పుస్తకాల్ని పక్కన పెట్టి వీధి రౌడీల్లా వ్యవహరించారో... తస్మాత్ జాగ్రత్త అంటూ విద్యార్థులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బస్సుల్లో శృతి మించి వ్యవహరిస్తున్న కొందరు విద్యార్థులపై నిఘా పెంచేందు కు ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్‌ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లతో 45 ప్రత్యేక బృందాల్ని శుక్రవా రం రంగంలోకి దించారు.
సాక్షి, చెన్నై:
రాజధాని నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ప్రైవేటు ఆర్ట్స్ కళాశాలల విద్యార్థుల మధ్య తరచూ వివాదం రాజుకుంటున్న విషయం తెలి సిందే. కొన్ని మార్గాల్లో తిరిగే బస్సుల్లో కొందరు విద్యార్థుల మరీ శృతిమించి వ్యవహరిస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది. అదే సమయంలో కళాశాలల్లో చోటు చేసుకున్న గొడవలు, వ్యక్తిగత వివాదాలు, ప్రేమ తగాదాలతో విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం నగరం లో మూడుచోట్ల విద్యార్థులు వీరంగం సృష్టించి ఒక బస్సును ధ్వంసం చేశారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేం దుకు నగర పోలీసు కమిషనర్ జార్జ్ సిద్ధమయ్యారు.
రంగంలోకి బృందాలు: ఇక మీదట విద్యార్థులు దుడ్డు కర్రలు, రాడ్లతో పట్టుబడితే వారిపై కఠిన సెక్షన్లను నమోదు చేయడంతో పాటుగా కొన్నాళ్లు కటకటాల్లోకి నెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థుల కదలికల్ని పసిగట్టేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. జాయింట్ కమిషనర్లు శ్రీధర్, తిరుజ్ఞానం, శంకర్, షణ్ముగ వేల్‌తో పర్యవేక్షణలో 45 ప్రత్యేక బృందాలు శుక్రవారం రంగంలోకి దిగాయి. ఉత్తర చెన్నై పరిధిలో 15, దక్షిణ చైన్నై, తూర్పు చెన్నై, పశ్చిమ చెన్నై పరిధుల్లో పది చొప్పున బృందాల్ని నియమించారు. ఒక్కో బృందంలో ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఐదురు కానిస్టేబుళ్లు విధుల్ని నిర్వర్తించనున్నారు.
ఆయా జోన్ల పరిధి నుంచి అన్నా శతకం, పురసై వాక్కం, ఎగ్మూర్, సెంబియం, ఆవడి, తంగసాలై, మైలాపూర్, రాయపేట, నుంగబాక్కం, అరుబాక్కం మీదుగా సాగే బస్సుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మఫ్టీలో సిబ్బంది తిరగనున్నారు. ఏ విద్యార్థి అయినా సరే శృతిమించి వ్యవహరిస్తే వారిని పట్టుకుని మళ్లీ తప్పు చేయని విధంగా తాట తీస్తారు. అలాగే ఆయా మార్గాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఈ బృందాలు గస్తీలో ఉంటాయి. ఎక్కడైనా విద్యార్థులు వీరంగం సృష్టించినా, శృతిమించి వ్యవహరించినా, ఎవరైనా ప్రయాణికులు ఈ గస్తీ బృందాలకు సమాచారం ఇచ్చినా సరే, తక్షణం అక్కడికి చేరుకునే ఏర్పాట్లు చేశారు.
తాట తీస్తాం
Published Sat, Mar 8 2014 2:38 AM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
Advertisement
Advertisement