భైంసాలో ఎమ్మార్పీఎస్ ధర్నా | MRPS Leaders protests in Bhainsa | Sakshi
Sakshi News home page

భైంసాలో ఎమ్మార్పీఎస్ ధర్నా

Published Tue, Aug 4 2015 1:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

MRPS Leaders protests in Bhainsa

ఆదిలాబాద్ : పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే సోమవారం ఇద్దరు ఎమ్మార్పీఎస్ నాయకులు హత్యకు గురయ్యారని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా భైంసాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో బెల్లంపల్లిలో ఇద్దరు నేతలు హతమయ్యారని విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము రాస్తారోకో చేశామన్నారు. రాస్తారోకోతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement