న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల నుంచి రావాల్సిన పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేయడం లేదంటే తగ్గించి తీసుకోవచ్చంటూ అధికారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సూచించింది. నోటీసులో పేర్కొన్న మేరకు పన్ను చెల్లించడంలో జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, చీఫ్ కమిషనర్, ప్రన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ ర్యాంక్ అధికారి ఎవరికి అయినా సరే వడ్డీని మినహాయించడం లేదంటే తగ్గించేందుకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 220 (2ఏ) కింద అధికారులున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది.
వడ్డీ మాఫీ చేసే లేదా తగ్గించే అధికారాలపైనా స్పష్టత ఇచి్చంది. ‘‘రూ.1.5 కోట్లకుపైన వడ్డీ మాఫీ చేయడమా లేదంటే తగ్గించడమా అన్నది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పరిధిలో ఉంటుంది. రూ.50 వేల నుంచి 1.5 లక్షల మధ్య ఉంటే చీఫ్ కమిషనర్‌కు అధికారం ఉంటుంది. రూ.50 లక్షల వరకు వడ్డీ ప్రిన్సిపల్ కమిషనర్ లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది’’అని సబీడీడీ పేర్కొంది. ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారుల దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వీలు కల్పిస్తుందని నాంజియా అండ్ కో ఎల్‌ఎల్‌పీ పార్ట్‌నర్ సచిన్‌గార్గ్ అభిప్రాయపడ్డారు.
మోసం కేసులకు ఏడాదిలో పరిష్కారం
ఎగుమతులు/దిగుమతుల మోసాల కేసుల విచారణలో క్షేత్రస్థాయి కస్టమ్స్ అధికారులు తటస్థంగా వ్యవహరించాలని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) కోరింది. విచారణకు ముందే సమాచారం మొత్తాన్ని విశ్లేషించి, క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించింది. కమర్షియల్ ఇంటెలిజెన్స్ ఫ్రాడ్ కేసుల్లో విచారణను ఏడాది దాటకుండా ముగించాలని కూడా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment