అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నెహ్రూ యువ కేంద్రం అనంతపురం వారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ–2, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి, నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయకర్త శివకుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి అనంతపురం జిల్లాలో ఉత్తమ సంఘసేవ కార్యక్రమాలను పాల్గొని, నిర్వహించి విజయవంతం చేసినందుకు కమ్యూనిటీ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అధ్యక్షురాలు బేగంకు రూ.25 వేల నగదును జేసీ–2 చేతుల మీదుగా అందించారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు.
కార్యక్రమంలో పీడీలు వెంకటనాయుడు, నెహ్రూ యువ కేంద్రం డీడీఓ శ్రీనివాసులు, జాతీయ యువ కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పురుషుల విభాగంలో విన్నర్స్‌గా నార్పల జట్టు, రన్నర్స్‌గా అనంతపురం పాతూరు జట్టు, మహిళల విభాగంలో విన్నర్స్‌గా ఎస్‌ఎస్‌బీఎన్ జట్టు, రన్నర్స్‌గా పీటీసీ జట్టు, 100 మీటర్ల పరుగు పందెం పురుషుల విభాగంలో ప్రథమ స్థానం వినయ్‌కుమార్‌రెడ్డి, ద్వితీయ స్థానం షెక్షావలి, లాంగ్ జంప్ పురుషుల విభాగంలో వినయ్‌కుమార్‌రెడ్డి, మహిళల విభాగంలో లావణ్య విజేతలుగా నిలిచారు.
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
Published Sat, Mar 25 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
Advertisement
Advertisement