MRPS leaders
-
బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
బోథ్: దళిత బాలికపై ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక 8 వ తరగతి చదువుతోంది. ఆదివారం తనను చూడటానికి వచ్చిన తల్లితో.. ఉపాధ్యాయుడు, ఇన్చార్జి వార్డెన్ వసంత్‌రావ్ కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని సదరు బాలిక వాపోయింది. దీంతో సోమవారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. అతడిపై దాడికి యత్నించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. ఎమ్మార్పీఎస్ ధర్నా: విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కీచక ఉపాధ్యాయుడు వసంత్‌రావును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి డిమాండ్ చేశారు. వారం రోజుల్లో విచారణ చేపట్టి సంబంధిత ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకుంటామని పీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే.. ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విచారణ చేపట్టిన జేసీ సంధ్యారాణి: పల్లె ప్రగతిలో భాగంగా బోథ్ మండల కేంద్రంలో పర్యటిస్తున్న జేసీ సంధ్యారాణికి విషయం తెలియడంతో వెంటనే పాఠశాలకు వెళ్లి బాధిత బాలికతో పాటు, తోటి బాలికలను విచారించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
వైఎస్సార్ సీపీతోనే మైనారిటీల సంక్షేమం
సాక్షి, మచిలీపట్నం టౌన్: పట్టణానికి చెందిన పలువురు టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు షేక్ మౌలాలికి పేర్ని నాని పార్టీ కండువాను కప్పారు. మౌలాలితో పాటు 20 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరారు. వీరిలో బాబూలాల్, లతీఫ్, అమ్జత్ఖాన్, షరీఫ్, నాగూర్, మస్తాన్‌షరీఫ్, అమాన్, అబ్బాస్, హజీ, అసీఫ్, రహీమాన్, అతీఫ్, అజీజ్, ఇద్రిస్, అబ్బాస్, సలీమ్, సలామ్, హషన్ తదితరులు ఉన్నారు. టీడీపీకి చెందిన మస్తాన్‌వలీ, ఎస్కె బాజీ లు కూడా పార్టీలో చేరారు. వీరికి కూడా పేర్ని నాని కండువాలు కప్పారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చెబా, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు పాల్గొన్నారు. ముస్లింలతో పేర్ని నాని సమావేశం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) శుక్రవారం ముస్లింలను కలుసుకున్నారు. స్థానిక రాజుపేటలోని కొత్తమసీదులో ప్రార్థనలు చేసి బయటకు వచ్చిన ముస్లింలను పలకరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చెబా, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, 31వ వార్డు ఇన్చార్జి ఇక్బాల్, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌రఫీ, మొహముద్, మొహముద్ సాహెబ్, బాజి, పార్టీ నాయకులు శొంఠి ఫరీద్ ఉన్నారు. ఇంటింటి ప్రచారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని కోరుతూ పట్టణంలోని పలు వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 37వ వార్డులో పేర్ని నాని తనయుడు కృష్ణమూర్తి (కిట్టు) బలరామునిపేట అంబేద్కర్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో ఆ వార్డు కౌన్సిలర్ లంకా సూరిబాబు, మాజీ కౌన్సిలర్ బండారు నాని, పిన్నెంటి శ్రీనివాసరావు, విజయగణపతి ఆలయ చైర్మన్ సింహాచలం, రవి పాల్గొన్నారు. 25వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ వార్డులో.. కోనేరుసెంటర్: పేర్ని నానిని గెలిపించాలని అని 15వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మేకల సుధాకర్ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఆర్థిక స్వావలంబనే.. మచిలీపట్నం సబర్బన్: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. చిన్నాపురంలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుల ప్రచారం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలేఖాన్‌పేటలో పర్యటిస్తూ ఎన్నికల్లో రాష్ట్రంలో మాదిగ వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడును గద్దె దింపేందుకు మాదిగలు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బీడెల్లి మరియకుమార్, కొల్లూరి బసవ, చీలి రవీంద్ర ఉన్నారు. -
అగ్నివేష్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలి
వనపర్తి అర్బన్: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ ప్రముఖ్, కుర వృద్ధుడైన అగ్నివేష్‌పై దాడి చేయడం అత్యంత అమానుషమని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని టిజేఏసీ, ఎమ్మార్పీఎస్, పాలమూరు అధ్యాయన వేదిక, పీడీఎస్‌ఊయూస్‌యు, డీటీఎఫ్ ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జార్ఖండ్ గవర్నన్‌ను కలిసి గిరిజనుల సమస్యలను విన్నవించి తిరిగి వెళ్తున్న సమయంలో మతోన్మాద గుండాలు ఆయనపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, లౌకికవాదాన్ని, వాక్స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాలు అణగదొక్కేస్తున్నాయని, దేశవ్యాప్తంగా ఎందరో సామాజిక కార్యకర్తలపై దాడులు నిరంతరం చేయడం మతోన్మాద చర్యలను ప్రేరేపించడమేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రభుత్వాలకు ప్రజలకు తగిన రీతిగా బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరం లేదని చెప్పారు. అగ్నివేష్‌పై జరిగిన దాడుల్లో పాల్గొన్న వారికి గుర్తించి శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. భవిషత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజారాంప్రకాష్, వేణుగోపాల్, బుచ్చన్న, యేసేపు, శ్రీనివాసులుగౌడ్, అగ్గిరాముడు, నారాయణ, శ్రీనివాసులు, పవన్, గోపి, బుచ్చన్న, శాంతన్న, స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా
టవర్‌సర్కిల్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. స్వల్ప తోపులాట అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, పైగా నాయకులను అరెస్టులు చేయిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఉపవాస దీక్షకు కూర్చున్న నేతను అరెస్ట్ చేయడం సామాజిక ఉద్యమాలను అణచివేయడమేనన్నారు. మందకృష్ణను విడుదల చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రేణికుంట్ల సాగర్, గోష్కి అజయ్, గోష్కి శంకర్, జనగామ నర్సింగ్, మాతంగి రమేశ్, గసిగంటి కుమార్, కొయ్యడ వినోద్, సుంచు నరేష్, కొంకటి దేవరాజ్, కనకం నర్సయ్య, చంటికుమార్,రాములు, బాబు, చంద్రశేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ముట్టడి.. కట్టడి..
కాకినాడ రూరల్: ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లాలన్న డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎమ్మార్పీస్ నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఆలమూరు మండల ఎమ్మార్పీస్ నేత కొమ్ము నారాయుడు స్పృహ తప్పిపడిపోయాడు. ఈ తోపులాటలో కాకినాడ డీఎస్పీ రవివర్మ కూడా ఉండడంతో ఆయన కూడా ఆందోళనకారుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. తమ నాయకుడు నారాయుడు అస్వస్థతకు గురి కావడంతో ఎమ్మార్పీస్ కార్తకర్తలు మరింత రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి చంద్రబాబు నశించాలి, మోసగాడు చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటూ నినాదాలిచ్చారు. మరోసారి కలెక్టర్ కార్యాలయపు గేటును ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అయితే డీఆర్ఓ జితేంద్ర నేరుగా ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడడంతో సద్దుమణిగింది. ఒకానొక దశలో ఆందోళనకారులు డీఆర్వో మాటను సైతం లెక్క చేయకుండా కలెక్టర్ బయటకురావాలంటూ నినాదాలిచ్చారు. అయితే ఆయన ఊరిలో లేరని కొందరు నాయకులు నిర్ధారించుకున్న తరువాత డీఆర్వో జితేంద్ర, డీఎస్పీ రవివర్మలతో చర్చించారు. ఆందోళనను విరమించారు. ఈ ఆందోళనలో గాయపడిన కొమ్ము నారాయుడిని ప్రత్యేక వాహనంలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మందా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పచ్చి మోసకారి, వెన్నుపోటుదారుడని, నమ్మిన వారిని మోసం చేయడంలో ఆయనకు ఆయనే సాటని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతానని బహిరంగంగా హామీ ఇచ్చి మాదిగలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఎస్సీ వర్గీకరణను సాధించే వరకు ఎమ్మార్పీస్ కార్యకర్తలు ఎంతటి త్యాగానికైనా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్పీస్ జిల్లా నాయకులు కొత్తపల్లి రఘు మాదిగ, వల్లూరి సత్తిబాబుమాదిగ, గంపల సత్యప్రసాద్, ముందేటి డేవిడ్‌రాజు, ఆకుమర్తి ఆశీర్వాదం, పలివెల నవీన్మాదిగ, యార్లగడ్డ సత్తిబాబు, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు భూపతి అప్పారావు, బంగారు మంగారావు, మోచీ కులం నాయకులు బి.భద్రం తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. అరెస్టు.. విడుదల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి చెందిన 60 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి కాకినాడ పోర్టు, సర్పవరం పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం ఐదు గంటల సమయంలో విడుదల చేశారు. -
కురుక్షేత్ర సభను అడ్డుకునే అర్హత సీఎంకు లేదు
గాంధీనగర్ (విజయవాడ) : నవ నిర్మాణ దీక్ష పేరుతో జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి సభలను నిర్వహించిన సీఎం చంద్రబాబుకు మాదిగల కురక్షేత్ర సభను అడ్డుకునే అర్హతలేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు అన్నారు. ఈ నెల 7న మందకృష్ణ మాదిగ నిర్వహించే కురుక్షేత్ర మహాసభకు ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు ఇస్తుందన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలను అణచివేయాలని చూస్తే టీడీపీకి పతనం తప్పదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతం అన్న చంద్రబాబు వర్గీకరణ విషయంలో రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారన్నారు. తెలంగాణాలో టీడీపీ నాయకత్వం వర్గీకరణ చేయాలని బల్లగుద్ది చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం బల్లకింద దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మాదిగలు తమ హక్కుల సాధన కోసం సభలు, సమావేశాలు పెట్టుకుంటే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కురుక్షేత్ర మహాసభకు పెద్దఎత్తున మాదిగలు తరలిరావాలన్నారు. సమావేశంలో ఏమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జెన్నీ రమణయ్య, సువర్ణరాజు, శ్రీరాం దేవమణి, విక్టోరియా, నల్లూరి శేఖర్‌బాబు, రాజా, లక్ష్మణరావు, బాబూరావు పాల్గొన్నారు. -
‘నయవంచకుల్లో నంబర్ ఒన్ చంద్రబాబు’
తిరుపతి : నయవంచకుల్లో ప్రపంచంలోనే నంబర్ ఒన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం గత నెల 20న రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య శ్రీకాకుళంలో ప్రారంభించిన మాదిగల చైతన్య యాత్రను శుక్రవారం సాయంత్రం తిరుపతిలో ముగించారు. బ్రహ్మయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాటను తుంగలోతొక్కి మాదిగల ఆశయాలను, ఆశలను మంటగలిపి విశ్వాస ఘాతకుడుగా చంద్రబాబు చరిత్రకెక్కారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు ఈ నెల 19 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఢిల్లీలో మహా ధర్నాలు, నిరసన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గోపిమాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు, ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఎమ్మార్పీస్ నాయకుల ఆందోళన
అనంతపురం: ఎస్సీ వర్గీకరణకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో సోమవారం ఎమ్మార్పీస్ కార్యర్తలు ఆందోళనకు దిగారు. సోములదొడ్డి వద్ద ఎమ్మార్పీస్ నేత రాజు ఆధ్వర్యంలో నాయకులు హైవేను దిగ్భందించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. వెంటనే పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భైంసాలో ఎమ్మార్పీఎస్ ధర్నా
ఆదిలాబాద్ : పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే సోమవారం ఇద్దరు ఎమ్మార్పీఎస్ నాయకులు హత్యకు గురయ్యారని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా భైంసాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో బెల్లంపల్లిలో ఇద్దరు నేతలు హతమయ్యారని విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము రాస్తారోకో చేశామన్నారు. రాస్తారోకోతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. -
మందకృష్ణపై దాడి హేయనీయం
ప్రగతినగర్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది దళిత సమాజంపై జరిగిన దాడి అని దళిత సంఘాల చర్చా వేదిక నాయకులు అన్నారు. ఇదంతా తెలిసి కూడా కలెక్టర్, జేసీ మౌనం దాల్చడం సరికాదన్నారు. నిజామాబాద్ టీఎన్జీవోస్ కార్యాలయంలో గురువారం ఎమ్మార్పీఎస్, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. మందకృష్ణపై ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. వారంతా దళితులు కాదని, ఎమ్మెల్యే దగ్గర పనిచేసే గుండాలని ఆరోపించారు. దళితుల కోసం పోరాడేది వామపక్ష పార్టీలేనని తెలిపారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీలు కార్మికుల, దళితుల పార్టీల ని మరోసారి రుజువయిందన్నారు. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి దళితుల భూములు లాక్కోవడమే కాక, వారిపై వివిధ కేసులు బనాయించడం, దాడులు చేయడం అధికార దురహంకారమేనని విమర్శించారు. న్యాయం కోసం దళితులు తహశీల్దార్, ఆర్డీవో, పోలీస్స్టేషన్ల చుట్టు తిరిగినా.. వారు అధికార పార్టీ తొత్తులుగా మారి ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని, ఈ విషయంలో కలెక్టర్, జేసీ స్పందించాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని దళితుల సమస్యలను స్వయంగా మందకృష్ణ జే సీకి విన్నవించినా.. ఆ సమస్య తమ దృష్టికి రాలేదని కలెక్టర్, జారుుంట్ కలెక్టర్ చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్ దళితుల సంక్షేమమంటూనే మరోవైపు ఆ వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయ న బాటలోనే నడుస్తున్నారనడానికి ఎల్లారెడ్డి ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. దళితులంతా కలిసి ఐక్యంగా పోరాడి ఎమ్మెల్యే ఆగడాలను ఎండగడతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇత ర నాయకులతో కలిసి ఈనెల 6న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగభూష ణం, రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రబాకర్, దేవారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్, నాయకులు గోవర్దన్, వెంకట్‌గౌడ్,సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న పాల్గొన్నారు. 5న కామారెడ్డి బంద్.. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి వైఖరికి నిరసనగా ఈ నెల 5న కామరెడ్డి బంద్‌కు పిలుపునిస్తున్నట్లు న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రభాకర్ తెలిపారు. -
సీఎంనా మజాకా!
సంగం : సీఎం చంద్రబాబునాయుడు తన అధికార ప్రతాపాన్ని చూపాడు. సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులతో చితకబాదించాడు. నాయకుడిగా సమస్యలను విని పరిష్కరించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరం లేకుండా విచక్షణా రహితంగా ఖాకీల ప్రతాపాన్ని చూపించేలా చేశారు. చివరకు వారిని అరెస్ట్ కూడా చేయించాడు. జలదంకికి చెందిన వెంకటేశ్వర్లు, యల్లాయపాళేనికి చెందిన వివేక్, దుత్తలూరుకు చెందిన శీనును శనివారం ఎస్సై వేణు అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరచారు. కేవలం సీఎం కాన్వాయ్‌కు అడ్డురావడమే నేరంగా చంద్రబాబు పరిగణించాడే తప్ప వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉస్మానియాలో ఉద్రిక్తత
ఉస్మానియా క్యాంపస్(హైదరాబాద్): ఉస్మానియా క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీయస్ నాయకులు వంగపల్లి, మందకృష్ణ మాదిగలు ఆదివారం పోటాపోటీగా ఉస్మానియా క్యాంపస్‌లో మాదిగ అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆర్ట్స్ కాలేజీ ముందు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మందకృష్ణ మాదిగ సభ జరగనుంది. అంతేకాకుండా, వంగపల్లి శ్రీను సభ సాయంత్రం 5 గంటలకు టాగూర్ ఆడిటోరియంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మందక్రిష్ణ వర్గం ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. -
ఢీ ‘దేశం’ గీ దండోరా
ఇందూరు: తెలుగుదేశం పార్టీ శనివారం నగరంలోని శివాజీనగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఘర్షణతో అయోమయం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రసంగం కొనసాగుతుండగా ఎంఆర్పీఎస్ నాయకులు ఒక్కసారిగా వేదిక మీదకు దూసుకు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీని తొలగించి. బల్లలను విసిరేశారు. దీంతో తొలుత నిర్ఘాంతపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనంతరం ఆగ్రహంతో ఊగిపోయారు.ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. కుర్చీలతో చావబాదారు. నాల్గవ, ఐదవ పట్టణ ఎస్ఐలు మధు, సైదయ్య వెంటనే వెళ్లి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి సైతం దెబ్బలు తగిలాయి. స్వల్పంగా లాఠీచార్జి చేసి ఎంఆర్పీఎస్ నాయకులను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులపై టీడీపీ నాయకులు కుర్చీలు విసిరారు. గేటు వద్ద కాపుగాసి మరికొంత మంది ఎంఆర్‌పీఎస్‌నాయకులు సమావేశం ప్రవేశమార్గం వద్ద ఉన్న వాహనాలపై దాడిచేశారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి నగర ఐదవ ఠాణాకు తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వేదికపై ఉన్న టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. కేవలం 15 నిమిషాలలోనే 20 మందికిపైగా ఎంఆర్‌పీఎస్‌నాయకులు సమావేశాన్ని రసాభాసాగా మార్చేశారు. కుర్చీలు ధ్వంసమయ్యాయి. సమావేశం అదుపు తప్పింది. టీడీపీ నాయకులు ఎంఆర్పీఎస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వేదికపై ఉన్న టీడీపీ నేతలు రమణ, రేవంత్‌రెడ్డి ఘటన చూస్తు విస్తుపోయా రు. ఈ క్రమంలో ఎమ్మె ల్సీ అరికెల నర్సారెడ్డి వారిం చినప్పటికీ టీడీపీ నాయకు లు, కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నాయకులపై దాడి చేశారు. ఆరుగురు అరెస్టు నిజామాబాద్ సిటీ: తెలుగుదేశం పార్టీ సమావేశంలోకి దూసుకువచ్చి గొడవ చేసిన ఆరుగురు ఎంఆర్పీఎస్ నాయకులను అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ ఎస్ఐ మధు తెలిపారు. వర్ని రోడ్డు శివాజీనగర్ ము న్నూర్కాపు సంఘంలో జరుగుతున్న సభలోకి ఎంఆర్పీఎస్ నాయకులు గందమాల నాగభూషణం, మైలారం బాలు, కిష్టయ్య, శ్రీనివాస్, సంతోష్, భూమన్న చొచ్చుకు వచ్చి అంతరాయం కలిగించారని అన్నారు. కుర్చీలు విసిరేసిటీడీపీ నాయకులు, కార్యకర్తలతో గొడవపడ్డారని వివరించారు. పై ఆరుగురిపై కేసు నమోదు చేసామన్నారు. -
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆందోళనలు
కలెక్టరేట్ల వద్ద ధర్నాలు.. టీడీపీ కార్యాలయాల ముట్టడి జూపూడిపై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్ ఫైర్ సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేసి పెద్ద మాదిగ అన్పించుకుంటానని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు దగా చేశారని ఎమ్మార్పీఎస్ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావును టీడీపీలోకి తీసుకోవడంతో మాదిగలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం, టీడీపీ పార్టీ కార్యాలయాల ముట్టడి, కలెక్టరేట్ల వద్ద ధర్నా వంటి నిరసనలు మిన్నంటాయి. వంచన చేసిన బాబుకు తగిన గుణపాఠం నేర్పేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీల్లో ఎస్సీ వర్గీకరణపై తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరులో టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి చిట్టిబాబును మూడు గంటలపాటు నిర్బంధించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసేవరకు వదిలేదిలేదని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఆందోళనకారులతో ఫోన్‌ద్వారా మంత్రి రావెల కిషోర్‌బాబుతో మాట్లాడించారు. పోలీసులు వచ్చి టీడీపీ కార్యాలయం తలుపులు పగలగొట్టి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిర్బంధం నుంచి టీడీపీ నాయకుడు చిట్టిబాబును విడిపించారు. నెల్లూరులో టీడీపీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టి, అద్దాలు పగలగొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో కలెక్టరేట్లను, టీడీపీ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు టి.రత్నాకర్ మాట్లాడుతూ... జూపూడి ప్రభాకర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాలజాతిని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. వర్గీకరణపై చంద్రబాబు మోసం ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ జగన్ మద్దతుపై సంతోషం సాక్షి, హైదరాబాద్: మాదిగల సహకారంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఎస్సీ వర్గీకరణలో చేస్తున్న మోసాలను ఎండగట్టడమే కాకుండా అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే చంద్రబాబు అధికారాన్ని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆయన సోమవారం తొలుత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు తమ సహకారం లేకపోతే తెలంగాణలో పాదయాత్రే జరిగి ఉండేది కాదన్నారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా మంగళవారం తెలంగాణలోని టీడీపీ కార్యాలయాలకు తాళాలు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం ఇరు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేస్తే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మందకృష్ణ సోమవారం అసెంబ్లీలోని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లో ఆయనను కలసి వర్గీకరణకు మద్దతు కోరారు. అనంతరం లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి తీర్మానం పెడితే తాము మద్దతు నిస్తామని జగన్ చెప్పారన్నారు. జగన్ స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటిపై అసంతృప్తి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైఖరిపట్ల మందకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో వారిద్దరూ ఎదురుపడ్డారు. ఒకవైపు ఎస్సీ వ ర్గీకరణకు అనుకూలమేనంటూ ఆ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించే మాల మహానాడు నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావును మంత్రి టీడీపీలో చేర్పించడంపై మందకృష్ణ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎవరిని పార్టీలో చే ర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే వర్గీక రణకు అనుకూలమంటూ శాసనసభలో తీర్మానం చేసేలా చూడాలని కోరారు.