24న ఆర్ట్స్‌ కళాశాలలో జాబ్‌మేళా | job mela on 24th in arts college | Sakshi
Sakshi News home page

24న ఆర్ట్స్‌ కళాశాలలో జాబ్‌మేళా

Published Fri, Sep 23 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

job mela on 24th in arts college

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఆర్ట్స్‌ కళాశాలలోని  జవహర్‌ నాలెడ్జ్‌  సెంటర్‌ (జేకేసీ)లో ఈనెల 24న వినూత్న ఫర్టిలైజర్స్‌ సంస్థలో ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, వయస్సు 35 ఏళ్ల లోపు  ఉండాలని పేర్కొన్నారు.

అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి అనంతపురంలోనే నియామకాలు ఉంటాయని వివరించారు. మరిన్ని వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్‌ (99893 34989) నంబర్లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement