MNC companies
-
డ్రాగన్ నుంచి షిఫ్ట్ అవ్వాలనే యోచనలో దిగ్గజ సంస్థలు.. ఎందుకంటే..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా తర్వాత చైనా జీరో కొవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో అక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కుంటుపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో తయారీ రంగంలో డ్రాగన్‌కు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో విదేశీ సంస్థలకు భారత్ మెరుగైన గమ్యస్థానంగా కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో భాగంగా తన విధానాల నుంచి వెనక్కు మళ్ళేది లేదని పలుమార్లు జిన్‌పింగ్ కరాఖండీగా చెప్పారు. మానవ వనరులు అధికంగా ఉండటంతో ప్రపంచంలోని వేలాది కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేశాయి. 2020లో వుహాన్‌లో కరోనా వ్యాప్తి చెందిన తరవాత దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు స్తంభించిపోయాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టిన తరవాత ప్రపంచ దేశాల్లో వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగింది. చైనాలో జీరో కొవిడ్ లాక్డౌన్ల వల్ల వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచానికి చైనా ఉత్పత్తి కేంద్రంగా మారింది. డ్రాగన్ అనుసరిస్తున్న విధానాలు దానికి ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలను ముందుకు తెచ్చాయి. ఆ ప్రయత్నాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ ముందున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఇప్పటికే తన విధానాలను భారత్ సవరించింది. ఇండియాలో 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో వియత్నాం నుంచి భారత్‌కు తీవ్ర పోటీ ఉంది. భౌగోళికంగా చైనాకు వియత్నాం చాలా చేరువలో ఉంది. పెద్దగా ఖర్చు లేకుండానే కర్మాగారాలను అక్కడకు తరలించవచ్చు. అయితే, వియత్నాంలో మౌలిక వసతుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. మౌలిక వసతుల విషయంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఏటా దేశంలో జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. దిల్లీ-ముంబయిల మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ రహదారి, సరకులను తరలించే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలు, దేశ తీర ప్రాంతాల్లోని ఓడరేవులు..ఇలా పలు సంస్థలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా ఉన్నాయి. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం చైనాలోని కొన్ని విభాగాలను భారత్‌కు తరలించాలని యోచిస్తోంది. 2025 కల్లా 25శాతం ఐఫోన్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ యోచిస్తుంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వారికి అందించాలన్న చట్టంపై కొన్ని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మానవవనరుల పరంగా ఇప్పటికే భారత్ చైనాను దాటేసిందని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లోని ముఖ్యపట్టణాలతో పాటు ఇతర నగరాలను కలుపుతూ రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వెరసి ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు భారత్‌వైపు చూసేందుకు ప్రధానకారణం అవుతుంది. -
భారత్‌ను గెలిపించడానికి ప్రపంచం ఏకమవుతోంది - సంజీవ్ మెహతా
ముంబై: గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అనేక బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీ) భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నాయని హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ సీఈవో సంజీవ్ మెహతా తెలిపారు. భారత్‌ను గెలిపించడానికి యావత్ప్రపంచం ఏకమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మెహతా ఈ విషయాలు చెప్పారు. వలస పాలన కారణంగా భారత్ తొలి రెండు పారిశ్రామిక విప్లవాల్లో పాలుపంచుకోలేకపోయిందని తెలిపారు. మూడో పారిశ్రామిక విప్లవ సమయంలో భారత్ ఆర్థికంగా బలహీనంగా ఉందన్నారు. తాజాగా నాలుగో పారిశ్రామిక విప్లవం .. భారత వృద్ధి, పురోగతికి దోహదకారిగా నిలవగలదని మెహతా చెప్పారు. మరోవైపు, హెచ్‌యూఎల్ నిర్వహణ మార్జిన్లు ఎంతో మెరుగ్గా ఉంటాయని, 75 బిలియన్ డాలర్ల పైచిలుకు వేల్యుయేషన్‌తో కోల్గేట్ పామోలివ్, రెకిట్ బెన్కిసర్ గ్రూప్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల కన్నా విలువైన కంపెనీగా ఉందని పేర్కొన్నారు. -
ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరిస్తోంది. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 3,000 సీటింగ్ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది. ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విజయవాడలో ఇప్పటికే ఉన్న హెచ్‌సీఎల్.. తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే యోచనలో ఉంది. విశాఖలో మరో భారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్కు, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది. యాంకర్ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థల చూపు ఇప్పుడు ఆ నగరంపై పడింది. ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ ఆర్బిట్‌మాల్ షాపింగ్ మాల్తో పాటు ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించిన 17 ఎకరాల భూమిని రహేజా గ్రూపు కొనుగోలు చేసింది. విజయవాడకు టెక్ మహీంద్ర టెక్ మహీంద్రా తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నాని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తెలియజేశారు. ఇప్పటికే విశాఖలో ఉన్న తాము విజయవాడలో కూడా అడుగు పెట్టామంటూ సీఎంను కలిసిన అనంతరం గుర్నానీ ట్వీట్ చేశారు. అంతకు ముందు దావోస్‌లో గుర్నానిని కలిసిన సీఎం జగన్.. రాష్ట్రంలో కార్యకలాపాలను మరింతగా విస్తరించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. విజయవాడాలోని మేథా టవర్స్‌లో ప్రస్తుతం 100 మందితో కార్యకలాపాలను ప్రారంభించగా, త్వరలో ఆ సంఖ్యను 1,000కి చేర్చాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తగిన భవనాలను కోసం అన్వేషిస్తోంది. మరో ఐటీ దిగ్గజ సంస్థ అసెంచర్స్ కూడా విజయవాడలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 1,000 మంది సీటింగ్ సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా తొలుత 200–300 సీటింగ్ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇదే సమయంలో ఇండియాకు చెందిన అతి పెద్ద ఐటీ కంపెనీ ఒకటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖ వేదికగా ఒక భారీ ఐటీ సదస్సును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. కోవిడ్‌తో చిన్న ఊళ్ల వైపు చూపు అంతర్జాతీయంగా పని చేస్తున్న ఐటీ నిపుణుల్లో 20 శాతం మంది మన రాష్ట్రం నుంచే ఉన్నారని అంచనా. ప్రతి ఐదుగురిలో ఒకరు మన రాష్ట్రం నుంచి ఉన్నట్లు వివిధ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ తర్వాత చాలా మంది బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ఆఫీసులకు వెళ్లి పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో 10 శాతం మించి ఉద్యోగులు ఆఫీసులకు రావడం లేదు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. తక్షణం ప్రభుత్వం వద్ద బిల్డింగ్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ప్రైవేటు బిల్డింగ్‌లలో కార్యకలాపాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రాయితీలతో పాటు, వాటి కార్యకలాపాలు సజావుగా సాగేలా అపిటా (ఏపీఈఐటీఏ– ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ) ద్వారా చేయూత అందిస్తున్నాం. ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. – ఎం.నందకిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) చిన్న కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, అసెంచర్స్ వంటి ఐటీ యాంకర్ కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో వాటికి అనుబంధంగా అనేక చిన్న కంపెనీలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే మర్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కడతాయి. ఐటీ కంపెనీలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు ఇస్తోంది. త్వరలో స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం. – శ్రీధర్ కోసరాజు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (ఐటాప్) -
టాప్ ఎంఎన్సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా?
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక వేతనం రూ. కోట్లలో ఉండటం సహజమే. దిగ్గజ సంస్థల్లో పనిచేసే కొందరైతే రూ. వందల కోట్లు కూడా ఆర్జిస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీల్లో పనిచేసే సీఈవోల్లో చాలా మంది కేవలం ఒక డాలర్ వేతనాన్నే ఎందుకు తీసుకుంటున్నారు? తమ తెలివితేటలతో ఆయా సంస్థలను అగ్రపథాన నడిపిస్తున్నప్పటికీ వారు ఇలా నామమాత్ర జీతాన్ని అందుకోవడానికి కారణమేంటి? ఇది నిజంగా వారు చేస్తున్న త్యాగమా? లేక దీని వెనక ఏమైనా గిమ్మిక్కు దాగి ఉందా? చరిత్రను పరిశీలిస్తే... ► బడా సంస్థల సీఈవోలు కేవలం ఒక డాలర్ వేతనాన్ని తీసుకొనే సంప్రదాయం రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే మొదలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లో చాలా మంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ► చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా తమ సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. అయితే జీతం ఇవ్వకుండా పనిచేయించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం కావడంతో అలా ముందుకొచ్చిన వారికి ఒక డాలర్ వేతనాన్ని ఆఫర్ చేశారు. ► అలా నామమాత్ర జీతం అందుకున్న వారు ‘డాలర్–ఎ–ఇయర్–మెన్’గా పేరుగాంచారు. చదవండి: పంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే! త్యాగధనులు అనిపించుకోవడానికి... ► అమెరికాలోని టాప్–3 ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన క్రిస్లర్ 1980లో కుప్పకూలే స్థితికి చేరుకున్నప్పుడు అప్పటి సీఈవో లీ ఇయాకోకా ప్రభుత్వం నుంచి 1.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ సాధించి సంస్థను గట్టెక్కించారు. అదే సమయంలో సంస్థలోని కార్మికులు, డీలర్లు, సరఫరాదారులు వారికి రావాల్సిన బకాయిలను స్వచ్ఛందంగా వదులుకొనేలా ఒప్పించారు. ► సంస్థను తిరిగి గాడినపెట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చాటిచెప్పేందుకు తన వేతనాన్ని ఒక డాలర్‌కు తగ్గించుకున్నారు. వాటాదారులకు సంఘీభావం తెలిపేలా... ►ఏడాదికి కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకుంటున్నట్లు చూపడం ఓ రకంగా ప్రతీకాత్మకమే.. సంస్థ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి సీఈవోలు ఇలా వ్యవహరిస్తుంటారు. ► ఏటా కేవలం ఒక డాలర్ వేతనాన్ని అందుకొనే సీఈవోలు నిజానికి సంస్థ స్టాక్‌లు, ఆప్షన్లు, బోనస్‌లను పనితీరు ఆధారిత పరిహారం కింద అందుకుంటుంటారు. చదవండి: సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే! బయటకు కనిపించేంత నిస్వార్థపరులేం కాదు..! ► పనితీరు ఆధారిత చెల్లింపుల కింద సీఈవోలు పొందే భారీ మొత్తాలపై చాలా వరకు తక్కువ పన్ను రేటే వర్తిస్తుంది. ► సీఈవోలకు చేసే ఈ తరహా చెల్లింపులను సంస్థ పన్ను ఆదాయంలోంచి కోతపెట్టేందుకు 1993లో అమెరికా చేసిన చట్టం అనుమతిస్తుంది. అంటే ఓ రకంగా చూస్తే సీఈవోలు పొందే భారీ మొత్తాలకు పన్ను చెల్లింపుదారులు సబ్సిడీ ఇస్తున్నట్లే లెక్క. ► కేవలం ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 2018లో ఫెడరల్ ఆదాయ పన్నుల కింద దమ్మిడీ కూడా చెల్లించలేదట! ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే... ► 2011లో 50 మంది సీఈవో లపై చేపట్టిన ఓ సర్వే గణాంకాలను (2019 ద్రవ్యోల్బణ విలువలకు సరిదిద్దాక) పరిశీలిస్తే ఒక డాలర్ వార్షిక వేతనం అందుకొనే సీఈవోలు సగటున జీతం కింద 6.10 లక్షల డాలర్లను వదలుకుంటున్నట్లు వెల్లడైంది. కానీ అదే సమయంలో వారు బయటకు ఎవరికీ పెద్దగా కనపించని ఈక్విటీ ఆధారిత పరిహారం కింద 20 లక్షల డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు తేలింది! చదవండి: పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా? 100 రెట్లకుపైగా... ► 2019లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం... అమెరికాలోని 500 బడా కంపెనీల సీఈవోల్లో 80 శాతం మంది తమ సంస్థల్లో పనిచేసే ఓ మధ్యశ్రేణి ఉద్యోగి వేతనానికి 100 రెట్లకుపైగా ఆర్జిస్తున్నారు. అసమానతల దృష్టి మళ్లించేందుకే... ► గత కొన్ని దశాబ్దాలుగా సీఈవో–ఉద్యోగి మధ్య వేతన వ్యత్యాసం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ►ఆర్థిక అసమానతలపై ఉద్యోగ సంఘాల దృష్టి మళ్లించేందుకు సీఈవోల నామమాత్ర వేతనం ఒక మార్గంగా మారినట్లు ఓ పరిశోధన గుర్తించింది. ►బాగా శక్తిమంతమైన సీఈవోలు ఒక డాలర్ జీతం విధానాన్నే ఎంచుకుంటారని, తద్వారా సంస్థ నుంచి వారు పొందే మొత్తం పరిహారంపై ఎక్కడా గగ్గోలు చెలరేగకుండా చూసుకుంటారని ఆ పరిశోధనలో వెల్లడైంది. చదవండి: గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు! తిరగబడ్డ తెలివి... ► ఒక డాలర్ వార్షిక వేతనంగా పొందే సీఈవోలు ప్రాతినిధ్యం వహించే సంస్థలు తమ ఆస్తులు, రాబడులపై నెలకు ఆర్జించే సొమ్ము... మార్కెట్ రేటు వేతనాలు పొందే సీఈవోలు ఉన్న కంపెనీలతో పోలిస్తే ఒక శాతం తక్కువని 2014లో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. ► ఒక డాలర్ వేతనం పొందే సీఈవోల అతివిశ్వాసం లేదా తమ కొలువుకు ఢోకా ఉండదన్న వైఖరి వల్ల ఆయా సంస్థల్లో ఇలా ‘పనితీరు తగ్గుదల’కనిపించినట్లు సర్వే వివరించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఉన్నత సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ రికార్డు సృష్టిస్తోంది. కోవిడ్ సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోగా ఆర్జీయూకేటీ విద్యార్థులకు మాత్రం ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం విశేషం. ప్రభుత్వ విద్యా సంస్థ అయిన ఆర్జీయూకేటీ విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉన్నత ప్రమాణాలు గుర్తించిన ఆయా కంపెనీలు నేరుగా ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. ఉచిత భోజన వసతులతో సాంకేతిక విద్య గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తూ ఆరేళ్ల సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్సార్ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీ పరిధిలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ప్రతి సంస్థలో వేయి మంది చొప్పున నాలుగు వేల మందికి ఇక్కడ సాంకేతిక విద్యను అందిస్తున్నారు. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా, తదుపరి నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుగా నిర్వహిస్తున్నారు. ఈ నాలుగింటిలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో ఆయా బ్యాచ్‌ల ఆరేళ్ల కోర్సు కాలపరిమితి ఇంకా కొనసాగుతోంది. ముందుగా ఏర్పాటైన నూజివీడు, ఆర్కే వ్యాలీల్లోని విద్యార్థులకు మాత్రం పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2014–15 నుంచి 2020–21 వరకు చూస్తే మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో అవకాశాలు దక్కాయి. నూజివీడు క్యాంపస్‌లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి. అత్యధిక వార్షిక ప్యాకేజీలు అందించిన కంపెనీలు – అనలాగ్ డివైజెస్– బెంగళూరు: రూ.20 లక్షలు – ఫ్రెష్ డెస్క్–చెన్నై: రూ.12 లక్షలు – టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్– బెంగళూరు: రూ.10 లక్షలు – సినాప్సిస్– హైదరాబాద్: రూ.9.5 లక్షలు – జేవోటీటీఈఆర్–ఐఈ: రూ.9.0 లక్షలు – థాట్ వర్క్స్– హైదరాబాద్: రూ.7.8 లక్షలు – ఏడీపీ, మేథ్ వర్క్స్, గోల్డెన్ హిల్స్: రూ. 5.0 లక్షల నుంచి రూ. 6.5 లక్షల వరకు ఇవేకాకుండా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్ టాక్, పర్పుల్.కామ్, సెలెక్ట్, నూక్కాడ్ షాప్స్, సెవ్యా, అడెప్ట్చిప్స్, సినాప్సిస్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్‌రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ గణనీయంగా కొలువులు గ్రామీణ విద్యార్థులకు కూడా ఐఐటీల స్థాయిలో మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఆర్జీయూకేటీ ఏర్పాటైంది. త్రిపుల్ ఐటీల్లో ఆరేళ్లు చదివే విద్యార్థులు హైక్వాలిటీ గ్రాడ్యుయేట్లుగా బయటకు రావాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. సివిల్ సర్వీసెస్ వంటి ఆలిండియా క్యాడర్ ఉద్యోగాల్లోనూ కొలువుదీరేలా తర్ఫీదు ఇస్తోంది. దీనివల్లే కోవిడ్ సంక్షోభంలోనూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు పొందగలిగారు. రానున్న కాలంలో మరింతమందికి ప్లేస్మెంట్లు దక్కనున్నాయి. నేటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిలబస్‌లో మార్పులు చేస్తున్నాం. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీ ఉన్నత విద్యామండలి కంప్యూటర్ సైన్స్‌కే అగ్రపీఠం ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఆయా కంపెనీలు ఇచ్చిన ఉద్యోగాలను పరిశీలిస్తే.. ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే అగ్రభాగాన ఉన్నారు. తదుపరి ఈసీఈ, సివిల్, మెకానికల్, కెమికల్ విభాగాల విద్యార్థులున్నారు. 2014–15 నుంచి ఇప్పటివరకు ఉద్యోగాలు దక్కించుకున్నవారిలో 1,921 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు. కాగా 1,702 మంది ఈసీఈ విద్యార్థులున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), అమెజాన్, ఐబీఎం, కేప్ జెమిని, ఇన్ఫోసిస్ తదితర ప్రముఖ కంపెనీల్లో వీరికి కొలువులు దక్కాయి. -
నీరజ్ చోప్రా... బ్రాండింగ్‌లో ఇప్పుడు సంచలన తార..!
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏవరినోటా విన్నా.. నీరజ్ చోప్రానే వినిపిస్తున్నాడు. నీరజ్ చోప్రా నామస్మరణతో దేశం ఊగిపోతుంది. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్ దూసుకుపోతున్నాడు. ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. నీరజ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 2.8 మిలియన్ల వరకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. కాగా ఇప్పుడు పలు మల్టీనేషనల్ కంపెనీలు నీరజ్ చోప్రా వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నీరజ్ చోప్రా తమ కంపెనీల బ్రాండ్లకు ప్రచారకర్తగా నియమించుకోవాలని కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అడ్వర్టైజింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం నీరజ్ చోప్రా ప్రస్తుత ఎండోర్స్మెంట్ ఫీజు సుమారు రు. 1.75 కోట్లు, టోక్యో ఒలింపిక్స్‌లోని చారిత్రాత్మక విజయంతో కనీసం 50% పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొనారు. నీరజ్ చోప్రా ఎండార్స్మెంట్ ఫీజు సుమారు రూ. 2.5 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. నీరజ్ చోప్రా అంతకుముందు పలు కంపెనీలకు బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేశాడు. నీరజ్ గత నాలుగు సంవత్సరాలుగా గాటోరేడ్ ఎనర్జీ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. అంతేకాకుండా నీరజ్ కంట్రీ డిలైట్ నేచురల్స్, జిల్లెట్ ఇండియా, మొబిల్ ఇండియా, ఆమ్స్ట్రాడ్ బ్రాండ్లతో కలిసి పనిచేశారు. నీరజ్‌పైనే పలు కంపెనీలు గురి... నీరజ్ చోప్రా జావెలింగ్ త్రోలో బంగారు పతకాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధించాడు. నీరజ్ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని ప్రముఖ అడ్వరటైజింగ్ సంస్థ బ్రాండ్ గురు అండ్ హరీష్ బిజూర్ కన్సల్ట్స్ ఇంక్ వ్యవస్థాపకుడు హరీష్ బిజూర్ వెల్లడించారు. ప్రముఖ కంపెనీలు నీరజ్‌ను బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాకుండా నీరజ్ చోప్రా అత్యంత ఖరీదైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తాడని హరీష్ బిజూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెల్చుకున్న అభినవ్ బింద్రా..ఆ సమయంలో అనేక కంపెనీలు అభినవ్ బింద్రా కోసం క్యూ కట్టాయి. టీఆర్ఏ రిసెర్చ్, సీఈవో అండ్ బ్రాండ్ ఎక్సపర్ట్ చంద్రమౌళి మాట్లాడుతూ..నీరజ్ చోప్రా బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఫీజు గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా నీరజ్ బ్రాండ్ వాల్యూ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వేరిబుల్స్, ఈ-కామర్స్, ఆటో, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నీరజ్ చోప్రాను కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటాయని పేర్కొన్నారు -
రిస్క్ తక్కువ,.. రాబడి ఎక్కువ...
మన రోజువారి అవసరాలు తీర్చే బహుల జాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) పెట్టుబడుల విషయంలో.. ఎంతో విశ్వసనీయంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంఎన్సీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే (థీమ్యాటిక్) పథకాలను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్ఎసీ ఫండ్ కూడా ఒకటి. ఈక్విటీల్లో తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎంఎన్సీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ పెట్టుబడుల విషయంలో మూడు రకాల విధానాలను అనుసరిస్తుంటుంది. భారత్‌కు చెందిన బహుళజాతి సంస్థలు (మన దేశంలో లిస్ట్ అయ్యి విదేశాలకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన కంపెనీలు), భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇక్కడి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు, భారత్‌లో లిస్ట్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఈ పథకం పెట్టబడులకు ఎంపిక చేసుకుంటుంది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, మెటల్స్, ఐటీ, సిమెంట్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించిన ఎంఎన్సీ కంపెనీలు పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంటాయి. నిపుణుల ఆధ్వర్యంలో డైనమిక్‌గా పనిచేస్తుంటాయి. లాభాల నుంచి వాటాదారులకు ఎక్కువ డివిడెండ్ కూడా పంచుతుంటాయి. కనుక స్థిరమైన రాబడులకు వీటిని మార్గంగా నిపుణులు పరిగణిస్తుంటారు. బలమైన బ్రాండ్, దండిగా నగదు నిల్వలు ఎంఎన్సీ కంపెనీల్లో చూడొచ్చు. అందుకే పరిణతి కలిగిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఎంఎన్సీ కంపెనీలకు చోటిస్తుంటారు. ఈ తరహా లక్షణాలు ఉండడం వల్ల ఇతర రంగాల థీమ్యాటిక్ పథకాలతో పోలిస్తే ఎంఎన్సీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ తక్కువ అస్థిరతలను ఎదుర్కొంటుంటాయి. సెబీ నిబంధనల మేరరు ఎంఎన్సీ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులను బహుళజాతి కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎంఎన్సీ పథకాల్లోనూ సైక్లికల్ (రాబడుల్లో స్థిరత్వం లేని), డిఫెన్సివ్ (స్థిరమైన రాబడులతో రక్షణాత్మకమైనవి) ఉంటాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ పథకం 20 శాతం పెట్టుబడులను అంతర్జాతీయ ఎంఎన్సీలకు కేటాయించింది. వీటిల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీలున్నాయి. దేశీయ ఎంఎన్సీ కంపెనీల విషయానికొస్తే.. ఈ పథకం పెట్టుబడుల్లో 61 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 26.5 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియో మొత్తం మీద వైవిధ్యంతో కూడుకుని ఉంది. దేశీయ కంపెనీల్లో కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్, సాఫ్ట్వేర్, ఆటో, పారిశ్రామిక ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ రంగానికి చెందినవి ఉన్నాయి. రాబడులు పెట్టుబడుల విషయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ మంచి పనితీరే చూపిస్తోంది. ఈ పథకానికి దీర్ఘకాల రాబడుల చరిత్ర లేదు. ఎందుకంటే 2019 జూన్‌లో ప్రారంభమైంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 28 శాతంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. మెరుగైన రాబడులుగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంచ్‌మార్క్‌తో పోల్చి చూసినా లేక ఎంఎన్సీ థీమ్యాటిక్ విభాగం రాబడులతో చూసినా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ రాబడులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. -
ఎంఎన్సీల్లో ఉద్యోగాలంటూ అమాయకులకు టోకరా
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు టోకరా వేస్తున్న కి'లేడి'ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన ప్రతిభ అలియాస్ గాయత్రి, ప్రస్తుతం కోల్‌కతాలో నివాసం ఉంటూ ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతుంది. తన ఫోన్ నంబర్‌ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్‌మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో పోస్టు చేసి బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులకు టోకరా వేస్తుంది. జాబ్ కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగుల డాటాను సేకరిస్తున్న ఈ కి'లేడి'.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ తనను ఫోన్లో సంప్రదించిన వారిని నమ్మిస్తుంది. తొలుత కొంత సొమ్మును అడ్వాన్స్‌గా తీసుకొని, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యాక మొత్తం నగదును చెల్లించాల్సి ఉంటుందని షరతులు పెడుతుంది. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి, దాని ద్వారా నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తుంది. జాబ్ లెటర్ ఇచ్చిన తరువాత.. ఇక తమ పని అయిపోయిందంటూ మిగిలిన సొమ్మును వసూలు చేసి, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుంది. ఇలా చాలా మంది అమాయకులకు బురడీ కొట్టించిన ఈ కిలేడి, చివరకు పోలీసులకు చిక్కింది. ఈమె చేతిలో మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బ్యాక్ డోర్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.2,42,520లు కాజేసిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కి'లేడి' ఉచ్చులో చాలామంది అమాయకులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రతిభ అలియాస్ గాయత్రికి చెందిన ఈ నంబర్ల 781 4226842, 6363506954 ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు(9490617310)కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. -
ఇంట్లోనే ఆఫీస్ సెటప్!
కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల బాగోగులు చూసుకునే సంస్థలు చాలానే ఉన్నాయి. తమ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాల పేరిట అవసరంలో ఆదుకుంటూ పెద్ద మనసు చూపిస్తున్నాయి. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట కొత్త ట్రెండ్‌ను చూస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కార్యాలయానికి వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి నుంచే చేసుకోవచ్చనుకుంటే అది పొరపాటే! ఎందుకంటే కార్యాలయంలో మాదిరిగా ఇళ్లలో పని చేసేందుకు అనుకూలంగా పూర్తి స్థాయి సదుపాయాలు ఉండవు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న వారు తమకు వెన్ను భాగంలో నొప్పి వస్తోందంటూ తమ ఇబ్బందులను బాస్ లతో పంచుకుంటున్నారు. ఈ సమస్యను ప్రముఖ కంపెనీలు వెంటనే అర్థం చేసుకున్నట్టున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్రత్యేక భత్యాన్ని (అలవెన్స్) ఇవ్వడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఉద్యోగులు ఇంట్లోనూ సౌకర్యంగా కూర్చునేందుకు అనుకూలమైన కుర్చీ, టేబుల్ తదితర సదుపాయాలను సమకూర్చుకోగలరన్నది వాటి ఉద్దేశం. ప్రత్యేక అలవెన్స్ ఇవ్వడం కంపెనీలకూ ప్రయోజనకరమే. ఉద్యోగులు సౌకర్యంగా పనిచేయగలిగినప్పుడే కంపెనీల ప్రాజెక్టులు సకాలంలో ముందుకు కదులుతాయి. అందుకే కంపెనీ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త విశాలంగా ఆలోచించాయి. గూగుల్, ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో, సేల్స్ ఫోర్స్, రేజర్ పే, వెరిజాన్ ఇండియా, సాస్ యూనికార్న్ ఫ్రెష్ వర్క్స్ .. ఇవన్నీ కూడా ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్ ను ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఈ అలవెన్స్‌తో సౌకర్యవంతమైన చైర్, ఇతర పరికరాలు కొనుగోలు చేసుకోవాలన్నది కంపెనీల సూచన. కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యల్లో భాగంగా తయారీ మినహా మిగిలిన చాలా రంగాల్లోని కంపెనీలు 30–90 శాతం మేర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫర్నిచర్ కంపెనీ గోద్రెజ్ ఇంటీరియో ఓ సర్వే నిర్వహించింది. వివిధ రంగాల్లోని కంపెనీలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. 1,500 మంది ఉద్యోగులు ఈ సర్వేలో పాలు పంచుకోగా, అందులో 41 శాతం మంది నడుము, వెన్ను నొప్పి, మెడనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘కంపెనీకి సంబంధించి 6,000 మంది ఉద్యోగుల ఆరోగ్యం మాకు ముఖ్యం. అందుకే ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ ను ప్రకటించాము. ఇది ఉద్యోగులు అందరికీ ఒక్కసారి ఇచ్చే అలవెన్స్. తమ ఇంటి నుంచి పని చేయడానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతర్జాతీయంగా 13 ప్రాంతాల్లో పనిచేస్తున్న 3,100 మందికి ఒక్కొక్కరికి రూ.18,000 చొప్పున హమ్ ఆఫీస్ అలవెన్స్ ను అందించాము’’ అని వెరిజాన్ ఇండియా మానవ వనరుల డైరెక్టర్ గోపినాథ్ పి తెలిపారు. ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూ ఎఫ్ హెచ్) అన్నది ఎక్కువ కాలం పాటు ఉంటుందన్నది మా అవగాహన. దీంతో మా ఉద్యోగులు ఇంటి నుంచే సంతోషంగా పనిచేసేందుకు వీలుగా తగిన వసతులు వారు కల్పించుకునే విధంగా చూడాలనుకున్నాము’’ అని ఫ్రెష్ వర్క్స్ హ్యుమన్ రీసోర్సెస్ చీఫ్ సుమన్ గోపాలన్ వెల్లడించారు. ఇంటి నుంచి పని చేసే తమ ఉద్యోగులకు ఏమేమి అవసరమో తెలుసుకునేందుకు బేయర్ గ్రూపు అయితే ప్రత్యేకంగా ఒక సర్వే నిర్వహించింది. ‘‘సర్వే ఫలితాల ఆధారంగా ఆఫీస్ పరికరాలైన హెడ్ ఫోన్లు, కీబోర్డు, మౌస్, ల్యాప్ టాప్ స్టాండ్, వెన్నెముకకు మద్దతునిచ్చే పరికరాలను ఉద్యోగులకు అందించాము’’ అని బేయర్ గ్రూపు దేశీయ హెచ్ ఆర్ హెడ్ కేఎస్ హరీష్ తెలిపారు. డెస్క్ టాప్ మానిటర్లు, చైర్లను కూడా ఈ సంస్థ ఉద్యోగులకు సమకూర్చడం విశేషం. ఫర్నిచర్ కంపెనీలకు పెరిగిన వ్యాపారం ఆఫీస్ ఫర్నిచర్ తయారు చేసే కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇంట్లోనే పని చేసేందుకు అనుకూలించే ఉత్పత్తులను అవి మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. గోద్రెజ్ ఇంటీరియో, స్టీల్ కేస్, హ్యుమన్ స్కేల్ ఈ విషయంలో ముందున్నాయి. ‘‘హోమ్ ఆఫీస్ సొల్యూషన్స్ విక్రయాలు సాధారణ రోజులతో పోలిస్తే గత కొన్ని నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. మా వెబ్సైట్ లో హోమ్ కేర్ ఉత్పత్తుల కోసం అన్వేషణ 140 శాతం పెరిగింది. ఏదో ఒక్క పరికరంతో (కుర్చీ లేదా టేబుల్) ఏకధాటిగా 8–10 గంటల పాటు పని చేయడం కష్టమే. ఉద్యోగులు దీన్ని అర్థం చేసుకున్నారు కనుకనే వర్క్ ఫ్రమ్ హోమ్ పరికరాలకు డిమాండ్ అంతగా పెరిగింది’’ అని గోద్రెజ్ ఇంటీరియో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సమీర్ జోషి వివరించారు. -
జులై చివరి వరకు ఐటీ కంపెనీలు ఇంటినుంచే..
ఛండీగడ్ : దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ఐటీరంగ సంస్థలు జులై చివరివారం వరకు ఇంటినుంచే పనిచేయాలస్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు అనుమతించాల్సిందిగా హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి విఎస్ కుందూ ప్రకటించారు. డీఎల్ఎఫ్ సహా పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కొన్ని నిబంధనలతో తాము అనుమతించామని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. (లాక్డౌన్ ఎత్తివేత: ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు) మిలినీయం సిటీగా పిలిచే గురుగ్రామ్‌లో ఇన్ఫోసిస్, జెన్పాక్ట్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ సహా అనేక బిపిఓలు, ఎంఎన్‌సిలు లాంటి అనేక దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. కరోనా నియంత్రణలో భాగంగా మార్చి నెలలో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించాయి. అయితే దీన్ని జులై నెలాఖరు వరకు పొడిగించాల్సిందిగా తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్డౌన్ సందర్భంగా రేషన్‌లేని పేద కుటుంబాలకు మూడు నెలలపాటు ఉచితంగా రేషన్ అందిస్తామని సీఎస్ కందూ పేర్కొన్నారు. రెండు దుస్తుల పరిశ్రమలకు పీపీఈ కిట్లను తయారుచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించారు. మొత్తంగా రాష్ర్టంలో 298 కోవిడ్ కేసులు నమోదుకాగా, ముగ్గరు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు విముక్తి! ) -
ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు
కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో అమలవుతున్న లాక్డౌన్ మే 3వ తేదితో పూర్తి అవుతున్న నేపథ్యంలో అసలు లాక్డౌన్ ఎత్తివేస్తారా లేదా కొనసాగిస్తారా అన్న విషయం చర్చనీయాంశమైంది. అయితే మే3 తర్వత లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తే ఐటీ కంపెనీలు తిరిగి తెరుచుకోడానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడంపై ప్రభుత్వ ఇచ్చే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తూ. కంపెనీలు పునఃప్రారంభించాలని యోచిస్తున్నాయి. అంతేగాక కోవిడ్-19ను అరికట్టడానికి కొత్తగా తమ సొంత నిబంధనలను కూడా తీసుకురాబోతున్నాయి. (లాక్డౌన్ కొనసాగింపునకే మోదీ మొగ్గు..! ) ఇక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి పనిచేయడానికి అనుమతించే క్రమంలో చాలా వరకు సంస్థలు భౌతిక దూరం కొనసాగించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యాలయాలు ఎలా సిద్ధమవుతున్నాయో తెలియజేయడానికి టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గున్నాని ట్విటర్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వీటిలో ఆఫీస్ ముఖద్వారాలు, లిఫ్ట్‌లు, బాత్రూమ్ల వద్ద గీసిన మార్కులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అదే విధంగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా తమ కార్యాలయాల్లో అనుసరిస్తున్న భౌతిక దూర నిబంధనలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు విముక్తి! ) Our offices across @tech_mahindra are getting ready for physical distancing post #Lockdown. Welcome to the new normal.. pic.twitter.com/5V6wZz2OOO — CP Gurnani (@C_P_Gurnani) April 20, 2020 మే 3 తర్వాత లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేసిన తర్వాత బహుళ జాతీయ సంస్థలు మాత్రమే కాకుండా చిన్న ఐటి కంపెనీలు కూడా ఈ చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. టెంపరేచర్ స్క్రీనింగ్ లాంటి సాధారణ జాగ్రత్త చర్యలే కాకండా.. శానిటైజర్లను డెస్క్‌లపై ఉంచడం, ఉద్యోగుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత వంటి ముందు జాగ్రత్త చర్యలపై కసరత్తు చేస్తునఆనయి. కాగా భౌతిక దూరంపై హైదరాబాద్‌లోని కొన్ని ఐటి కంపెనీలు అనుసరిస్తున్న కొత్త నిబంధనలను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ యేదుల పేర్కొన్నారు. అవి ► కార్యాలయ ప్రవేశ ద్వారం, యాక్సెస్ కార్డ్ స్క్రీనింగ్ వద్ద రెండు అడుగుల దూరం పాటించడం. ► లిఫ్టులో కేవలం 50శాతం మాత్రమే అనుమతించడం. ► క్యాబ్‌కు ఒక వ్యక్తి మాత్రమే అనుమతించడం....... అయితే లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ప్రభుత్వం జారీచేసే నిబంధనలపై కంపెనీలు ఆధారపడి పనిచేయాల్సి ఉంటుందని కృష్ణ యేదుల పేర్కొన్నారు. (ఆ దేశంలో భారతీయుల మరణాలు ఎక్కువ! ) -
విదేశీ పెట్టుబడులకు గాలం
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి. భూ, కార్మిక చట్టాలతోనే సవాలు... వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్‌ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రతిపాదనలు ఇవీ... ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా... 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
కోడింగ్ రాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కలే..
-
క్యాంపస్ కొలువు కష్టమే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఓ మోస్తరు కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం గ్యారంటీ.. టాప్ 10 కాలేజీల్లో సీటు వచ్చిందంటే ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే.. – రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన ఇది! కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి 250 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉద్యోగ ఆఫర్ లెటర్లు ఇచ్చిన దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏటా 10 నుంచి 12 వేల మందిని నియమించుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇప్పుడు ‘ఏ’కేటగిరి ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అది కూడా టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి మూడు నుంచి ఆరు మాసాలపాటు శిక్షణ ఇచ్చే ఈ సంస్థలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన విద్యార్థులను మాత్రమే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరి ఆయా కాలేజీలకు వెళ్లి వేల మందికి ఒక రోజు పరీక్ష నిర్వహించి, మరో రోజు మౌఖిక పరీక్ష నిర్వహించి వందల మందిని ఎంపిక చేసుకునే ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఇన్ఫోసిస్ ‘హ్యాక్ విత్ ఇన్ఫీ’, కాగ్నిజెంట్ ‘టెక్నాలజీ హైరింగ్’పేరుతో విద్యార్థులకు కఠిన పరీక్షలు నిర్వహించి ఎక్కువ వేతనంతో నియమించుకుంటున్నాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యా రంగంలో టాప్ కాలేజీలుగా పేర్కొంటున్న సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, ఎంవీఎస్ఆర్ కాలేజీల్లో సైతం 2018 పాస్డ్ అవుట్ విద్యార్థులకు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువ ఆఫర్లు వచ్చాయి. కోడింగ్ వస్తేనే.. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు అమెరికన్ కంపెనీలు కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఉద్యోగాలు ఆఫర్ చేయడానికి గతంలో మాదిరి ఒకరోజు రిక్రూట్మెంట్కు పరిమితం కావడం లేదు. కోడింగ్ బాగా తెలిసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, డెలాయెట్, అమెజాన్, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించి.. వారిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ కారణంగా ప్రైవేట్ టాప్ కాలేజీల్లో ఐటీ సంబంధిత కోర్సుల్లో సీటు కోసం రూ.12 నుంచి రూ.15 లక్షల మేర డొనేషన్ చెల్లించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. బీ, సీ కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు కూడా ఉండటం లేదని తెలియడంతో టాప్ కాలేజీల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాలుగు కాలేజీలకే పరిమితమైన కాగ్నిజెంట్ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ దేశవ్యాప్తంగా ఎనిమిది కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టింది. వాటిలో హైదరాబాద్ కాలేజీలే నాలుగు ఉన్నాయి. సీబీఐటీ, వాసవి, ఎంవీఎస్ఆర్, శ్రీనిధి కాలేజీల్లో మాత్రమే టెక్నాలజీ హైరింగ్ పేరుతో నియామకాలు చేపట్టి కేవలం 12 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సంస్థ సీబీఐటీ కాలేజీ నుంచి 201 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేయగా ఈ ఏడాది ఐదుగురికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. వాసవీ కాలేజీలో 2017లో 121 మందికి ఆఫర్ చేసి.. ఈ ఏడాది పాసైన నలుగురు విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంవీఎస్ఆర్ నుంచి ముగ్గురికి ఉద్యోగాలు ఆఫర్ చేయగా.. శ్రీనిధి కాలేజీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదీ అదే దారి దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్.. కాగ్నిజెంట్ దారిలోనే నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వందల సంఖ్యలో టాప్ కాలేజీల విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చిన ఈ సంస్థలు 2017లో పరిమిత సంఖ్యలో నియమించుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని, గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ కంపెనీలకు వస్తున్న ఆర్టర్లు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో పని చేయడానికి అర్హులైన వారు లభించకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2016లో నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 753 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసిన ఇన్ఫోసిస్.. 2017కు వచ్చేసరికి ఆ సంఖ్యను 132కి తగ్గించింది. ఈ ఏడాది రెగ్యులర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆ కంపెనీ విధానమేమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఇక టీసీఎస్ హైదరాబాద్‌లో పరిమితంగా రెండు లేదా 3 కాలేజీల్లో మాత్రమే నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. కోడింగ్ రాకుంటే కష్టమే: ప్రొఫెసర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్, సీబీఐటీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. జావా కోడింగ్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా వంటివి కూడా ఇప్పుడు కంపెనీలకు అవసరం. ఐఐటీలు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. మిగిలిన యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ఏదేమైనా గతంలో మాదిరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడు అంత ఈజీ కాదు. -
ఎంఎన్సీలకు దోచిపెట్టేందుకే గ్రీన్‌హంట్
-ప్రొఫెసర్ హరగోపాల్ న్యూశాయంపేట : ఆదివాసీల హక్కులను కాలరాసి మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు గ్రీన్‌హంట్ పేరిట ప్రభుత్వాలు ఆదివాసీల నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో మంగళవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిగోపాల్ మాట్లాడారు. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీలను పోలీస్ బలగాలు అడవుల నుంచి బయటకు గెంటివేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ఇలాంటి చర్యలు తగవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఆంధ్రా వాళ్లు తమ సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అధికారంలోకి రాకముందు తమది నక్సల్స్ ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై నిర్బంధాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల సమస్యల కోసం సభ పెట్టుకుంటే చివరికి న్యాయవ్యవస్థ జోక్యం తీసుకుని అనుమతి ఇచ్చాక కూడా, పోలీసు నిర్బంధాల మధ్య సభ నిర్వహించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీఎఫ్ నాయకులు రవీంధ్రనాధ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి ఇంత నిర్బంధం ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్త మాట్లాడుతూ భారత దేశంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో విరసం నేత వరవరరావు, ఆచార్య జిఎన్ సాయిబాబా, టీడీఎఫ్ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, నాయకులు నారాయణరావు, చిక్కుడు ప్రభాకర్, కోట శ్రీనివాసరావు, రవీందర్రావు, నలమాస కృష్ణ, జనగాం కుమారస్వామి, బాసిత్, రమాదేవి, నల్లెల రాజయ్య పాల్గొన్నారు. సభలో చేసిన తీర్మానాలివే.. -ఆదివాసీలను మట్టు పెట్టెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మూడవ దశ గ్రీన్‌హంట్ మారణకాండను వెంటనే నిలిపి వేయాలి -దేశ వ్యాప్తంగా దళిత మైనారిటీలపై ఫాసిస్టు దాడులను నిలిపివేయాలి. -ఖనిజ నిక్షేప ఒప్పందాలను రద్దుచేయాలి. -బహిరంగ సభకు వస్తుండగా నిర్బంధించిన ఆదివాసీలను విడుదల చేయాలి. -వేముల రోహిత్ హంతకులను శిక్షించాలి నిర్బంధం మధ్య బహిరంగ సభ.. అనేక నిర్బంధాల మద్య టీడీఎఫ్ బహిరంగ సభ జరిగింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు మాత్రమే సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు ఒంటరిగా రావాలని, ర్యాలీలు, నినాదాలు చేయవద్దని పోలీసులు కట్డడి చేశారు. సభను, హంటర్‌రోడ్ ప్రధాన రాహదారి వద్ద సభకు వచ్చే వారిని వీడియో ద్వారా చిత్రీకరించారు. బహిరంగసభలో ఏడుగురు ముఖ్య వ్యక్తులలో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే మాట్లాడారు. ప్రధాన వక్త అయిన విరసం నేత వరవరరావు స్టేజీపై కాకుండా ప్రజల మధ్యనే ఉండాల్సి వచ్చింది. ఇంత నిర్బంధం విధించినా బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం గమనార్హం. -
మే 17 నుంచి జీహెచ్ఎంసీ జాబ్‌మేళా..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ హైదరాబాద్ జాబ్ మేళా నిర్వహిస్తోంది. సీటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు సమీపంలో మే 17 నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలను చాలా ఎమ్ఎన్సీ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి వెంటనే ఆఫర్ లెటర్ ఇవ్వనున్నట్టు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ జాబా మేళాకు హాజరయ్యేవారికి ఉండాల్సిన కనీస అర్హతలు ఇవే... కనీస విద్యా అర్హతలు.. - 10వ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ పీజీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ఉద్యోగ అనుభవం ఉన్నా లేకున్నా దరఖాస్తు చేయవచ్చు. కావాల్సినవి... దరఖాస్తుదారులు ముందుగా 2 రిజ్యూమ్‌లు, రెండు పాస్‌పోర్టు ఫోటోలు, ఐడీ ఫ్రూప్( పాన్‌కార్డ్/ఓటర్ కార్డు) లు సమర్పించాల్సి ఉంటుంది. -
బహుళజాతి కంపెనీల పన్ను ఎగవేతలకు చెక్
సెయింట్ పీటర్స్బర్గ్(రష్యా): కంపెనీల ఆదాయాల తరలింపునకు సంబంధించి సమర్ధవంతమైన పన్నుల విధానాన్ని అమలు చేయడం కీలక సవాలుగా నిలుస్తున్న నేపథ్యంలో జీ20 సదస్సు దీనిపై దృష్టిసారించింది. పన్ను ఎగవేతలు, పన్నులను తప్పించుకోవడం కోసం కంపెనీలు చేపట్టే హానికరమైన విధానాలకు అడ్డుకట్టవేయడానికి నిబంధనలను మార్చాలని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సహా జీ20 దేశాధినేతలు అంగీకరించారు. శుక్రవారం సదస్సు ముగింపు సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. బహుళజాతి కంపెనీ(ఎంఎన్సీ)లు తమ లాభాలను తక్కువ పన్నులున్న దేశాల్లోని అనుబంధ సంస్థలకు కృత్రిమంగా తరలించి, పన్నుల భారాన్ని తగ్గించుకునే చర్యలను అనుమతించకుండా పన్నుల నిబంధనలను మార్చాలనేది తీర్మానంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం. సీమాంతర పన్ను ఎగవేతలు, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం వంటివి పన్నుల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలేలా చేస్తున్నాయని జీ20 దేశాలు తీర్మానించాయి. మొత్తం 27 పేజీల తీర్మానంలో బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిప్టింగ్(బీఈపీఎస్)ను ఎదుర్కోవడానికి సంబంధించిన అంశానికే రెండు పేజీలను కేటాయించడం గమనార్హం. పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట, పన్ను విధానాల్లో పారదర్శకత, సమాచారాన్ని ఆటోమేటిక్‌గా పంచుకోవడం వంటివి బీఈపీఎస్ ప్రధానోద్దేశం. ఏదైనా ఎంఎన్సీ ఎక్కడైతే తన కార్యకలాపాలను ప్రధానంగా చేపడుతోందో, సంపదను సృష్టించడం ద్వారా లాభాలను ఆర్జిస్తుందో అక్కడే పన్నులను చెల్లించడం అనేది ముఖ్యమని తీర్మానంలో స్పష్టం చేశారు. కాగా, జీ20లో ఈ తీర్మానం భారత్ వాదనలను ప్రతిబింబించిందని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పేర్కొన్నారు. తమ దేశంలో కార్యకలాపాల ద్వారా ఆర్జించే లాభాలపై పన్నుల విధింపు అనేది ఆ దేశానికి ఉన్న హక్కు అని, ఇది ఆమోదనీయ సూత్రమన్నారు. కరెన్సీ ఒడిదుడుకులపై భారత్ ఆందోళనలకు ప్రాధాన్యం... విదేశీ నిధుల ప్రవాహాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, కరెన్సీ రేట్లలో అసంబద్ధమైన కదలికల కారణంగా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న భారత్ అందోళనలకు జీ20 తీర్మానం ప్రాధాన్యం లభించింది. కరెన్సీ ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం పటిష్టమైన పాలసీలను తీసుకురావాలన్న భారత్ సూచనలను పరిగణనలోకి తీసుకుంది. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనేందుకు కొన్ని దేశాలు తీసుకుంటున్న చర్యల ప్రతికూల ప్రభావం వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడకుండా చర్యలకు పిలుపునిచ్చింది. ప్రపంచ వృద్ధికి చోదోడుగా, ఆర్థిక స్థిరీకరణకోసం అన్ని దేశాలు తమ పాలసీల అమలువిషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని జీ20 తీర్మానంలో పేర్కొన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ ఘోరంగా కుప్పకూలి తాజాగా 68.80కి పడిపోయిన నేపథ్యంలో భారత్ జీ20 సదస్సులో ఈ అంశాలను లేవనెత్తింది. ప్రధానంగా అమెరికాలో ఉద్దీపనల ఉపసంహరణ భయాలతో విదేశీ పెట్టుబడులు వెనక్కివెళ్తాయనే ఆందోళనలు రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన ట్రిగ్గర్‌గా నిలిచాయి. 2008నాటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సంపన్న దేశాలు ప్రకటించిన సహాయ ప్యాకేజీల ఉపసంహరణ విషయంలో క్రమబద్ధమైన విధానం అవసరమని జీ20 సదస్సులో మన్మోహన్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. నిపుణుల రాకపోకలపై నియంత్రణలు వద్దు: మన్మోహన్ వివిధ రంగాల్లోని నిపుణులు అంతర్జాతీయంగా ఎక్కడైనా పనిచేసేలా సానుకూల పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. నిపుణుల రాకపోకలకు అడ్డుకట్టవేసేలా కొన్ని దేశాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు సరికాదని, దీనివల్ల రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలను వెనక్కితీసుకోవాలని పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో రెండో వర్కింగ్ సెషన్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్యోగాల కల్పనకు వీలుగా మౌలిక సదుపాయాలను పెంచేందుకు వినూత్న ఫైనాన్సింగ్ స్కీమ్‌లు అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు. అత్యున్నత నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగులు అంతర్జాతీయంగా ఎక్కడైనా పనిచేందుకు వీలుకల్పించడం చాలా ముఖ్యమని, ప్రపంచ దేశాల మధ్య సమగ్రతలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు.