5న ఆర్ట్స్‌ కళాశాలలో ఉద్యోగ మేళా | job mela in arts college on 5th | Sakshi
Sakshi News home page

5న ఆర్ట్స్‌ కళాశాలలో ఉద్యోగ మేళా

Published Thu, Aug 4 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

job mela in arts college on 5th

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఈనెల 5న ఆర్ట్స్‌ కళాశాల జేకేసీ సెంటర్‌లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా  డిగ్రీ చేసిన 18–30 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. డిగ్రీ మార్కు లిస్టు, ఆధార్‌కార్డు, బయోడేటా సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలోనే నియామకాలు ఉంటాయన్నారు.  మరిన్ని వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టీ.జీవన్‌కుమార్‌ (సెల్‌: 99893 34989)ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement