
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యువతకు అండగా నిలవాలని జాబ్ మేళాకు శ్రీకారం చుట్టామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మూడు దశల్లో ఈ జాబ్ మేళా చేపట్టామని, తిరుపతి, వైజాగ్ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి(శని,ఆది) జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. తిరుపతి, వైజాగ్ జాబ్ మేళా ల్లో 30,473 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
చదవండి: వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
ఆంధ్రా యూనివర్సిటీలో 208 కంపెనీలో జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 210 కంపెనీలు నాగార్జున యూనివర్సిటీ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 26289 ఉద్యోగాలు ఖాళీలున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. 97000 మంది ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు జాబ్ మేళాల ద్వారా యాభై వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, ఉద్యోగం రానివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment