లమెంట్ వద్ద జరిగిన ఘటనకు భద్రతా వైఫల్యమనే కారణమనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది. కానీ, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమే దీనికి కారణం’అని అనంతరం ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. -
ఐటీ ఉద్యోగాల సంక్షోభం: టెకీలకు నిపుణుల సంచలన హెచ్చరికలు
భారతీయ దిగ్గజ ఐటి కంపెనీలు టీసీఎస్) ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌టెక్ ఈ వారం తమ క్యూ2 ఎఫ్వై24 ఫలితాలను ప్రకటించాయి. లాభాలు, ఆదాయాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నింటిలో ప్రధాన ట్రెండ్‌లో హెడ్‌కౌంట్ సంఖ్య గణనీయంగా తగ్గడంచర్చకు దారి తీసింది. దీనికి తోడు దాదాపు కొత్త హైరింగ్‌పై ఆశాజనక అంచనాలను ప్రకటించలేదు. ఇదే ఐటీ ఉద్యోగార్థులను కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న వారి ఉద్యోగాలపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవడంతోపాటు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవైపు ఏఐ విధ్వంసంపై ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు జాబ్ మార్కెట్లో అనిశ్చితి వేలాదిమంది లేఆఫ్స్ ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు పడుతుందని, అత్యధిక రిస్క్ గ్రూపులో వారే ఉంటారని ఇండస్ట్రీ నిపుణుల మాట. (IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ) టీసీఎస్ టీసీఎస్‌లో త్రైమాసిక ప్రాతిపదికన 6,333 మంది ఉద్యోగుల సంఖ్య నికరంగా క్షీణించింది. జూన్ త్రైమాసికంలో 615,318 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య,సెప్టెంబర్ 30 నాటికి 608,985 వద్దకు చేరడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే గత ఏడాది 616,171 ఉద్యోగు 7,186 మంది తగ్గిపోయారు. తమ నియామక లక్ష్యాలను రీకాలిబ్రేషన్ చేయడం దీనికి కారణమని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తెలివైన ఫ్రెషర్లను ముందస్తుగా నియమించుకోవడం, సరైన నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడి పెట్టడం అనే తమ వ్యూహం ఫలిస్తోంది. ఆ టాలెంట్ స్ట్రీమ్‌లోకి రావడంతోపాటు తగ్గిన అట్రిషన్‌ను తగ్గించి, స్థూల జోడింపులను రీకాలిబ్రేట్ చేయగలిగా మని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ప్రాజెక్ట్ ఫలితాలను పెంచడమే లక్ష్యమని లక్కాడ్ వివరించారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ తన హెడ్‌కౌంట్‌లో వరుసగా 7,530 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల ప్రకారం క్రితం త్రైమాసికంలో కంపెనీలో 3,36,294 మందితో పోలిస్తే సెప్టెంబర్ 2023 నాటికి 3,28,764 మంది ఉన్నారు. గత ఏడాది త్రైమాసికంతో పోల్చినా కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యాంపస్‌లలో మాస్ రిక్రూటింగ్ డ్రైవ్‌లను నిర్వహించబోని కూడా సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ ఫలితాల విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కంపెనీ గణనీయ మైన బెంచ్ పరిమాణాన్ని కలిగి ఉందన్నారు. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాం, డిమాండ్ కంటే ముందుగానే నియమించుకున్నాం, ముఖ్యమైన ఫ్రెషర్ బెంచ్ ఇంకా ఉందని ఆయన చెప్పారు. (Infosys: షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్!) హెచ్‌సీఎల్‌టెక్ కొత్త నియమాలను ప్రకటించినప్పటికీ హెచ్‌సిఎల్‌టెక్ నికర హెడ్‌కౌంట్ మాత్రం క్షీణించింది. క్యూ1లో కంపెనీ హెడ్‌కౌంట్ 2,506 తగ్గా, Q2 FY 24లో 2,299 తగ్గింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,139గా ఉంది. ఈ క్షీణత ఇది వరుసగా రెండో త్రైమాసికం. బెంచ్ లేదా శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు ప్రాజెక్ట్‌లలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నందున కంపెనీలో హెడ్‌కౌంట్ తగ్గిందని సీఎండీ విజయకుమార్ వివరించారు.గత 18 నెలల్లో నియమించుకున్న చాలా మంది ఫ్రెషర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే అట్రిషన్‌ను బ్యాక్‌ఫిల్ చేయలేదు. ఈ కారణంగానే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 1 శాతం తగ్గిందని చెప్పారు. సెక్టార్ వ్యూ మూడు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఫలితాలను విడుదల చేశాయి.ఫైనాన్షియల్తో పాటు, నియామకాల విషయానికి వస్తే Q2 త్రైమాసికంలో స్వల్పంగా తగ్గాయి.సంవత్సరం క్రితం త్రైమాసికంలో టీసీఎస్ 9,840 మందిని నియమించుకుంది; ఇన్ఫోసిస్ 10,032 మందిని నియమించుకుంది. HCLTech 8,382 మందిని నియమించుకుంది. ఈ మూడు కంపెనీల సంయుక్త హెడ్‌కౌంట్ వృద్ధి 28,254గా ఉంది. అదే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, మొత్తం మూడు కంపెనీల నికర ఉద్యోగుల చేరిక 16,162 వద్ద ప్రతికూలంగా ఉంది. -
అధిక సంతానం ఉంటే అనర్హులే.. యూపీ నూతన చట్టం
లక్నో: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేరు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతి సైతం దక్కదు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన రాయితీలూ పొందలేరు. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడమే లక్ష్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ముసాయిదాలోని ముఖ్యాంశాలివీ. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల విధానాన్ని కఠినంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పాలసీని ఉల్లంఘిస్తే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం అసాధ్యమే. ఈ మేరకు ‘ఉత్తరప్రదేశ్ జనాభా(నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు–2021’లో భాగంగా యూపీ లా కమిషన్(యూపీఎస్ఎల్సీ) ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఈ ముసాయిదాను మెరుగుపర్చేందుకు ప్రజల సలహాలు, సూచనలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు లా కమిషన్ వెల్లడించింది. జూలై 19లోగా ప్రజలు స్పందించాలని కోరింది. ముసాయిదాలో ఏముందంటే.. ► జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర జనాభా నిధిని ఏర్పాటు చేస్తారు. ► ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సర్వీసు కాలంలో అదనంగా 2 ఇంక్రిమెంట్లు అందుకోవచ్చు. 12 నెలల పూర్తి వేతనం, భత్యాలతో మాతృత్వ, పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వ వాటాను 3 శాతం పెంచుతారు. ► అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెటర్నిటీ సెంటర్లు నెలకొల్పుతారు. ఇక్కడ గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు సరఫరా చేస్తారు. ► ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ► గర్భధారణలు, ప్రసవాలు, జననాలు, మరణాలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ► జనాభా నియంత్రణను అన్ని సెకండరీ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి. ► పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వనరులు పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆహారం, సురక్షిత తాగునీరు, సరైన ఆవాసం, నాణ్యమైన విద్య, విద్యుత్ వంటి వసతులతోపాటు జీవనోపాధి తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. పరిమిత వనరులతో అందరికీ అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం కష్టం. అందుకే జనాభా నియంత్రణ, స్థిరీకరణ చర్యలు చేపట్టాలి. రాజకీయ అజెండాతోనే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదాను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని యూపీ కాంగ్రెస్ ప్రతినిధి అశోక్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి బిల్లును తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ధ్వజమెత్తారు. దేశంలో దళితులు, గిరిజనుల కారణంగానే జనాభా పెరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహూమూద్ వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కోసం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా అది ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే భావించాలన్నారు. -
ప్రస్నార్ధకంగా తెలంగాణ వీఆర్వోల పరిస్థితి
-
ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!
సాక్షి, విశాఖపట్నం : నిరుద్యోగులే టార్గెట్... ఉద్యోగం కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారు కనిపించగానే అక్కడ వాలిపోయాడు... డీఆర్ఎం ఆఫీసులో తను పనిచేస్తున్నానని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసేశాడు... అనంతరం అదుగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు.. అంటూ కాలం గడిపేశాడు.. చివరకు బండారం బయటపడుతుందని అనుమానం రాగానే నగరం నుంచి ఉడాయించేశాడు. దీంతో మోసపోయిన 30 మందికిపైగా బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నమ్మించి టోకరా నగరంలోని అక్కయ్యపాలెంలో ‘వైజాగ్ హోమ్స్’ పేరిట ఎయిర్ కూలర్ సర్వీస్ సెంటర్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురహరి సాయి సంతోష్ నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిరుద్యోగులను తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. గత ఏప్రిల్ నెలలో రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మించాడు. వారు తెలియనప్పటికీ సంతోష్ నేరుగా వెళ్లి పరిచయం చేసుకునేవాడు. డీఆర్ఎం కార్యాలయంలో హెచ్ఆర్ విభాగంలో రిక్రూట్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను... రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అనంతరం అతని భార్య మురహరి సుజాతని రంగంలోకి దింపేవాడు. ఆమె చాకచక్యంగా మాట్లాడుతూ నిరుద్యోగులను అక్కయ్యపాలెం పరిధి లలితానగర్‌లోని ఎంకే కైలాస్ టవర్స్‌లో అద్దెకు ఉంటున్న తమ నివాసానికి తీసుకొచ్చి నమ్మకం కలిగించేది. మరికొందరిని డీఆర్ఎం కార్యాలయానికి రమ్మని అక్కడి పరిచయాలతో నమ్మకం కలిగించేవాడు. పూర్తిగా నిరుద్యోగులను నమ్మించిన తర్వాత డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పేవాడు. ఇలా మొత్తం ఐదు అకౌంట్లలో బాధితుల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. అలా సుమారు 30 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షలు చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశాడు. సెంటర్లోని ఫర్నిచర్ తరలింపు బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు భువనేశ్వర్‌కు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్ చేయించుకోమనేవా డు. ఈ క్రమంలో వారు సిద్ధమైతే వాయిదా వేసేవాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు అప్పట్లోనే నగరంలోని నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఇల్లు, వైజాగ్ హోమ్స్ సర్వీసు సెంటర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి గురువారం రాత్రి అందులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని మురహరి సాయి సంతోష్ తరలించుకుపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 30 మందికిపైగా బాధితులు మురహరి సంతోష్ బాధితులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 30 మందికిపైగా ఉన్నా రు. వారిలో శ్రీనివాస్, నక్కరాజు వెంకట సింహాద్రి, నక్కరాజు శివ, కర్రి సత్యారావు, గరికిన స్వర్ణ, గుర్రం అనిల్‌కుమార్, నక్కా రమణ, గెడ్ల మోహన్‌రెడ్డి, జి.వెంకట సతీష్, వళ్లు సూర్యనారాయణ, ఎల్లా త్రీనాథమ్మ, రేగిడి పద్మలతో కలిసి 30 మందికి పైగా బాధితులున్నారు. -
గిట్లనే ఉంటదా?
నేలకొండపల్లి : పోటీ ప్రపంచంలో ఏళ్లతరబడి చదివినా కొలువులు రాని పరిస్థితి. ఉన్న భూమిలో కొంత ప్రభుత్వానికి ఇస్తే కొడుకులకు కొలువొస్తుందని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు అడిగిందే తడవుగా గ్రామాల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి భూములిచ్చారు. స్థలం ఇచ్చిన రైతు కుటుంబాలకు రెండు ఉద్యోగాలు ఇస్తామని ఐదేళ్ల క్రితం అధికారులు హామీ ఇచ్చారు. ఏళ్లు గడిచినా హామీ అమలుకు నోచుకోకపోగా.. భూమి ఇచ్చిన దాతల కుటుంబాల్లో ఎదురుచూపులే మిగిలాయి. కొందరు ఉన్న కొద్దిపాటి భూమిని పోగొట్టుకోవడం.. తమ గోడు మంత్రులు, అధికారులకు వినిపించినా పట్టించుకోకపోవడంతో వచ్చే నెల నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 మండలాల్లో మెరుగైన విద్యుత్‌ను అందించేం దుకు 2013లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నారు. అందుకు అవసరమైన స్థలాన్ని స్థానిక రైతుల నుంచి సేకరించారు. సబ్‌స్టేషన్ స్థాయి, వీలునుబట్టి అరెకరం, ఎకరం భూమిని తీసుకున్నారు. ఈ క్రమంలో భూమి ఇచ్చిన రైతు కుటుంబాల్లో అర్హతనుబట్టి ఉద్యోగం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ప్రతి సబ్‌స్టేషన్‌కు ఆపరేటర్, వాచ్‌మన్‌ను నియమిస్తామని చెప్పడంతో రైతులు సంతోషంగా తమ భూములిచ్చారు. సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టారు.. ఐదేళ్లు పూర్తయింది.. ఉద్యోగాలు మాత్రం ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. సబ్‌స్టేషన్‌కు తాళాలు విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో సదరు రైతు కుటుంబాలు సబ్స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నాయి. పలుచోట్ల సబ్స్టేషన్లకు తాళాలు వేసి.. నిరసన తెలియజేస్తున్నారు. అనేక మార్లు సంబంధిత అధికారులను భూ నిర్వాసితులు కలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 గ్రామాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన పి.వంశీ కుటుంబ సభ్యులు సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎకరం స్థలం ఇచ్చారు. ప్రస్తుతం ఆ భూమి రూ.13లక్షల విలువ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం రాకపోవడంతో చెరువుమాధారం సబ్‌స్టేషన్ వద్ద రైతు కుటుంబం పలుమార్లు తాళాలు వేసి.. నిరసనకు దిగింది. ఇక అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, దీంతో వచ్చే నెల నుంచి ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని బాధిత రైతు కుటుంబాలు ప్రకటించాయి. -
కోడింగ్ రాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కలే..
-
క్యాంపస్ కొలువు కష్టమే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఓ మోస్తరు కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం గ్యారంటీ.. టాప్ 10 కాలేజీల్లో సీటు వచ్చిందంటే ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే.. – రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన ఇది! కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి 250 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉద్యోగ ఆఫర్ లెటర్లు ఇచ్చిన దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏటా 10 నుంచి 12 వేల మందిని నియమించుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇప్పుడు ‘ఏ’కేటగిరి ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అది కూడా టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి మూడు నుంచి ఆరు మాసాలపాటు శిక్షణ ఇచ్చే ఈ సంస్థలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన విద్యార్థులను మాత్రమే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరి ఆయా కాలేజీలకు వెళ్లి వేల మందికి ఒక రోజు పరీక్ష నిర్వహించి, మరో రోజు మౌఖిక పరీక్ష నిర్వహించి వందల మందిని ఎంపిక చేసుకునే ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఇన్ఫోసిస్ ‘హ్యాక్ విత్ ఇన్ఫీ’, కాగ్నిజెంట్ ‘టెక్నాలజీ హైరింగ్’పేరుతో విద్యార్థులకు కఠిన పరీక్షలు నిర్వహించి ఎక్కువ వేతనంతో నియమించుకుంటున్నాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యా రంగంలో టాప్ కాలేజీలుగా పేర్కొంటున్న సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, ఎంవీఎస్ఆర్ కాలేజీల్లో సైతం 2018 పాస్డ్ అవుట్ విద్యార్థులకు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువ ఆఫర్లు వచ్చాయి. కోడింగ్ వస్తేనే.. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు అమెరికన్ కంపెనీలు కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఉద్యోగాలు ఆఫర్ చేయడానికి గతంలో మాదిరి ఒకరోజు రిక్రూట్మెంట్కు పరిమితం కావడం లేదు. కోడింగ్ బాగా తెలిసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, డెలాయెట్, అమెజాన్, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించి.. వారిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ కారణంగా ప్రైవేట్ టాప్ కాలేజీల్లో ఐటీ సంబంధిత కోర్సుల్లో సీటు కోసం రూ.12 నుంచి రూ.15 లక్షల మేర డొనేషన్ చెల్లించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. బీ, సీ కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు కూడా ఉండటం లేదని తెలియడంతో టాప్ కాలేజీల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాలుగు కాలేజీలకే పరిమితమైన కాగ్నిజెంట్ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ దేశవ్యాప్తంగా ఎనిమిది కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టింది. వాటిలో హైదరాబాద్ కాలేజీలే నాలుగు ఉన్నాయి. సీబీఐటీ, వాసవి, ఎంవీఎస్ఆర్, శ్రీనిధి కాలేజీల్లో మాత్రమే టెక్నాలజీ హైరింగ్ పేరుతో నియామకాలు చేపట్టి కేవలం 12 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సంస్థ సీబీఐటీ కాలేజీ నుంచి 201 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేయగా ఈ ఏడాది ఐదుగురికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. వాసవీ కాలేజీలో 2017లో 121 మందికి ఆఫర్ చేసి.. ఈ ఏడాది పాసైన నలుగురు విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంవీఎస్ఆర్ నుంచి ముగ్గురికి ఉద్యోగాలు ఆఫర్ చేయగా.. శ్రీనిధి కాలేజీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదీ అదే దారి దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్.. కాగ్నిజెంట్ దారిలోనే నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వందల సంఖ్యలో టాప్ కాలేజీల విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చిన ఈ సంస్థలు 2017లో పరిమిత సంఖ్యలో నియమించుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని, గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ కంపెనీలకు వస్తున్న ఆర్టర్లు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో పని చేయడానికి అర్హులైన వారు లభించకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2016లో నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 753 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసిన ఇన్ఫోసిస్.. 2017కు వచ్చేసరికి ఆ సంఖ్యను 132కి తగ్గించింది. ఈ ఏడాది రెగ్యులర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆ కంపెనీ విధానమేమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఇక టీసీఎస్ హైదరాబాద్‌లో పరిమితంగా రెండు లేదా 3 కాలేజీల్లో మాత్రమే నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. కోడింగ్ రాకుంటే కష్టమే: ప్రొఫెసర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్, సీబీఐటీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. జావా కోడింగ్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా వంటివి కూడా ఇప్పుడు కంపెనీలకు అవసరం. ఐఐటీలు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. మిగిలిన యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ఏదేమైనా గతంలో మాదిరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడు అంత ఈజీ కాదు. -
హోదా సంజీవనే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంజీవినే.. ఇది ప్రతి నిరుద్యోగి చెబుతున్న మాట.. ఎందుకంటే వ్యవసాయిక జిల్లా అయిన పశ్చిమ గోదావరిలో పారిశ్రామిక రంగంలో మాత్రం రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించక పోగా వాటికి ఇచ్చే నిధుల్లో కూడా కోత పెట్టారు. దీంతో గడిచిన రెండేళ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఉపాధి కల్పన శాఖ కూడా ప్రైవేటు కంపెనీలలో మార్కెటింగ్ ఉద్యోగాలను మాత్రమే కల్పించింది. ఇక్కడ కూడా వేతనాలు లేక 90 శాతం మంది మళ్లీ ఆ ఉద్యోగాలను మానివేశారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉపాధి కార్యాలయంలో నమోదు చేయించుకున్న వారి లెక్కన చూస్తే 81,561 మంది నిరుద్యోగులు ఉంటే, అనధికారికంగా నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వనరులు ఎక్కువగా ఉన్నా వాటిని వినియోగించుకునే పరిశ్రమలే లేవు. అభివృద్ధికి జిల్లాలో ఎంతో అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. 29 డెల్టాతో పాటు 19 మెట్ట మండలాల్లో మెజారిటీ వరి పంట పండిస్తారు. వరి ద్వారా రైస్ మిల్లులను ఎక్కువగా పెంపుదల చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఒక్క తాడేపల్లిగూడెం ఏరియాలోనే 40 వరకూ రైస్‌మిల్లులు మూత పడ్డాయి. మనకు సుద్ద నిల్వలు అపారంగా ఉన్నాయి. దీని ద్వారా సిరామిక్ పరిశ్రమలను స్థాపించవచ్చు. బొగ్గు నిల్వలు చింతలపూడి ప్రాంతంలో లభిస్తున్నాయని తేలింది. కనీసం దీనిపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి కేంద్రీకరించలేదు. జిల్లాలో పండించే చెరకు వల్ల పంచదార పరిశ్రమలను అధికంగా ఏర్పాటు చేయవచ్చు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే చాగల్లు సుగర్ ఫ్యాక్టరీ దివాలా తీసే స్థాయికి చేరింది. జీడిమామిడి ఉత్పత్తులు, ఆక్వా రంగంపైనా దృష్టి కేంద్రీకరించి ఫీడ్ యూనిట్లు వంటివి నెలకొల్పవచ్చు. జూట్ నగరంగా పేరుగాంచిన ఏలూరులో జూట్ మిల్లులపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. 12 వేల మందికి ఉపాధి కల్పించే ఏలూరు జూట్ మిల్లులు ప్రస్తుతం కేవలం 6 వేల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. హోదా వచ్చి ఉంటే.. జిల్లాలో రూ.7,400 కోట్ల వ్యయంతో 5 మెగా ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటి ద్వారా 12,820 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటూ మాటలు చెప్పారు. అయితే వాటిలో ఏ ఒక్కటి నేటికీ పూర్తి కాలేదు. జిల్లాలో లభించే ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పితే మరో లక్షా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు పారిశ్రామిక రంగంలో కల్పించవచ్చు. రెండు సంవత్సరాలలో వివిధ రాయితీల రూపంలో ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు 50 కోట్ల రూపాయలు సబ్సిడీ నిధులు విడుదల చేసింది. ప్రత్యేక హోదా వస్తే ఈ రాయితీ నిధులు మరో రూ.100 కోట్లకు పైబడి జిల్లాకు విడుదలయ్యే అవకాశం ఉండేది. రెండేళ్లలో జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 798 మంది స్థాపించేందుకు ముందుకు వచ్చారు. వాటిలో 772 మందికి అనుమతులు ఇవ్వగా, ఇందులో పదోవంతు పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదు. ఇవన్నీ అనుమతుల దశలోనే నిలిచిపోయాయి. అదే హోదా వచ్చినట్టయితే ఈ పరిశ్రమలన్నీ ఆచరణలోకి వచ్చి ఉండేవి. హోదా లభిస్తే పరిశ్రమలకు కస్టమ్స్, ఎకై్సజ్ సుంకాలలోనూ, కార్పొరేట్ ఇ¯Œæకమ్ ట్యాక్స్‌లో పూర్తి మినహాయింపు లభిస్తుంది. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ, 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్ చార్జీలపై 50 శాతం రాయితీ వంటి సౌకర్యాలు లభిస్తాయి. హోదావల్ల ఇటువంటి సౌకర్యాలు అందుతాయి కనుక పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పోటీ పడేవారు. కేటాయింపులు ఘనం.. అమలు శూన్యం జిల్లాలో మచ్చుకైనా భారీ పరిశ్రమలు కనిపించడం లేదు. ప్రభుత్వం భారీ పరిశ్రమలు జిల్లాలో స్థాపిస్తామంటూ చెబుతోంది. కానీ ఆ విధమైన ప్రయత్నాలు చేసేందుకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. రెండేళ్లలో భారీ పరిశ్రమల కోసం రూ.200 కోట్లు కేటాయింపులు చేస్తే వాటిలో కేవలం రూ.122 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. 2015–16 విషయానికి వస్తే 805 కోట్ల రూపాయలు పరిశ్రమలకు వెచ్చించాలని నిర్దేశించుకున్నా వాటిలో కేవలం రూ.264.4 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా వస్తే పశ్చిమ గోదావరి చివరి స్థానం నుంచి ముందుకు వచ్చే అవకాశంతో పాటు వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. -
కొలువుల కలపై పిడుగుపాటు
జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం 15 వేల మంది నిరీక్షణ రాష్ట్ర మంత్రి గంటా ప్రకటనతో వారిలో నిరాశానిస్పృహలు రామచంద్రపురం: ‘జాబు కావాలంటే బాబు రావాలి’.. చంద్రబాబు నాయుడి సారథ్యంలోని టీడీపీ గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నినాదమిది. కానీ గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల్లో నిరాశానిస్పృహలకు కారణమవుతున్నాయి. ఉద్యోగాల్లో ఖాళీలకు నియామకాలు చేపట్టకుండా మెుండిచెయ్యి చూపుతున్నారు. తాజాగా ఉపాధ్యాయుల పోస్టులు ఇక భర్తీ లేనట్లేనని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన ప్రభుత్వం తీరును, చంద్రబాబునాయుడి హామీలలోని మోసాన్ని బహిర్గతం చేస్తోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మంత్రి గంటా ప్రకటన హతాశులను చేసింది. జిల్లాలో సుమారుగా 15 వేల మంది ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు వారంతా కంగుతిని ‘బాబు వస్తే జాబు వస్తుం’దని చెప్పిన టీడీపీపై మండిపడుతున్నారు. అటు పోస్టులను భర్తీ చేయకుండా, ఇటు ఉన్న పోస్టులకు ఎసరు పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఏటా 6,500 మంది ఉపాధ్యాయ ఉత్తీర్ణులు జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మెుత్తం 4,300 వరకు ఉన్నాయి. గత డీఎస్సీ నియామకాలు చేపట్టిన అనంతరం జిల్లాలో 240 స్కూల్ అసిస్టెంటు పోస్టులు, 25 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవికాకుండా ఏటా సుమారు 350 మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచటంతో పదవీ విరమణ చేసేవారు తక్కువగా ఉంటున్నారు. 2017 నాటికి జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనుండటంతో ఎక్కువగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలు ఏర్పడనున్నాయి. జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. వీటిలో ఏటా సుమారు 5 వేలమంది ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. ఇక జిల్లాలో ఏటా 1,500 మంది వరకు బీఈడీ అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 15 వేలమంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారున్నారని అంచనా. ఆది నుంచీ కొలువులకు ఎసరే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెడుతూనే ఉంది. గత ఏడాది నుంచి పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో జిల్లాలో సుమారుగా 370 పాఠశాలలను విలీనం చేసి ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను మిగిలిన పాఠశాలలకు సర్దుబాటు చేసి ఉపాధ్యాయ పోస్టులను కుదించేశారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వమే పాఠశాలల విలీనం పేరుతో ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెట్టింది. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. అయినా ఆశతో ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి మంత్రి ప్రకటన అశనిపాతంలా మారింది. ఇచ్చిన హామీని నెరవేర్చాలి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీని నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఉపాద్యాయ పోస్టుల్లో కోత పెడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. –ఎస్.రేణుకాదేవి, ఎంఎస్సీ, బీఈడీ, రామచంద్రపురం నిరాశే మిగిలింది.. గతంలో నిర్వహించిన డీఎస్సీని రాసాను, కానీ ఉద్యోగం రాలేదు. ఈ ఏడాది తిరిగి డీఎస్సీ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను, కానీ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటనతో నిరాశే మిగిలింది. – కుడిపూడి నాగేశ్వరరావు, బీఎస్సీ, బీఈడీ, రామచంద్రపురం ఏకగవాక్ష విధానాన్ని తేవాలి.. ప్రభుత్వ నిర్ణయాలతో పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏక గవాక్ష విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. దీంతో ఏటా శిక్షణ పొందుతున్న వారికి ఉద్యోగాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. –టీవీవీఎస్ తిలక్‌బాబు, పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు