IT campuses
-
గ్రామీణ యువత కోసం ఐటీ హబ్‌ల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ‘టాస్క్’సంస్థ సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి ‘తనపై ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తు న్నానని, ఆలోగా ఆరోపణలు రుజువు చేయక పోతే నిజామాబాద్ పులాంగ్చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాకు ఎవరు ఒక్క రూపాయి ఇచ్చారో రుజువు చేయాలని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే బాగోదని హెచ్చరించారు. శుక్రవారం నిజా మాబాద్ జిల్లాకేంద్రంలో కవిత విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోతే, ఇప్పుడు మేం చేశామని చెప్పారు. నిజామా బాద్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ డబ్బులు ఏ కుటుంబం తిన్నదో ప్రజలకు తెలుసున్నారు. ‘నా తండ్రిని అంటే వదిలేశా..ఇప్పుడు నా భర్తను కూడా విమర్శిస్తున్నారు..మజాక్ చేస్తే బాగుండదు.ఆయన రాజకీయాల్లో లేకున్నా పేరు ఎందుకు తీస్తున్నారంటూ’ అర్వింద్‌ను ప్రశ్నించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వెళ్లి ఆయన్ను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోం: ఆఫీస్‌లకు శాశ్వతంగా గుడ్‌బై!
పరిమితి లేని పని గంటలు.. పని ఒత్తిడిని భరిస్తూనే వర్క్ ఫ్రమ్ హోంలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు ఎంప్లాయిస్. దీంతో జీతభత్యాల కోతల నడుమ కొన్నాళ్లపాటు అనుమతులు ఇస్తున్నాయి కంపెనీలు. వీటికి తోడు డెల్టా ఫ్లస్ వేరియెంట్ కేసులు పెరుగుతున్న టైంలో.. జనవరి వరకు వర్క్ ఫ్రమ్ హోంను పొడిగించాయి కొన్ని ఐటీ కంపెనీలు. అయితే ఈ అంశం ఇప్పుడు కంపెనీల పరిధి దాటిపోయినట్లు అనిపిస్తోంది. ఆఫీసులు తెరిచినా.. తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న చాలామంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బలవంతపు ఆదేశాలు జారీ చేస్తే.. కంపెనీలను వీడతామంటూ కుండబద్ధలు కొట్టేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం విషయంలో చాలా కంపెనీలు వరుసగా ఎంప్లాయిస్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంకి ఆసక్తి చూపిస్తున్నట్లు ఉద్యోగులు చెప్తున్నారు. ఈ మేరకు కొన్ని సర్వేలు ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే కంపెనీల స్పందన ఎలా ఉండబోతుందనేది రానున్న రోజుల్లోనే తెలిసేది. ►లండన్‌కు చెందిన ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న 41 శాతం మంది తాము అసలు ఆఫీస్‌లకు రమ్మన్నా.. రామని తేల్చి చెప్పారు. జనవరిలో ఇదే కంపెనీ నిర్వహిచిన సర్వేలో కేవలం 29 మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. చదవండి: హైదరాబాద్ ఐటీ కంపెనీల నయా ట్రెండ్ ఇది! ► భారత్‌కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కంపెనీ ఆగష్టు రెండో వారంలో.. లక్షన్నర మంది ఎంప్లాయిస్ అభిప్రాయంతో ఓ సర్వే చేపట్టింది. అందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంకి ఓటేశారు. ఒత్తిడిలో ఉన్నా.. తాము రిమోట్ వర్క్‌తో అన్ని విధాలుగా కంఫర్ట్‌గా ఉన్నట్లు చెప్పారు. ► భారత్‌కు చెందిన మరో ఐటీ కంపెనీ జులై చివరి వారంలో చేపట్టిన సర్వేలో.. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా 19 శాతం ఉద్యోగులు రిమోట్ వర్క్(వర్క్ ఫ్రమ్ హోం)కే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.17 శాతం మంది వారానికి మూడు రోజులైనా వర్క్ ఫ్రమ్ హోం కావాలని కోరుకుంటున్నారు. 22 శాతం మంది తాము కనీసం ఒక్కరోజైనా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ► తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 1500 మందితో ఇలాంటి సర్వేనే నిర్వహించగా.. 38 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రమ్ హోంను.. 21 శాతం వారంలో కనీసం మూడు రోజులైనా వర్క్ ఫ్రమ్ హోం కోరుకున్నారు. వ్యాక్సినేషన్ సర్వే చాలా కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కచ్చితంగా ఉండాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోంతో పాటు ఆఫీసులకు రావాలనుకుంటున్న ఉద్యోగులను తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆదేశిస్తున్నాయి. అయితే ఈ కంపల్సరీ రూల్‌ను చాలామంది ఉద్యోగులు ఆమోదిస్తున్నారు. గాలప్ సర్వే ప్రకారం.. 36 శాతం ఉద్యోగులు ఈ నిబంధనకు మద్దతు తెలపగా. 29 శాతం ఉద్యోగులు మాత్రం ఈ రూల్‌తో విభేదిస్తున్నారు. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. బాబోయ్ మాకొద్దు! -
ఐటీ సంస్థల్లో, మహిళలకు బంపర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో కొలువుల జాతర మొదలైంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల్లో సుమారు 60వేల ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 60వేల ఉద్యోగాల నియామకం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఆయా దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. టార్గెట్ 2030 •ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 45శాతం మంది మహిళలే విధులు నిర్వహించేలా ఇన్ఫోసిస్ భారీ ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసింది. •టీసీఎస్ సైతం 40వేల మంది మహిళా గ్రాడ్యూయేట్ లలో 15 వేల నుంచి 18వేల లోపు మహిళా ఉద్యోగుల నియమాకం కోసం కసరత్తు. •రాబోయే రోజుల్లో మహిళలు - పురుషుల ఉద్యోగుల సంఖ్య సమానంగా ఉండేలా హెచ్‌సీఎల్ నియామకం చేపట్టనుంది. ఇందుకోసం 60 శాతం మహిళా ఉద్యోగుల్ని ఆయా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. •విప్రో ఉద్యోగుల్లో 50శాతం మంది మహిళలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 30వేల మందిని ఎంపిక చేసేలా డ్రైవ్ నిర్వహించనుంది. -
రాజధానిలో ఐటీ ప్రాంగణాలు ! : మంత్రి పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్, గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీలు అంగీకరించాయని, దీనివల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంస్థలు అమెరికా వెలుపల మొట్టమొదటి క్యాంపస్‌ను హైదరాబాద్‌లోనే నిర్మించేందుకు అంగీకరించాయని ఆయన చెప్పారు. అమెజాన్ ఇంటర్నేషనల్ కంపెనీ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో 2005 ఆగస్టు 11న అవగాహన కుదుర్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నానక్‌రామ్‌గూడలో 10.57 ఎకరాలను ఆ కంపెనీకి కేటాయించింది. ఆ సంస్థ మొత్తం డబ్బును చెల్లించినా కోర్టు వివాదం వల్ల ఏపీఐఐసీ స్థలం అప్పగించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పుణే, ముంబైలలో ప్రాంగణాల ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించింది. దీంతో ఐటీ శాఖ మంత్రి ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఇక్కడే క్యాంపస్ నిర్మించాలని,అవసరమైన అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.మంత్రి హామీతో క్యాంపస్‌లను ఇక్కడే నిర్మించేందుకు ఆ సంస్థల ప్రతినిధులు అంగీకరించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 76 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి పొన్నాల పేర్కొన్నారు. గూగుల్‌కు ప్రత్యామ్నాయ స్థలం గూగుల్ కంపెనీకి హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కోర్టు వివాదం వల్ల గతంలో కేటాయించిన స్థలం అప్పగించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో గూగుల్ ఇక్కడే క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని మంత్రి వివరించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని తెలిపారు.