ఓ మోస్తరు కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గ్యారంటీ.. టాప్ 10 కాలేజీల్లో సీటు వచ్చిందంటే ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినట్టే..
– రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన ఇది!
కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి 250 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉద్యోగ ఆఫర్ లెటర్లు ఇచ్చిన దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏటా 10 నుంచి 12 వేల మందిని నియమించుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇప్పుడు ‘ఏ’కేటగిరి ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అది కూడా టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.
కోడింగ్ రాకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కలే..
Published Sun, Jul 22 2018 8:02 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement