Job Fair
-
ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు: ఖర్గే
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం విమర్శించారు. ఉద్యోగ మేళాల పేరిట మోదీ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగాలు, ప్రమోషన్లు వచి్చనవారికి మళ్లీ నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలపై ప్రధానమంత్రి నీళ్లు చల్లుతున్నారని ఆక్షేపించారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత శాతం రెండేళ్ల గరిష్టాన్ని అధిగమించిందంటూ ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లిమిటెడ్’ తాజాగా విడుదల చేసిన నివేదికను ఖర్గే ప్రస్తావించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో 90 లక్షలకుపైగా ఉద్యోగాలు మాయమయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థిత మరింత దారుణంగా ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం డిమాండ్ 20 శాతం పెరిగిందని తెలిపారు. మొత్తానికి దేశంలో నిరుద్యోగం 10.8 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువతలో నిరుద్యోగం 13.4 శాతంగా ఉందని, ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రకటనలు, ట్రిక్కులు ఎక్కువ కాలం చేయవని తేలి్చచెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచకుండా అన్యాయం చేసిన వారిపై యువత ప్రతీకారం తీర్చుకుంటారని, ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతున్నారన్నారు. -
వాస్తవాలపై ‘ఉక్కుపాదం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్ కెరీర్ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అసత్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్సీఎస్ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ సమన్వయంతో 516 జాబ్ మేళాలు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు. -
ఐటీ కొలువులకు ‘వింగ్స్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా విశాఖపట్నం భాసిల్లుతోంది. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా కూడా ప్రత్యేకతను సంతరించుకోనున్న విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ హబ్‌గా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీచ్ ఐటీ కాన్సెప్్టని ప్రమోట్ చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు విశాఖ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఐటీ సంస్థల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సహకారంతో విశాఖలో జాబ్ ఫెయిర్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జూలై 21, 22 తేదీల్లో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు హాజరుకానున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్, వెబ్‌సైట్‌ని విశాఖలో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీస్ (ఎపిటా), వి ఇన్ఫో టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో దిగ్గజ సంస్థల కార్యకలాపాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 300కి పైగా ఐటీ కంపెనీలుండగా.. ఇందులో 80 శాతం వరకు విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 28న దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. డెవలప్మెంట్ సెంటర్‌ని ప్రారంభించనుంది. ఇదే బాటలో టాటా కన్సల్టెన్సీ సర్వి సెస్ (టీసీఎస్), విప్రో కూడా పయనించనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కు, ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు మధ్య బాండింగ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తోంది. ఎపిటా, రాష్ట్ర ఐటీ విభాగం సహకారంతో వి ఇన్ఫో టెక్నాలజీస్ ఆధ్వర్యంలో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023ని నిర్వహించనుంది. ఐటీ, ఐటీ అనుబంధ రంగ కంపెనీలకే కాకుండా.. ఫార్మా సంస్థలు, స్టార్టప్ సంస్థలకు ఏ విధమైన నైపుణ్యాలున్న మానవ వనరులు అవసరం?.. ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి? టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలి వంటి అంశాలను గ్రాడ్యుయేట్స్‌తో పాటు 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ‘స్ప్రెడ్ యువర్ వింగ్స్’ అనే పేరుతో రెండు రోజుల పాటు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన యువత నుంచి సీవీలు తీసుకొని.. అక్కడే ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఎంపికైనవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ ఫెయిర్‌కు టెక్ మహీంద్ర, టీసీఎస్, ఎల్ అండ్ టీ, కాన్సెంట్రిక్స్, కాండ్యుయెంట్, చెగ్, డబ్ల్యూఎన్ఎస్, సెయింట్, పాత్రా, ఫ్లూయెంట్‌గ్రిడ్, పల్సస్ వంటి 40 వరకూ ఐటీ, అనుబంధ కంపెనీలు, పైజర్, అరబిందో వంటి 10 ఫార్మా సంస్థలు, 54 యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు 10 స్టార్టప్ కంపెనీలు హాజరు కానున్నాయి. విశాఖ ఐటీలో అపార అవకాశాలు.. విశాఖ ఐటీలో అపార అవకాశాలున్నాయి. కానీ.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలన్న అంశంపై గ్రాడ్యుయేట్స్‌కు సందేహాలున్నాయి. ఐటీ సంస్థలకు కూడా మానవవనరుల కొరత ఉంది. వాటిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాం. విశాఖ నగరంలో ఉన్న ఐటీ కంపెనీల గురించి అందరికీ తెలియజేయడం ఒక లక్ష్యం కాగా.. వాటిలో ఉపాధి అవకాశాలను ఇక్కడి యువతకు కల్పించడాన్ని మరో లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంస్థ 15 నిమిషాల పాటు విద్యార్థులతో అనుసంధానమవుతుంది. తమ సంస్థ గురించి తెలియజేయడమే కాకుండా.. అందులో ఉద్యోగం సాధించేందుకు ఎలాంటి అర్హతలు కావాలో అవగాహన కల్పిస్తాయి. ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకొచ్చాక విశాఖలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. – సాయికుమార్, సీఈవో, వి ఇన్ఫో టెక్నాలజీస్ -
25న సీబీఐటీలో మెగా జాబ్‌మేళా
చాపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ)లో 100 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సోమవారం సీబీఐటీ కాలేజీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి జాబ్‌మేళా నిర్వహణకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే గుంటూరు, తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఈక్రమంలో జిల్లా ప్రజల కోసం సీబీఐటీలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తామన్నారు. మేళాలో ఆయా కంపెనీలకు చెందిన 300 మంది హెచ్ఆర్లు తమ ప్రతినిధులతో పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగ ఎంపిక పడతారన్నారు. అభ్యర్థులు వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుని డైరెక్ట్‌గా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీబీఐటీ కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ డా.జి.శ్రీనివాసులరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షులు తెలిదేల లక్షుమయ్య, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
AP: జాబ్‌మేళాకు 210 కంపెనీలు
ఏఎన్‌యూ/పాత గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో శని, ఆదివారాల్లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 26,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని వివరించారు. మేళాలో పాల్గొనేందుకు ‘వైఎస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కామ్’ వెబ్సైట్లో ఇప్పటికే 97 వేలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారికి ఈ జాబ్‌మేళాలో అవకాశం కల్పిస్తున్నామన్నారు.అర్హతలను బట్టి ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకైనా హాజరుకావచ్చని చెప్పారు. గత రెండు జాబ్‌మేళాల్లో 30,473 మందికి ఉద్యోగాలు ప్రభుత్వపరంగా ఇస్తున్న ఉద్యోగాలతోపాటు అర్హత, ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 347 కంపెనీలు పాల్గొని మొత్తం 30,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పారు. జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు రానివారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి సంబంధిత శిక్షణ ఇచ్చి మళ్లీ జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేవరకు జాబ్‌మేళాల నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. ఏఎన్‌యూలో జాబ్‌మేళా కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ముందుగా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ వద్ద క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్లో స్కాన్ చేయాలని చెప్పారు. స్కాన్ చేయగానే.. ఏ బ్లాక్‌లో ఏయే ఉద్యోగాల ఇంటర్వ్యూలు అన్న వివరాలు తెలుస్తాయన్నారు. డైరెక్షన్ ఆప్షన్ నొక్కితే అక్కడికి ఎలా వెళ్లాలో తెలుస్తుందని, బ్లాక్ ఇన్చార్జి అన్నది ప్రెస్చేస్తే ఆయన పేరు, ఫోన్ నంబరు వివరాలు, కంపెనీల జాబితాను ప్రెస్చేస్తే ఏ బ్లాక్‌లో ఏ కంపెనీల ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నది తెలుస్తుందని వివరించారు. -
జాబ్ మేళా నిరంతర ప్రక్రియ: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యువతకు అండగా నిలవాలని జాబ్ మేళాకు శ్రీకారం చుట్టామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మూడు దశల్లో ఈ జాబ్ మేళా చేపట్టామని, తిరుపతి, వైజాగ్ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి(శని,ఆది) జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. తిరుపతి, వైజాగ్ జాబ్ మేళా ల్లో 30,473 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని పేర్కొన్నారు. చదవండి: వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఆంధ్రా యూనివర్సిటీలో 208 కంపెనీలో జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 210 కంపెనీలు నాగార్జున యూనివర్సిటీ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 26289 ఉద్యోగాలు ఖాళీలున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. 97000 మంది ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు జాబ్ మేళాల ద్వారా యాభై వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, ఉద్యోగం రానివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. -
Mega Job Mela: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘ఉపాధి విప్లవం’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెంచేదిశగా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో విస్తృత ఉద్యోగాల కల్పన కోసం.. అభివృద్ధి వికేంద్రీకరణ మేరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఈ మెగా జాబ్‌మేళాల ద్వారా 25 వేలమందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. చదవండి: అన్నదాతల ‘ఆత్మ’ సాక్షిగా రాజకీయం! శని, ఆదివారాల్లో (16, 17 తేదీల్లో) తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా యువత కోసం వైఎస్సార్సీపీ జాతీయ, అంతర్జాతీయంగా పేరుగాంచిన 147 కంపెనీలను పిలిపించి జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ మేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా 1.47 లక్షల మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పారు. శని, ఆదివారాల్లో తిరుపతిలోను, 23, 24 తేదీల్లో విశాఖ ఆ«ం«ధ్ర యూనివర్సిటీలో, ఈనెల 30, మే 1వ తేదీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈమేళాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. శనివారం తిరుపతి, వైఎస్సార్, రాజంపేట, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు, ఆదివారం అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల వారు ఈమేళాలో పాల్గొనాలని సూచించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినవారు మాత్రమే హాజరుకావాలన్నారు. తిరుపతిలో నిర్వహించే జాబ్‌మేళాకు 40 వేలమందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. మూడేళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు ఉద్యోగాల కల్పనలో ఏపీ ముందంజలో ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే ఆరులక్షలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనన్నారు. 2.50 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఆర్టీసీలోని 52 వేలమంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారని, 2.60 లక్షల వలంటీర్ల పోస్టులు ఇచ్చారని, ఆప్కోస్ ద్వారా 95 వేలమందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తూ 75% మంది స్థానికులకే ఉద్యోగాలను అందించేందుకే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లలో 30 సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని చెప్పారు. బాబూ ఎప్పుడైనా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించావా? ‘చంద్రబాబు తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారుగానీ.. వాస్తవానికి 44 ఇయర్స్ ఇండస్ట్రీ. అయితే ఏం ప్రయోజనం? తాను తొమ్మిదేళ్లు సమైక్యాంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చేసినప్పుడుగానీ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడుగానీ ఒక్కరికైనా జాబ్‌లు ఇప్పించారా.. కనీసం ఇలాంటి మేళాలు ఎప్పుడైనా నిర్వహించారా..’ అని ప్రశ్నించారు. నూతన చరిత్రకు నాంది పలికేలా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళాను చూసి చంద్రబాబుకి టీడీపీ నేతలకు వణుకుపుడుతోందన్నారు. వారు చేయరు, ఎవరైనా చేస్తే ఓర్చుకోలేని వింత వ్యాధితో పప్పునాయుడు, తుప్పునాయుడు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లలో చంద్రబాబుహయాంలో కేవలం తన సామాజికవర్గానికి చెందిన అనుకూలురకే లబ్ధిచేకూర్చుకున్నారని విమర్శించారు. తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలు, రాజకీయాలు, కులాలకతీతంగా ఎన్నో మేళ్లు చేస్తున్నామని చెప్పారు. 2024లో టీడీపీ సమాధి ఖాయం రానున్న ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమా అని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. ఒంటరిగా పోటీచేసినా, పొత్తులతో పోటీచేసినా 2024 ఎన్నికల్లో మళ్లీ చావు దెబ్బతిని.. టీడీపీ సమాధి కావడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న పప్పు నాయుడు లోకేశ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నది నిజమే అయితే.. తన తండ్రి పేరుని, తాను పోటీచేసిన నియోజకవర్గం మంగళగిరినిసరిగ్గా పలికించాలని సూచించారు. కుప్పంలో కూడా జాబ్‌మేళా పెడతాం చంద్రబాబు అడిగితే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశామని, ఆయన అడిగితే కుప్పంలో కూడా ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్‌మేళా వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలి విడతలో 15 వేల ఉద్యోగాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కనీసంగా 15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈనెల 16, 17న తిరుపతి.. 23, 24 తేదీలలో విశాఖపట్నం.. 30 మే 1 న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు చదివిన వారు అప్లై చేసుకోవచ్చన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు: కన్నబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. 1.22 లక్షల మందికి సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 2.59 లక్షల మంది వాలంటీర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు. -
East Godavari: డిగ్రీ చదివారా.. అయితే ఇది మీ కోసమే..
రాజమహేంద్రవరం రూరల్(తూర్పుగోదావరి): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో 25న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం హుకుంపేటలోని మహిళా మండల సమాఖ్య భవనంలో జరుగుతుందని డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి అన్నారు. రాజమహేంద్రవరంలో ఎంసీవీ మోటో క్రోఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్, బ్రాంచ్, ఏరియా మేనేజర్లుగా పనిచేయడానికి ఎంబీఏ లేదా డిగ్రీ చదివిన పురుషులు అర్హులన్నారు. జూనియర్ అక్కౌంటెంట్, ఆడిట్ అక్కౌంటెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన స్త్రీ, పురుషులు కావాలన్నారు. చదవండి: టీచర్ కాదు కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించి.. సీనియర్ అక్కౌంటెంట్ ఇన్ టాక్సేషన్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు, స్త్రీలు అర్హులన్నారు. వివిధ బ్రాంచ్‌ల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, స్పేర్ ఎగ్జిక్యూటివ్‌లు, బిల్లింగ్ చేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులకు అవకాశం ఉందన్నారు. రాజానగరం, కడియం, రంపచోడవరం, కోరుకొండలలో రిస్పెప్షనిస్ట్గా పనిచేయడానికి పురుషులు, స్త్రీలు కావాలని ఆమె అన్నారు. ఫ్లోర్ సూపర్వైజర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్లు, టెక్నీషియన్లు, వర్క్ ఇన్చార్జ్, సీనియర్ అడ్వయిజర్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు అర్హులన్నారు. రాజమహేంద్రవరం నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేయడానికి ఏదైనా డిగ్రీ చదివిన పురుషులు కావాలన్నారు. తడ శ్రీసిటీలో భరత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్‌లో మొబైల్ అసెంబ్లర్కు పదో తరగతి ఆపై, ఏదైనా బీటెక్ చదివిన స్త్రీలు కావాలన్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, రేషన్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ నకళ్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు 90309 24569, 8919868419 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఏపీలో మెగా ఐటీ జాబ్‌ఫెయిర్
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో హైఎండ్ ఉద్యోగాలు కల్పించే విధంగా మెగా జాబ్ ఫెయిర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్ఎస్డీసీ), ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (అపిటా), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) సంయుక్తంగా ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరుతో వర్చువల్ మెగా జాబ్‌ఫెయిర్ నిర్వహిస్తున్నాయి. 30కి పైగా కంపెనీల్లో ఫుల్‌స్టాక్ డెవలపర్, బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ అసోసియేట్ (బీపీఎం) విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ జాబ్‌ఫెయిర్ ఏర్పాటు చేశాయి. ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 25లోగా preciouscareers.com/istp అనే వెబ్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని ఏపీఎస్ఎస్డీసీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించింది. ఆ ప్రకటన మేరకు.. 2018 నుంచి 2021 వరకు ఇంజనీరింగ్ (ఐటీ/సీఎస్ఈ/ఈఈఈ/ఈసీఈ), ఎంసీఏ/ఎంఎస్సీ 55 శాతం మార్కులతో పూర్తిచేసినవారు ఫుల్‌స్టాక్ డెవలపర్ ఉద్యోగాలకు, 2017 నుంచి 2021 వరకు డిగ్రీ పూర్తిచేసినవారు బీపీఎం ఉద్యోగాలకు అర్హులు. నమోదు చేసుకున్న వారికి 27వ తేదీ నుంచి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటాయి. స్క్రీన్‌టెస్ట్ తుదిజాబితాలో ఉండి ఉద్యోగం పొందలేని విద్యార్థులకు విశాఖలో జనవరి 19 నుంచి 35 రోజులు ఫుల్‌స్టాక్ డెవలపర్, బీపీఎం కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి మంచి వేతనంతో ఉద్యోగాలిస్తాయి. మరిన్ని వివరాలకు ఎపీఎస్ఎస్డీసీ టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చు. -
ఒకేషనల్ విద్యార్థులకు ఉద్యోగ మేళ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వృత్తివిద్య అభ్యసించిన విద్యార్థుల కోసం ఈనెల 30న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు. ఆటో మొబైల్( ఏఈటీ), మెకానికల్ టెక్నాలజీ(ఎంటీ) పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లి బాజహర్ఘాట్లో ఉన్న ప్రభుత్వ వృత్తి కళాశాలలో ఈ ఉద్యోగ మేళ జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాస్, ఫెయిల్ అయిన ఇతర గ్రూపుల విద్యార్థులు కూడా ఉద్యోగ మేళాకు హాజరుకావొచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 9395554558 నంబర్లో సంప్రదించవచ్చు. -
జాబ్ మేళాకు విశేష స్పందన
కడప కోటిరెడ్డి సర్కిల్: స్థానిక పాత రిమ్స్‌లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని ఇన్‌ఛార్జి ఉపాధి కల్పనాధికారి ఎస్.వెంకట రమణ తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలకు 65 మంది హాజరు కాగా, 31 మందిని ఎంపిక చేశామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 8న తిరుపతిలో శిక్షణకు హాజరు కావాలని, అనంతరం వీరంతా జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి ఫరూఖ్బాష, జేఈఓ దోనప్ప, గంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
జాబ్ మేళాకు విశేష స్పందన
కడప కోటిరెడ్డి సర్కిల్: స్థానిక పాత రిమ్స్‌లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని ఇన్‌ఛార్జి ఉపాధి కల్పనాధికారి ఎస్.వెంకట రమణ తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలకు 65 మంది హాజరు కాగా, 31 మందిని ఎంపిక చేశామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 8న తిరుపతిలో శిక్షణకు హాజరు కావాలని, అనంతరం వీరంతా జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి ఫరూఖ్బాష, జేఈఓ దోనప్ప, గంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
జాబ్ మేళాకు విశేష స్పందన
వెంకటగిరి: డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. నాయుడుపేట మండలం హిందూస్థాన్ గ్లాస్ ఫ్యాక్టరీ, గ్రీన్‌టెక్, తడ మండలం శ్రీసిటీలోని సెల్కంపెనీ, తిరుపతిలోని అమరారాజా బ్యాటరీస్ పరిశ్రమల్లోని ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు 385 మంది నిరుద్యోగులు హాజరైనట్లు మండల పరిషత్ సూపరింటెండెంట్ కోటీశ్వరరావు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 175 మందిని ఎంపిక చేసినట్లు వివరించారు. జాబ్‌మేళాలో డీఆర్డీఏ ప్రతినిధులు నవీన్, శైలజ, తదితరులు పాల్గొన్నారు. -
మే 17 నుంచి జీహెచ్ఎంసీ జాబ్‌మేళా..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ హైదరాబాద్ జాబ్ మేళా నిర్వహిస్తోంది. సీటీ కాలేజీ, హైకోర్టు రోడ్డు సమీపంలో మే 17 నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలను చాలా ఎమ్ఎన్సీ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారికి వెంటనే ఆఫర్ లెటర్ ఇవ్వనున్నట్టు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ జాబా మేళాకు హాజరయ్యేవారికి ఉండాల్సిన కనీస అర్హతలు ఇవే... కనీస విద్యా అర్హతలు.. - 10వ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ పీజీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. - ఉద్యోగ అనుభవం ఉన్నా లేకున్నా దరఖాస్తు చేయవచ్చు. కావాల్సినవి... దరఖాస్తుదారులు ముందుగా 2 రిజ్యూమ్‌లు, రెండు పాస్‌పోర్టు ఫోటోలు, ఐడీ ఫ్రూప్( పాన్‌కార్డ్/ఓటర్ కార్డు) లు సమర్పించాల్సి ఉంటుంది. -
27న మెగా జాబ్ ఫెయిర్
విజయనగర్‌కాలనీ: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు కృషిచేస్తున్నామని ఉపాధి శిక్షణశాఖ అదనపు సంచాలకులు, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) అధికారి పి.ధర్మరాజు తెలిపారు. నగరంలోని 38 సంస్థల అభ్యర్ధన మేరకు 3159 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 27న మెహిదీపట్నంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధి శిక్షణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ ఫెయిర్ మెహిదీపట్నం పుల్లారెడ్డి కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. బుధవారం విజయనగర్‌కాలనీలోని టామ్‌కామ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జాబ్‌ఫెయిర్‌లో ప్రముఖ కంపెనీలు నిస్సాన్ కంపెనీ-చెన్నై, వరుణ్ మోటార్స్, వసంత టూల్స్ ఆండ్ క్రాఫ్ట్స్, హర్ష టయోటా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇన్బిస్కో, ెహ టిరోల్యాబ్స్, వెరిబ్యాటిం, సిప్రాల్యాబ్స్, గ్రీన్‌పార్క్ హోటల్, ఏజీస్, ఈమౌకా, ఎంఎస్ఎన్ ల్యాబ్ తదితర కంపెనీలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రీజియన్ ఆర్ఈవో టామ్‌కామ్ జనరల్ మేనేజర్ కె.భవానీ, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం అధికారి ఆర్.జగన్నాథం, ఉపాధి అధికారులు ఎ.పరమేశ్వర్ రెడ్డి, ఎస్. సుబ్బారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సల్ విద్యార్థుల ఎంపిక
మేడికొండూరు, న్యూస్‌లైన్: మండలం లోని డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలోని యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో లాజిక్ ఇ ఆర్ పి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొహాలీ, పంజాబ్ వారి ఆధ్వర్యంలో రెండు రోజులుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీటెక్ ఈసీఈ, సీఎస్ఈ, ఈఈఈ విద్యార్థులు 150 మంది హాజరయ్యారు. కంపెనీ ఆపరేషన్స్ హెడ్ సాల్మన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి 10 మందిని ఎంపిక చేశారు. చీరాలలోని వీఆర్ఎస్, వైఆర్ఎన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన జాబ్‌ఫెయిర్ నందు యురేకాఫోర్ట్, ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీలకు కళాశాలకు చెందిన 16 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జాస్మిన్ ఇన్ఫోటెక్ చెన్నై సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అర్హత సాధించిన 33మంది విద్యార్థులకు రాతపరీక్ష నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ గాలి బాలి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే కార్యదీక్ష, పట్టుదలతో పాటు ఇంగ్లిష్ భాషపై ప్రావీణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ లూర్దురెడ్డి మాట్లాడుతూ వివిధ కంపెనీల ప్రోత్సాహంతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో టెక్‌మహీంద్రా, విప్రో కంపెనీలతో పాటు వివిధ కంపెనీలు ఎంపికలు నిర్వహించడానికి కళాశాలకు రానున్నాయని చెప్పారు.