
ముంబై: గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అనేక బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీ) భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నాయని హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ సీఈవో సంజీవ్ మెహతా తెలిపారు. భారత్‌ను గెలిపించడానికి యావత్‌ప్రపంచం ఏకమవుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మెహతా ఈ విషయాలు చెప్పారు. వలస పాలన కారణంగా భారత్ తొలి రెండు పారిశ్రామిక విప్లవాల్లో పాలుపంచుకోలేకపోయిందని తెలిపారు. మూడో పారిశ్రామిక విప్లవ సమయంలో భారత్ ఆర్థికంగా బలహీనంగా ఉందన్నారు.
తాజాగా నాలుగో పారిశ్రామిక విప్లవం .. భారత వృద్ధి, పురోగతికి దోహదకారిగా నిలవగలదని మెహతా చెప్పారు. మరోవైపు, హెచ్‌యూఎల్ నిర్వహణ మార్జిన్లు ఎంతో మెరుగ్గా ఉంటాయని, 75 బిలియన్ డాలర్ల పైచిలుకు వేల్యుయేషన్‌తో కోల్గేట్ పామోలివ్, రెకిట్ బెన్‌కిసర్ గ్రూప్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల కన్నా విలువైన కంపెనీగా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment