
100 ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సి టీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో, అపోలో ఫార్మసీ సంయుక్తంగా ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో జాబ్‌మేళా జరగనుంది.
అపోలో ఫార్మసీల్లోని 100 ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టు పోస్టులను.. జాబ్‌మేళా లో భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తు న్నట్లు వర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది.
వేతనం రూ.14,800 నుంచి 25 వేల వరకు ఇవ్వను న్నారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్సు ప్రతు లతో యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరోకు హాజరుకావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment