సంగం : సీఎం చంద్రబాబునాయుడు తన అధికార ప్రతాపాన్ని చూపాడు. సమస్యల పరిష్కారానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులతో చితకబాదించాడు. నాయకుడిగా సమస్యలను విని పరిష్కరించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరం లేకుండా విచక్షణా రహితంగా ఖాకీల ప్రతాపాన్ని చూపించేలా చేశారు. చివరకు వారిని అరెస్ట్ కూడా చేయించాడు. జలదంకికి చెందిన వెంకటేశ్వర్లు, యల్లాయపాళేనికి చెందిన వివేక్, దుత్తలూరుకు చెందిన శీనును శనివారం ఎస్సై వేణు అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరచారు. కేవలం సీఎం కాన్వాయ్‌కు అడ్డురావడమే నేరంగా చంద్రబాబు పరిగణించాడే తప్ప వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.