వైఎస్సార్ సీపీలో చేరిన నాయకులతో పేర్ని నాని
సాక్షి, మచిలీపట్నం టౌన్: పట్టణానికి చెందిన పలువురు టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు షేక్ మౌలాలికి పేర్ని నాని పార్టీ కండువాను కప్పారు. మౌలాలితో పాటు 20 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరారు. వీరిలో బాబూలాల్, లతీఫ్, అమ్‌జత్‌ఖాన్, షరీఫ్, నాగూర్, మస్తాన్‌షరీఫ్, అమాన్, అబ్బాస్, హజీ, అసీఫ్, రహీమాన్, అతీఫ్, అజీజ్, ఇద్రిస్, అబ్బాస్, సలీమ్, సలామ్, హషన్ తదితరులు ఉన్నారు.
టీడీపీకి చెందిన మస్తాన్‌వలీ, ఎస్‌కె బాజీ లు కూడా పార్టీలో చేరారు. వీరికి కూడా పేర్ని నాని కండువాలు కప్పారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చెబా, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు పాల్గొన్నారు.
ముస్లింలతో పేర్ని నాని సమావేశం
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) శుక్రవారం ముస్లింలను కలుసుకున్నారు. స్థానిక రాజుపేటలోని కొత్తమసీదులో ప్రార్థనలు చేసి బయటకు వచ్చిన ముస్లింలను పలకరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చెబా, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, 31వ వార్డు ఇన్‌చార్జి ఇక్బాల్, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌రఫీ, మొహముద్, మొహముద్ సాహెబ్, బాజి, పార్టీ నాయకులు శొంఠి ఫరీద్ ఉన్నారు.
ఇంటింటి ప్రచారం
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని కోరుతూ పట్టణంలోని పలు వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 37వ వార్డులో పేర్ని నాని తనయుడు కృష్ణమూర్తి (కిట్టు) బలరామునిపేట అంబేద్కర్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో ఆ వార్డు కౌన్సిలర్ లంకా సూరిబాబు, మాజీ కౌన్సిలర్ బండారు నాని, పిన్నెంటి శ్రీనివాసరావు, విజయగణపతి ఆలయ చైర్మన్ సింహాచలం, రవి పాల్గొన్నారు. 25వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
15వ వార్డులో..
కోనేరుసెంటర్: పేర్ని నానిని గెలిపించాలని అని 15వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మేకల సుధాకర్ వార్డులో ప్రచారం నిర్వహించారు.
ఆర్థిక స్వావలంబనే..
మచిలీపట్నం సబర్బన్: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. చిన్నాపురంలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ నాయకుల ప్రచారం
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలేఖాన్‌పేటలో పర్యటిస్తూ ఎన్నికల్లో రాష్ట్రంలో మాదిగ వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడును గద్దె దింపేందుకు మాదిగలు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బీడెల్లి మరియకుమార్, కొల్లూరి బసవ, చీలి రవీంద్ర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment