ఆర్ట్స్‌ కాలేజీలో గొడవ.. వీడిన మిస్టరీ! | Ananthapur Police Arrest Five Persons Over Arts College Attack | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కాలేజీలో గొడవ.. వీడిన మిస్టరీ!

Published Sat, Jun 29 2019 7:23 PM | Last Updated on Sat, Jun 29 2019 7:26 PM

Ananthapur Police Arrest Five Persons Over Arts College Attack - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపుం ఆర్ట్స్‌ కాలేజీలో యువకుడిపై దాడి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దాడి చేసిన ఐదుగురు యువకులను అరెస్ట్‌ చేశారు. ఓ యువతి విషయంలో వివాదం వల్లే ఈ ఘర్షణ జరిగిందని.. ఈ గొడవలో కాలేజ్‌ విద్యార్ధులకు సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఓ అమ్మాయి విషయంలో శివయ్య, భరత్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భరత్‌ గ్యాంగ్‌ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో శివయ్యపై దాడి చేసింది. భరత్‌, అతని స్నేహితులు మద్యం సేవించి శివయ్యను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ పీఎన్‌ బాబు.. నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement