ఓవరాల్‌ చాంపియన్‌గా ఆర్ట్స్‌ కళాశాల | Overall champions of the Arts College | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌గా ఆర్ట్స్‌ కళాశాల

Published Wed, Dec 14 2016 12:27 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

Overall champions of the Arts College

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఓవరాల్‌ చాంపియన్‌గా అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల జట్టు తన సత్తా చాటింది. సోమవారం నుంచి ప్రారంభమైన అంతర్‌ కళాశాలల అథ్లెటిక్స్‌ క్రీడా పోటీల్లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల జట్టు 136 పాయింట్లు సాధించి యూనివర్శిటీ పరి«ధిలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆర్ట్స్‌ కళాశాల 6 సార్లు తన ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుని డబుల్‌ హ్యాట్రిక్‌ను సాధించింది. ఆర్ట్స్‌ కళాశాల క్రీడాకారుడు వినయ్‌కుమార్‌ రెడ్డి అన్ని ఈవెంట్లలో కలిపి 16 పాయింట్లు సాధించాడు. బాలికల విభాగంలో అన్ని ఈవెంట్లలో 18 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌గా ఆర్ట్స్‌ కళాశాల క్రీడాకారిణి విజయలక్ష్మీ నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి.

 

మరిన్ని విజయాలు సాధించి జాతీయస్థాయికి చేరాలి – ఎస్‌కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రెటరీ జెస్సీ

మరిన్ని విజయాలు సాధించి జాతీయస్థాయి ఆల్‌ ఇండియా యూనివర్శిటీ లెవల్‌లో పతకాలు సా«ధించాలని ఎస్‌కేయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రెటరీ జెస్సీ తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన అంతర్‌ కళాశాలల అథ్లెటిక్స్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతి«ధిగా హాజరయ్యారు. ఆమెతో పాటు ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రంగస్వామి, రిటైర్డ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. ఆల్‌ ఇండియా లెవల్‌ యూనివర్శిటీ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్యూమినీ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీదేవి, కళాశాల అధ్యాపకులు సత్యనారాయణ, జయరామిరెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రెటరిలు జబీవుల్లా, వెంకటనాయుడు, జయరామప్ప, ఎస్‌ఎస్‌బీఎన్‌ పీడీ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజు విజేతలు:

ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు:

200 మీటర్లు బాలురు : మహేశ్వరరెడ్డి(సీఎంఐ అనంతపురం), వినయ్‌కుమార్‌రెడ్డి(ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం), మనోహర్‌(ఎస్‌కేయూ, అనంతపురం)

400 మీటర్లు బాలురు : మనోహర్‌(ఎస్‌కేయూ అనంతపురం), గిరీష్‌బాబు(ఎస్‌కేపీ గుంతకల్లు), ఉమర్‌(ఎస్‌ఆర్‌డీసీ పామిడి)

10 కీ.మీ బాలురు : రాజకుళ్లాయప్ప(ఎస్‌వీపీఈ హిందూపురం), నరేంద్ర(ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం), హరికృష్ణ(ఎస్‌కేపీ గుంతకల్లు)

ట్రీపుల్‌ జంప్‌ : వినయ్‌కుమార్‌(ఆర్ట్స్‌ కళాశాల అనంతపురం), సాయితేజ(ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ్యాణదుర్గం), వీరేష్‌బాబు(ఎస్‌వీపీడీ హిందూపురం)

4 ఇన్‌టు 100 రిలే : ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం–1, ఎస్‌కేయూ అనంతపురం–2, ఎస్‌వీపీడీ–3

200 మీటర్లు బాలికలు : లావణ్య(ఎస్‌కేపీ గుంతకల్లు), రమ(ఎస్‌వీపీఈ హిందూపురం), శ్రీలత(ఎస్‌వీపీఈ హిందూపురం)

3 కీ.మీ బాలికలు : గౌతమిబాయి(ఆర్ట్స్‌ కళాశాల అనంతపురం), మహాలక్ష్మీ(ఆర్ట్స్‌ కళాశాల అనంతపురం), స్వాతి(ఎస్‌కేపీ గుంతకల్లు)

4 100 రిలే బాలికలు : ఎస్‌వీపీఈ హిందూపురం–1, ఆర్ట్స్‌ కళాశాల అనంతపురం–2, శ్రీవాణి అనంతపురం–3

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement