రేపు కాయర్ బోర్డులో జాబ్‌మేళా
Published Sat, Sep 10 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరం – ధవళేశ్వరం రోడ్డులో ఉన్న కాయర్ బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.మల్లిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని షైన్‌డోవ్ కంపెనీలో ఫొటోషాప్ డిజైనర్ (డిగ్రీ పాస్, ఫొటోషాప్‌లో అనుభవం), కస్టమర్ కేర్ (డిగ్రీ పాస్); ఇన్వెన్సిస్ టెక్నాలజీలో డేటా ప్రాసెస్ (డిగ్రీ పాస్, నిమిషానికి 25 పదాల టైపింగ్ స్పీడు) పని చేయడానికి 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన స్త్రీలు, పురుషులు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల నకళ్లు, రేషన్ కార్డుల నకళ్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94413 59873 నంబరులో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement