job mela
-
రేపు ఓయూలో జాబ్‌మేళా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సి టీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో, అపోలో ఫార్మసీ సంయుక్తంగా ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జాబ్‌మేళా జరగనుంది. అపోలో ఫార్మసీల్లోని 100 ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టు పోస్టులను.. జాబ్‌మేళా లో భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తు న్నట్లు వర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. వేతనం రూ.14,800 నుంచి 25 వేల వరకు ఇవ్వను న్నారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్సు ప్రతు లతో యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరోకు హాజరుకావాలని సూచించారు. -
గ్రామీణ యువత కోసం ఐటీ హబ్‌ల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ‘టాస్క్’సంస్థ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి ‘తనపై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తు న్నానని, ఆలోగా ఆరోపణలు రుజువు చేయక పోతే నిజామాబాద్ పులాంగ్చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకు ఎవరు ఒక్క రూపాయి ఇచ్చారో రుజువు చేయాలని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు. శుక్రవారం నిజా మాబాద్ జిల్లాకేంద్రంలో కవిత విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోతే, ఇప్పుడు మేం చేశామని చెప్పారు. నిజామా బాద్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసున్నారు. ‘నా తండ్రిని అంటే వదిలేశా..ఇప్పుడు నా భర్తను కూడా విమర్శిస్తున్నారు..మజాక్ చేస్తే బాగుండదు.ఆయన రాజకీయాల్లో లేకున్నా పేరు ఎందుకు తీస్తున్నారంటూ’ అర్వింద్‌ను ప్రశ్నించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వెళ్లి ఆయన్ను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు. -
అక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఫ్రీ.. ఫ్రీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యువ తను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణంగా ఎన్నికల వేళ జాబ్ మేళాలు నిర్వహించే నేతలు ఈసారి కొత్తగా యువ ఓటర్లకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తు న్నారు. ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఏకంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం మీసేవ సెంటర్లకు వెళ్లి, నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను పరిశీలించి ఆయా ప్రాంతాల్లోని ఎంవీ ఇన్స్పెక్టర్లు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తారు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం చెల్లించాల్సిన రుసుము రూ.300 కూడా నాయకులే చెల్లిస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట్, గజ్వేల్ నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ కౌంటర్లను ఏర్పాటు చేయగా, దుబ్బాకలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వీటిని తెరిచారు. అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా నేతలు ఈ కౌంటర్లను తెరిచేందుకు సిద్ధమయ్యారు. మా వద్దనే దరఖాస్తు చేసుకోండంటూ ప్రకటనలు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం తమ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ఆయా పార్టీల నేతలు, ప్రజాప్రతి నిధులు ప్రకటనలు చేస్తున్నారు. మరో వైపు ఆయా మండలాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయ కుల ద్వారా కూడా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్ పొందాక, ఆరు నెలల తర్వాత రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకునేందుకు వీలుంటుంది. ముందు లెర్నింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తున్న నేతలు, మరో ఆరునెలల్లో పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇప్పిస్తామని భరోసా ఇస్తున్నారు. యువ ఓటర్లే ఎక్కువ.. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు నిండాలి. అలాగే 18 ఏళ్లు నిండిన వారికే ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుంటుంది. దీంతో నేతలు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లలో యువ ఓటర్లే అధికంగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా ఒక్క దుబ్బాకలోనే బీఆర్ఎస్, బీజేపీ ఏర్పాటు చేసిన కౌంటర్లలో వేలల్లో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. -
నిరుద్యోగ రహిత ఏపీ రూపకల్పనే లక్ష్యం
ఏఎన్‌యూ/సాక్షి, అమరావతి: నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ రూపకల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపడుతున్నారని రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండ్రోజుల పాటు జరగనున్న జాబ్‌మేళాను గురువారం ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువకులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృఢ నిశ్చయంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గత ఏడాది నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మెగా జాబ్‌మేళాలు నిర్వహించి నలభై వేల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. త్వరలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో కూడా వేర్వేరుగా మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వివరించారు. వీటి ద్వారా అరవై నుంచి లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఏపీలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రభుత్వ వ్యవస్థను సామాన్యుల చెంతకు చేర్చడంతోపాటు యువతకు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు కల్పించారన్నారు. జాబ్‌మేళా నిర్వహణ బృహత్తర కార్యక్రమమని తెలిపారు. ఏఎన్‌యూలో ఇంక్యుబేషన్ కేంద్రాల అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా హాజరుకావొచ్చు ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి. రాజశేఖర్ మాట్లాడు తూ.. ఏఎన్‌యూలో అంతర్జాతీయ విద్య, పరిశోధనా ప్రమాణాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. జాబ్‌మేళాకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా హాజరుకావచ్చన్నారు. ఏఎన్‌యూ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ డాక్టర్ బి. నాగరాజు మాట్లాడుతూ.. చెన్నైకి చెందిన సిటిజన్ ఫర్ ఛేంజ్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాలో 75 సంస్థలు పాల్గొంటున్నాయని పది వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి, ఇన్చార్జి రిజి స్ట్రార్ ఆచార్య సునీత, వివిధ విభాగాల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాల్ని తిప్పికొట్టాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్సీపీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డీనేటర్, అనుబంధ విభాగాల ఇన్చార్జ్ విజయసాయిరెడ్డి కోరారు. పార్టీ పంచాయతీరాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్‌చార్‌్జలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్, పార్లమెంటరీ పోలింగ్ బూత్ ఇన్చార్్జలతో తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. న్యాయపరంగా ఎల్లో మీడియా తీరును సమర్ధవంతంగా తిప్పికొట్టాలని.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. -
గుంటూరు ఏఎన్‌యూలో వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా
-
జాబ్‌మేళాలతో భారీగా ఉద్యోగ కల్పన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా యువతకు స్థానికంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 987 జాబ్‌మేళాలు నిర్వహించి.. 1,05,889 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ ఏడాది కూడా 286 జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా కనీసం 30,000 మందికి ఉద్యోగాలు లభించే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుమారు 200 కంపెనీలను గుర్తించి వారికి అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందుకోసం మినీ జాబ్‌మేళా, జాబ్‌మేళా, మెగా జాబ్‌మేళాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో ప్రతి మంగళవారం మినీ జాబ్‌మేళా, శుక్రవారం జాబ్‌మేళా, ప్రతి మూడు నెలలకు ఒకసారి జోన్ పరిధిలో మెగా జాబ్‌మేళా నిర్వహించే విధంగా క్యాలెండర్ సిద్ధం చేసింది. ఇంటర్‌లోపు విద్యార్హత ఉన్న వారికి ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 192 స్కిల్ హబ్స్ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి మంగళవారం నిర్వహించే మినీ జాబ్‌మేళాల ద్వారా ఉపాధి కల్పించనుంది. మూడు, నాలుగు కంపెనీలకు మానవ వనరులు అవసరం కాగానే మినీ జాబ్‌మేళా, కనీసం 10 కంపెనీలకైతే జాబ్‌మేళా నిర్వహిస్తారు. ఇవి కాకుండా జోన్ పరిధిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కనీసం 50 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. చదవండి: గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
25, 26 తేదీల్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు జాబ్‌మేళా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు రవాణా సేవలను అందిస్తున్న మేధా సర్వో డ్రైవ్స్ సంస్థలో రూ.3లక్షల వార్షిక ప్యాకేజీతో వంద మందిని ఇంజనీరింగ్ ట్రైనీలుగా తీసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వూ్యలకు హాజరుకావొచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డిప్లమో విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే గత డిసెంబరులో రూ.3 లక్షల ప్యాకేజీతో మేధా సర్వో డ్రైవ్స్ 31 మందికి పారిశ్రామిక శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించిందని నాగరాణి పేర్కొన్నారు. -
రోజ్‌గార్ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. 2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్ పాపులేషన్ రేషన్–డబ్లూపీఆర్) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు. -
10 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి: ప్రధాని మోదీ
గాంధీనగర్: దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. యువతకు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు. రాబోయే నెలల్లో జాతీయ, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామన్నారు. గుజరాత్ ప్రభుత్వం శనివారం గాంధీనగర్‌లో ‘ఉద్యోగమేళా’ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. ధంతెరాస్ సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఉద్యోగమేళాలో 75 వేల మందికి నియామక పత్రాలను అందజేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2022లో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా సాధించిందని చెప్పారు. ఈ మేళా సందర్భంగా గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డు నుంచి 5 వేల మందికి, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 8 వేల మందికి సీఎం భూపేంద్ర పటేల్ నియామక పత్రాలను అందజేశారు. చదవండి: గుజరాత్లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. -
3 నెలల్లో 15,032 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఈ జాబ్ మేళాల ద్వారా కేవలం మూడు నెలల్లోనే 15,032 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు ఆన్లైన్ జాబ్ మేళాలకు మాత్రమే పరిమితమైన ఏపీఎస్ఎస్డీసీ... ఇప్పుడు నేరుగా కళాశాలల్లోనే జాబ్ మేళాలను నిర్వస్తోంది. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 142కు పైగా జబ్మేళాలను నిర్వహించగా, 37,879 మంది విద్యార్థులు హాజరైనట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎస్.సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాబ్ మేళాల్లో 146కు పైగా ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 15,032 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వివరించారు. వారికి అర్హతల ప్రకారం రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు నెలవారీ వేతనం ఇవ్వడానికి కంపెనీలు సిద్ధమయ్యాయని తెలిపారు. గత మూడు నెలల్లోనే ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 2,000 మందికిపైగా విద్యార్థులను ఎంపిక చేసుకోగా, డైకిన్ వంటి పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు, హాస్పిటల్స్ వంటి సంస్థలు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు జాబ్ మేళాల ద్వారా 45,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీలకు అవసరమైన నిపుణుల కోసం స్కిల్ హబ్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలి. ఈ క్రమంలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఏపీఎస్ఎస్డీసీ చర్యలు చేపట్టిందని సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విధంగా ఈ స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తొలి దశలో 66 స్కిల్ హబ్స్‌ను సిద్ధం చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఏటా 42,000 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కిల్ హబ్స్‌ను రూపొందించినట్లు చెప్పారు. శిక్షణ అనంతరం అదే కంపెనీలో ఉద్యోగం ఇచ్చే విధంగా పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు చేసుకుంటోంది. -
25న సీబీఐటీలో మెగా జాబ్‌మేళా
చాపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ)లో 100 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సోమవారం సీబీఐటీ కాలేజీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి జాబ్‌మేళా నిర్వహణకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే గుంటూరు, తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఈక్రమంలో జిల్లా ప్రజల కోసం సీబీఐటీలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తామన్నారు. మేళాలో ఆయా కంపెనీలకు చెందిన 300 మంది హెచ్ఆర్లు తమ ప్రతినిధులతో పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగ ఎంపిక పడతారన్నారు. అభ్యర్థులు వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుని డైరెక్ట్‌గా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీబీఐటీ కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ డా.జి.శ్రీనివాసులరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షులు తెలిదేల లక్షుమయ్య, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
AP: జాబ్ మేళాకు జేజేలు
సాక్షి నెట్వర్క్: మేథో సంపత్తిలోనూ, కష్టపడి పనిచేయటంలోనూ తెలుగు యువతకు ఎవరూ సాటిరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో పది లక్షల మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మనదేశంలో 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటిలో 50 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులే ఉన్నారు. అలాగే బెంగళూరులో 25 శాతం, చెన్నైలో 15 శాతం ఉద్యోగులు ఈ రాష్ట్రానికి చెందిన వారే. అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేసిన గత పాలకుల నిర్ణయాల ఫలితం.. విభజనాంధ్రప్రదేశ్లో యువతకు శాపంగా మారింది. ఒకప్పుడు లోకల్ స్టేటస్‌ను అనుభవించిన మన విద్యార్థులు ఇప్పుడు అక్కడ నాన్ లోకల్‌గా మారిపోయారు. అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అవకాశాలు కల్పించింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ శకానికి శ్రీకారం చుట్టింది. చదువు ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ‘కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం..’ అంటూ అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందిస్తూనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలు నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. పరిశ్రమలు లేకపోయినా, శ్రమించే యువత ఉండటం మనకు కలిసి వచ్చిన అదృష్టం. ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలో, 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో.. ఈ నెల 7, 8 తేదీల్లో గుంటూరులోని ఏఎన్‌యూలో నిర్వహించిన జాబ్ మేళాల్లో 34,173 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్ లెటర్లు అందించాయి. మరో రెండువేల మంది ఫైనల్ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు. తిరుపతిలో శ్రీకారం రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పార్టీ వెబ్సైట్లో సుమారు 47 వేల మందికి పైగా నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకున్నారు. 143 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీల్లో ఉద్యోగాలకు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. టెన్త్ నుంచి ఎంటెక్ వరకూ.. రెండు రోజుల పాటు నిర్వహించిన ఎంపికల్లో మొత్తం 8,256 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్హత కలిగిన 4,139 మంది.. డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన 2,041 మంది.. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన 1,358 మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. మరో 718 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు కనిష్ట వేతనం రూ.13 వేలు కాగా గరిష్టంగా రూ.77 వేలు వేతనం లభించనుంది. సాగర తీరాన... విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 23, 24 తేదీల్లో జాబ్ మేళా నిర్వహించారు. 208 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. తొలిరోజు 13,663 మంది, రెండో రోజు 8,554 మంది చొప్పున మొత్తంమీద 22,217 మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించారు. మొదటి రోజు జాబ్‌మేళాలో రూ.12, రూ.10 లక్షల వార్షిక వేతనాలతో ఇద్దరు, రెండోరోజు రూ.12.5 లక్షల వేతనంతో ఒకరు, రూ.12 లక్షల వేతనంతో ఇద్దరు ఉద్యోగాలు సాధించటం విశేషం. మేళాలో పాల్గొన్న ఒమిక్స్ కంపెనీ ఈ మేరకు అత్యధిక వేతనం ఆఫర్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంది. టెన్త్ విద్యార్హతలతోనే రూ.10 వేల వేతనంతో ఫ్లిప్‌కార్ట్ నియామకాలు చేసుకొంది. ఏఎన్‌యూలో... గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాబ్‌మేళాకు 14,500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 3,700 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. మరో రెండు వేల మంది ఫైనల్ సెలెక్షన్స్‌కు ఎంపికయ్యారు. నెలకు రూ.14 వేల నుంచి ఏడాదికి రూ.11 లక్షల వరకు ప్యాకేజీలు లభించాయి. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వెబ్ ప్రాసెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దక్కారో టీ హబ్, డీమార్ట్, మ్యాక్స్, ఫ్లిప్‌కార్ట్‌లతో కలిసి 42 మంది దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అందరికీ ఆఫర్ లెటర్స్ అందించారు. త్వరలో కడపలో.. కడపలో త్వరలో జాబ్ మేళా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేదీలు ఖరారు కావాల్సి ఉంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఆదేశాల మేరకే ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. చదువుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అండగా ఉండాలన్న సీఎం ఆశయ సాధనలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. సుమారుగా 15,000 ఉద్యోగాలు వరకూ కల్పించాలని తలపెట్టిన కార్యక్రమం అనుకున్న అంచనాలను మించి తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో కలిపి 35,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించాం. ఇది ఆరంభం మాత్రమే. ప్రతిఏటా జాబ్ మేళా ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించనున్నాం. నిరుద్యోగ సమస్య తీరేవరకూ మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తూ వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతకు అండగా ఉంటుంది. – వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేశ చరిత్రలోనే అద్వితీయం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల్లోనే ప్రభుత్వంలో 6,03,756 పైచిలుకు ఉద్యోగాలు కల్పించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రయివేటు రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు వీలైనంత మేరకు ఉద్యోగ కల్పన చేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టింది. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇదే మొదటిసారి అనడంలో అతిశయోక్తి లేదు. నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఠీఠీఠీ. yటటఛిp్జౌbఝ్ఛ ్చ.ఛిౌఝకి చాలా మంచి రెస్పా¯Œన్స్ వచ్చింది. విద్యార్థులు ఖీజ్చిnజు ్గౌu ఇM జీట అంటూ జేజేలు పలుకుతుంటే ఈ కరోనా పాండమిక్‌లో కల్పించిన ఉద్యోగాలకు వారి ఆనందానికి అవధుల్లేవు. – గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి -
నిరంతరంగా జాబ్‌మేళాలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున జాబ్‌మేళాలు కొనసాగుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటుచేసిన రెండ్రోజుల వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియని, అవకాశం ఉన్న ప్రతిచోటా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని చెప్పారు. మూడు విడతల్లో 40,243 మందికి.. తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 30 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఏఎన్‌యూలో నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా 10,480 మంది ఉద్యోగాలు పొందారన్నారు. మూడు జాబ్‌మేళాల్లో మొత్తం 40,243 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మరో 2వేల మందిని రెండోరౌండ్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారన్నారు. మూడు విడతల్లో 540 కంపెనీల రాక మూడు విడతల జాబ్‌మేళాల్లో దాదాపు 540 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించారని.. వారందరికీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగో జాబ్‌మేళాను జూన్ మొదటి వారంలో వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో నిర్వహిస్తామని తెలిపారు. దీంతో మొదటి దశ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత రెండో దశను ప్రారంభిస్తామన్నారు. గరిష్టంగా రూ.11లక్షల వార్షిక ప్యాకేజీ జాబ్‌మేళాలపై విపక్షంతో పాటు, ఒక వర్గం మీడియా విమర్శలు చేస్తున్నాయని, అవన్నీ నైతిక విలువల్లేని వారి విమర్శలుగా విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. జాబ్‌మేళాల్లో చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలో వాస్తవం లేదన్నారు. రూ.15 వేల నుంచి రూ.లక్ష దాకా నెలసరి వేతనంతో ఉద్యోగాలు కల్పించామని, గరిష్టంగా రూ.11 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం లభించిందన్నారు. కార్యక్రమంలో మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రోశయ్య, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సోషల్ జస్టిస్ సలహాదారు జూపూడి ప్రభాకర్, సీఎం సలహాదారు ధనుంజయరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వీసీ రాజశేఖర్ పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకు బాసటగా వైఎస్సార్సీపీ: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన జాబ్ మేళా మొదటి రోజు విజయవంతంగా జరిగింది. జాబ్‌మేళాలో మొదటి రోజు 142 కంపెనీలు పాల్గొనగా.. 7,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. 1,562 మందిని షార్ట్ లిస్ట్ చేశాయి. 373 మందికి వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చారు. మిగిలిన వారికి మెయిల్, వాట్సప్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపనున్నారు. చదవండి: (వైఎస్సార్సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి) మొదటి రోజు జాబ్ మేళా అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'జాబ్ మేళా మొదటి రోజు విజయవంతంగా జరిగింది. నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్న సీఎం కల సాకారం కాబోతుంది. నిరుద్యోగ యువతకు బాసటగా వాళ్ల ఇళ్ళలో వెలుగు నింపుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆదివారం కూడా జాబ్ మేళా కొనసాగుతోంది. ఇవాళ 31,000 మంది యువత జాబ్ మేళాకు హాజరయ్యారు. ఉద్యోగం రాని వాళ్లు నిరుత్సాహ పడవద్దు. ఉద్యోగం వచ్చే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జాబ్ మేళాలు కొనసాగుతాయి. జాబ్ మేళా విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. పార్టీలో ఒక సెల్ ఏర్పాటు చేసి నిరుద్యోగులు జాబితా రూపొందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. పార్టీ కేంద్రకార్యాలయంలో సెల్ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలు పొందిన వాళ్లు కుటుంబ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధి కృషి చెయ్యాలి' అని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: (బాబు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మంచి పనులు చేశారా: వైవీ సుబ్బారెడ్డి) -
AP: జాబ్‌మేళాకు 210 కంపెనీలు
ఏఎన్‌యూ/పాత గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో శని, ఆదివారాల్లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని, దాదాపు 26,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని వివరించారు. మేళాలో పాల్గొనేందుకు ‘వైఎస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కామ్’ వెబ్సైట్లో ఇప్పటికే 97 వేలమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారికి ఈ జాబ్‌మేళాలో అవకాశం కల్పిస్తున్నామన్నారు.అర్హతలను బట్టి ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకైనా హాజరుకావచ్చని చెప్పారు. గత రెండు జాబ్‌మేళాల్లో 30,473 మందికి ఉద్యోగాలు ప్రభుత్వపరంగా ఇస్తున్న ఉద్యోగాలతోపాటు అర్హత, ఆసక్తి ఉన్నవారికి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 347 కంపెనీలు పాల్గొని మొత్తం 30,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పారు. జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు రానివారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి సంబంధిత శిక్షణ ఇచ్చి మళ్లీ జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేవరకు జాబ్‌మేళాల నిర్వహణ కొనసాగుతుందని చెప్పారు. ఏఎన్‌యూలో జాబ్‌మేళా కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ముందుగా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ వద్ద క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్లో స్కాన్ చేయాలని చెప్పారు. స్కాన్ చేయగానే.. ఏ బ్లాక్‌లో ఏయే ఉద్యోగాల ఇంటర్వ్యూలు అన్న వివరాలు తెలుస్తాయన్నారు. డైరెక్షన్ ఆప్షన్ నొక్కితే అక్కడికి ఎలా వెళ్లాలో తెలుస్తుందని, బ్లాక్ ఇన్చార్జి అన్నది ప్రెస్చేస్తే ఆయన పేరు, ఫోన్ నంబరు వివరాలు, కంపెనీల జాబితాను ప్రెస్చేస్తే ఏ బ్లాక్‌లో ఏ కంపెనీల ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నది తెలుస్తుందని వివరించారు. -
జాబ్ మేళా నిరంతర ప్రక్రియ: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యువతకు అండగా నిలవాలని జాబ్ మేళాకు శ్రీకారం చుట్టామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మూడు దశల్లో ఈ జాబ్ మేళా చేపట్టామని, తిరుపతి, వైజాగ్ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి(శని,ఆది) జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. తిరుపతి, వైజాగ్ జాబ్ మేళా ల్లో 30,473 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని పేర్కొన్నారు. చదవండి: వైఎస్సార్ రైతు భరోసా.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఆంధ్రా యూనివర్సిటీలో 208 కంపెనీలో జాబ్ మేళాలో పాల్గొన్నాయి. 210 కంపెనీలు నాగార్జున యూనివర్సిటీ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. 26289 ఉద్యోగాలు ఖాళీలున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. 97000 మంది ఈ జాబ్ మేళా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు జాబ్ మేళాల ద్వారా యాభై వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, ఉద్యోగం రానివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇస్తామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. -
ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా
సాక్షి, ఏఎన్‌యూ: జన క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో వైఎస్సార్ సీపీ మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న ఆ పార్టీ యువతరం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగ కల్పనకు నాందిపలికింది. నిరుద్యోగులతోపాటు కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో పలు రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారికి అవకాశాలను చేరువచేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా భారీ ఉద్యోగ మేళా నిర్వహించనుంది. భారీ స్పందన ఈ మేళాకు నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నాటికి 90వేల మందికిపైగా నిరుద్యోగులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాబ్‌మేళా నాటికి రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం 8985656565 ఫోన్ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ysrcpjobmela@gmail.com మెయిల్ అడ్రస్‌కు రెజ్యూమ్ పంపవచ్చు. కనీస వేతనం రూ.14వేల నుంచి అవకాశాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. ఏఎన్‌యూ వేదికగా 25 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జాబ్‌మేళా నిర్వహణకు ఏఎన్‌యూలోని డాక్టర్ వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్, ఈసీఈ, సెంట్రల్ బ్లాక్ తదితర ఐదు భవనాల్లో విభాగాల వారీగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. పది, ఇంటర్మీడియెట్ చదివిన వారికి ఒక బ్లాక్‌లోనూ, డిగ్రీ, పీజీ కోర్సులకు మరో భవనంలోనూ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల వారికి ఇంకో భవనంలోనూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. దీనికోసం ఈ భవనాల్లోని 100కుపైగా గదులను ఇప్పటికే సిద్దం చేశారు. 500 మంది వలంటీర్ల నియామకం మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు సేవలందించేందుకు 500 మంది సిబ్బంది, వలంటీర్లను నియమించారు. నిరుద్యోగులకు సమాచారం ఇచ్చేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థికీ ఓ కోడ్ ఇచ్చి వారికి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాన్ని వారి మొబైల్‌కు ఆన్లైన్ ద్వారా తెలిపే ఏర్పాట్లూ చేస్తున్నారు. చదవండి:‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’ విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్ సౌకర్యం నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. యువత కోసమే.. నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కారుమూరి మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసమే మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విశాఖలో మేళాలు నిర్వహించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో విజయవంతం చేస్తాం... జాబ్‌మేళా ఏర్పాట్లకు సహకారం అందించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. యూనివర్సిటీ, ప్రభుత్వ శాఖలూ పూర్తి సహకారం అందిస్తున్నాయి. కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అందరి సహకారంతో జాబ్‌మేళాను విజయవంతం చేస్తాం. – ఎ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జాబ్‌మేళా పర్యవేక్షకులు -
నిరంతర జాబ్ మేళాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు జాబ్ మేళాలు నిరంతరం నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళాల్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నిరుద్యోగుల కోసం మే 7, 8 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తిరుపతి, విశాఖ, గుంటూరులో మెగా జాబ్ మేళాలు నిర్వహించి 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పామన్నారు. తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహించిన జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభించిందని, 30,473 మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. చెప్పిన దానికంటే అధికంగా ఉద్యోగాలు కల్పించడంతో ఓర్వలేని ప్రతిపక్షాలు జాబ్ మేళాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జాబ్‌మేళాలో 148 కార్పొరేట్ సంస్థలు జాబ్ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారికి విద్యార్హతల ఆధారంగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో కార్పొరేట్ సంస్థలు నియామక పత్రాలను అందజేశాయని తెలిపారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే జాబ్ మేళా కోసం వెబ్సైట్ ద్వారా ఇప్పటికే 77 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 148 కార్పొరేట్ సంస్థలు పేర్లను నమోదు చేసుకున్నాయని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన ద్వారా తలసరి ఆదాయం, పరిశ్రమల ఉత్పాదకత పెరిగి తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి చెందుతుందన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జలవనరులు, పౌర సరఫరా, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
'సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ జాబ్ మేళా'
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరపనున్న జాబ్ మేళా పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. జాబ్‌మేళా పోస్టర్ విడుదల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ జాబ్ మేళా. సీఎం జగన్ ఆదేశాల మేరకే తిరుపతి, విశాఖలో తొలి రెండు విడతల్లో జాబ్ మేళా నిర్వహించాం. మూడో విడతగా నాగార్జున యూనివర్సిటీలో ఈ జాబ్ మేళా మే 7,8 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటివరకు తిరుపతి, విశాఖలో 10వేల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే 30వేల ఉద్యోగాలు వచ్చాయి. విశాఖలో 23వేల మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏఎన్‌యూలో జరిగే మేళాలో 148 కంపెనీలు, 70 వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో 4 లక్షల వరకు ఉద్యోగాలిచారు. ఇప్పుడు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఎంపికైన విద్యార్థుల ముఖాల్లో కొత్త కాంతులు కనిపించడం ఆనందంగా ఉంది. సంక్షేమ పథకాలతో పాటు పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగంలో సమానంగా అబివృద్ది కోసం కృషి చేస్తున్నాం. రాబోయే రెండేళ్లలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తాం.. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేరుస్తాం' అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి👉🏼 (సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం) -
విశాఖ జాబ్ మేళాకు భారీ స్పందన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) ప్రాంగణంలో వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 22,227 మంది యువతకు అభినందనలు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఇంత పెద్ద ఉపాధి లభించడం సీఎం జగన్‌కు సంతోషం కలిగించే అంశమని అన్నారు. తొలి రోజు 13, 663 రెండో రోజు 8,557 మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం 22,227 మంది రెండు రోజుల్లో ఉపాధి కల్పించడం వైఎస్సార్సీపీ సాధించిన రికార్డు. అత్యధికంగా ఏడాదికి 12 లక్షలు 50 వేలు, అత్యల్పంగా నెలకు 15 వేలు వేతనం ఉద్యోగాలు అందించాము. రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులు ఎదగాలి’’ అని అన్నారు. -
మే 1, 2 తేదీల్లో వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా
తెనాలి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. ఏఎస్ఎన్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలోను శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి కేంద్రంగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ జాబ్‌మేళా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు ఏఎన్‌యూలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఇది మంచి అవకాశమన్నారు. పార్టీ తరఫున కంపెనీలను ఆహ్వానించి జాబ్‌మేళా నిర్వహించటం రాజకీయాల్లో కొత్త అధ్యాయమని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత డేటా సేకరించామన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని అందరిని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. (క్లిక్: ‘నన్నయ’ వర్సిటీకి 16 ఏళ్లు) -
విశాఖలో జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏయూ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారు. ప్రభుత్వం రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. జాబ్ మేళా అనేది నిరంతర ప్రక్రియ. చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగుల కూడదు అనేది సీఎం లక్ష్యం. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పని వైఎస్సార్సీపీ చేస్తోంది. గ్రామ, వార్డు వాలంటరీ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం కల్పించారు. నేడు, రేపు జాబ్ మేళా జరుగుతుంది. అవరమైతే ఎల్లుండి కూడా నిర్వహిస్తాము. 208 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఒక్కొక్కరు ఐదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాము. 77 వేల మంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో వచ్చే వారం జరగాల్సిన జాబ్ మేళా సీఎం ఢిల్లీ పర్యటన కారణంగా ఒక వారం వాయిదా పడింది అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఐటీశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీ విజయ సాయిరెడ్డి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. జాబ్ మేళా ద్వారా సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయం ద్వారా 1.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా 2.50 లక్షల మందికి అవకాశం కల్పించారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తాము అని మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. -
గుంటూరు: 30న, మే 1న మెగా జాబ్‌మేళా
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న, వచ్చే నెల 1న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్‌నెట్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడ్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథి అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో 80 కంపెనీలు పాల్గొంటున్నాయని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి ఉద్యోగాలిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. -
తిరుపతి చరిత్రలో తొలిసారి: కనీవిని ఎరుగని రీతిలో స్పందన
‘రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపాలి. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. తల్లిదండ్రులతోపాటు ఆ కుటుంబాలకు అండగా నిలవాలి’ అనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. రాయలసీమ జిల్లాల్లోని యువతీయువకులు తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్‌మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో సత్తాచాటి ఉద్యోగాలు దక్కించుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. సాక్షి, తిరుపతి రూరల్/తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్రంలోనే మొదటి సారి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి పాదా ల చెంత శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభిచింది. ఎస్వీ ఆడిటోరియంలో ఎంపీ విజయసాయిరెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి దేవేంద్రరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటైన జాబ్‌మేళాకు రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 43 వేల మంది హాజరయ్యారు. వీరంతా మెగా జాబ్‌మేళా అఫిషియల్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారు. పది. ఇంటర్, డిప్లొమో, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఆశావహులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్హత, అనుభవం, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉద్యోగాలు సాధించిన 4,784 మందిలో తక్షణం 410 మందికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. చరిత్రలో మొదటి సారి తిరుపతి చరిత్రలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మెగా జాబ్‌మేళా నిర్వహించింది. సరిగా నడవలేని స్థితిలో కొందరు, చంటిబిడ్డలతో మరికొందరు, డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాని యువతీయువకులు ఎందరో.. సర్టిఫికెట్లు చేతబట్టి తండోపతండాలుగా తరలివచ్చారు. జాబ్‌మేళా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలు కిక్కిరిసిపోయాయి. జాబ్‌మేళాలో చంద్రగిరి, సత్యవేడు, పలమనేరు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలం, వెంకటేగౌడ్, ప్రభుత్వ సలహాదారు (ఏపీ స్కిల్ డెవలప్మెంట్) చల్లా మధుసూదన్‌రెడ్డి, జాబ్‌మేళా తిరుపతి ఇన్చార్జ్ దేవేందర్‌రెడ్డి, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.. పక్కాగా ఏర్పాట్లు ►మెగాజాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులకు నేతలు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ►పోలీస్ బృందాలతో భారీ బందోబస్తుతోపాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేశారు. ►ఎండ వేడిమికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి చోటా షామియానాలు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఇబ్బందులు పడకుండా భోజనం సమకూర్చారు. ►దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. మూడు చక్రాల సైకిళ్లలో జాబ్‌మేళా కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. ►జాబ్‌మేళా కేంద్రాల ప్రత్యేక సూచిక బోర్డులు, నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు ప్రతి గదిలోనూ అభ్యర్థులకు సలహాలిచ్చేందుకు వలంటీర్లను నియమించారు. గొప్ప అవకాశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మెగా జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగులకు గొప్ప వరం. పెద్ద కంపెనీల ద్వారా జాబ్‌మేళా నిర్వహించారు. ఇంటర్వుల్లో పాల్గొని సాఫ్ట్ వేర్‌గా ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు కృతజ్ఞతలు. – ఖాజా మస్తాన్, కావలి కల నెరవేరింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలన్న కల నెరవేరింది. ఉన్నతమైన కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురు చూశాను. ఈ మెగా జాబ్ మేళా ద్వారా అది సాధ్యమైంది. బంధువులు స్నేహితులతో గర్వంగా సాఫ్ట్వేర్ అని చెప్పుకోగలను. అమ్మనాన్నలకు నా వంతు సహకారం అందిస్తా. – హారికారెడ్డి, తిరుపతి పేర్లు నమోదు చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగాజాబ్ మేళా నిరంతర ప్రక్రియ. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం. ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా తిరిగి మళ్లీ ప్రయత్నించాలి. రిజిస్ట్రేషన్ల కోసం వైఎస్సార్సీపీ ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. – విజయసాయిరెడ్డి, ఎంపీ ఇది ప్రారంభం మాత్రమే తిరుపతి వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మేగా జాబ్‌మేళా రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు వరం. సామాజిక బాధ్యత, నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు పార్టీ ఆధ్వర్యంలో ఇంతపెద్ద మెగాజాబ్ మేళా నిర్వహించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమం. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా పార్టీ లక్ష్యం. – గురుమూర్తి, ఎంపీ తిరుపతి -
ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది..
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాబ్ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందన్నారు. జాబ్ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జాబ్‌మేళాకు 1.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రేపు 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులందరికీ అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. టీడీపీ కుల పార్టీ అని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్‌మేళా వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలి విడతలో 15 వేల ఉద్యోగాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కనీసంగా 15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈనెల 16, 17న తిరుపతి.. 23, 24 తేదీలలో విశాఖపట్నం.. 30 మే 1 న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు చదివిన వారు అప్లై చేసుకోవచ్చన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు: కన్నబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. 1.22 లక్షల మందికి సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 2.59 లక్షల మంది వాలంటీర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు. -
జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..
అనంతపురం అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ– వైఎస్సార్ క్రాంతి పథకం పీడీ ఐ.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 11వ తేదీ ఉదయం10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ధన్వి లోన్స్, సర్వీసెస్, వికాస్ ప్లేస్మెంట్ (కియా అనుబంధ సంస్థ), సిల్వర్ పార్క్ తదితర కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. వివరాలకు 8985091256 నంబర్లో సంప్రదించాలన్నారు. చదవండి: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అర్హత... వేతనం ►ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ : సేల్స్ ఆఫీసర్, డెవలప్మెంట్ మేనేజర్, ఏదైనా డిగ్రీ, మార్కెటింగ్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి (స్త్రీ, పురుషులు), వయసు 25 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. ►ధన్వి లోన్స్, సర్వీసెస్: కలెక్షన్ ఆఫీసర్, ఇంటర్ (పురుషులు), వయసు 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం రూ.16 వేల నుంచి రూ.17,200 వరకు ఉంటుంది. రవాణా భత్యం ఇస్తారు. జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. ►వికాస్ ప్లేస్మెంట్ (కియా అనుబంధ సంస్థ): మెషిన్ ఆపరేటర్, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ (పురుషులు), వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. వేతనం రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది. ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. పెనుకొండ వద్ద ఉన్న సంస్థలో పనిచేయాలి. ►సిల్వర్ పార్క్ (రేమాండ్): టైలర్, క్వాలిటీ ప్యాకింగ్, కటింగ్. పదో తరగతి ఆపై చదివిన స్త్రీలు అర్హులు. వయసు 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.13,340, ఉచిత వసతి, రాయితీతో కూడిన భోజన వసతి కల్పిస్తారు. బెంగుళూరులో పనిచేయాల్సి ఉంటుంది. -
ఎన్నికల్లో ఇతర పార్టీలు అసలు రేస్ లోనే లేవు
-
35 కంపెనీలు.. 3 వేల పోస్టులు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నగర మహిళల భద్రతకే కాదు.. వారి ఆర్థిక పురోభివృద్ధికి షీటీమ్ పాటుపడుతోంది. షీ టీమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆవరణలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నగరమహిళల కోసమే ఏర్పాటు చేసిన జాబ్‌కనెక్ట్ కార్యక్రమమే అందుకు తాజా ఉదాహరణ. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేలమంది నగర మహిళలు పాల్గొనగా 35 కంపెనీలలో మూడు వేలమంది నిరుద్యోగ మహిళలు ఉద్యోగాలు దక్కించుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్లు, రిక్రూటర్లు పాల్గొని ఇంటర్వ్యూ లు నిర్వహించారు. సుమారు 3 వేల ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలలో పలువురు ఆఫర్ లెటర్లు అందుకు న్నారు. పోలీసులు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఎంఐఎస్) సంయుక్తంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నానికి నగర మహిళల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ జాయింట్ సీపీ రమేశ్, అదనపు సీపీ షికాగోయెల్, షీటీమ్ అదనపు డీసీపీ శిరీష ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాబ్‌కనెక్ట్ ద్వారా ఉద్యోగులు పొందిన నిరుద్యోగ యువతులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో ఉద్యోగాలు పొందడం ద్వారా నిరుద్యోగుల ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. చదవండి: టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు! ఆదర్శం నుంచి అధోగతికి! -
ఖాళీల వేట .. ఉపాధికి బాట
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నేపథ్యంలో పెరిగిన నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. లాక్డౌన్, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో వివిధ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదించాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ రాకతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆర్థిక పురోగతిపై ధీమా పెరుగుతుండటంతో కంపెనీలు తిరిగి ఉద్యోగ నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాల సమన్వయంతో ఉపాధి అవకాశాల కల్పనకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా వివిధ సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు లేఖలు రాస్తోంది. ఆయా కంపెనీల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఉద్యోగులను అందించే లక్ష్యంతో అగుడులు వేస్తోంది. ఎక్కడివారికి అక్కడే ఏ ప్రాంతంలోని వారికి అక్కడే అవకాశాలు కల్పించేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ రూపొందింస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. జిల్లా పరిధిలో ఉన్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలతో సమావేశమై ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని సేకరించి... ఆ మేరకు జాబ్ మేళాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. తొలుత జిల్లా పరిధి ప్రాతిపదికన, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ జాబ్ మేళా లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. చిరుద్యోగం మొదలు.. కార్మిక శాఖ జాబితాలో ఉన్న కంపెనీలతో పాటు ఇతర చిన్న కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో చిరు ఉద్యోగం నుంచి సూపర్వైజర్ స్థాయి వరకు జాబ్‌మేళాల ద్వారా భర్తీ చేసే అవకా>శం ఉంది. ఈనెలాఖరులోగా వివిధ కంపెనీలను సంప్ర దించి ఖాళీలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీల వారీగా ఉద్యోగ విభజన చేపట్టి కంపెనీ అవసరాలకు అనుగుణం గా అర్హతలను నిర్దేశించి ప్రకటనలు జారీ చేయడం, రెండు, మూడు విడతల్లో జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధి, శిక్షణ విభాగం సంచాలకులు కేవై నాయక్ సాక్షికి తెలిపారు. -
వారి జీవితాల్లో నిజమైన పరివర్తన
‘‘నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. కృష్ణాజిల్లా ఎస్పీ సారు నిర్వహించిన జాబ్ మేళాలో నాకు కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.10 వేలు ఇస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది’’ అంటోంది శ్రావణి. కృష్ణాజిల్లా పోలీసులేమిటి, జాబ్‌మేళా నిర్వహించడం ఏమిటీ అని అనుమానం వస్తోంది కదా... అదేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా ఆ జిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో ఏం జరుగుతోందో, అటువంటి వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందో తెలుసుకుందాం. కృష్ణాజిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా తయారీనే జీవనోపాధిగా చేసుకుని దశాబ్దాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దొరికిన ప్రతిసారి కటకటాల పాలవడం... బయటకు రాగానే మళ్లీ సారా తయారీ చేయడం.. అమ్ముకోవడం వారికి కులవృత్తిగా మారిపోయింది. దీంతో ఆ గ్రామాల నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు చివరకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాని వివక్షకు గురయ్యారు. ఇలా దశాబ్దాలుగా ఇలాంటి వారు పడిన వెతలకు చెక్ పెడుతూ వారి జీవితాల్లో ‘నవోదయం’ తెచ్చేందుకు ప్రభుత్వం ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మిగిలిన జిల్లాలకు భిన్నంగా కృష్ణాజిల్లా పోలీసులను ఆలోచింపజేసేలా చేసింది. అరెస్టులు, కేసుల కంటె వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమార్గంగా తలచి ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో మార్పునకు బీజం వేశారు. సైనికుల్లా పనిచేసిన ఆ పోలీసుల కథేమిటో.. వారి కృషివల్ల వీరి జీవితాల్లో వచ్చిన ‘పరివర్తన’ ఏమిటో చూద్దాం. వారిలో ‘పరివర్తన’కు బీజం పైన చెప్పుకున్నట్లుగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన శ్రావణి ఒక్కతే కాదు, ఆ పల్లెల్లో వందలాది నిరుద్యోగ యువత రేపటి భవిష్యత్ కోసం ఆశగా అడుగులు వేస్తోంది. చీకట్లను చీల్చుకుంటూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.‘సారా’ గ్రామాలుగా ముద్రపడిన ఆ పలెల్లో ‘పరివర్తన’ తెచ్చే దశగా ఏడాది క్రితం అడుగులు పడ్డాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది మొదలు రవీంద్రనాథ్‌బాబు తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని నిర్ణయించుకున్నారు. వారిలో పరివర్తనకు బీజం వేశారు. వారిచ్చిన భరోసాతో చాట్రాయి, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో నాలుగు దశాబ్దాలుగా సారానే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఏడు గ్రామాల్లోని 431 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సారాకు దూరంగా ఉంటామని ప్రతిన బూనారు. గిరిజనులకు భూములు.. యువతకు ఉద్యోగాలు సారాకు దూరంగా ఉంటామని ముందుకొచ్చిన 200 గిరిజనకుటుంబాలకు గిరిజన భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చదువులేని నిరుద్యోగులకు, పనులు చేయగలిగే మహిళలకు స్థానిక కంపెనీల్లో దినసరి వేతన కూలీలుగా అవకాశాలు కల్పించారు. ఇక కొద్దో గొప్పో చదువుకున్న నిరుద్యోగ యువత కోసం పీవీఎన్ఆర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు 12కు పైగా కార్పొరేట్ కంపెనీలను ఒక వేదికపైకి తీసుకొచ్చి మెగా జాబ్‌మేళాలు నిర్వహించారు. అలా సారా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువతలో దాదాపు 150 మందికి వారు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కలలో కూడా ఊహించని రీతిలో కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్లు చేతికి రావడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన పరివర్తనతో ఆ పల్లెల్లో వెలుగు పూలు పూస్తున్నాయి. – పంపాన వరప్రసాదరావు, ఫొటోలు: అజీజ్ జుజ్జవరపు సాక్షి, మచిలీపట్నం మా జీవితాల్లో వెలుగులు నింపారు.. మా తాతముత్తాల నుంచి గత్యంతరం లేక ఈ పని చేస్తున్నాం. మా అబ్బాయి ఏడుకొండలును డిగ్రీ వరకు చదివించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మా పని వల్ల వాడికి ఉద్యోగం రాలేదు. జిల్లా ఎస్పీ దొరగారు నిర్వహించిన జాబ్‌మేళాలో మా అబ్బాయికి చెక్ పోస్టులో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – మల్లవోలు శ్రీనివాసరావు, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం -
22న నిరుద్యోగులకు జాబ్‌మేళా
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కే.రవికుమార్ తెలిపారు. నగరపాలక సంస్థ నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని హరిహర కళాభవన్ ఆడిటోరియంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగి 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చుని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఇంర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో ఉచితంగా శిక్షణలు ఇచ్చిన మీదట ఉద్యోగ అవకాశాలు చూపించనున్నట్టు చెప్పారు. కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు, యానిమేటర్లు, సాఫ్ట్‌వేర్‌డెవలపర్లు, డొమెస్టిక్వాయిస్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఎలక్ట్రీషిన్ తదితర కోర్సుల్లో శిక్షణలు ఇవ్వనున్నట్టు డీసీ చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 22న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హరిహరకళాభవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీ కోరారు. మరిన్ని వివరాలకు 9705092502, 9010650188. -
యువత స్థిర పడేవరకు వదిలిపెట్టం
సాక్షి, సిద్దిపేట: ‘కసి, తపన, లక్ష్యం నిరుద్యోగ యువతలో తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబ్‌మేళా ప్రారంభం మాత్రమే.. నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశం కల్పించి జీవితంలో స్థిరపడే వరకు వదిలిపెట్టం. జాబ్‌మేళాలో ప్రతిభను చూపి ఉద్యోగాన్ని సాధించుకున్న వారు ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు. జాబ్‌మేళాలో ఉద్యోగం రానివారి భవిష్యత్‌కు ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతాం. మీరు చేయాల్సిందల్లా మా ప్రతీ సందేశానికి స్పందిస్తే చాలు’ అంటూ ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేశారు. సోమవారం సిద్దిపేటలోని కొండ మల్లయ్య ఫంక్షన్ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మెగాజాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతీయువకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందన్నారు. ఆ దిశగా ఉద్యోగం విషయంలో కూడా యువతీయువకులు సీరియస్‌గా ముందుకు సాగాలన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, తపన, లక్ష్యం ఉండాలని ఉద్యోగం చిన్నదా, పెద్దదా , ప్రభుత్వమా, ప్రైవేట్‌దా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉండాలన్నారు. కొంత కాలం కష్టపడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుకుని ఇంటికే పరిమితమై ఉంటే ఉద్యోగాలు రావని, తల్లిదండ్రులకు భారం కాకుడదన్నారు. సమాజాన్ని తెలుసుకునేందుకు ఒక అడుగు బయటపెట్టి బాహ్యప్రపంచాన్ని చూస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారికంటే ప్లంబర్ మేస్త్రీలకు ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ప్రపంచం మారిందని, మనం మారుదామని ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే ఉద్యోగం కాదన్నారు. ప్రైవేటు రంగంలో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించడంతో పాటు ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి ఒకే వేతనం స్థిరీకరణ చెంది ఉంటుందని, ప్రైవేటు ఉద్యోగికి ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగిలో ప్రతిభ శక్తి సామర్థ్యాలు ఉంటే సొంతంగా కంపెనీ యజమాని కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని అదే తరహాలో ఉద్యోగాన్ని సాధించడం కోసం కూడా జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొందరి సక్సెస్ స్టోరీలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ జాబ్‌మేళాలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, జిల్లా మెప్మా పీడీ శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు గ్యాదరి రవి, సాకిఆనంద్, నర్సయ్య, మోయిజ్, దీప్తినాగరాజు, లక్ష్మీసత్యనారాయణ, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాల సాయిరాం. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
దారి దీపం!
నాంపల్లి: ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఆ పూట మాత్రమే వారి కడుపు నిండుతుంది. కానీ ఆ కుటుంబంలో ఏ ఒకరికైనా ఉద్యోగ వస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుంది. ఆ పనే చేస్తోంది ట్రేడ్ హైదరాబాద్.కాం నిరుద్యోగుల ఉపాధి కల్పించి వారి జీవితాలకు దారి దీపమై నిలుస్తోందీ సంస్థ. ఇప్పటి దాకా సుమారు 159 జాబ్ మేళాలతో 19 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. వారిలో 7,200 మంది ఆయా ఉద్యోగాల్లో చేరి మెరుగైన జీవితాన్ని, గౌరవాన్ని పొందుతున్నారు. ఇంత భారీగా నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తున్న ట్రేడ్ హైదరాబాద్.కాం ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. దరఖాస్తులకయ్యే ఖర్చు కూడా లేకుండా నిర్వహించడం విశేషం. ట్రేడ్ హైదరాబాద్.కాం తన మాతృసంస్థ కుశ్మాన్వి వెబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా మెగా ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ వెంకట్ బులెమోని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకూ సేవల విస్తరణ ట్రేడ్ హైదరాబాద్.కాం నిర్వహించే మెగా ఉద్యోగ మేళాలలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 385 కంపెనీలు ట్రేడ్ హైదరాబాదు.కాం జాబ్ మేళాలలో పాల్గొన్నాయి. ఉద్యోగ మేళాలు పట్టణ స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యాయి. హైదరాబాద్, వరంగల్లు, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, వనపర్తి, నారాయణపేట, ఖమ్మం, కోదాడ, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, జనగాం, వికారాబాద్, షాద్‌నగర్, మేడ్చల్, మంచిర్యాల, కల్వకుర్తి, జడ్చర్ల, కొత్తపేట సహా పలు గ్రామాల్లోనూ గ్రామ పంచాయతీ సహకారంతో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోంది. ఏపీలోని విజయవాడ, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, కాకినాడ, చీపురుపల్లి, ప్రకాశం, ఒంగోలు, విజయనగరం,శ్రీకాకుళం, తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, కర్నూలు, చీరాలతో పాటు పలు మండల, గ్రామాల స్థాయిలో ట్రేడ్ హైదరాబాద్.కాం ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోంది. ఆత్మ సంతృప్తినిస్తోంది నిరుద్యోగులకు ఉద్యోగ మేళాలు కల్పవృక్షాల వంటివి. ఉద్యోగాల కోసం యువత వెతుక్కోకుండా ఉండేందుకు మేళాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల అర్హతలు కలిగిన వారిని ఉద్యోగస్తులను చేస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పించడం మాకెంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తోంది. త్వరలో నిరుద్యోగులకు ఉచిత శాశ్వత జాబ్ కన్సల్టెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. కెరీర్ మంత్ర పేరుతో ప్రారంభించే ఈ కన్సల్టెన్సీ ఎంతో ఉపయోగపడుతుంది. – వెంకట్ బులెమోని,ట్రేడ్ హైదరాబాద్.కాం సీఈఓ పాతబస్తీ వాసులకు665 ఉద్యోగాలు.. ట్రేడ్ హైదరాబాద్.కాం సంస్థ సహకారంతో తాము పాతబస్తీలోని కార్వాన్లో గత ఏప్రిల్ మాసంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించాం. మొత్తం 45 కంపెనీలు పాల్గొన్నాయి. 665 మందికి ఉద్యోగాలు లభించాయి. నిరక్షరాస్యతను దృష్టిలో ఉంచుకుని 7వ తరగతి చదివిన అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించాయి. – పెద్దిగారి సంతోషి,స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
మళ్లీ జాబ్‌మేళాలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ భారీ ఎత్తున ‘జాబ్‌మేళా’ నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులకు నడుంబిగించారు. అయితే ఈ మేళాలకు నిరుద్యోగుల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే.. గడచిన రెండేళ్లలో ఎంతో అట్టహాస ఆర్భాటాలతో జాబ్‌మేళాలు నిర్వహించాం, పెద్ద ఎత్తున స్పందన లభించిందని బల్దియా చెబుతున్నా మేళాలో ఎంపికైన వారు మాత్రం ఉద్యోగాల్లో చేరడంలో ఆసక్తి చూపలేదు. తరువాత చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. మొక్కుబడిగా నిర్వహణ జీహెచ్ఎంసీ అధికారులు మొక్కుబడి తంతుగా జోన్ల వారీగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక మహిళాసంఘాలు, మీడియా తదితర మార్గాల ద్వారా భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ఉద్యోగాలనగానే యువత భారీయెత్తున హాజరైనప్పటికీ, ఉద్యోగాల్లో చేరకుండా వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం అన్నీ ప్రైవే టు కంపెనీలవి కావడం.. ఎంతకాలముంటాయో తెలియకపోవడం.. తాము ఆశించే పని ఉండకపోవడం.. ఆకర్షణీయమైన వేతనం కూడా లేకపోవడం తదితర కారణాలున్నాయి.మరికొందరు మాత్రం దూరాభారం వల్ల వాటిల్లో చేరడం లేదు.అయితే జీహెచ్ఎంసీ మాత్రం ఎందుకు, ఏమిటి అనేవి ఆలోచించడం లేదు. నిరాసక్తత జాబ్‌మేళాల ద్వారా ఏటా కనీసం మూడువేలమందికి ఉపాధి కల్పించాలనేది జీహెచ్ఎంసీ లక్ష్యం. జాబ్‌మేళాలకు 2016–17లో భారీయెత్తున (23,328 మంది)హాజరైనప్పటికీ, వారిలో 5,039 మంది మాత్రం వివిధ ఉద్యోగాలకు ఎంపి కయ్యారు. అందులోనూ కేవలం 646 మంది మా త్రమే ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత ఎంత కాలం వారు పనిచేశారన్నది మాత్రం తెలియదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన జాబ్‌మేళాకు కేవలం 6,241 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో 2,483 మంది ఎంపిక కాగా, 670 మంది మాత్రం ఆయా ఉద్యోగాల్లో చేరారు. ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నా.. 2016–17లో మొత్తం 89 సంస్థలు జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇంటర్వ్యూలు నిర్వహించిన వాటిల్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెరిటేజ్ ఫుడ్స్, ఇన్నోవ్ సోర్స్, శుభగృహ ఇన్ఫ్రా, టీబీఎస్ఎస్, ఐక్యాగ్లోబల్, కార్పొన్ ఔట్సోర్సింగ్, జీ4ఎస్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్‌కార్ట్, యురేకా ఫోర్బ్స్, వాల్‌మార్ట్, టీమ్‌లీజ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, కార్వి, వీటీఐ, జస్ట్‌డయల్, టీమ్‌లీజ్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్నెట్, టాటా ఏఐఏ, డొమినో పిజ్జా మెర్లిన్ సొల్యూషన్స్వంటివి ఉన్నాయి. 2017–18లో 67 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీస్, లాట్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీక్లబ్, అక్వాఫిట్, బిగ్ మొబైల్స్, స్విగ్గీ, పవన్మోటార్స్, కాఫీడే, టెక్‌మహీంద్ర, వరుణ్ మోటార్స్, బిగ్‌బాస్కెట్, వొడాఫోన్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్ట్ ఫైబర్, హెటరో ల్యాబ్స్ లిమిటెడ్ తదితరమైనవి ఉన్నాయి. పేరెన్నికగన్న ప్రముఖ సంస్థలున్నప్పటికీ, వారికి అర్హమైన వారు లేకపోవడం.. అర్హత పొందినవారికి ఆశించిన వేతనాలు లేకపోవడంతో చాలాకొద్దిమంది మాత్రమే జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాల్లో చేరారు. ఈ నెల 25 నుంచి వచ్చేనెల 12 వరకు.. ఈనెల 25వ తేదీ నుంచి జూన్ 12 వరకు ఆయా తేదీల్లో, ఆయా జోన్లలో జాబ్‌మేళాలు నిర్వహించనున్నారు. ఏ జోన్లో ఏరోజు జాబ్‌మేళా జరిగేది వివరాలిలా ఉన్నాయి. జోన్ జాబ్‌మేళా తేదీ ఎల్బీనగర్ జోన్ 25.05. 2018 సికింద్రాబాద్ జోన్ 28.05.2018 కూకట్పల్లి జోన్ 30.05.2018 ఖైరతాబాద్ జోన్ 04.06.2018 శేరిలింగంపల్లి జోన్ 08.06.2018 చార్మినార్ జోన్ 12.06.2018 -
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
జమ్మికుంటరూరల్(హుజూరాబాద్): యువత సంక్షేమం కోసం ప్రభుత్వం జాబ్‌మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపుతోందని, మేళాల్లో లభించే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని డీఆర్డీవో వెంకటేశ్వర్రావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(టీ సెర్ప్) ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత పలు రకాల శిక్షణలు పొంది వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు భారం కావద్దని, ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. హెటోరో డ్రగ్స్, జీ4ఎస్, అపోలో ఫార్మసీ, ఇంటలెనెట్ గ్లోబల్ సర్వీస్, రిలయన్స్ ఫౌండేషన్, సుభగృహ ప్రాజెక్టు, బిగ్ బాస్కెట్, వరుణ్ మోటార్స్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్టు, టాటా సర్వీస్ ప్రైవేటు సంస్థలకు ఇంటర్వ్యూ లు నిర్వహించారు. జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట మండలాల నుంచి 550 మంది యువతీయువకులు హాజరయ్యారు. 240 మంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం, 250 మంది వివిధ రంగాల్లో శిక్షణకు ఎంపికయ్యారు. ఎంపీపీ గంగారపు లత, నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, ఆర్థిక మంత్రి ఓఎస్డీ ప్రసాద్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ నిర్మల, ఎంపీడీవో రమేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు లింగారావు, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, ఏపీఎంలు రమాదేవి, శ్రీనివాస్, తిరుపతి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగం కోసం పోటెత్తిన నిరుద్యోగులు
చిత్రంలో కనిపిస్తున్నవారిని చూశారా.. వీరంతా ఉద్యోగం కోసం ఆశగా వచ్చిన వేలాదిమంది నిరుద్యోగులు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉద్యోగ నోటిఫికేషన్లు మాయమయ్యాయి. రాజకీయ వివక్షతో చిరుద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. బతుకుకోసం డిగ్రీ పట్టాలు చేతపట్టి వీధిన పడ్డారు. డెంకాడ మండలం చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన జాబ్ మేళాకు కోటిఆశలతో హాజరయ్యారు. ఇక్కడ వేలల్లో ఉన్న నిరుద్యోగులను చూసి.. బిత్తర పోయారు. అయ్యో.. రాష్ట్రంలో నిరుద్యోగం ఇంత దారుణంగా ఉందా అంటూ నిరాశచెందారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని.. బాబు పోతే తప్ప ఈ దుస్థితి మారేలా లేదంటూ కొందరు విమర్శించారు. డెంకాడ: చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్డీఎ, వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువ త పోటెత్తింది. పేర్లు న మోదుకు గంటల తరబడి వేచి ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 34 కం పెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు విచ్చేసి నిరుద్యోగ యువతీయువకులకు పరీక్షలు నిర్వహిం చారు. అందులో ప్రతిభ చూపిన వారికి ఇంట ర్వ్యూ చేశారు. ముందుగా ఆయా కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు... జీతభత్యాలు.. షరతులు తదితర వివరాలను తెలియజేశా రు. అయితే... రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్‌మేళాకు పదివేల మంది హోజరుకాగా.. రెండోరోజు ఆది వారం నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు ఆరువేల మంది రావడంతో కళాశాల మైదానం కిక్కిరిసింది. మూడేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం... వేలాది మంది విద్యార్థులు ఏటా డిగ్రీలు, ఇంజినీరింగ్ పట్టాలతో రిలీవ్కావడంతో జాబ్ మేళాకు పోటెత్తారు. అక్కడి నిరుద్యోగ లోకాన్ని చూసి కొంద రు బిక్కయిపోయారు. పరీక్ష రాయకుండానే ఇంటిముఖం పట్టారు. మరికొందరు గంటల తరబడి నిరీక్షిం చి ప్రతిభకు పదును పెట్టారు. ఏటా ఉద్యోగాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని... నేతల ప్రకటనలకు.. ఆచరణకు ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత’ తేడా ఉందంటూ నిట్టూర్చా రు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని... ఇప్పుడు బాబుకు చెక్చెబితే తప్ప జాబు వచ్చే అవకాశం కనిపించడంలేదంటూ బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వ కొలు వులు లేకపోవడంతో కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు వేలాది మంది తరలివస్తున్నారంటూ విద్యార్థులకు తోడుగా వచ్చి న తల్లిదండ్రులు పేర్కొన్నారు. పల్లెల్లో ఉంటే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని.. ఉద్యోగాలు చూసుకోమని చెబితే మీరే చూపిం చండంటూ సమాధానం చెబుతున్నారన్నారు. ఉద్యోగ కల్పనకు చర్యలు నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. జాబ్‌మేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల్లో పదివేల మంది యువతీ యువకులు హాజరుకాగా, 2 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పతివాడ, గీతలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కోపం.. నిరుద్యోగులకు శాపం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం జరగాల్సిన ఉద్యోగ మేళా రద్దు అయిందన్న సమాచారం తెలియక వచ్చిన వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కారణంగా మేళా రద్దు చేయడమేంటని ఐదు జిల్లాల నుంచి వచ్చిన యువతీయువకులు మండిపడ్డారు. ఎంతో వ్యయప్రయాసలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. 30 కంపెనీలకు సంబంధించి 2500 ఉద్యోగాల కల్పన కోసం కౌశల్ గోదావరి– వికాస్ సంస్థ ప్రతినిధుల సహకారంతో నన్నయ యూనివర్సిటీలో ఉద్యోగ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 10 వేల మంది నిరుద్యోగులకు సమాచారం పంపించారు. దీంతో వారంతా గురువారం సాయంత్రమే యూనివర్సిటీకి వచ్చేందుకు బయలుదేరారు. అయితే, ఈలోపే ఉద్యోగ మేళా ఆహ్వాన పత్రిక, బ్రోచర్, ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తన ఫొటో వేయకపోవడమేంటని, తనకు తెలియకుండా నిర్వహించడమేంటని నిర్వాహకులపై ఎమ్మెల్యే పెందుర్తి సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో ఉద్యోగ మేళాను రద్దు చేశారు. అయితే, ఈ విషయం తెలియని వారంతా శుక్రవారం నన్నయ యూనివర్సిటీకి వచ్చారు. మేళా రద్దు అయిందని కాకినాడలో జరుగుతుందని పెట్టిన బోర్డును చూసి షాక్ అయ్యారు. దీంతో కాకినాడ వెళ్లారు. అయితే, అక్కడ కేవలం ఆరు కంపెనీలకు చెందిన ఉద్యోగాలకే ఎంపిక చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నగిరిలో ఉగ్యోగ మేళాకు విశేష స్పందన
-
జాబ్‌మేళా.. జనమేళా
♦ రైల్వే జాబ్‌మేళాకు వివిధ ప్రాంతాల నుంచి 25 వేల మంది హాజరు ♦ ప్రారంభించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ హైదరాబాద్: రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ మేళాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. వివిధ కంపెనీల్లోని 10 వేల ఉద్యో గాల కోసం నిర్వహించిన ఈ మేళాకు 21 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా... 25 వేల మంది హాజరయ్యారు. దీంతో ప్రాంగణం కిటకిట లాడింది. పరిసర ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణమధ్య రైల్వే 6వ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయ వాడ, గుంతకల్లు, నాందేడ్ సర్కిళ్ల రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు ఐదువేల మందికి నియామక ఉత్తర్వులిచ్చాయి. మిగిలిన ఐదువేల మందికి వారం తరువాత ఉత్తర్వులిచ్చి, శిక్షణ కార్య క్రమాలు చేపడతామన్నాయి. అయితే ఇందులో పాల్గొన్న 109 కంపెనీల్లో చాలావరకు టెలీకాలర్, సేల్స్, డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలే ప్రకటించడంతో ఎంతో ఆశతో వచ్చిన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు. 100 కెరీర్ గైడెన్స్ కేంద్రాలు: దత్తాత్రేయ దేశoలో 60 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ వివిధ పథ కాలు తెస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవా లని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బ్రెజిల్ తదితర దేశాలతో ఉద్యోగ నియామకాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశ వ్యాప్తంగా 100 జాతీయ కెరీర్ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ కేంద్రం ప్రారంభించామని, త్వరలో వరంగల్, కరీంన గర్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, చిత్తూరు, వైజాగ్‌లలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందులో ఉద్యోగాలు రాని వారి కోసం ఆగస్టు మొదటి వారంలో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు. -
రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం జాబ్ మేళా
-
అమ్రపాలి వివాదాస్పద వ్యాఖ్యలు
-
అమ్రపాలి వివాదాస్పద వ్యాఖ్యలు
జాబ్ మేళా సందర్భంగా నిరుద్యోగులకు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి చేసిన సూచన వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని ములుగు వద్ద బుధవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన అమ్రపాలి.. ఉద్యోగం రావాలంటే కొన్ని అబద్దాలు ఆడాల్సివుంటుందని అయితే వాటిని సర్వీసులోకి వచ్చిన తర్వాత నిజం చేయాలని ఉద్యోగార్థులకు సూచించారు. అమ్రపాలి వ్యాఖ్యలతో జాబ్ మేళాకు హాజరైన మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలు కంగుతిన్నారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వూల్లో అబద్దాలు ఆడితే వెంటనే దొరికిపోతారని అన్నారు. తెలివైన వారు ఎంపిక బోర్డులో ఉంటే వచ్చే ఉద్యోగం కూడా చేజార్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ సర్కార్ ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలాడి ఉద్యోగం తెచ్చుకోవాల్సి అవసరం ఉండదన్నారు. అయితే కలెక్టర్ స్థాయి ఉద్యోగి అబద్ధాలాడమని చెప్పడం సంచలనంగా మారింది. -
నేడే మెగా జాబ్ మేళా
►3వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ►డీఆర్డీఏ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహణ ►ప్రారంభించనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, పెద్దపల్లి: జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. మూడువేల మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పెద్దపల్లి మండలం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో ఉదయం 9గంటలకు మొదలుకానుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ జాబ్‌మేళాను ప్రారంభించనున్నారు. జిల్లాలో ఎస్సెస్సీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి ఉద్యోగాల్లేని నిరుద్యోగ యువతీయువకులు వేలాదిమంది ఉన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తోంది. ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు చదివిన యువతీయువకులు పాల్గొనవచ్చు. మొత్తం 3వేల పోస్టులు ఉన్నాయి. రూ.7వేలనుంచి రూ.30వేల వరకు అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి వేతనాలను చెల్లిస్తారు. ఉద్యోగావకాశాలు ఉన్న రంగాలు ఇవే.. 18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు జాబ్‌మేళాలో పాల్గొనాలి. ఐటీఈఎస్, రిటైల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, టెలీకాం, సెక్యూరిటీ కంపెనీల్లోనూ ఉద్యోగాలున్నాయి. ఇవేకాక సేల్స్ ప్రమోటర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, డొమెస్టిక్ వాయిస్ సపోర్ట్, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, కాంట్రాక్ట్ కాజువల్స్, అసోసియేట్స్, డెంటర్స్, పేంటర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.7వేల నుంచి రూ.30వేలవరకు వేతనాలు ఉన్నాయి. ఆసక్తి గల వారు బయోడేటా, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హతల జిరాక్సు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది. -
ఉచిత జాబ్ మేళా విజయవంతం
టెరాబైట్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, tradehide.comల ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలో ఆ సంస్ధ కార్యాలయంలో ఉచిత జాబ్ మేళా జరిగింది. ఈ మేళాకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్లు అధిక సంఖ్యలో నమోదయ్యాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నితిషా మాధవరం తెలిపారు. జాబ్ మేళాను శనివారం రాచకొండ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇలాంటి మేళాల వలన నిరుద్యోగులకు చాలా మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి సంస్థల వలన నిరుద్యోగం అనే మాట లేకుండా చేయవచ్చన్నారు. కొందరు జాబ్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతుంటారని ఈ సంస్థ అలా కాకుండా నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు నడుంబిగించడం శుభ పరిణామన్నారు. జాబ్‌మేళా పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సంస్థ ఎండీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సంస్థను ప్రారంభించామని విద్యార్థులకు శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగం ఇప్పించాలన్నదే వారి లక్ష్యమని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలెపర్గా 10 సంవత్సరాలు పని చేసినట్లు చెప్పారు. మన దేశానికి ఏదైనా చేయాలన్నఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. మొదటగా ఉచితంగా ఈ మేళాను నిర్వహించామని చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలో పీజీడీసీఏ, జావా, మైక్రోసాఫ్ట్ నెట్, ట్యాలీ తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఫీజు లేకుండా ఉచితంగా శిక్షణ ఇప్పించి ఉద్యోగం ఇప్పిస్తామని వెల్లడించారు. బ్యాంక్‌కు సంబంధించిన ఎగ్జామ్స్‌పై కూడా శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. -
8న జాబ్ మేళా
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో చదివి 2014లోపు పాస్ అయిన విద్యార్థు«లకు ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా వృత్తి విద్యాధికారి టి.వి సుబ్రమణ్యేశ్వరరావు సోమవానం ప్రకటనలో తెలిపారు. స్థానిక బిక్యాంపులోని ఒకేషనల్ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్ మేళాను ఒకేషనల్ కోర్సులు చేసిన నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
31న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 31న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ.కళ్యాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన అపోలో హోం హెల్త్ కేర్ లిమిటెడ్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, అనంతపురం వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ రెప్రజెంటేటివ్స్ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులన్నారు. వయస్సు 18–32 ఏళ్లలోపు ఉండాలని, మొత్తం ఖాళీలు 50 ఉంటాయన్నారు.నెలకు రూ.15 వేలు వేతనంతో బెంగళూరులోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. సేల్స్ రెప్రజెంటేటివ్ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అర్హులని, వయసు 19–30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఎంప్లాయింట్ కార్యాలయానికి రావాలన్నారు. -
200 ఉద్యోగాల భర్తీని నేడు జాబ్‌మేళా
వరంగల్ : దివ్య శ్రీ రియలటర్స్ (ప్రైయివేట్)లిమిటెడ్ సంస్దలో 200 ఉద్యోగాల భర్తీ కి ఈనెల 22 వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు వరంగల్ రూరల్ జిల్లా ఉపాధి అధికారి వి.నిరూపమ తెలిపారు. వరంగల్ ములుగు రోడ్ లోని ప్రభుత్వ ఐ.టి.ఐ. ఆవరణ లోని వరంగల్ రూరల్ జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఈ జాబ్‌మేళా జరగనుంది. సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌లు,టీం లీడర్ ఉద్యోగాలకు 200 మంది అభ్యర్దులు కావాలని ఆమె సూచించారు. అభ్యర్దులు 10 వతరగతి ఉత్తీర్ణులై,18–25 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష అభ్యర్దులు అర్హులని ఆమె తెలిపారు. జీతం 10,000 రుపాయలతో పాటు,వసతి తో కలిపి చెల్లిస్తారని వి.నిరూపమ సూచించారు. అభ్యర్దులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఎంపికైన అభ్యర్దులకు వససతి కల్పనతో పాటు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారని ఆమె సూచించారు.ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్దులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ,బయోడేటా తో ఈ నెల 22 వతేది ఉదయం 10.30గంటలకు నిర్వహించే జాబ్‌మేళా కు హజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి వి.నిరూపమ కోరారు. మిగతా వివరాలకు 0870–2427146 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని ఆమె సూచించారు. -
జాబ్ మేళా పేరుతో మోసం..ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: జాబ్‌మేళాలో పాల్గొని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చనే ఆకర్షణీయ ప్రకటనతో జనాన్ని మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నాచారంనకు చెందిన మునిగేటి నెమిలి కుమార్, మౌలాలిలోని జవహర్‌నగర్‌కు చెందిన లింగాల సుమిత్ అనే వారు నిరుద్యోగులు. సులువుగా డబ్బు సంపాదించటానికి వారిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. దీని ప్రకారం.. తాము నిర్వహించే జాబ్‌మేళా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని, దీనికి హాజరై ఉద్యోగాలు పొందాలని ఇటీవల వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రకటనతో ఆశపడిన వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 26వ తేదీన ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూలులో నిర్వహించిన మేళాకు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం అంటూ ఒక్కొక్కరి నుంచి రూ. 200 చొప్పున మొత్తం రూ.1,11,600 వసూలు చేశారు. అంతేకాకుండా అధికారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ మేళాకు ప్రకటనలో పేర్కొన్న విధంగా ప్రముఖ కంపెనీలేవీ కూడా రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన అభ్యర్థులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఎఫ్(అద్వైత సేవా ఫౌండేషన్)పేరుతో వీరు స్వచ్ఛంద సేవా సంస్థను కూడా నడుపుతున్నట్లు విచారణలో తేలింది. -
ఉప్పల్‌లో ఉద్రిక్తత
-
ఉప్పల్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలో ఉద్యోగాల పేరిట మరో భారీ మోసం బయటపడింది. గేట్‌మై జాబ్స్ డాట్‌కామ్, అద్వేతియా శ్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ. 200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కళాశాలలో జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న నిరుద్యోగులకు ఇదంతా అబద్ధమని తేలడంతో.. వారంతా ఆగ్రహానికి గురై రోడ్డెక్కారు. దీంతో ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రేపు కర్నూలులో జాబ్ మేళా
కర్నూలు సిటీ: స్థానిక బిక్యాంపులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్, జేకేసీ సెంటర్ కో–ఆర్డినేటర్ డా.ఎం.శారదలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. డిగ్రీ విద్యార్హత (బీటెక్, ఎంబీఏ మినహా), 26 సంవత్సరాల వయస్సు ఉండి, ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ బయోడెటాతో పాటు, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని వారు పేర్కొన్నారు. -
టీడీపీ జాబ్‌మేళా..నిరుద్యోగుల గోల
జాబ్‌మేళా పేరుతో టీడీపీ నేతల ప్రచారం వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కలరింగ్ నిజమేనని నమ్మిన నిరుద్యోగులు కాల్‌లెటర్ తీసుకుని వెళితే అవి కంపెనీలే కావు అవుట్ సోర్సింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీలు మాత్రమే... పిల్లలతో వెళ్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు మోసపోయామని నేతలపై ఆగ్రహం ‘సాక్షి’ కార్యాలయానికి సాక్ష్యాలతో వచ్చిన బాధితులు సాక్షి, రాజమహేంద్రవరం : మెగా జాబ్ మేళా పేరుతో జిల్లా టీడీపీ నేతలు చేపట్టిన క్యాంపస్ ఇంటర్వూ్యల దగా బట్టబయలైంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిలువునా మోసం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతకు ఏదో మేలు చేస్తున్నట్లు, వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచార ఆర్భాటం చేపట్టారు. ఆ మేళాలకు ప్రఖ్యాత కంపెనీలు వస్తున్నట్లు బ్రోచర్లు విడుదల చేసి మీడియా సమావేశాలు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరుద్యోగులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పత్రాలు అందజేస్తున్నారు. అదంతా నిజమనుకొని ఎంతో సంతోషంతో కంపెనీలో చేరడానికి వెళ్లిన యువతీ యువకులకు, వారి వెంట వెళ్లిన తల్లిదండ్రులను టీడీపీ నేతలు నిర్వహించిన జాబ్ మేళాలు కంగుతినిపించాయి. ఉద్యోగం ఇచ్చామని చెప్పిన కంపెనీలు అక్కడ లేకపోగా, ఉన్న ఒకటి రెండు కంపెనీలు చిన్న గదిలో... ఒక కంప్యూటర్ పెట్టుకుని నడుస్తున్నాయి. ఆ తతంగమంతా చూసిన యువత, తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమైంది. ఎంతో కష్ట పడి చదివించిన తమ కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని ఆశపడిన ఆ తల్లిదండ్రులు తాము మోసపోయమన్న బాధతో ఊరుకాని ఊరులో కన్నీరు పెట్టుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రుల చేతుల మీదుగా పత్రాలు పొంది కంపెనీలో చేరడానికి వెళ్లిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించి తిరిగి నగరానికి చేరుకున్నారు. గురువారం ‘సాక్షి’ కార్యాలయం వద్దకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పండగ పూట పయనం... రాజమహేంద్రవరం నగరానికి చెందిన వి.బి.ఎ¯ŒS.తేజ గత ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ట్రస్ట్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 16,17న రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నాడు. ఉద్యోగం వచ్చిందని మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు ఆఫర్ లెటర్ ఇచ్చారు. అది తీసుకుని సంక్రాంతి కనుమ పండుగ రోజు హైదరాబాద్ వెళ్లాడు. 18న రిపోర్టింగ్ చేయాలని చెప్పడంతో 15వ తేదీ రద్దీ తక్కువగా ఉంటుందని తల్లిదండ్రులను ఒప్పించి మరీ వెళ్లాడు. 16 ఉదయం ఎంతో ఉత్సాహంతో కంపెనీకి వెళ్లాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయానికి వెళ్లిన తేజకు అసలు విషయం బోధపడింది. అది కంపెనీయే కాదని, అదొక కన్సల్టెన్సీ సంస్థ అని గుర్తించాడు. అయినా 18వ తేదీన వెళ్లాడు. ఇది రిపోర్టింగ్ తేదీ మాత్రమేనని చెప్పిన అక్కడివారు మరో రెండు వారాల్లో ఎçప్పుడు చేరేది మెయిల్ చేస్తామని పంపించేశారు. ఇదే విషయం కాకినాడ కలెక్టరేట్లో ఉన్న వికాస కార్యాలయం మేనేజర్‌కు ఫో¯ŒS చేసి చెప్పగా జాబ్ మేళా నిర్వíßంచడమే తమ పని అని మిగతా విషయాలు తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక తేజ బుధవారం తిరిగి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. -
17న కాకినాడలో జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : స్థానిక జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి కుసుమ శాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి వినూత్న ఫెర్టిలైజర్స్‌లో సేల్స్ అసిస్టెంట్స్‌గా పనిచేయడానికి పదవ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. పూర్తి వివరాలకు 0884–2373270కు సంప్రదించాలని ఆమె కోరారు. -
3న ఐటీఐలో జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : బెంగళూరులోని టాటా అడ్వాన్స్డ్ మెటీరియల్ సంస్థలో టెక్నీషియన్ల ఉద్యోగాల భర్తీకి స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో జనవరి 3న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.తులశి ఓ ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016లోపు ఐటీఐ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 1లోగా బయోడేటా, సర్టిఫికెట్లను ప్లేస్మెంట్ విభాగంలో అందజేసి జనవరి 3న ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు రావాలని సూచించారు. -
ఉపాధి కల్పనే ధ్యేయం
► మంత్రి గంటా శ్రీనివాసరావు ► ఏయూలో సందడిగా జాబ్‌మేళా ► నేడూ కొనసాగింపు ఏయూ క్యాంపస్/బీచ్‌రోడ్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏయూ స్నాతకోత్సవ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ‘డిజిటల్ సమ్మిట్ జాబ్ మేళా 2016’ను ఆయన ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి, ఏయూ, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్్స, మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సంయుక్తం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ వర్సిటీలో కాలానుగుణంగా జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. ఏయూ వీసీ జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తి చేసి కళాశాల నుంచి వెళ్లే సమయానికి విద్యార్థికి ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జాబ్ మేళాలో 20 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సీఈవో ప్రసాద్, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూష¯Œ్స సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేళా విజయవంతంపై హర్షం : జాబ్‌మేళాలో తొలిరోజు 1,250 మంది అభ్యర్థులు ఎంపిక కావడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రెండోరోజు సైతం ఇదే స్ఫూర్తితో మరింత మందికి ఉపాధిని కల్పించాలని సూచించారు. ఏయూ, మిలీనియం, మిరాకిల్ సంస్థలు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. 1250 మంది ఎంపిక : తొలిరోజు జరిగిన ప్రక్రియ లో 1, 250 మంది ఎంపికయ్యారు. వీరిలో మిరాకిల్ సంస్థలకు 282, యలమంచిలి సాఫ్ట్‌వేర్‌కు 50, ఐఐసీ టెక్కు 25, ఓపెన్ లాజిక్కు 125, ఏమ్జూర్కు 50, బల్క్హవర్కు 45, నోవల్ పేటెంట్‌కు 100, రోబో కంప్యూటెక్కు 100, మేట్రిక్స్ 50, జైన్ ఇన్ఫోటెక్‌కు 20 మంది, మిగతా సంస్థలకు మరికొంత మంది ఎంపికైనట్టు మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈవో జి.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హెచ్ఎస్బీసీ సంస్థ 700 మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలో ఎంపిక చేసిందని, వీరికి శనివారం మరికొన్ని నైపుణ్యాల్లో పరీక్షించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చా జాబ్‌మేళా కోసం ఎంతో ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి వచ్చా. అనుకున్నంత ఎక్కువ కంపెనీలు ఈ జాబ్‌మేళాల్లో పాల్గొనలేదు. ప్రతీ కంపెనీ వారు ఫోన్ చేసి చెబుతా మంటున్నారు. – ఎల్.హరీశ్, బీఎస్సీ, హైదరబాద్ మా కోర్సుకు ఉద్యోగాలు లేవట నేను బీఈ మెకానికల్ చేశాను. ఈ కోర్సుకు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీల్లో ఉద్యోగాలు లేవని చెబుతున్నారు. ప్రకటనలో అన్ని డిగ్రీ కోర్సుల వారికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. తీరా వస్తే ఇక్కడ పరిస్థితి వేరు. జాబ్‌మేళా వల్ల సమయం వృథా అయింది. – పద్మజ, బీఈ, మెకానికల్ ఖాళీలను ముందే తెలపాలి ఏ ఏ కంపెనీల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ముందే తెలపాలి. జాబ్‌మేళా అంటే మౌకిక పరీక్షలు నిర్వహించి ఉద్యోగం వచ్చిందో లేదో వెంటనే చెప్పాలి. నేను నాలుగు కంపెనీ ఉద్యోగాల కోసం వెళ్తే.. అందరూ నా దరఖాస్తులు తీసుకొని ఫోన్ చేస్తామన్నారు. ఈ జాబ్‌మేళాలో రూ. 8 వేల నుంచి రూ.15 వేల మధ్య వచ్చే ఉద్యోగాలే ఉన్నాయి. ఈ జీతంతో నెలమొత్తం ఎలా నెట్టుకురాగలం. – సంపత్, బీటెక్ ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు జాబ్‌మేళా వల్ల ప్రముఖ కంపెనీలన్నింటికీ ఒకే చోట దరఖాస్తు చేసుకోవచ్చు. నేను రెండు ఉద్యోగాల కోసం మౌకిక పరీక్షలకు హాజరయ్యాను. వారు ఫోన్ చేసి చెబుతామన్నారు. నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది. – మనీషా, బీఎస్సీ నిరాశలో నిరుద్యోగులు ఏయూలో జరిగిన జాబ్‌మేళాలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ప్రకటనలో తెలిపిన విధంగా మాత్రం ఇక్కడ పరిస్థితి లేకపోవడంతో ఆందోâýæన చెందారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని, ఫోన్ చేస్తామని చాలా సంస్థలు చెప్పడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కంపెనీలు సేల్స్‌మెన్ ఉద్యోగాలకు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
కొలువు ఆశతో వెల్లువలా..
ఎన్టీఆర్ ట్రస్ట్ జాబ్‌మేళాకు వేలాదిమంది నిరుద్యోగులు సౌకర్యాల లేమితో అవస్థలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో మొదలైన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. రెండురోజులు జరిగే మేళాకు ఉభయ గోదావరి సహా వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులైన వేలాదిమంది యువతీయువకులు ఎంతో ఆశతో తరలివచ్చి పేర్లను నమోదు చేయించుకున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అవస్థలు పడ్డారు. మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయప్ర«ధాన కార్యదర్శి నారా లోకేష్ తన ప్రసంగంలో ‘బాబు’ వస్తే జాబు ఇస్తామన్న మాటకు అర్థం ప్రభుత్వోద్యోగం కాదని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని అనడంతో నిరుద్యోగ యువత నిసృ్పహ చెందారు. రాజమహేం ద్రవరం రూ రల్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ జాబ్‌మేళాలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మేయర్ పంతం రజనీశేషసాయి, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జెడ్పీ ఛైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గొల్లపల్లి సూర్యారావు, జవహర్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, శశికిరణ్, కలెక్టర్ అరుణ్‌కుమార్, నన్న య వర్సిటీ వీసీ ఎం.ముత్యాలునాయుడు పాల్గొన్నారు. సొమ్మసిల్లిన ఉద్యోగార్థులు జాబ్‌మేళాకు సుమారు 25 వేలమంది నిరుద్యోగులు హాజరయ్యారు. సభ ప్రారంభమయ్యే వరకు నిరుద్యోగులను బారులు తీర్చి ఎండలో నిలబెట్టడంతో చాలా మంది సొమ్మసిల్లిపోయారు. సుమారు 75కి కంపెనీలు మేళాకు రాగా నిరుద్యోగులు రిజిస్ట్రేష¯ŒS చేసుకునేందుకు 30 వరకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులంతా గంటల తరబడి కౌంటర్ల ముందు నిలబడి ఎండవేడిలో మాడిపోయారు. తాగేందుకు సరైన మంచినీరు సౌకర్యం ఏర్పాటుచేయలేదు. రిజిస్ట్రేష¯ŒS చేసుకున్న వారికి ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాలల్లో ఇంటర్వూలు నిర్వహించారు. నిలబడలేక నీరసం వచ్చేసింది ఉద్యోగం మాట ఎలా ఉన్నా ముం దు క్యూలో నిలబడలేక నీరసం వచ్చేసింది. ఆయా విభాగాల వారీగా రిజిస్ట్రేషన్ల కౌం టర్లు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేష¯ŒSకు గంటల తరబడి మండే ఎండలో నిల్చున్నాను. –సంధ్య, ఎంబీఏ, కాకినాడ జాబ్ వస్తుందో లేదో తెలీదు ఉద్యోగమేళాలో ముందు పేరు రిజిస్ట్రేష¯ŒS చేసుకునేందుకు వచ్చా. జాబ్ వస్తుందో లేదో తెలీదు. ఇక్కడ ఏర్పాట్లు బాగా లేవు. ఎండ వేడి తగలకుండా ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. –పి.ప్రేమ్‌కుమార్, ఎమ్మెస్సీ, జంగారెడ్డిగూడెం -
నేడు మెగా జాబ్ మేళా
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో శుక్ర, శనివారాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. వికాస్, ఎన్టీఆర్ ట్రస్టుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు రాష్ట్రంలో నలుమూల నుంచి సుమారు 27 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ¯ŒSలై¯ŒSలో 13 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలనాయుడు గురువారం తెలిపారు. జాబ్ మేళా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, గూగుల్, జెస్ ఫ్యాక్ట్, టెక్ మహేంద్ర, జీఎంఆర్, హెచ్‌సీఎల్. ఐసీఐసీఐ, రిలయ¯Œ్స, ఎయిర్టెల్, ఏటీఎం, క్వారీ వంటి ప్రముఖ వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. అలాగే ఫార్మా రంగానికి చె ందిన కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు రానున్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ తదితర అర్హతలున్న వారంతా ఈ జాబ్ మేళాకు హజరుకావొచ్చన్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారితోపాటు స్పాట్లో రిజిస్ట్రేష¯ŒS చేసుకునే వారికి అవకాశం ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల, ఎస్‌కేవీటీ కళాశాల ప్రాంగణాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా జరుగుతుందన్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సాయంత్రమే నియామక పత్రాలు అందజేస్తారన్నారు. -
'త్వరలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు'
హైదరాబాద్ : దేశంలో ఐదు కోట్ల మందికి త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. బషీర్‌బాగ్ న్యాయకళాశాలలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర కార్మిక మంత్రిగా ఉద్యోగాల కల్పన తన బాధ్యత అని, 2022 నాటికి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. -
11న డీఆర్డీఏ జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): డీఆర్డీఏ–ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక బి.తాండ్రపాడులోని టీటీడీసీలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. రాక్సా అకాడమీలో సెక్యూరిటీ గార్డు పోస్టుకు ఎంపిక నిర్వహిస్తామన్నారు. వీరికి మూడు నెలల పాటు అనంతపురంలో శిక్షణ ఇస్తారని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 08518–277499, 8522083879, 8341581022, 9177016174 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
పోటీతత్వంతో ముందుకెళ్లాలి
జేసీ ఇంతియాజ్ గూడూరు: నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో ముందుకెళ్లాలని జేసీ ఇంతియాజ్ అన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువాని కండ్రిగలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా పోటీ అనేది తప్పడం లేదన్నారు. ఉద్యోగం సాధించడానికి పోటీ తప్పదనుకుంటే అది సాధించాక కూడా విధి నిర్వహణలో కూడా ఆ పోటీ తప్పడం లేదన్నారు. సచిన్ దత్తత గ్రామంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని, గ్రామాభివృద్దే కాకుండా ఆ గ్రామంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించడం కూడా చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, హిందూస్థాన్, గమీషా, మీనాక్షి, సింహపురి, శ్రీసిటి లాంటి 38 కంపెనీలకు చెందిన ప్రతినిధులచే ఈ జాబ్ మేళా నిర్వహించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇన్చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలోని నలు మూలల నుంచి సుమారు 1500 మందికి పైగా నిరుద్యోగ యువతీయువకులు ఈ జాబ్ మేళాకు వచ్చారని తెలిపారు. డీఆర్డీ ఏపీడీ లావణ్యవేణి, సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మ, ఎంపీటీసీ పెంచలరావు, తహసీల్దార్ భవానీ, హౌసింగ్ డీఈ నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల అతి తెలివి
-
జాబ్‌మేళాలో 20 మంది ఎంపిక
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు జనరేషన్ మిషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాలో 20 మంది ఎంపికయ్యారని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మెడ్‌ప్లస్ కంపెనీలో కస్టమర్ సేల్ అసోసియేట్, ఫార్మసిస్టు తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఈ ఎంపికలకు 50 మంది హాజరు కాగా వారిలో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎంపిక చేశారని వివరించారు. ఎంపికైన వారు ఈనెల 8న బెంగుళూరులోని మెడ్‌ప్లస్ కంపెనీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతిని«ధులు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు క్వాయర్ బోర్డులో జాబ్‌మేళా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : జిల్లాగ్రామీణాభివృద్ధిసంస్థ ఆధ్వర్యలో ఈనెల 14న రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం రోడ్ దగ్గర ఉన్న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు ఎస్.మల్లిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం షైన్‌డోవ్ కంపెనీలో పనిచేయుటకు కస్టమర్‌కేర్(మహిళలు),బిజినెస్డవలప్మెంట్(పురుషులు) డిగ్రీ పాసై, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరిజిల్లాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్‌లో రిటైల్ స్టోర్ మేనేజర్(బీఎస్సీ/ఎంబీఏ/అగ్రికల్చర్ డిప్లమో/అగ్రికల్చర్)గా పనిచేయుటకు 20 నుంచి 30సంవత్సరాల వయస్సు గల పురుషులు కావాలన్నారు. కావున అర్హత కల్గిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు నకలు, రేషన్‌కార్డు నకలుతో హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు సెల్ : 94413 59873ను సంప్రదించాలన్నారు. -
జాబ్‌మేళాకు విశేష స్పందన
ఏలూరు సిటీ : ఏలూరు గవరవరంలోని సెయింట్ థెరిస్సా స్వయం ప్రతిపత్తి డిగ్రీ మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన జా»Œ æమేళాకు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా జాబ్‌మేళాకు 1,561 మంది విద్యార్థులు హాజరై ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఐసీఐసీఐ, అడెకో, కొటాక్, ఫస్ట్‌సోర్స్, హెచ్‌సీఎల్, అటిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించారు. ఈ జాబ్‌మేళాను సెయింట్ థెరిస్సా డిగ్రీ కళాశాల వికాస్ ట్రైనింగ్ సెంటర్, నన్నయ్య యూనివర్సిటీతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.మెర్సి తెలిపారు. ఈ జాబ్‌మేళాలో ఐసీఐసీఐలో ఉద్యోగాల కోసం 265 మంది, అడెకో సంస్థకు 175 మంది, కొటాక్కు 304, ఫస్ట్‌సోర్స్ 161 మంది, హెచ్‌సీఎల్ 156, అటిక్స్ 500 మంది ఉద్యోగాలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి సరస్వతి దేవి, అధ్యాపకులు ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
27న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం రోడ్డు దగ్గర ఉన్న క్వాయర్‌బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజñ క్టు డైరెక్టర్ మల్లిబాబు తెలిపారు. విజయవాడలోని పీఎస్బీ ఆటోమొబైల్స్‌లో పనిచేయడానికి 50 మంది డ్రైవర్లు (హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి), వెహికల్ క్లీనర్స్, వర్క్‌షాపు క్లీనర్స్ (క్లీనింగ్ మీద ఆసక్తి కలవారు) కావాలన్నారు. 25 ఏళ్లు నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. వివరాలకు 94413 59873ను సంప్రదించాలన్నారు. -
24న ఆర్ట్స్ కళాశాలలో జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆర్ట్స్ కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ)లో ఈనెల 24న వినూత్న ఫర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి అనంతపురంలోనే నియామకాలు ఉంటాయని వివరించారు. మరిన్ని వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్ (99893 34989) నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి
నవులూరు (మంగళగిరి) : రాజధాని గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా ద్వారా ఉపాధి కల్పించడమే అమరావతి స్కిల్ డెవలప్మెంట్ సంస్థ లక్ష్యమని ఐటీ మానిటరింగ్ సోషల్ డెవలప్మెంట్ ఐటీ డైరెక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. గురువారం నవులూరులోని సంస్థ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. రైజింగ్ స్టార్ మొబైల్, డ్రీమ్ సేవియర్ కంపెనీలు నిర్వహించిన మేళాకు 251 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. వీరిలో 131 మందిని ఎంపికచేసి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యనభ్యసించిన ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించేలా శిక్షణ ఇస్తామని చెప్పారు. -
23న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : చెన్నైకు చెందిన బాట్లిబాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఈనెల 23న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎ.కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ (ఈఈఈ), డిప్లొమా ఎలక్ట్రికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులన్నారు. 25–35 ఏళ్లలోపు పురుఫులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని, జీతం నెలకు రూ. 15 వేలు ఉంటందని, ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోనే పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 23న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జరిగే జాబ్‌మేళాకు బయోడేటాతో పాటు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 88868 82092 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
రేపు కాయర్ బోర్డులో జాబ్‌మేళా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరం – ధవళేశ్వరం రోడ్డులో ఉన్న కాయర్ బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.మల్లిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని షైన్‌డోవ్ కంపెనీలో ఫొటోషాప్ డిజైనర్ (డిగ్రీ పాస్, ఫొటోషాప్‌లో అనుభవం), కస్టమర్ కేర్ (డిగ్రీ పాస్); ఇన్వెన్సిస్ టెక్నాలజీలో డేటా ప్రాసెస్ (డిగ్రీ పాస్, నిమిషానికి 25 పదాల టైపింగ్ స్పీడు) పని చేయడానికి 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన స్త్రీలు, పురుషులు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల నకళ్లు, రేషన్ కార్డుల నకళ్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94413 59873 నంబరులో సంప్రదించాలని కోరారు. -
జాబ్‌మేళాకు విశేష స్పందన
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణతో నిమిత్తం లేకుండా శ్రీరామ లైఫ్ ఇన్సూ్యరెన్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్లు, యూనిట్ మేనేజర్ ఉద్యోగాలకు 25 మందిని ఎంపిక చేసినట్లు డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 80 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో ప్రతిభ కలిగిన 25 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులంతా ఈనెల 27న రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, సాయి రమణారెడ్డి, నరసింహరెడ్డి, జేడీఎం హరప్రసాద్రాజు, ఏపీఎం ఎస్తేర్‌రాణి, ఈజీఎం సిబ్బంది పుథ్విరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
23న ఐటీఐలో జాబ్‌మేళా
పోచమ్మమైదాన్ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 23న వరంగల్‌లోని ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో కాల్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వారు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. హోమ్ సర్వీస్ పోస్టులకు ఏఎన్ఎం, డీఎంపీహెచ్డబ్ల్యూ, జీఎన్ఎం పాసైన వారు అర్హులన్నారు. మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పక చేయించి ఉండాలన్నారు. 20 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. ఇంటర్వూ్యలు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు 91332 50055 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు -
26, 27 తేదీల్లో జాబ్‌మేళా
గుంటూరు వెస్ట్: నిరుద్యోగ యువతకు చేయూతను అందించాలన్న ఉద్దేశంతో ఈనెల 26, 27 తేదీల్లో గుంటూరు రూరల్ చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల ప్రాంగణంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. రావెల ట్రస్టు, వికాస ఆధ్వర్యంలో నవ్యాంధ్రప్రదేశ్ యువతకు ఈ మహాదావకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం విడుదల చేసినట్లు మంత్రి రావెల పేర్కొన్నారు. దేశ విదేశాలకు చెందిన 60 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 5 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నాయని మంత్రి పేర్కొన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి వారి అర్హతల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీలోగా ఆన్లైన్లో www.ravelatrust.org అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. -
రేపు జాబ్ మేళా
మర్రిపాలెం : శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా జరుపుతామని జిల్లా ఉపాధి అధికారి(టెక్నికల్) సిహెచ్.సుబ్బిరెడ్డి తెలియజేశారు. గ్రామ్‌తరంగ్ ఎంప్లాయిబిలిటీ, ఐటీసీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. కనీస విద్యార్హత పదో తరగతి కలిగి 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసు గల పురుష అభ్యర్థులు జాబ్‌మేళాకు అర్హులన్నారు. ఖాళీలు 40 ఉన్నాయన్నారు. శిక్షణ కాలం 55 రోజులని, ఆ కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన సై్టఫండ్ అభ్యర్థికి చెల్లిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ఐటీసీ కంపెనీ ఎఫ్.ఎం.జి.సి విభాగంలో సేల్స్‌మన్ ఉద్యోగంలో ప్రవేశం కల్పిస్తారని వివరించారు. కంపెనీ నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వరకు జీతం చెల్లిస్తుందన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంచూరియన్ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికేట్ ప్రదానం చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. -
పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా నగర పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పోలీసులు సోమవారం మెగా జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉదయం ఈ మెగా జాబ్ మేళాను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో పలు కంపెనీలో పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు. -
12న విశాఖలో జాబ్‌మేళా
పాలకొండ రూరల్ : ఒకేషనల్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు పాలకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్స్‌పాల్ సీహెచ్ ఆదినారాయణ శుక్రవారం తెలిపారు. విశాఖలో గల వీఎస్ కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మేళా జరుగుతుందన్నారు. అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను ఎంహెచ్ఆర్డీఏఎన్టిఎస్.జీఓవి.ఐన్ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. -
5న ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఈనెల 5న ఆర్ట్స్ కళాశాల జేకేసీ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసిన 18–30 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. డిగ్రీ మార్కు లిస్టు, ఆధార్‌కార్డు, బయోడేటా సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలోనే నియామకాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ టీ.జీవన్‌కుమార్ (సెల్: 99893 34989)ను సంప్రదించాలని సూచించారు. -
రేపు జాబ్‌మేళా
అనంతపురం టౌన్ : అనంతపురంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 23న వినూత్న ఫర్టిలైజర్స్ తరఫున జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్పన తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. సేల్స్ రెప్రజెంటేటివ్ ఉద్యోగం కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు విద్యార్హత పత్రాలతో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలన్నారు. మొత్తం 30 మందిని ఎంపిక చేస్తామని, నెలకు రూ.7,500 జీతం ఉంటుందని పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భారీ జాబ్‌మేళా
హైదరాబాద్: ఈ నెల 17,18 వ తేదీల్లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 10 వ తరగతి పాస్/ఫెయిలైన విద్యార్థులతో పాటు ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, ఎంసీఏ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగి 18-35 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా జరగనుంది. హైకోర్టు దగ్గరలోని సిటీ కాలేజీలో మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17వ తేదీన హజరయ్యే అభ్యర్థులందరికి అవగాహన, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 18 వ తేదీన అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులకు సంబంధిత కంపెనీల హెచ్ఆర్లతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ మేళాలలో దాదాపు 40 సంస్థలు పాల్గొంటున్నాయని... ఆసక్తి కలిగి, అర్హత ఉన్న అభ్యర్థులందరూ తమ విద్యార్హతలకు సంబంధించిన ఐదు జిరాక్స్ సెట్లతో పాటు బయోడెటాతో హజరు కావాలని సూచించారు. -
రేపే జాబ్‌మేళా.. వెంటనే నియామకాలు!
కంటోన్మెంట్: హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఫార్మా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో అర్హులైన వారికి ఉద్యోగులు కల్పించేందుకు మంగళవారం సికింద్రాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగే ఈ కార్యక్రమాన్ని మెప్మా పీడీ, జలమండలి ఎండీ దానకిశోర్ ప్రారంభించనున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, టెక్నికల్, నాన్‌టెక్నికల్, ఫార్మా, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో మొత్తం 27 విభాగాల ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు మెప్మా కంటోన్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. కేటగిరీలవారీగా అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు రావాల్సిందిగా సూచించారు. ఈ మేళాలో సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలను అక్కడికక్కడే నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతారని పేర్కొన్నారు.