నగరంలో మరో కామాంధుడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రఖ్యాత మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేంద్ర వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలకు వలవేసి, పెళ్లిచేసుకుంటానని నమ్మించడం ఇతని నైజం. అలా దగ్గరైన అమ్మాయిలకు స్వీట్‌పాన్‌లో మత్తుమందు కలిపిచ్చి, అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి, వాటిని యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతోపాటు నానారకాలుగా వేధించేవాడు’’ అని పోలీసులు చెప్పారు.