arts college
-
TS: బీజేపీకి ఊహించని షాక్.. జేపీ నడ్డా పర్యటన వేళ ట్విస్ట్?
సాక్షి, హనుమకొండ: తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఈ నెల 27న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య తెలిపారు. సభకు అనుమతి లేదని గురువారం రాత్రి పోలీసులు చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు వాట్సాప్‌లో లేఖ పంపారు. అలాగే, గ్రౌండ్ కోసం ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇస్తామని తెలిపారు. దీంతో రావు పద్మతో పాటు బీజేపీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి తదితరులు హనుమకొండ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నా పర్మిషన్ తెచ్చుకున్నామని, ఇప్పుడు సభకు కూడా కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగానే శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. కాగా, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. మరోవైపు.. బండి సంజయ్ పాదయాత్ర నేడు పున:ప్రారంభం కానుంది. హైకోర్టు అనుమతులతో పాంనూర్ నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం అవనుంది. ఉప్పుగల్, కోనూర్, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడతలో పాదయాత్ర ముగియనుంది. కాగా, పాదయాత్ర నేపథ్యంలో బండి సంజయ్‌ను టీఆర్ఎస్ సర్కార్ హెచ్చరించింది. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇక, పాదయాత్ర రూట్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇది కూడా చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? -
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైభవంగా సాంస్కృతిక మహోత్సవం
-
కళ తప్పిన ‘ఆర్ట్స్’
ఉస్మానియా యూనివర్సిటీ: చారిత్రక ఆర్ట్స్ కళాశాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. యూనివర్సిటీ కాలేజీల్లో అతిపెద్దదైన ఆర్ట్స్ కళాశాలలో ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాలలో 26 ఎంఏ కోర్సులు ఉన్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులు మినహా ఇతర 23 కోర్సులలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో 6– 8 మంది అధ్యాపకులు ఉండాలి. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తప్పనిసరి. కానీ మూడు విభాగాలు మినహా మిగతావాటిలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు లేకుండాపోయారు. దీంతో విద్యార్థులు ఆయా కోర్సులలో చేరడం లేదు. విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖలలో కేవలం ఒకే అధ్యాపకుడు ఉన్నారు. తమిళ్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ విభాగాల్లో అధ్యాపకులు లేకపోవడంతో పీజీ కోర్సులను రద్దు చేశారు. చరిత్ర, తెలుగు, హిందీ, అరబిక్, సైకాలజీ, ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్ తదితర విభాగాల్లో ఒకరి నుంచి ముగ్గురు మాత్రమే అధ్యాపకులు పని చేస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ విభాగంతో పాటు మరికొన్ని విభాగాల్లో పర్మనెంట్ అధ్యాపకుల స్థానంలో కాంట్రాక్టు అధ్యాపకులతో కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను ఆరు సంవత్సరాల క్రితం రద్దు చేయడంతో ప్రస్తుతం పార్టుటైం అధ్యాపకులతో బోధన సాగుతోంది. ఓయూలో పని చేస్తున్న కాంట్రాక్ట్, పార్టుటైం అధ్యాపకులు కేవలం బోధనకు మాత్రమే చేస్తున్న పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వకపోవడంతో పరిశోధనలు కుంటుపడ్డాయి. ఓయూ పరిధిలోని ఇతర కాలేజీల్లో పని చేసే కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులకు ప్రిన్సిపల్ పదవులతో పాటు ఇతర ముఖ్యమైన పదవులను కూడ కట్టపెడుతున్నారు కానీ ఆర్ట్స్ కాలేజీలో పని చేసే వారికి కనీసం అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం లేదు. వృథాగా మౌలిక వసతులు.. ఆర్ట్స్ కాలేజీలో అనేక విభాగాల తరగతి గదులు, కార్యాలయాలు, అధ్యాపకుల గదులు, సెమినార్ లైబ్రరీలు, ఇతర మౌలిక వసతులు వృథాగా ఉంటున్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, చరిత్ర, జర్నలిజం, సైకాలజీ విభాగాలు మినహా ఇతర 20 విభాగాల తరగతి గదులు, ఇతర గదులు ఎవరూ లేక బోసిపోతున్నాయి. ఆర్ట్స్ కాలేజీలోని కోట్లాది రూపాయల విలువైన మౌలిక వసతులను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడం లేదు. అండర్ గ్రౌండ్‌తో పాటు మరో రెండు అంతస్తులతో ఆర్ట్స్ కాలేజీని నిర్మించారు. ప్రస్తుతం విద్యార్థులు లేని కోర్సులకు అన్ని వసతులున్న ప్రవేశ ద్వారానికి దగ్గరఉన్న గదులను అలాగే కొనసాగిస్తున్నారు. నిత్యం తరగతులు జరిగే ఇంగ్లిష్ కోర్సును 2వ అంతస్తు చివర్లో, సైకాలజీ, జర్నలిజం కోర్సులను సెల్లార్ గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు లేకుండా నిరుపయోగంగా ఉన్న కోర్సులకు ప్రధాన గదులను కేటాయించారు. ప్రాధాన్యమున్న కోర్సులకు తరగతి గదులను సెట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్ట్స్ కాలేజీ తరగతి గదులను సెట్ చేయాలని విద్యార్థులు ఓయూ అధికారులను కోరుతున్నారు. ఇతర భాషా కోర్సుల్లో శూన్యం.. ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకుల కొరత కారణంగా పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్ తదితర కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. గతంలో ఇతర భాషా కోర్సులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యార్థుల ఆర్థిక సహాయం లభించేది. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల భాషా కోర్సుల్లో ఎవరూ చేరడం లేదు. -
మద్యం సేవించి శివయ్యపై దాడికి పాల్పడ్డ నిందితులు
-
ఆర్ట్స్ కాలేజీలో గొడవ.. వీడిన మిస్టరీ!
సాక్షి, అనంతపురం : అనంతపుం ఆర్ట్స్ కాలేజీలో యువకుడిపై దాడి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దాడి చేసిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఓ యువతి విషయంలో వివాదం వల్లే ఈ ఘర్షణ జరిగిందని.. ఈ గొడవలో కాలేజ్ విద్యార్ధులకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఓ అమ్మాయి విషయంలో శివయ్య, భరత్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భరత్ గ్యాంగ్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శివయ్యపై దాడి చేసింది. భరత్, అతని స్నేహితులు మద్యం సేవించి శివయ్యను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ పీఎన్ బాబు.. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని వెల్లడించారు. -
ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయ సంచాలకులు పద్మశ్రీ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, తత్సమాన అర్హత ఉన్నవారితో పాటు యూనివర్సిటీ వారు నిర్వహించిన అర్హత పరీక్ష 2013–2017 మధ్య ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం కోర్సుల ప్రవేశాలకు అక్టోబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08554–222448, 73829 29602 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఆర్ట్స్ కళాశాలలో పీజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన పీజీ కోర్సు సీట్లకు ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి తెలిపారు. ఎమ్మెస్సీ బాటనీలో 5, జువాలజీలో 3, మైక్రో బయాలజీలో 17, జువాలజీలో 22, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8, ఫిజిక్స్‌లో 12, స్టాటిస్టిక్స్‌లో 7, ఎలక్ట్రానిక్స్‌లో 29, ఎంఏ ఇంగ్లీష్‌లో 23, తెలుగులో 10 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్కేయూ నిర్ణయించిన ఫీజుతో సహ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, స్టడీ, కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. స్కూసెట్ ర్యాంకు ఉన్నాలేకపోయినా పర్వాలేదని వివరించారు. -
ఉట్టిపడిన కళా వైభవం..
అనంతపురం కల్చరల్ : భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు.. గరగాటం, పేరిణీ శివతాండవం, గొరవయ్యలు వంటి ప్రాచీన కళారూపాలు.. వన్ యాక్ట్ ప్లే.. ఇలా ప్రతి దాంట్లో వివిధ కళాశాలలకు చెందిన యువతీయువకులు తమదైన ప్రతిభతో అదరగొట్టారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల వేదికగా డివిజన్ స్థాయి ఘనంగా యువజనోత్సవాలు జరిగాయి. యువజన సంక్షేమ శాఖ, ఆన్సెట్ సంయుక్త ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. జిల్లాకు చెందిన ఆరభి బృందం పలు బహుమతులను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం, సహాయ అధికారి భవానీ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి, ఎన్ఎస్ఎస్ అధికారి సుధాకర్ తదితరులు మాట్లాడారు. యువతలోని ప్రతిభను వెలికితీయడానికే యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. -
ఆర్ట్స్ కళాశాలలో ప్లాస్టిక్ బియ్యం కలకలం
కళాశాల వద్ద విద్యార్థుల ధర్నా భోజనంలో నాణ్యత లోపించిందంటూ ఆరోపణ ప్రిన్సిపల్, వార్డన్‌ను సస్పెన్షన్‌కు డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు గురువారం ఆకలికేకలు పెట్టారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన భోజనం పెడుతున్నారంటూ కళాశాల, హాస్టల్‌తో పాటు టవర్‌క్లాక్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. వందలాది మంది విద్యార్థులు భోజనం తినకుండా ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. భోజనం నాణ్యతపై ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మరుగుదొడ్లు చాలడం లేదని, ఉన్న మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్, వార్డెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. విద్యార్థులతో డీఎస్పీ చర్చలు జరిపారు. స్వయంగా హాస్టల్‌కు వెళ్లి భోజనం రుచి చూశారు. అన్నం చేయడానికి వాడుతున్న బియ్యంపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు వచ్చి భోజనాన్ని పరిశీలించారు. శాంపిల్ తీసుకుని పరిశీలనకు ల్యాబ్‌కు పంపుతామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని యాజమాన్యానికి డీఎస్పీ సూచించారు. -
ఆర్ట్స్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : అనంత నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరం డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులకు సంబంధించిన వివిధ గ్రూపుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 1 నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. రంగస్వామి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సర్టిఫికెట్లు, ఫొటోలతో హాజరుకావాలన్నారు. కోర్సుల వివరాలు : బీఏ : గణితం, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ (ఎంఈఎస్) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ (జే1ఏహెచ్) ఇంగ్లిష్ మీడియం. హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ (హెచ్‌హెచ్‌పీ) తెలుగు మీడియం. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, అడ్వాన్స్ ఇంగ్లిష్, హిస్టరీ (ఎల్1సీ). ఎకనామిక్స్, పిలాసపీ, పొలిటికల్ సైన్స్ (ఈపీపీ) తెలుగు మీడియం, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ (ఈఎస్సీఏ), ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం). బీఎస్సీ : గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (జీపీసీ) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జియాలజీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ (జీపీసీఎస్) ఇంగ్లిష్ మీడియం. కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ (సీపీజెడ్) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ (సీజెడ్బీసీ) ఇంగ్లిష్ మీడియం. మైక్రో బయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ (ఎంబీసీ) ఇంగ్లిష్ మీడియం. బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ (బీబీసీ) ఇంగ్లిష్ మీడియం. నూతనంగా ప్రవేశపెడుతున్న కోర్సులు : బీఏ : ఆర్కాలజీ (ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆర్కాలజీ) బీఎస్సీ : అప్లయిడ్ స్టాటిస్టిక్స్ (గణితం, స్టాటిస్టిక్స్, అకౌంటెన్సీ). రెవెవబుల్ ఎనర్జీ సోర్సెస్ (గణితం, ఫిజిక్స్, రెవెవబుల్ ఎనర్జీ సోర్సెస్) బీకాం : డిజిటల్ మార్కెటింగ్ (మార్కెటింగ్, ఈకామర్స్, డిజిటల్ మార్కెటింగ్). -
అలరించిన సాంస్కృతిక సంబరాలు
అనంతపురం కల్చరల్ : నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు మరోసారి ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశారు. నాక్ బృందం సందర్శన సందర్భంగా సోమవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తూ సాగిన కళారూపాలతో విద్యార్థులు అలరించారు. శివతాండవం రూపకంపై యశ్వంత్ శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం రెండు గంటల పాటు కరతాళ ధ్వనుల నడుమ హృద్యంగా సాగింది. విశిష్ట అతిథులుగా విచ్చేసిన నాక్ బృంద సభ్యులు ఆచార్య సతీందర్ సింగ్, ఆచార్య సోంకావాడే, ప్రొఫెసర్ ఎడ్విన్ జ్ఞానదాసు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రంగస్వామి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త లక్ష్మీనారాయణ, డ్యాన్స్ మాస్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నెహ్రూ యువ కేంద్రం అనంతపురం వారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ–2, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి, నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయకర్త శివకుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి అనంతపురం జిల్లాలో ఉత్తమ సంఘసేవ కార్యక్రమాలను పాల్గొని, నిర్వహించి విజయవంతం చేసినందుకు కమ్యూనిటీ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలు బేగంకు రూ.25 వేల నగదును జేసీ–2 చేతుల మీదుగా అందించారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీడీలు వెంకటనాయుడు, నెహ్రూ యువ కేంద్రం డీడీఓ శ్రీనివాసులు, జాతీయ యువ కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పురుషుల విభాగంలో విన్నర్స్‌గా నార్పల జట్టు, రన్నర్స్‌గా అనంతపురం పాతూరు జట్టు, మహిళల విభాగంలో విన్నర్స్‌గా ఎస్ఎస్బీఎన్ జట్టు, రన్నర్స్‌గా పీటీసీ జట్టు, 100 మీటర్ల పరుగు పందెం పురుషుల విభాగంలో ప్రథమ స్థానం వినయ్‌కుమార్‌రెడ్డి, ద్వితీయ స్థానం షెక్షావలి, లాంగ్ జంప్ పురుషుల విభాగంలో వినయ్‌కుమార్‌రెడ్డి, మహిళల విభాగంలో లావణ్య విజేతలుగా నిలిచారు. -
ఆర్ట్స్ కళాశాల తొలి గ్రాడ్యుయేషన్ డే
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఆర్ట్స్ కళాశాల తొలి గ్రాడ్యుయేష¯ŒS డే త్వరలో జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెంది 164 ఏⶠ్ల చరిత్రగల కళాశాల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రముఖులను తయారుచేసిందని, ఈ కళాశాలలో మరికొద్ది రోజుల్లో ఈ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.డేవిడ్కుమార్స్వామి మంగళవారం తెలిపారు. ఆదికవి నన్నయ వర్సిటీ నుంచి మొదటి, రెండో బ్యాచ్‌గా డిగ్రీ పట్టా పొందే విద్యార్థులకు పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే 2012–13 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది 2015లో డిగ్రీ పూర్తిచేసిన వారు, 2013–14లో డిగ్రీ ప్రవేశం పొంది 2016లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తుచేసుకోవాలన్నారు. దరఖాస్తులను డబ్లు్యడబ్లు్యడబ్లు్య.జీసీఆర్జేవై.ఏసీ.ఇ¯ŒS అనే వెబ్సైట్ నుంచి డౌ¯ŒSలోడ్ చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోగా అందజేయాలన్నారు. -
నేడు ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలోని మహిళా నిష్ణాతులు - దేశాభివృద్ధిలో వారి పాత్ర’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభం కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆచార్యులు, మేధావులు హాజవుతారని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి, సదస్సు కన్వీనర్ బి.జమీలాబీబీ, కో-ఆర్డినేటర్ టి.శైలజారాణి తెలిపారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఓవరాల్ చాంపియన్‌గా ఆర్ట్స్ కళాశాల
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఓవరాల్ చాంపియన్‌గా అనంతపురం ఆర్ట్స్ కళాశాల జట్టు తన సత్తా చాటింది. సోమవారం నుంచి ప్రారంభమైన అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో అనంతపురం ఆర్ట్స్ కళాశాల జట్టు 136 పాయింట్లు సాధించి యూనివర్శిటీ పరి«ధిలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆర్ట్స్ కళాశాల 6 సార్లు తన ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుని డబుల్ హ్యాట్రిక్‌ను సాధించింది. ఆర్ట్స్ కళాశాల క్రీడాకారుడు వినయ్‌కుమార్ రెడ్డి అన్ని ఈవెంట్లలో కలిపి 16 పాయింట్లు సాధించాడు. బాలికల విభాగంలో అన్ని ఈవెంట్లలో 18 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా ఆర్ట్స్ కళాశాల క్రీడాకారిణి విజయలక్ష్మీ నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. మరిన్ని విజయాలు సాధించి జాతీయస్థాయికి చేరాలి – ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ జెస్సీ మరిన్ని విజయాలు సాధించి జాతీయస్థాయి ఆల్ ఇండియా యూనివర్శిటీ లెవల్లో పతకాలు సా«ధించాలని ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ జెస్సీ తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతి«ధిగా హాజరయ్యారు. ఆమెతో పాటు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. ఆల్ ఇండియా లెవల్ యూనివర్శిటీ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్యూమినీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీదేవి, కళాశాల అధ్యాపకులు సత్యనారాయణ, జయరామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరిలు జబీవుల్లా, వెంకటనాయుడు, జయరామప్ప, ఎస్ఎస్బీఎన్ పీడీ చంద్ర తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు విజేతలు: ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు: 200 మీటర్లు బాలురు : మహేశ్వరరెడ్డి(సీఎంఐ అనంతపురం), వినయ్‌కుమార్‌రెడ్డి(ఆర్ట్స్ కళాశాల, అనంతపురం), మనోహర్(ఎస్కేయూ, అనంతపురం) 400 మీటర్లు బాలురు : మనోహర్(ఎస్కేయూ అనంతపురం), గిరీష్‌బాబు(ఎస్కేపీ గుంతకల్లు), ఉమర్(ఎస్ఆర్డీసీ పామిడి) 10 కీ.మీ బాలురు : రాజకుళ్లాయప్ప(ఎస్‌వీపీఈ హిందూపురం), నరేంద్ర(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం), హరికృష్ణ(ఎస్కేపీ గుంతకల్లు) ట్రీపుల్ జంప్ : వినయ్‌కుమార్(ఆర్ట్స్ కళాశాల అనంతపురం), సాయితేజ(ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ్యాణదుర్గం), వీరేష్‌బాబు(ఎస్వీపీడీ హిందూపురం) 4 ఇన్టు 100 రిలే : ఆర్ట్స్ కళాశాల, అనంతపురం–1, ఎస్కేయూ అనంతపురం–2, ఎస్వీపీడీ–3 200 మీటర్లు బాలికలు : లావణ్య(ఎస్కేపీ గుంతకల్లు), రమ(ఎస్‌వీపీఈ హిందూపురం), శ్రీలత(ఎస్‌వీపీఈ హిందూపురం) 3 కీ.మీ బాలికలు : గౌతమిబాయి(ఆర్ట్స్ కళాశాల అనంతపురం), మహాలక్ష్మీ(ఆర్ట్స్ కళాశాల అనంతపురం), స్వాతి(ఎస్కేపీ గుంతకల్లు) 4 100 రిలే బాలికలు : ఎస్‌వీపీఈ హిందూపురం–1, ఆర్ట్స్ కళాశాల అనంతపురం–2, శ్రీవాణి అనంతపురం–3 -
15న ఆర్ట్స్ కళాశాలలో జాతీయ సెమినార్
కంబాలచెరువు : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 15న ‘భాషా నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు’ అంశంపై తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాపాక డేవిడ్ కుమార్‌స్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోధనలో వినూత్న విధానాలు, భాషలో ప్రత్యేక నైపుణ్యాలకు పెరుగుతున్న రంగాలు, సిలబస్‌లో మార్పు ద్వారా పెరిగే ఉద్యోగ అవకాశాలు, కమ్యూనికేష¯ŒS స్కిల్స్, సాహిత్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం, భాషాసాహిత్యం ద్వారా ఉపాధి అవకాశాలపై సెమినార్లో చర్చిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలను అనుఫాంట్ సెవె¯ŒSలో సెమినార్ పత్రాల రూపంలో ఆర్వీ.కామేశ్వరరావుఎట్దిరేటాఫ్జీమెయిల్.కామ్‌కు పంపాలని సూచిం చారు. లేనిపక్షంలో సెమినార్ జరిగే రోజు ఉదయం 9 గంటలకు హాజరై రిజిస్ట్రేష¯ŒS చేసుకోవచ్చని తెలిపారు. -
తొలిసారి స్వయంప్రతిపత్తి హోదాలో పరీక్షలు
– నేటి నుంచి ఆర్ట్స్ కళాశాల మొదటి సంవత్సరం పరీక్షలు అనంతపురం ఎడ్యుకేషన్ : ఆర్ట్స్ కళాశాలలో తొలిసారిగా స్వయం ప్రతిపత్తి హోదాలో సొంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్నిరోజులూ ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన ఈ కళాశాల శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ మొదటి సంవంత్సరం పరీక్షలు తామే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలుంటాయని వివరించారు. పరీక్షలకు 1,800 మంది విద్యార్థులు హాజరవుతారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. జానకీరామ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. పద్మశ్రీ తెలిపారు. -
24న ఆర్ట్స్ కళాశాలలో జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆర్ట్స్ కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ)లో ఈనెల 24న వినూత్న ఫర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి అనంతపురంలోనే నియామకాలు ఉంటాయని వివరించారు. మరిన్ని వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్ (99893 34989) నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఆర్ట్స్ కళాశాలకు రూ.లక్ష విరాళం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎండోమెంట్ క్యాష్‌ప్రైజ్‌ల కోసం రిటైర్డ్ ప్రిన్సిపల్ పి. మహమ్మద్‌ఖాన్ ఆర్ట్స్ కళాశాలకు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఈయన ఈ కళాశాలలో 1964–67లో బీఎస్సీ బీజెడ్సీ గ్రూపులో చదివి, ఇదే కళాశాలలో 2000–03 మధ్య బాటనీ అధ్యాపకునిగా పని చేశారు. తర్వాత కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. తాను చదివిన, బోధించిన కళాశాల పట్ల అభిమానంతో ఈ విరాళం అందజేశారు. తల్లిదండ్రులైన పి. మహబూబీ, పి. యూసుఫ్‌ఖాన్ జ్ఞాపకార్థం డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తంపై వచ్చే వార్షిక వడ్డీని మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాల బీఎస్సీ బాటనీ సబ్జెక్టులో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా అందజేయాలని కోరారు. మహ్మద్‌ఖాన్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి అభినందించారు. -
నేడు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వరుణయాగం
అనంతపురం అగ్రికల్చర్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడి కటాక్షం కోసం శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వరుణయాగం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఏపీ ఎల్డీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్ పీడీ కొండలరావు సాక్షితో మాట్లాడుతూ...డీఆర్డీఏ, నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మంది మహిళలు, పరంజ్యోతి ఆలయం నుంచి భక్తులు, అలాగే పెద్ద సంఖ్యలో పురోహితులు యాగంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యాగం ప్రారంభమవుతుందన్నారు. -
10 నుంచి అంతర్జాతీయ సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మనుషులు అక్రమ రవాణా’ అనే అంశంపై స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ఈనెల 10 నుంచి 12 దాకా మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషియల్, సైన్స్ రీసెర్చ్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.‘మహిళలు, అమ్మాయిల అక్రమ రవాణా’ అనేది అంతర్జాతీయ సమస్యగా మారింది. ఆయుదాల అక్రమ రవాణా, మత్తు పదార్థాల రవాణా తర్వాత మనుషుల రవాణా ప్రముఖంగా వినిపిస్తోంది. కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి అధ్యక్షతన జరిగే సదస్సుకు ముఖ్య అతిథులుగా కళాశాల విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మీ, ఎస్కేయూ వీసీ కె. రాజగోపాల్, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, కళాశాల విద్య ఆర్జేడీ కె.మల్లేశ్వరి, సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.గంగాధరశాస్త్రి, ఉస్మానియూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి. రామిరెడ్డి, ఆసే్త్రలియాకు చెందిన రెజ్రపెంటింగ్ మై చాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ వీవీయన్ ఇసాక్, ఇండోర్ ఐఐఎం ప్రొఫెసర్ డాక్టర్ ఎంఆర్ శ్రీధర్ హాజరవుతున్నారు. -
5న ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఈనెల 5న ఆర్ట్స్ కళాశాల జేకేసీ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసిన 18–30 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. డిగ్రీ మార్కు లిస్టు, ఆధార్‌కార్డు, బయోడేటా సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలోనే నియామకాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ టీ.జీవన్‌కుమార్ (సెల్: 99893 34989)ను సంప్రదించాలని సూచించారు. -
విద్యకే తొలి ప్రాధాన్యం
మంత్రి ఈటల రాజేందర్ శాతవాహన వర్సిటీని తనిఖీ చేసిన మంత్రి కమాన్‌చౌరస్తా: శాతవాహన యూనివర్సిటీని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. వర్సిటీ పాలన విభాగం, నిర్మాణంలో ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనం, సెంట్రల్ లైబ్రరీ, సైన్స్ కళాశాలను పరిశీలించారు. సైన్స్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. భోజన శాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కళాశాల ఎదుట మొక్కలు నాటారు. ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని అని మంత్రి ఈటల అన్నారు. విద్యాభివృద్ధి కోసం జిల్లాలోని ప్రతి నియోజకవర్గాని రూ. 10 కోట్ల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ. 15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వర్సిటీ కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పారు. విద్యాపర్యవేక్షణకు ఒక కమిటీని వేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కంప్యూటర్‌సైన్స్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీలను త్వరలో రెగ్యూలర్ కోర్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు, వసతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. 12–బీ గుర్తింపునకు కావాల్సి వనరులను అందిస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ కావాల్సిన గుర్తింపు, కేంద్రం నుంచి వచ్చే నిధులు త్వరగా వచ్చేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కరీంన గర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, శాతవాహన రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరెపల్లి సుజాత, టీఆర్ఎస్ నాయకులు సిద్దం వేణు, కట్ల సతీష్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రెడ్డవేని తిరుపతి, బోనాల శ్రీకాంత్, చల్లహరిశంకర్, బండారి వేణు, మల్లెంకి శ్రీనివాస్, సయ్యద్ అక్బర్ హుస్సేన్ వర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు క్రికెట్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : మాజీ రాష్ట్రపతి డా క్టర్ అబ్దుల్ కలాం స్మారక క్రికెట్ పోటీలను బుధవారం నుంచి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు వరంగల్ క్రికెట్ అకాడమీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు తెలిపారు. ఈ మేరకు వరంగల్ లోని అకాడమీ కార్యాలయంలో సోమవారం టోర్నమెంటు బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్ మాజీ డైరక్టర్ రాజనాల శ్రీహరి హాజరై మాట్లాడుతు గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలను నిర్వహిస్తున్న అకాడమీ బాధ్యులను అభినందించారు. ఉదయభానురావు మాట్లాడుతు అండర్–16 పాఠ శాల స్థాయి క్రీడాకారులకు నిర్వహించే పోటీలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెుత్తం 40 జట్లు హాజరుకానున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ ఇస్తామని తెలిపారు. అకాడమీ అధ్యక్షురాలు టి.అనిత, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మంద వినోద్‌కుమార్, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు విజయ్‌కుమార్, వేణు, వేణుగోపాల్, వేణుమాధవ్, అకాడమీ సహాయ కార్యదర్శి ప్రభాకర్, భాస్కర్‌రావు, శ్రీనివాసరెడ్డి, కుమార్, సారంగపాణి పాల్గొన్నారు. -
26న ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా
కేయూ క్యాంపస్ : హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్‌మేళా ని ర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె.రామానుజరావు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల బా ధ్యులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నా రు. ఎస్సెస్సీ నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి వి ద్యార్హతలను బట్టి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆయా కంపెన్నీల్లో ట్రెయినీలుగా పనిచేసేందుకు ఎంపిక చేసిన వారికి పదమూడు వారాల నుంచి పది నెలల వర కు పాటు శిక్షణ ఉంటుందని వివరించారు. ఈ మేరకు విద్యార్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా కోరారు. -
కళామతల్లి ముద్దుబిడ్డ తలమర్ల
ప్రముఖ సాహితీ వేత్త ఆశావాది ప్రకాశరావు అనంతపురం కల్చరల్ : సాహిత్యాని కి ఊపిరిగా నిలి చి న వారిలో తల మర్ల కళానిధి ఒకరని ప్రముఖ సాహి తీ వేత్త ఆశావాది ప్రకాశరావు అ న్నా రు. స్థానిక ఆర్ట్ క ళాశాలలో ఆదివారం సాహితీ స్రవంతి, ఆర్ట్స్ కళాశాల తెలుగు వి భా గం సంయుక్తంగా విద్వాన్ తలమర్ల కళానిధి శత జయంతి నిర్వహిం చారు. సాహితీ స్రవంతి నగర అధ్యక్షుడు నీరుగంటి వెంకటేష్ అ« ద్యక్ష త వహించారు. ఆశావాది ప్రకాశరావు మాట్లాడుతూ కష్టనష్టాలను దాటుకుని దళిత కవికోకిలగా స్థిరపడడం తలమర్లకే చెల్లిందన్నారు. దళితులు బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే చదువు ఒక్కటే మా ర్గమన్న ఆయన రచనలను అందరూ చదివాలని అభిప్రాయపడ్డారు. కళానిధి కుమారుడు విశ్రాంత డీఎస్పీ తలమర్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ తన తండ్రి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి విద్యా, వైద్య, సాహితీ రంగాల్లో కృషి చేసిన వారిని ప్రోత్సహిస్తామన్నారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రగతి, ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, పం డిట్ సూర్యనారాయణరెడ్డి ,మధురశ్రీ, జూటూరు షరీఫ్ పాల్గొన్నారు. -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
వైవీయూ : కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ ప్రథమ సంవత్సరం 68 శాతం, ద్వితీయ సంవత్సరం 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. పూర్తి ఫలితాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జీసీఎంకడప.ఓఆర్జీ అనే వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. అదే విధంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఐఎల్ఎన్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఎస్. రామచంద్రయ్య, ఎల్ఎంబీ భక్షు పాల్గొన్నారు. -
ఓయూలో గాల్లో లేచిన పోలీసుల సుమో
హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఓయూ భగ్గుమంది. ఈ సంఘటన చూసిన వారెవ్వరికైనా ఒకప్పటి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలాంటి వాతావరణం టక్కున కళ్లముందుకు రావాల్సిందే. ప్రభుత్వ కొలువులకు ప్రకటనలు వెలువడటంతో పక్కవాడిని కూడా పలకరించే తీరికలేకుండా చదువుకుంటున్న విద్యార్థులు మరోసారి తమలో సామాజిక స్పృహ నివురుగప్పిన నిప్పులా అలాగే ఉందని నిరూపించారు. బుధవారం ఉదయం అంతా హోళీ వేడుకలకు సిద్ధమయ్యారు. కొంతమంది విద్యార్థులు మొదలుపెట్టారు కూడా. ఇంతలోనే ఓ కబురు. లైబ్రరీ వెనుక ఎవరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని. మొన్న గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్య పెంచనందుకు, పరీక్షలను పోస్ట్ పోన్ చేయనందుకు అతడు ప్రాణాలుతీసుకున్నాడని వేగంగా వార్తలు పాకాయి. వెంటనే ఆ హాస్టల్ ఈ హాస్టల్ అని తేడా లేకుండా ఎన్సీసీ నుంచి తార్నాకా ఆర్టీసీ ఆస్పత్రి వరకు వున్న వసతి గృహాల్లో ఉన్నవిద్యార్థులందరికీ ఈ విషయం తెలిసింది. వెంటనే ఒక్కొక్కరుగా హోలీ వేడుకలు పక్కన పెట్టి కదిలారు. కాసేపట్లనో చీమలదండుగా మారారు. రోడ్డుమీదనుంచి లైబ్రరీ వైపు వెళ్లేందుకు కాలు కూడా ముందుకు కదపలేనంతగా విద్యార్థులు. అక్కడక్కడా నలుగురు, ఐదుగురుపోలీసులు వారిని చుట్టుముట్టి ప్రశ్నిస్తూ విద్యార్థులు కనిపిస్తున్నారు. సరిగ్గా సరస్వతీ దేవాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని ఓ టార్పల్ కాగితంలో చుట్టి ఉంచారు. అంతకుముందే లైబ్రరీ వెనుక నీళ్ల ట్యాంకులోపలి నుంచి ఆ మృతదేహం బయటకు తీశారు. దీనిపై పోలీసులను వివరాలు కోరగా ఇప్పటి వరకు ఏమీ తెలియదని అన్నారు. రెండు రోజుల కింద చనిపోయి ఉండొచ్చని మాత్రం చెప్పారు. బాడీ డీ కంపోజ్ అయి దుర్వాసన వస్తుంది. అదేం పట్టించుకోకుండా విద్యార్థులు మృతదేహం ముందే కూర్చుని అతడు తమ యూనివర్సిటీ విద్యార్థేనని కావాలనే పోలీసులు వివరాలు మాయం చేశారని నినదిస్తున్నారు. ఇదే విషయంపై పోలీసులను ప్రశ్నించగా ఆధారాలు మాత్రం దొరకలేదని, ఒక మొబైల్ ఫోన్ మాత్రం లభ్యమైంది అని చెప్తుండగా పోలీసులు అబద్ధం చెప్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. 'అతడి వద్ద ఒక ఐడెంటీటి కార్డు కూడా ఉంది. కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. అతడి దుస్తులు చూసి గుర్తుపడతామేమోనని వాటిని కూడా పోలీసులు తీసి దాచారు' అని విద్యార్థులు ఆరోపించారు. కానీ కొద్ది సేపట్లోనే అతడు విద్యార్థే కాదని, మాణికేశ్వర్ నగర్ లోని అడ్డా కూలీ అని, ప్రసాద్ అనే వ్యక్తి కుమారుడు బాబా అని పోలీసులు చెప్పారు. దీంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడి వివరాలు తమకు పూర్ది స్థాయిలో చూపిస్తేనే మేం మృతదేహాన్ని అప్పగిస్తామని లేదంటే ఊరుకునేది లేదని, ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థి చనిపోతే అతడు కూలీగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాసేపు హైడ్రామా ఇదిలాఉండగా, చనిపోయిన వ్యక్తి తమవాడే అని బస్తీ(మాణికేశ్వర్ నగర్) నుంచి కొందరు వచ్చారు. విద్యార్థులు వారిని దగ్గరకు రానివ్వకపోవడంతో కాసేపటికీ ఇంకొందరు అతడు తమ పిల్లాడే అని అంటూ దఫాల వారిగా భిన్నమైన వ్యక్తులు చనిపోయింది తమ వాడే అంటూ వచ్చారు. పైగా వారిలో ఆ తాలూకు బాధ ఏది కనిపించకపోవడం విద్యార్థులకు కోపాన్ని తెప్పించింది. బస్తీ వాసులతో పోలీసులు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహం తీసుకుపోనివ్వకుండా అడ్డుపడ్డారు. ఈలోగా మాణికేశ్వర్ నగర్ కార్పోరేటర్ హరి వచ్చి అతడి ఆధ్వర్యంలో మృతదేహాన్ని తరలించారు. కాసేపట్లోనే రణరంగంలా.. మాణికేశ్వర్ నగర్ కార్పొరేటర్ హరి ఎప్పుడైతే మృతదేహం తరలించేందుకు వచ్చారో అప్పుడే పెద్ద పోలీసు పటాలం దిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాలు ఏమి చెప్పకుండా పోలీసులు మృతదేహం తరలిస్తుండటంతో కోపానికి లోనైన విద్యార్థులు వారిపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం ఆవిష్కృతమైంది. ఓయూ పోలీస్ స్టేషన్ వరకు వేలమంది విద్యార్థులు పోలీసులను తరిమితరిమి కొట్టగా తిరిగి రాళ్లతో విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. గాల్లో లేచిన పోలీసుల సుమో.. విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతుండగా పోలీసుల వాహనం టాటా సుమో ఆర్ట్స్ కాలేజీ వైపునుంచి వస్తుండగా ఒకేసారి విద్యార్థులు దానిపై రాళ్ల వర్షం కురిపించారు. సుమోను నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డు మీదనుంచి కారును పక్కకు తిప్పాడు. దీంతో ఆ సుమో ఏకంగా చుట్టూ పేర్చిన ఫెన్సింగ్‌ను ఢీకొట్టి గాల్లో లేస్తూ పార్క్‌లో నుంచి చిన్నచిన్న చెట్లు ఢీకొంటూ రెండో ఫెన్సింగ్ ను కూడా గుద్దేసి ఏకంగా వెళ్లి ఓయూ హాస్టల్స్ నిర్వహణా కార్యాలయానికి బలంగా ఢీకొట్టింది. అందులోని డ్రైవర్‌కు తీవ్రగాయాలయి వాహనమంతా రక్తసిక్తంగా మారింది. విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ వాహనాన్ని రిలీఫ్ వ్యాన్ సహాయంతో ఈడ్చుకెళ్లారు. ఇంతకి చనిపోయింది విద్యార్థా? బస్తీ వాసా? ఇంత జరిగినా అసలు చనిపోయింది విద్యార్థియేనా, లేక బస్తీకి చెందిన వ్యక్తా? అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా? అతడి పూర్తి వివరాలు ఏమిటీ అనే విషయం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మొత్తానికి హోలీ రోజు ఓయూ ఒకసారి మండుటెండల్లో మరింత హాట్ హాట్‌గా కనిపించింది. డీసీపీ ఏం చెప్పారంటే.. 'మాణికేశ్వరీనగర్కు చెందిన ప్రసాద్ OU లైబ్రరీ వెనుక వైపు ఉన్న ట్యాంక్‌లోపడి చనిపోయాడు. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరగడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాల సంఖ్య పెంచాలంటూ నినాదాలు చేస్తూ... కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో గాయాలైన పోలీసులకు 108 సిబ్బంది చికిత్స అందించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కేసులు నమోదు చేస్తాం' అని డీసీపీ రవీందర్ తెలిపారు. -
కాల్చబోయి..కాల్చుకున్నారు
-
ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డికి ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్ రావడంపై ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అందులోభాగంగా రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీపై విద్యార్థులు పెట్రోల్ తగలబెట్టారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న విద్యార్థి శివన్నారాయణపై ప్రమాదవశాత్తూ పెట్రోల్ పడి... మంటలు చెలరేగాయి. ఉహించని పరిణామం ఒక్కసారి ఎదురుకావడంతో అక్కడే ఉన్న విద్యార్థులంతా ఆందోళనకు గురైయ్యారు. ఆ వెంటనే తేరుకుని శివన్నారాయణకు అంటుకున్న మంటలను ఆర్పివేసి... ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఓయూ క్యాంపస్ పోలీసులు... ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా సిబ్బందిని మోహరించారు. -
ఓయూలో ఉద్రిక్తత
♦ ఆందోళనలు, అరెస్టుల మధ్య ♦ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవం ♦ బలవంతంగా విద్యార్థుల అరెస్ట్ ♦ పోలీసుల తీరుకు నిరసనగా ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ : ఆనందంతో జరగాల్సిన కళాశాల వార్షికోత్సవం విద్యార్థుల ఆందోళనలు, అరెస్టుల మధ్య జరిగింది. గురువారం ఓయూ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేసి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌లను ఆహ్వానించారు. అయితే కొంత కాలంగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు కోటూరి మానవతరాయ్, చైర్మన్ కళ్యాణ్‌లు కళాశాల వార్షికోత్సవానికి టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరైతే శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. యూనివర్సిటీ లైబ్రరీలో పీజీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈలోగా పోలీసులు లోనికి వెళ్లి ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులు లైబ్రరీ నుంచి బయటకు వస్తే అరెస్టు చేస్తామని మైకులతో హెచ్చరించారు. వార్షికోత్సవం జరిగే ఠాగూర్ ఆడిటోరియం వద్ద మూడంచెల పోలీసుల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. లైబ్రరీ, ల్యాండ్‌స్కేప్ గార్డెన్, ఆర్ట్స్ కళాశాల, లా కాలేజ్ తదితర ప్రాంతాలలో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. కాగా విద్యార్థుల అరెస్టుకు నిరసనగా నిరుద్యోగులు, విద్యార్థులు పలువురు లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు మూతులకు గుడ్డకట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవారం పాలన భవనాన్ని ముట్టడించనునట్లు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే వరకు టీఆర్ఎస్ మంత్రులను, పార్టీ శ్రేణులను ఓయూ క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వబోమని కళ్యాణ్ హెచ్చరించారు. -
ఉస్మానియాలో ఉద్రిక్తత
ఉస్మానియా క్యాంపస్(హైదరాబాద్): ఉస్మానియా క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీయస్ నాయకులు వంగపల్లి, మందకృష్ణ మాదిగలు ఆదివారం పోటాపోటీగా ఉస్మానియా క్యాంపస్‌లో మాదిగ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆర్ట్స్ కాలేజీ ముందు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మందకృష్ణ మాదిగ సభ జరగనుంది. అంతేకాకుండా, వంగపల్లి శ్రీను సభ సాయంత్రం 5 గంటలకు టాగూర్ ఆడిటోరియంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మందక్రిష్ణ వర్గం ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. -
పుష్కరాలకు.. రైట్ రైట్
గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా తరలిరానున్న భక్తుల కోసం ఆర్టీసీ రాష్ర్టవ్యాప్తంగా 620 బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే 100 సిటీ బస్సులను కూడా ఏర్పాటు చేయనుంది. వీటికి అవసరమైన తాత్కాలిక బస్టాండ్లు, ఏడు మార్గాలను గుర్తించింది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల ముందుంచారు. భక్తుల రాకపోకలు సులభతరంగా ఉండేలా నగరంలో మూడు తాత్కాలిక బస్టాండ్లను గుర్తించినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. లూథరగిరి, ప్రభుత్వ అటానమస్ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), ప్రధాన రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న గూడ్స్గేట్ ఏరియాలను గుర్తించారు. - రాజమండ్రి సిటీ నగరంలో బస్సులు తిరిగే మార్గాలు ఇవే...లాలాచెరువు-లూథరగిరి మార్గంలో వయా ప్రభుత్వ అటానమస్ కళాశాల, గోకవరం బస్టాండ్, లాలాచెరువు మీదుగా 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.సాయినగర్-లూథరగిరి మార్గంలో వయా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, ఆజాద్ చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. సాయినగర్-వేమగిరి మార్గంలో వయా ఆర్టీసీ కాంప్లెక్స్ కోటిపల్లి బస్టాండ్ ,రైల్వే స్టేషన్ , సాయినగర్ 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.గోకవరం బస్టాండ్ - గోకవరం బస్టాండ్ వయా ప్రభుత్వ అటానమస్ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), లాలాచెరువు, మోరంపూడి జంక్షన్, వేమగిరి, ధవళేశ్వరం, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్, తాడితోట, ఆజాద్ చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ ప్రాంతాల్లో 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.లాలాచెరువు- లాలాచెరువు వయా మోరంపూడి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట, ఆజాద్ చౌక్,దేవీచౌక్, లాలాచెరువు ప్రాంతాల్లో 15 బస్సులు నడపనున్నారు. లాలాచెరువు - లాలాచెరువు వయా ఆనాల వెంకట అప్పారావు రోడ్, రామాలయం జంక్షన్, గోరక్షణపేట, ఆజాద్ చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్, లాలాచెరువు ప్రాంతాల్లో 15 బస్సులు నడపనున్నారు.గోకవరం బస్టాండ్-రాజానగరం వయా కంబాలచెరువు, ఆర్ట్స్ కాలేజ్, లాలాచెరువు,దివాన్‌చెరువు రాజాగరం ప్రాంతాల్లో పది బస్సులను నడపనున్నారు. పుష్కరాల భక్తులకు అన్నివిధాలా సౌకర్యంగా ఉండేందుకు అవసర మైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామ ఆర్ఎం ఆర్వీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 620 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
అనంతపురం స్పోర్ట్స్ : అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మంత్రి ర్యాలీని ప్రారంభించారు. రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీలో ‘ఎయిడ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంతో మంది యువత ఎయిడ్స్ మహమ్మారికి బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యంతో దాన్ని నివారించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎయిడ్స్‌ను పారదోలేందుకు పది నిమిషాలు చర్చించేలా చర్యలు తీసుకుంటామని, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామన్నారు. ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారిని సామాజిక స్పృహతో ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. వారి పట్ల వివక్ష చూపకుండా అందరిలాగే చూడాలన్నారు. తెలిసో తెలియకో ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయొద్దని సూచిం చారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ను తరిమికొట్టే దిశగా ఆరోగ్యశాఖ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ ప్రభుదాస్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. హెచ్ఐవీ బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మదమంచి స్వరూప, అనంత నెట్ వర్క్ ఆఫ్ పాజిటివ్స్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఉర్రూతలూగించిన యువతరంగం
అనంతపురం కల్చరల్: జిల్లా స్థాయిలో రెండు రోజులు జరిగే డిగ్రీ కళాశాలల విద్యార్థుల యువతరంగం శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. 15 కళాశాలల విద్యార్థులు తమదైన అభినయంతో అందరిని ఆకట్టుకున్నారు. మిమిక్రీ, మోనోయాక్షన్, లఘునాటికలు, చుక్కల ముగ్గులతో పాటు వ్యాసరచన, వక్తృత్వం తదితర వాటిల్లో తమ ప్రతిభ ప్రదర్శించారు. ముఖ్యంగా శ్రీవాణి కళాశాల విద్యార్ధిని సుజిత ప్రదర్శించిన ‘మృత్యుఘోష’ శ్రీరాములు ప్రదర్శించిన కన్నతల్లి ఆవేదన ఏకపాత్రాభినయాలు అందరినీ మంత్రముగ్దుల్ని చేసాయి. అమ్మాయిలు ముత్యాల ముగ్గులతో, స్పాట్ పెయింటింగ్స్‌తో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ జనార్దనశాస్త్రి మాట్లాడుతూ యువతలో అంతర్లీనంగా దాగున్న సృజనాత్మకతకు పదును పెట్టే యువతరంగం స్ఫూర్తిదాయకంగా సాగడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ లక్ష్మీనారాయణ సమన్వయకర్తగా వ్యవహరించిన యువతరంగానికి పల్లవి, శేషయ్య, సత్యనారాయణ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలు వీరే... వ్యక్తృత్వం తెలుగులో నితిన్, ఆంగ్లంలో లక్ష్మణ్ణ, వ్యాసరచన లో హుస్నాబాను, మహబూబ్‌బాషా, హంసలేఖ, జేబాతహసిన్ ప్రతిభ కనబర్చారు. పద్యపఠనంలో మాధురి, ఏకాంకికలో గుంతకల్లు ప్రభుత్వ డిగ్రీకళాశాల బృందం, స్పాట్ పెయింటింగ్‌లో సోమశేఖర్, చుక్కల ముగ్గులో హరిత తదితరులు విజేతలుగా నిలిచారు. వీరికి శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులందిస్తారు. -
వర్సిటీకి తీరని నష్టం
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్ధాలుగా ఉన్న భారీ వృక్షాలు హుదూద్ దెబ్బకు నేలకొరిగాయి. పరిపాలనా భవనం, ఆర్ట్స్ కళాశాల, స్టేట్‌బ్యాంక్, రిజిస్ట్రార్ నివాసం, బోటనీ విభాగం, ఎకనామిక్స్ భవనం తదితర ప్రాంతాల్లోని పెద్ద వృక్షాలు కొన్ని పెకలించుకుపోయాయి. విద్య పరిశోధకుల వసతిగృహంలో ఉన్న భారీ మామిడి చెట్టు కూలిపోయింది. విద్యుత్ స్తంభాలు, దీపాలు నేలరాలాయి. భవనాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు దెబ్బతిన్నాయి. వర్సిటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. హుదూద్ తీవ్రతకు దెబ్బతిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖ ఎంపీ హరిబాబు సోమవారం పరిశీలించారు. ఏయూకు రెండు వారాలు సెలవులు ఆంధ్రా యూనివర్సిటీకి రెండు వారాలు సెలవులిస్తున్నట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించారు. వర్సిటీ ఆవరణలో కూలిన చెట్లను తొలగించి, పరిస్థితి చక్కదిద్దేందుకు రెండు వారాలు పట్టే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి జరగాల్సిన మిడ్ టర్మ్ పరీక్షలను వాయిదా వేశారు. తుపాను కారణంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం జరగాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ రీజనల్ డెరైక్టర్ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తారు. -
వీళ్లకేం మేసే రోగం!
వాళ్లంతా ప్రభుత్వోద్యోగులు. నెల తిరిగే సరికి వేలాది రూపాయల వేతనం చేతికందుతుంది. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా బతికేయొచ్చు. తాము చే సిన పనికి లభించిన వేతనంతో తృప్తిపడదామని అనుకోవడం లేదు. కానీ ఎందుకో ప్రజల సొమ్మును కూడా భోంచేయాలనే దుర్బుద్ధి పుడుతోంది. ఇంకేముంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగుల తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి. కడప అర్బన్: కడప ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 18.60 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి రూ. 5 లక్షలు మాయం చేసేశాడు. ఇక కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది ఏకంగా తాకట్టు పెట్టిన బంగారు నగలనే మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఐదు లక్షలు మాయం.. ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చక్రపాణి గతనెల 28వ తేదీన రూ.13లక్షలు ట్రెజరీ నుంచి నగదు రూపంలో కార్యాలయానికి తీసుకొచ్చాడు. రూ.5లక్షలను ఉద్యోగులకు వేతనాలుగా పంపిణీ చేశాడు. మిగిలిన రూ.8లక్షలను బీరువాలో ఉంచి సెలవుపై వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత కార్యాలయానికి తిరిగి వచ్చి బీరువా తెరిచి చూస్తే రూ.3లక్షలు మొత్తం మాత్రమే ఉంది. మిగిలిన రూ.5లక్షలు కనిపించలేదు. బీరువాకు వేసిన తాళం వేసినట్లే ఉంటే ఈ ఐదు లక్షలు ఎలా మాయమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం సదరు ఉద్యోగి అయినా చెప్పాలి.. లేదంటే కార్యాలయ ఉన్నతాధికారులైనా చెప్పాలి. ఇవేమీ లేకుండా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే, డబ్బు గురించి పూర్తిగా విచారించకుండానే సంజాయిషీ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం.. అదేరోజు అకౌంటెంట్ రూ.5లక్షలు ఠంచన్‌గా జమ చేసేయడాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఇక్కడి డీటీసీపై సీరియస్ అయ్యారు. రికార్డులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అకౌంటెంట్ చక్రపాణిని సస్పెండ్ చేశారు. డీసీసీ బ్యాంక్‌లో బంగారు మాయ... చెన్నూరుకు చెందిన సాదక్ అలీ 2012 మే 4న తన అవసరం కోసం 9.5 తులాల బంగారు ఆభరణాలను జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ.1.36లక్షలను రుణంగా తీసుకున్నాడు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకు అప్రైజర్ వీరబ్రహ్మాచారి నగలను పరిశీలించి వాటి నాణ్యత, విలువను నిర్ధారించాకే రుణం మంజూరైంది. మరలా 2013 జులై 25న రెన్యువల్ చేసేటప్పుడు కూడా అదే అప్రైజర్ బంగారు ఆభరణాలను సరిచూశారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు గత నెల 27వ తేదీన వీరబ్రహ్మాచారి, మరో అప్రైజర్ పి.గిరి 520 ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలను రెండు రోజుల్లో సరి చూశారు. ఈ క్రమంలో సాదక్ అలీ రెండు రోజుల క్రితం రెన్యువల్ కోసం డబ్బు కట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన నగలు నకిలీవని బ్యాంక్ అధికారులు తె లపడంతో అవాక్కైన సాదక్ అలీ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్కె వలీచాంద్ కూడా తమ సిబ్బందితో వచ్చి సాదక్ అలీ ఇచ్చిన నగలు నకిలీవని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారించి ఆ నగలను తీసుకురావాలని చెప్పినప్పటికీ బ్యాంకు అధికారులు నగలను అప్పజెప్పకుండానే కేసు నమోదు చేయాలని కోరడం గమనార్హం. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇటీవల ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ సాక్షరభారత్ నిధులను స్వాహా చేశారనే కారణంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో కడపలో ఓ స్టేట్‌బ్యాంక్ అధికారి కూడా ఇదే రీతిలో మోసాలకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ట్స్ కళాశాలలో ఏం జరిగిందంటే.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 2013లో తమ కళాశాలలో డిగ్రీ చదివి వెళ్లిన మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ అనే విద్యార్థి పేరు మీద సెంట్రల్ బ్యాంక్‌లో ఖాతా ఉండటంతో తన దగ్గరున్న చెక్కు బుక్కుతో అక్షరాలా రూ.4.30 లక్షలను రాయించి ఇచ్చాడు. ఆంధ్రాబ్యాంక్‌కు చెక్కు వెళ్లి సెంట్రల్ బ్యాంక్‌లో కృపాకర్ ఖాతాలో రూ.4.30లక్షలు జమ అయింది. కృపాకర్‌ను అడ్డుపెట్టుకొని రఘురామిరెడ్డి, అతని స్నేహితుడు ఎంఎం బాషా, వారి సహచరులు చిన్ని, మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కవిత అనే వారు ఎంచక్కా రూ.4.25లక్షలను డ్రా చేసుకున్నారు. సెంట్రల్ బ్యాంక్ మేనేజర్‌కు అనుమానం వచ్చి ఆర్ట్స్ కళాశాల ఖాతా నుంచి ఒకే విద్యార్థికి రూ.4.30లక్షలు ఎందుకు జమ అయిందో సంజాయిషీ అడిగారు. సదరు విద్యార్థిని పిలిపించి అథారిటీ లెటర్ తీసుకురావాలని కోరారు. కృపాకర్ రఘురామిరెడ్డిని సంప్రదించగా కవిత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్ తయారుచేసి ఇచ్చింది. ఆ సంతకాలలో ఒకటి నకిలీదని బ్యాంక్ మేనేజర్ గుర్తించి నిలదీశారు. ప్రిన్సిపల్‌ను పిలిపించి వ్యవహారాన్ని తేల్చమని చెప్పారు. దీంతో ఆమె రఘురామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో రఘురామిరెడ్డి అండ్ పార్టీ వ్యవహారం బయటపడింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన ఖాతాలు బోలెడున్నాయి. ఇదే అదనుగా భావించిన రఘురామిరెడ్డి మొదట తన స్నేహితుడు ఎంఎంబాషా పేరుతో రూ.4600 చెక్కును రాయించి ఎస్బీఐ బ్యాంక్‌కు పంపించాడు. వెంటనే ఆ మొత్తం ఎంఎంబాషా పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత మారుతీనగర్‌కు చెందిన కృపాకర్ పేరు మీద రూ.4.30 లక్షలు, రామిరెడ్డి అనే వ్యక్తి పేరు మీద రూ.4,84,500, రూ.4,74,500 అనే రెండు చెక్కులు రాయించాడు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచి ఈ మొత్తం ఖాతాలో పడగానే డబ్బును డ్రా చేసుకొని వెంటనే ఖాతా కూడా రద్దు చేసుకున్నాడు. రఘురామిరెడ్డి బంధువు మనోరంజన్‌రెడ్డి అనంతపురంలో వ్యాపారం చేస్తున్నాడు. అతని స్నేహితుడు సర్దార్ ఖాతాలో రూ.4.70లక్షల మొత్తాన్ని జమచేసి వెంటనే డ్రా చేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.18.60లక్షలను స్వాహా చేసిన రఘురామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇన్ని లక్షల రూపాయలను స్వాహా చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనేది అర్థంకాని ప్రశ్న. -
తెలుగు భాషను మరవొద్దు
అనంతపురం క ల్చరల్ : పర భాష మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను మరవొద్దని వక్తలు పేర్కొన్నారు. వాడుక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ఆర్ట్స కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగుభాషా దినోత్సవం నిర్వహించారు. ‘మా తెలుగు తల్లికి మల్లపూ దండ’ గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. ‘కమ్మనైన తెలుగు భాష.. కలనైన మరవొద్దు’ అంటూ శ్రీధర్‌నాయుడు ఆలపించిన భాషోద్యమ గీతం స్పందింపజేసింది. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బ్రహ్మానందం, ఆర్ట్స కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగస్వామి, సీనియర్ అధ్యాపకులు సింహాద్రి, పీజీ తెలుగు కో ఆర్డినేటర్ మల్లికార్జున తదితరులు తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. వందేళ్ల కిందటే తెలుగు భాష అచ్చు గ్రాంధికంలో ఉండటంతో జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి వ్యవహారిక (వాడుక) భాష అవసరమని గుర్తించిన గిడుగు రామ్మూర్తి, గురజాడ, ఆదిభట్ల నారాయణదాసు వంటి వారి దార్శనికత అత్యద్భుతమన్నారు. వారి ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. వ్యవహార భాష ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విద్యార్థులకు విధిగా తెలుగును వంటబట్టించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి ఎక్కువగా ఉండాలని సూచించారు. తెలుగుభాష సుసంపన్నానికి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రాంతాల వారు సమానంగా కృషి చేశారన్నారు. అనంత వాసులలో సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువని కొనియాడారు. అనంతరం బ్రహ్మానందంను పూర్వ విద్యార్థులు, ఆధ్యాపకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జూపల్లి ప్రేమ్‌చంద్, జెన్నే ఆనంద్, లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, సుందరమోహనరెడ్డి, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు. సాహితీ అభిమానుల అసంతృప్తి : తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం పట్ల పలువురు సాహితీ అహిమానులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల ముందు నుంచే హడావుడి చేసే తెలుగు భాషా వికాస ఉద్యమ నిర్వాహకులు కూడా ఈసారి మిన్నకుండిపోవడం నిరాశ కలిగించిందన్నారు. -
నిధుల్లేక ‘ఆంధ్రో’ళన
ఏయూ క్యాంపస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విశిష్ట స్థానం ఉంది. పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తూ ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాదిమంది విద్యార్థులకు విద్యను చేరువ చేస్తోంది. ప్రతిష్టాకరమైన విశ్వవిద్యాలయం ఇప్పుడు ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంతంతమాత్రంగానే ఉండడం, అంతర్గతంగా నిధులు సమకూర్చుకోవడం కష్టతరంగా మారుతోంది. వర్సిటీ నిర్వహణ, అభివృద్ధి గగనంగా తయారైంది. ఆచార్యుల కొరత ఆర్ట్స్ కళాశాల పరిధిలో 97, సైన్స్ కళాశాల పరిధిలో 97, ఇంజినీరింగ్ కళాశాలలో 136, న్యాయకళాశాలలో 10, ఫార్మసీ కళాశాలలో 13 ,దూరవిద్యలో 12, అనుబంధ పీజీ కేంద్రాల్లో 11 మంది ఆచార్యులు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు(కాంట్రాక్ ్టపద్ధతిన) 130 మంది పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా మరికొందరు కొనసాగుతున్నారు. వర్సిటీలో ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాల్సి ఉండగా, 24 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడే ఉన్నారు. కొన్ని విభాగాల్లో కేవలం ఒకరిద్దరు ఆచార్యులతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఆర్ట్స్ కళాశాలల పరిధిలో చరిత్రలో 1, హిందీలో 2, తత్వశాస్త్రంలో 2, సోషియాలజీలో 2, లిగ్విస్టిక్స్లో 1, ఎడ్యుకేషన్, ఎంజేఎంసీ, సంగీతం, సైకాలజీ, సంస్కృతం విభాగాల్లో 3 ఆచార్యులు చొప్పున ఉన్నారు. సైన్స్ కళాశాల పరిధిలో జియో ఫిజిక్స్‌లో 3, హ్యూమన్ జెనిటిక్స్‌లో 3, మైక్రోబయాలజీలో 1, న్యూక్లియర్ ఫిజిక్స్‌లో 3, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫుడ్, డ్రగ్, వాటర్ విభాగంలో కేవలం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ప్రతి విభాగంలో ఒక ఆచార్యుడు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చొప్పున ఉండాలి. ప్రస్తుతం ఈ విధానం వర్సిటీలోని ఏ ఒక్క విభాగంలోను కనిపించడంలేదు. ఏటా నూతన కోర్సులు, విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా వీటికి అనుగుణంగా ఆచార్యుల సంఖ్య పెరగడం లేదు. బ్లాక్గ్రాంట్పైనే ఆశలు వర్సిటీకి ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్‌గా వస్తున్న రూ.130.38 కోట్లు కేవలం మూడు నెలల వేతనాలకు సరిపోతోంది. అంతర్గతంగా సమకూర్చుకున్న నిధులతో కాలం వెళ్లదీస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.118.38 కోట్ల లోటు బడ్జెట్‌తో బండి నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం 509 ఆచార్యుల నియామకాలకు అనుమతులు మంజూరు చేసింది. కానీ ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదు. ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన హామీ వస్తేగాని ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం లేదు. దీంతో బ్లాక్ గ్రాంట్పైనే వర్సిటీ ఆశలు పెట్టుకుంది. వీటికి నిధులెలా? వర్సిటీకి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వసతి సమస్య వెంటాడుతోంది. అదనపు వసతిగృహాలు నిర్మించాల్సి ఉంది. క్రీడా విభాగం పూర్తిస్థాయిలో ఆధునికీకరణకు రూ.50 కోట్లు, భవనాల ఆధునికీకరణ, మరమ్మతులకు రూ.50 కోట్లు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది గృహాల ఆధునికీకరణకు రూ.50 కోట్లు, బోధనేతర సిబ్బంది నియామకం, వేతనాలకు ఏడాదికి సుమారు రూ.60 కోట్లు, భూముల పరిరక్షణకు అవసరమైన రక్షణ గోడ నిర్మాణానికి రూ.50 కోట్లు, నిరంతరాాయంగా విద్యుత్ సరఫరాకు రూ.20 కోట్లు, ప్రయోగశాల అభివృద్ధి, నూతన పరికరాల కొనుగోలుకు ఏడాదికి రూ.50 కోట్లు అవసరం అవుతుంది. సెంట్రల్ హోదా ప్రతిపాదన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రలో కేంద్రీయ విద్యా సంస్థలు నెలకొల్పనున్నారు. దీంతోపాటు ఏయూను కేంద్రీయ వర్సిటీగా మార్చాలని, ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు ఐఐటీ హోదా కల్పించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏయూను సెంట్రల్ వర్సిటీగా మార్చడం ద్వారా వసతుల కల్పన సాధ్యమవుతుంది. -
గస్తీ..సుస్తీ!
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కొల్లగొడుతున్నారు. వారి ఆట కట్టించడంలో విఫలమైన పోలీసులు... బాధితులపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఎవరైనా తమ ఇంట్లో చోరీ జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళితే సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు. విలువైన వస్తువులు,డబ్బు దాచుకునే పద్ధతి ఇదా? నిజంగా అంత సొత్తు చోరీ అయ్యిందా? అంటూ బాధితులనే దొంగల్లా చూస్తున్నారు. దీనివల్ల అనేకమంది స్టేషన్ మెట్లెక్కడానికి భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల గస్తీ తగ్గడం దొంగలకు అవకాశంగా మారింది. ఇదే అదునుగా బరి తెగించి ఇళ్లను కొల్లగొడుతున్నారు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో జరిగిన చోరీల్లో దాదాపు 40 తులాల బంగారం, 28 కిలోల వెండి వస్తువులు, రూ.2 లక్షల నగదు కొల్లగొట్టారు. నాలుగు రోజుల క్రితం అనంతపురం నగరంలోని ఆంజనేయనగర్‌లో అసిస్టెంట్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్ సుందర్ ఇంట్లో 25 కిలోల వెండి, ఐదు తులాల బంగారు, రూ.లక్ష నగదు చోరీ చేశారు. త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెండో రోడ్డులో ఆర్ట్స్ కళాశాల ఉద్యోగి ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. గౌరవ్ గార్డెన్స్‌లో నివాసముంటున్న మున్నీ ఇంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. రూ.52 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు నగలు, విలువైన చీరలు అపహరించుకుపోయారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అనురాధ అనే మహిళ నుంచి పట్టపగలే ఓ దొంగ హ్యాండ్ బ్యాగు లాక్కొని వెళుతుండగా.. ప్రయాణికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మే 4న నగరంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఏకంగా లాకరును తెరిచి చోరీకి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో చివరి క్షణంలో అక్కడి నుంచి ఉడాయించారు. కళ్యాణదుర్గం రోడ్డులోని ఎస్బీహెచ్లో కూడా లాకరును తెరిచేందుకు విఫలయత్నం చేశారు. డబ్బు జమ చేసేందుకు అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఎస్బీఐ- ఏడీబీ బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళను దొంగలు ఏమార్చి రూ.పది వేలు అపహరించారు. ఈ బ్యాంకు వద్ద దొంగలు తరచూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నా పోలీసులు ఒక్కరినీ పట్టుకున్న పాపానపోలేదు. రాప్తాడు మండలం మరూరులో పసుపుల చిన్న నరసింహులు ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. రూ.పది లక్షలు విలువైన బాండ్లు, రూ.1.17 లక్షల నగదు అపహరించుకెళ్లారు. తాజాగా గురువారం తెల్లవారుజామున రాప్తాడులోని మూడిళ్లలో చోరీ జరిగింది. దారి శ్రీనివాసులు ఇంట్లో రెండు తులాల బంగారు నగలు, గవ్వల పరంధామ ఇంట్లో నాలుగు తులాల బంగారం, వికలాంగుడైన జానకిరామయ్య ఇంట్లో రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. మే 27న ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ శివారులో సావిత్రి అనే మహిళ కళ్లలో కారం చల్లి బంగారు గాజులతో పాటు గొలుసు, ఉంగరాన్ని లాక్కెళ్లారు. పది తులాలకు పైగా బంగారం అపహరించుకెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మే 29న ధర్మవరంలోని చంబ్రాబాబు నగర్లో ఒకే రోజున నాలుగు ఇళ్లలో దొంగలు పడ్డారు. 10 తులాల బంగారంతో పాటు వెండి, కొంత నగదు చోరీ చేశారు. చోరీలను నివారిస్తాం ఇన్నాళ్లూ పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నందున చోరీల నివారణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయాం. ఇక మీదట నిఘా కట్టుదిట్టం చేస్తాం. దొంగల ఆట కట్టిస్తాం. - నాగరాజ, అనంతపురం డీఎస్పీ -
రాష్ట్ర సలహామండలిలో జిల్లావాసికి చోటు
ఆరుగురి సభ్యుల్లో రిటైర్డ్ ఐఏఎస్ పాపారావుకు అవకాశం అస్సాం హోం సెక్రటరీగా విధులు.. ఐక్యరాజ్యసమితిలోనూ బాధ్యతలు ఇన్టాక్ లైఫ్ మెంబర్‌గా కొనసాగుతున్న విశ్రాంత అధికారి కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి ఆరుగురు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సలహా సంఘం సభ్యుల్లో బీవీ.పాపారావుకు అవకాశం దక్కింది. పాపారావు వరంగల్ జిల్లా వాసి. ఆయన స్వగ్రామం నెల్లికుదురు మండలం మునిగలవీడు. 1970 దశకంలో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో పాపారావు డిగ్రీ చదివారు. అనంతరం 1982 బ్యాచ్ అస్సాం కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం హోం సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున పని చేశారు. పాపారావుకు మంచి పరిపాలనాదక్షుడిగా పేరుంది. ఉద్యోగ కాలం పూర్తి కాకుండానే ముందస్తు ఉద్యోగ విరమణ చేసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వారసత్వ సంపద పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాలకుర్తి మండలం బమ్మెరలో పొతన వంశీకులకు సంబంధించి సుమారు నాలుగు ఎకరాల భూమిని కొని అభివృద్ధి చేస్తున్నారు. ఇన్టాక్ లైఫ్ మెంబర్‌గా కూడా పాపారావు ఉన్నారు. కాకతీయ ఉత్సవాల సమయంలో ప్రతే ్యకంగా కాఫీటేబుల్ బుక్ రూపొందించారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువులపై ‘ఇరిగేషన్ ఆఫ్ కాకతీయ’ పేరుతో సమగ్ర సమాచారం సేకరించి అందుబాటులో ఉంచారు. 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు జయూపసేనాని రచించిన నిత్యరత్నావళి గ్రంధాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ప్రపంచవ్యాప్తంగా కాకతీయ కీరిన్తి ఇనుమడింపజేసేందుకు కృషిచేశారు. ఇన్టాక్ కన్వీనర్‌గా పనిచేస్తున్న నిట్ పూర్వ ఆచార్యులు పాండురంగారావు ఈ మేరకు స్పందిస్తూ... ‘మేము ఇన్టాక్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా కలిసి పనిచేస్తున్నాం. పాపారావు ప్రభుత్వ సలహా సంఘంలో సభ్యుడిగా నియమితులు కావడం సంతోషదాయకం. పాపారావు మార్గనిర్ధేశకంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.’ అని ఆకాంక్షించారు. -
విద్యార్థులకు వరం
వైవీయూ, న్యూస్‌లైన్ : కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యావిధానంలో సైతం అధునాతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా తాను చదివే చదువుతో పాటు నచ్చిన సబ్జెక్టుల్లో సైతం ప్రావీణ్యం పొందుతూ డిగ్రీ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని ఉన్నతవిద్యాశాఖ విద్యార్థులకు అందిస్తోంది. ప్రయోగాత్మకంగా రాష్ర్టవ్యాప్తంగా తొలిసారి చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పేరుతో నచ్చిన విద్యను అందిపుచ్చుకునేందుకు అటానమస్ హోదా కలిగిన 10 కళాశాలలను ఎంపికచేశారు. రాయలసీమ నుంచి కర్నూలు సిల్వర్జూబ్లి కళాశాలతో పాటు కడపకు చెందిన ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) అంటే.. డిగ్రీ విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టుతో పాటు ఇతర అంశాలపైనా అవగాహన పొందేందుకు రూపొందిస్తున్న పాఠ్యప్రణాళికా విధానమే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఈ సిస్టమ్‌ను 2014-15 విద్యాసంవత్సరం నుంచి స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలో తొలిసారిగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కళాశాలల అధ్యాపకుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన ఉన్నత విద్యాశాఖ ఈ యేడాది నుంచి అమలుచేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విధానం ప్రకారం కాలేజ్ స్టడీస్ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. ప్రతి విభాగానికి అనుబంధంగా మరో రెండు ఏవైనా పరీక్షపత్రాలను విద్యార్థి చాయిస్ విధానంలో ఎన్నుకోవచ్చు. ఓ విద్యార్థి బీఎస్సీ చదువున్నట్లయితే ఆ విద్యార్థి సాప్ట్వేర్ కానీ పర్యాటకం, జెమాలజీ, జర్నలిజం ఇలా ప్రత్యేకతలు కలిగిన 18 అంశాల్లోని ఏవైనా సబ్జెక్టును ఎన్నుకోవచ్చు. అలాగే ఒక గ్రూపునకు సంబంధించిన విద్యార్థులు మరో గ్రూపుకు చెందిన సబ్జెక్టులను సైతం ఐచ్చికంగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షా విధానంలో సైతం గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అవుట్ స్టాండింగ్ గ్రేడ్, ఏ గ్రేడ్, బీ గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఇ గ్రేడ్, నాట్ క్వాలిఫైడ్ గ్రేడిం గ్ (ఎఫ్ గ్రేడ్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెమిస్టర్ స్థానంలో మాడ్యూల్స్.. ఈ యేడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందే విద్యార్థి తొలిసంవత్సరం క్రెడిట్ 1, క్రెడిట్ 2తో ప్రథమ సంవత్సరం పూర్తయిన తర్వాత సెకండియర్ చివరలో సర్టిఫికెట్ కోర్సు లేదా విద్యార్థి ఐచ్ఛిక సబ్జెక్టు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. చదువుతున్న సిలబస్‌కు అవసరాన్ని బట్టి అదనంగా చేర్చడం లేదా తొలగించడం తదితర ప్రక్రియలతో కూడిన విధానం విద్యార్థికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతం.. జిల్లాలో అటానమస్ పొందిన కళాశాల కావడంతో సీబీసీఎస్‌ను ఆర్ట్స్ కళాశాలలో అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థి స్వేచ్ఛగా తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకుంటూ ఇతర సబ్జెక్టులపైనా అవగాహన పొందవచ్చు. ఈ యేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం అమలుపరచనున్నాం. - డాక్టర్ రవికుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప -
సామాజిక న్యాయం కోసమే తెలంగాణ ఇచ్చాం
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాంరమేశ్ రాక సందర్భంగా ఆదివారం నగరకాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో సంబరాలు జరిగాయి. సభ అనంతరం కనివినీ ఎరగని రీతిలో దాదాపు రెండుగంటలపాటు బాణాసంచా పేలుళ్లతో జిల్లా కేంద్రం మారుమోగింది. ఆకాశంలో అద్భుత విన్యాసాలతో నగరవాసులంతా ఇళ్లనుంచి బయటకు వచ్చి బాణాసంచాల పేలుళ్లను ఆసక్తిగా చూశారు. చిన్నపిల్లలు కేరింతలు కొట్టారు. మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రదేశం నుంచి బాణాసంచా పేల్చారు. అక్కడే టపాసులతో ‘జై తెలంగాణ..జైసోనియా...జై కాంగ్రెస్...జైరాం..’అన్న అక్షరాలు రావడం సభికులను అబ్బురపరిచింది. క్రాకర్స్షోను కేంద్రమంత్రి జైరాం రమేశ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆసక్తిగా వీక్షించారు. జైరాం రమేశ్‌కు ఘనస్వాగతం తెలంగాణ బిల్లును రూపొందించి రాష్ట్ర ఏర్పాటులో ప్ర ధానపాత్ర పోషించి తొలిసారి జిల్లాకు వచ్చిన జైరాంరమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం ల భించింది. బైపాస్‌రోడ్డు వద్ద స్వాగతం పలికిన అనంత రం, ఓపెన్‌టాప్ జీబులో జైరాంరమేశ్‌ను బైపాస్, కో తిరాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్వాడి, బస్టాండ్ మీదు గా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గంమధ్యలో మహిళలు, యువకులు, తె లంగాణ వాదులు జైరాంరమేశ్‌కు అభివాదం చేశారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎం పీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, విప్ ఆరెపల్లి మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్న కృష్ణ తదితరులు ఉన్నారు.ాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్వాడి, బస్టాండ్ మీదు గా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గంమధ్యలో మహిళలు, యువకులు, తె లంగాణ వాదులు జైరాంరమేశ్‌కు అభివాదం చేశారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎం పీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, విప్ ఆరెపల్లి మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్న కృష్ణ తదితరులు ఉన్నారు. -
తాట తీస్తాం
పుస్తకాల్ని పక్కన పెట్టి వీధి రౌడీల్లా వ్యవహరించారో... తస్మాత్ జాగ్రత్త అంటూ విద్యార్థులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బస్సుల్లో శృతి మించి వ్యవహరిస్తున్న కొందరు విద్యార్థులపై నిఘా పెంచేందు కు ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లతో 45 ప్రత్యేక బృందాల్ని శుక్రవా రం రంగంలోకి దించారు. సాక్షి, చెన్నై: రాజధాని నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ప్రైవేటు ఆర్ట్స్ కళాశాలల విద్యార్థుల మధ్య తరచూ వివాదం రాజుకుంటున్న విషయం తెలి సిందే. కొన్ని మార్గాల్లో తిరిగే బస్సుల్లో కొందరు విద్యార్థుల మరీ శృతిమించి వ్యవహరిస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది. అదే సమయంలో కళాశాలల్లో చోటు చేసుకున్న గొడవలు, వ్యక్తిగత వివాదాలు, ప్రేమ తగాదాలతో విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం నగరం లో మూడుచోట్ల విద్యార్థులు వీరంగం సృష్టించి ఒక బస్సును ధ్వంసం చేశారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేం దుకు నగర పోలీసు కమిషనర్ జార్జ్ సిద్ధమయ్యారు. రంగంలోకి బృందాలు: ఇక మీదట విద్యార్థులు దుడ్డు కర్రలు, రాడ్లతో పట్టుబడితే వారిపై కఠిన సెక్షన్లను నమోదు చేయడంతో పాటుగా కొన్నాళ్లు కటకటాల్లోకి నెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థుల కదలికల్ని పసిగట్టేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. జాయింట్ కమిషనర్లు శ్రీధర్, తిరుజ్ఞానం, శంకర్, షణ్ముగ వేల్తో పర్యవేక్షణలో 45 ప్రత్యేక బృందాలు శుక్రవారం రంగంలోకి దిగాయి. ఉత్తర చెన్నై పరిధిలో 15, దక్షిణ చైన్నై, తూర్పు చెన్నై, పశ్చిమ చెన్నై పరిధుల్లో పది చొప్పున బృందాల్ని నియమించారు. ఒక్కో బృందంలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు సబ్ఇన్స్పెక్టర్లు, ఐదురు కానిస్టేబుళ్లు విధుల్ని నిర్వర్తించనున్నారు. ఆయా జోన్ల పరిధి నుంచి అన్నా శతకం, పురసై వాక్కం, ఎగ్మూర్, సెంబియం, ఆవడి, తంగసాలై, మైలాపూర్, రాయపేట, నుంగబాక్కం, అరుబాక్కం మీదుగా సాగే బస్సుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మఫ్టీలో సిబ్బంది తిరగనున్నారు. ఏ విద్యార్థి అయినా సరే శృతిమించి వ్యవహరిస్తే వారిని పట్టుకుని మళ్లీ తప్పు చేయని విధంగా తాట తీస్తారు. అలాగే ఆయా మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఈ బృందాలు గస్తీలో ఉంటాయి. ఎక్కడైనా విద్యార్థులు వీరంగం సృష్టించినా, శృతిమించి వ్యవహరించినా, ఎవరైనా ప్రయాణికులు ఈ గస్తీ బృందాలకు సమాచారం ఇచ్చినా సరే, తక్షణం అక్కడికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. -
రణరంగంగా ఆర్ట్స్ కళాశాల
ప్రిన్సిపాల్ తీరుకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన ఆరు గంటలసేపు గందరగోళం ప్రిన్సిపాల్ చాంబర్ ముట్టడి యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల శనివారం రణరంగంగా మా రింది. హాజరుతో పనిలేకుండా అందరినీ పరీక్షకు అనుమతించాలంటూ రెండువేల మంది విద్యార్థులు మూకుమ్మడిగా ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో మరింత రెచ్చిపోయారు. ఈలలు, కేకలతో కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. కొందరు విద్యార్థులు రాళ్లు, ఇసుక రువ్వడంతో ఓ పోలీసు అధికారి గాయపడ్డాడు. ఆపై ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి చక్కబడింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలకు మార్చి 10వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువు ఈనెల 20వ తేదీతో ముగస్తుంది. హాజరు శాతం 75 కంటే తక్కువ ఉన్నవారి జాబితాను శనివారం నోటీసు బోర్డులో పెట్టారు. 50 నుంచి 75 శాతం మధ్య హాజరు ఉన్నవారు అపరాధ రుసుం చెల్లించాలని సూచించారు. 75 శాతం కన్నా ఎక్కువ హాజరువున్నవారు 117 మంది మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు. మొత్తంగా 86 శాతం మందికి తగినంత హాజరులేనట్టు నోటీసు బోర్డులో పేర్కొన్నారు. దీన్నిచూసి విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. హాజరుతో పనిలేకుండా పరీక్షకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఇతర కారణాల వల్ల తరగతులకు సరిగా హాజరుకాలేదని, అందువల్ల హాజరుతో సంబంధంలేకుండా అందర్నీ పరీక్షలకు అనుమతించాలని కోరారు. అలాగే గేమ్స్, ఎన్సీసీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సంబంధిత హాజరు కలపాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న మిగతా కళాశాలల్లో ఇదే విధానాన్ని పాటిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌కు విన్నవించారు. ఆర్ట్స్ కళాశాలలోనూ అదే పద్ధతిని అమలు చేయాలని సూచించారు. అందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. విద్యార్థులందరినీ పరీక్షకు అనుమతించాలని కోరుతూ ప్రిన్సిపాల్‌ను ఘెరావ్ చేశారు. నోటీసు బోర్డును పగలగొట్టారు. ఈ నేపథ్యంలో క్రైమ్ డీఎస్పీ ఎంవీఎస్ స్వామి, క్యాంపస్ సీఐ రామకృష్ణారెడ్డి, క్రైమ్ సీఐ నాగసుబ్బన్న, ఎస్ఐ తిమ్మారెడ్డిల ఆధ్వర్యంలో పోలీసుల బృందం రంగప్రవేశం చేసింది. విద్యార్థుల గుంపును చెదరగొట్టడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో విద్యార్థులకు నచ్చజెప్పాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో విద్యార్థులు కొందరు గాల్లోకి ఇసుక చల్లారు. చిన్నచిన్న రాళ్లను విసిరారు. దీంతో క్యాంపస్ పోలీసు స్టేషన్ రైటర్ దేవదత్తరెడ్డి తలకు గాయమైంది. ఆగ్రహించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కొందరు విద్యార్థి నాయకులను ఈడ్చుకెళ్లారు. పాతకేసుల్లో నిందితుడుగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.ఆనంద్‌గౌడ్‌ను ఈడ్చుకుంటూ క్యాంపస్ స్టేషన్‌కు తరలించారు. అయినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. ఆరుగంటల వరకు ఆందోళన సాగింది. చివరకు పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను తాను హాజరు విషయంలో నిబంధనల ప్రకారమే నడచుకున్నానని ప్రిన్సిపాల్ క్రిష్టఫర్ తెలిపారు. 75 నుంచి 50 శాతం హాజరు ఉన్న వారిని అపరాధ రుసుము కట్టమని చెప్పానన్నారు. 50 శాతం హాజరు కూడా లేనివారిని పరీక్షకు ఎలా అనుమతించాలని ప్రశ్నించారు. -
బీసీ డిక్లరేషన్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సామాజిక, రాజకీయ, ఆత్మగౌరవ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచిన పోరుఖిల్లా... తాజాగా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు సన్నద్ధమవుతోంది. వెనుకబడిన వర్గాలకు సమానత్వం, సాధికారతే లక్ష్యంగా డిక్లరేషన్ చేసేందుకు ఓరుగల్లు కేంద్రంగా నిలవనుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ (ఏబీసీడీఈ) వరంగల్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు ముస్తాబవుతోంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో శని, ఆదివారాల్లో జరిగే సమావేశంలో మెజార్టీ జనాభా ఉన్న బీసీలు ఆరున్నర దశాబ్దాలుగా ఎలా మోసపోతున్నారు... అభివృద్ధి ఫలాల్లో వాటా... రాజ్యాధికారంలో భాగం... వృత్తుల విధ్వంసం, ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార కులాలకు చెందిన వారు విద్యకు, ఉపాధికి దూరమవుతున్న తీరు... వంటి అంశాలపై మేధావులు, ప్రముఖులు చర్చించనున్నారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో బీసీలు తమ హక్కులు, సమానత్వ సాధనకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. అంతేకాకుండా పలు అంశాలపై సదస్సులు, చర్చాగోష్టులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఈ మేరకు వివిధ యూనివర్సిటీలు, న్యాయవ్యవస్థ, అధికార రంగంలో ఉన్న మేధావులు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఏబీసీడీఈ అధ్యక్షుడు, ప్రొఫెసర్ మురళీమనోహర్ తెలిపారు. బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ ఎంఎన్ రావు సమావేశాన్ని ప్రారంభించనున్నారని, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు పొన్నం, మధుయాష్కీ, రాపోలు ఆనందభాస్కర్, దేవేందర్‌గౌడ్, సుధారాణి, కేశవరావు, ఈటెల రాజేందర్, వినయ్, దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు బీసీ సామాజిక సంఘాల నేతలు ఉ.సాంబశివరాం, వై. కోటేశ్వర్రావు తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాలోన్లి పరిశోధకులకు సైతం ఆహ్వానం పలికినట్లు వెల్లడించారు. సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. -
ఆగని పోరు
సాక్షి, కడప : సమైక్యవాదులు సింహాలై గర్జించారు. శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు అఫ్జల్ఖాన్, భూపేష్‌రెడ్డి, నరసింహారెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షలు శనివారంతో ఆరవరోజుకు చేరుకున్నాయి. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కడప నగరంలో న్యాయవాదులు, విద్యుత్ కార్మికులు, జేఏసీ, ఉపాధ్యాయ, ఆర్అండ్బీ, మున్సిపల్ కార్మికులు, న్యాయశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరు పట్టణంలో మహిళా ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు, వైద్యులు కూడా రిలే దీక్షల్లో కూర్చొన్నారు. పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి పట్టణంలో శిబ్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేట పట్టణంలో విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ నాయక్ అనే విద్యార్థి ఆమరణ దీక్ష చేపట్టారు. మైదుకూరులో న్యాయవాదులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల, బద్వేలులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాశినాయనలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో, మానవహారం చేపట్టారు. జమ్మలమడుగులో మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రగుట్ల, ఆర్టీపీపీలలో రిలే దీక్షలు కొనసాగాయి. -
అభివృద్ధి పేరుతో వనరుల విధ్వంసం
జులైవాడ, న్యూస్‌లైన్ : అభివృద్ధి పేరుతో ఆదివాసీల వనరులను విధ్వంసం చేస్తున్నారని ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి మైపతి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కళాశాలలో మానవహక్కుల వేదిక జిల్లా ఐదో మహాసభలు ఆదివారం ముగిశాయి. సభలకు మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాల శోభారాణి అధ్యక్షత వహించారు. సభాప్రాంగణానికి మానవహక్కుల వేదిక నాయకులు కె.బాలగోపాల్, బుర్రా రాములు నామకరణం చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు 10 ఆదివాసీ జిల్లాలు ఉన్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పోడు పేరుతో గిరిజనేతరులు అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హైడల్ విద్యుత్ ప్రాజెక్టుతో కుంటాల జలపాతం, పురాతన సోమేశ్వర స్వామి దేవాలయం నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరులోనే 21 వేల మంది గిరిజనేతరులు పోడు చేసుకుంటున్నారని వివరించారు. ఓపెన్కాస్ట్తో 244 ఆదివాసీ గూడేలు లేకుండా పోతున్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆది వాసీలు మాత్రమే ఉన్నప్పుడు పులులు, జం తు జాతులు ఉన్నాయని చెప్పారు. గిరిజనేతరులు వచ్చాక పులుల జాడ కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులైతే గిరిజనేతరులు వ్యాపారదృక్ప థం కలిగిన వారని వివరించారు. గిరిజనేతరులతో అటవీ విధ్వంసం జరుగుతోందన్నారు. కామన్‌స్కూల్ విధానం రావాలి.. భారత విద్యావిధానంలో కామన్ స్కూల్ విధానం రావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రంరెడ్డి నర్సింహరెడ్డి అన్నారు. విద్యారంగం ప్రైవేటికీకరణపై మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఒక్కోవిద్యార్థికి ప్రభుత్వం విద్యాపరంగా పెట్టే ఖర్చు ఒక్కో రకంగా ఉంటుందన్నారు. నవోదయ విద్యాలయాల్లో ఒక్కోవిద్యార్థిపై 16 వేలు, ఏపీఆర్ స్కూళ్లలో సంవత్సరానికి 14వేలు, సెంట్రల్ స్కూల్లో 18వేలు, ప్రభుత్వ స్కూళ్లలో రూ. 1400 ఖర్చు పెడుతున్నాయని వెల్లడించారు. చదువు మూడో కన్నులాంటిదని, విద్య ద్వారానే మనకు జరిగే అన్యాయాన్ని తెలుసుకోవచ్చన్నారు. ప్రతి 1000 మందిలో 60 మంది బాలురు, 24 మంది బాలికలు పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్ ఆహారభద్రతపై మాట్లాడుతూ ఒక మనిషికి సగటున 8,9 కిలోల బియ్యం నెలకు అవసరమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఆహార భద్రత ద్వారా ఒక వ్యక్తికి ఐదు కిలోలు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ధరలను నియంత్రించే స్థితిలో ప్రభుత్వాలు లేవన్నారు. అనంతరం మానవహక్కుల వేదిక ప్రణాళిక, కార్యవర్గ ఎంపికపై చర్చించారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా కార్యదర్శి బాదావత్ రాజు, నాయకులు సాదు రాజేష్‌కుమార్, దడబోయిన రంజిత్‌కుమార్, పాలకుర్తి సత్యం, ప్రొఫెసర్ కాత్యాయనీవిద్మహే తదితరులు పాల్గొన్నారు.