హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ హైదరాబాద్ జాబ్ మేళా నిర్వహిస్తోంది. సీటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు సమీపంలో మే 17 నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలను చాలా ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి వెంటనే ఆఫర్ లెటర్ ఇవ్వనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ జాబా మేళాకు హాజరయ్యేవారికి ఉండాల్సిన కనీస అర్హతలు ఇవే...
కనీస విద్యా అర్హతలు..
- 10వ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ పీజీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఉద్యోగ అనుభవం ఉన్నా లేకున్నా దరఖాస్తు చేయవచ్చు.
కావాల్సినవి...
దరఖాస్తుదారులు ముందుగా 2 రిజ్యూమ్‌లు, రెండు పాస్‌పోర్టు ఫోటోలు, ఐడీ ఫ్రూప్( పాన్‌కార్డ్/ఓటర్ కార్డు) లు సమర్పించాల్సి ఉంటుంది.
మే 17 నుంచి జీహెచ్‌ఎంసీ జాబ్‌మేళా..
Published Sun, May 15 2016 6:49 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement
Advertisement