ఉస్మానియాలో ఉద్రిక్తత
ఉస్మానియా క్యాంపస్(హైదరాబాద్): ఉస్మానియా క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీయస్ నాయకులు వంగపల్లి, మందకృష్ణ మాదిగలు ఆదివారం పోటాపోటీగా ఉస్మానియా క్యాంపస్‌లో మాదిగ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆర్ట్స్ కాలేజీ ముందు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మందకృష్ణ మాదిగ సభ జరగనుంది. అంతేకాకుండా, వంగపల్లి శ్రీను సభ సాయంత్రం 5 గంటలకు టాగూర్ ఆడిటోరియంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మందక్రిష్ణ వర్గం ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.