సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ‘టాస్క్’సంస్థ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు.
నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి
‘తనపై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తు న్నానని, ఆలోగా ఆరోపణలు రుజువు చేయక పోతే నిజామాబాద్ పులాంగ్‌చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకు ఎవరు ఒక్క రూపాయి ఇచ్చారో రుజువు చేయాలని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు. శుక్రవారం నిజా మాబాద్ జిల్లాకేంద్రంలో కవిత విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోతే, ఇప్పుడు మేం చేశామని చెప్పారు.
నిజామా బాద్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసున్నారు. ‘నా తండ్రిని అంటే వదిలేశా..ఇప్పుడు నా భర్తను కూడా విమర్శిస్తున్నారు..మజాక్ చేస్తే బాగుండదు.ఆయన రాజకీయాల్లో లేకున్నా పేరు ఎందుకు తీస్తున్నారంటూ’ అర్వింద్‌ను ప్రశ్నించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వెళ్లి ఆయన్ను ఓడించి బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment