MLA ganeshgupta
-
గ్రామీణ యువత కోసం ఐటీ హబ్‌ల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ‘టాస్క్’సంస్థ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి ‘తనపై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తు న్నానని, ఆలోగా ఆరోపణలు రుజువు చేయక పోతే నిజామాబాద్ పులాంగ్చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకు ఎవరు ఒక్క రూపాయి ఇచ్చారో రుజువు చేయాలని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు. శుక్రవారం నిజా మాబాద్ జిల్లాకేంద్రంలో కవిత విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోతే, ఇప్పుడు మేం చేశామని చెప్పారు. నిజామా బాద్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసున్నారు. ‘నా తండ్రిని అంటే వదిలేశా..ఇప్పుడు నా భర్తను కూడా విమర్శిస్తున్నారు..మజాక్ చేస్తే బాగుండదు.ఆయన రాజకీయాల్లో లేకున్నా పేరు ఎందుకు తీస్తున్నారంటూ’ అర్వింద్‌ను ప్రశ్నించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వెళ్లి ఆయన్ను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు. -
‘ఆ పదవికి ఎమ్మెల్యే రూ.50 లక్షలు అడిగారు’
నిజామాబాద్ అర్బన్: రూ.50 లక్షలు ఇస్తే నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పిస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా డిమాండ్ చేశారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి ఆరోపించారు. మంగళవారం నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డబ్బులు డిమాండ్ చేయలేదని ఆలయం మెట్లు ఎక్కి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. అసలు తాను చేసిన ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించే దమ్ము ఎమ్మెల్యేకు ఉందా అని సవాలు విసిరారు. -
మేలు చేసేందుకే ‘రైతుబంధు’
నిజామాబాద్ అగ్రికల్చర్(నిజామాబాద్ అర్బన్) : రాష్ట్రంలోని రైతులకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి పంటకు రూ.4వేలను అందిస్తున్నారని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని మానిక్‌భవన్ స్కూల్లో రైతుబంధు పథకం చెక్కులు, పట్టాపాస్‌పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, వారు పెట్టుబడుల కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవద్దనే ఉద్ధేశంతోనే రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.4వేలను అందిస్తున్నారని రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామాల్లో అన్నివర్గాల రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 24 గంటల నిరంతర విద్యుత్, మద్దతు ధరలకు పంటల కొనుగోళ్లు, పెట్టుబడి సాయం, తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా మొత్తం 459 మంది రైతులకుగాను 283 మందికి రూ.12.30లక్షల వి లువైన చెక్కులు, పట్టాపాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, నిజామాబాద్ ఎంపీపీ యాదగిరి, జడ్పీటీసీ పుప్పాల శోభ, కార్పొరేటర్లు, వ్యవసాయశా ఖ ఏడీఏ వెంకట రవిందర్, ఏఓలు, రెవెన్యూ అధికారులు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులను సీఎం ఆదుకుంటారు
శంషాబాద్(రాజేంద్రనగర్): ఆర్యవైశ్యుల డిమాండ్లను తీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం శంషాబాద్‌లో దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సు జరిగింది. వైశ్యులపై ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉందని సదస్సులో ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే ఆర్యవైశ్యులను ముఖ్యమంత్రి కలుసుకుని డిమాండ్లను నెరవేరుస్తారన్నారు. ఆర్యవైశ్యులకు సంబంధించిన పలు డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. సమాచార హక్కు కమిషన్ బుద్ధా మురళిని మహాసభ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె.దామోదర్ గుప్తా అన్నారు. ఆర్యవైశ్యులకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ప్రముఖ ఆలయాల వద్ద ఆర్యవైశ్య మహాసభలకు ఐదెకరాల చొప్పున స్థలాలను కేటాయించడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం, కల్యాణలక్ష్మి వంటి పథకాలను నిరుపేద ఆర్యవైశ్యులకు కల్పించాలంటు ఐదు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల బోర్డు చైర్మన్ సంపత్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.గణేశ్‌గుప్తా, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొండె మల్లికార్జున్, సుమారు ఐదు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం
- నాలుగు రోజుల్లో విగ్రహం తెప్పిస్తాం - అనుమతి రాగానే ప్రతిష్ఠాపన - సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేస్తా - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా నిజామాబాద్‌కల్చరల్: నగరంలోని రైల్వే స్టేషన్ కూడలి వద్ద మహాత్మా జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం తనను చాలా బాధకు గురి చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. ఏడడుగుల ఎత్తు గల పూలే విగ్రహాన్ని తొలగించి పోలీసుస్టేషన్లో టాయిలెట్ పక్కన పడేయడంతో పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విగ్రహం తొలగింపుపై ప్రతిపక్షాలు సైతం తీవ్రస్థాయిలో స్పందించారుు. దీంతో విగ్రహాన్ని పున ప్రతిష్ఠించేందుకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ముందుకొచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన బీసీ సంఘాల నాయకులతో కలసి విగ్రహాన్ని ప్రతిష్ఠించే రైల్వే స్టేషన్ కూడలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే విగ్రహం ప్రతిష్ఠించిన విషయం కానీ, తొలగించిన విషయం కానీ తనకు తెలియదన్నారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని, ఇందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విగ్రహ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. కొందరు పనిగట్టుకొని రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. ఏదేమైనా విగ్రహ తొలగింపు దురదృష్టకరమని, నాలుగు రోజుల్లో తన సొంత డబ్బులతో జ్యోతిభాపూలే విగ్రహాన్ని తెప్పిస్తానని హామీ ఇచ్చారు. దాన్ని భద్రంగా ఉంచి రైల్వే స్టేషన్ కూడలి వద్ద లేదా అంతకంటే మంచి కూడలి వద్దనైనా ప్రతిష్ఠించేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో చర్చించానన్నారు. ఒకటిరెండు రోజుల్లో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సింగిల్ ఎజెండాతో తీర్మానం చేసి ఆ లేఖను ప్రభుత్వానికి పంపుతామన్నారు. వీలైనంత త్వరగా విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొస్తానని చెప్పారు. అంతేకాక ప్రభుత్వ భవనానికి, పార్కుకు జ్యోతిబాపూలే పేరు పెడతామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ, రజక సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ డి. నారాయణరావు(నాని), బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాతశ్రీశైలం, ఆదె ప్రవీణ్‌కుమార్, మట్టెల శేఖర్, బి.విజయలక్ష్మి, సామల చిలకల్‌రాజ్, ఎం.ఎస్.అంబదాస్రావు పాల్గొన్నారు.