చైనా పెట్టుబడులకు సంబంధించిన విషయం మీద కేంద్రమంత్రి 'పియూష్ గోయల్' స్పష్టమైన వివరణ ఇచ్చారు. చైనా ఎఫ్‌డీఐకి మద్దతు ఇవ్వడంపై పునరాలోచన లేదని, ఆర్థిక సర్వే దీనికి ఏమాత్రం కట్టుబడి లేదని ఆయన అన్నారు. చైనా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.
2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు.. నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల గురించి వెల్లడించారు. చైనా పెట్టుబడుల ద్వారా ఉత్పత్తిని పెంచి.. ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని సర్వే అభిప్రాయపడింది. ఈ కారణంగానే కేంద్ర మంత్రి కూడా చైనా ఎఫ్‌డీఐలను ప్రోత్సహించాలని పేర్కొన్నారని, పియూష్ గోయల్ అన్నారు.
జూన్ 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత భారత ప్రభుత్వం మనదేశంలో సుమారు 200 చైనా యాప్‌లను నిషేదించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD నుండి వచ్చిన ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనను కూడా ఇండియా తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment