khaja moiddin
-
బాలల హక్కులు హరిస్తే కఠిన చర్యలు
అనంతపురం అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు నిర్ధేశించిన చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని జేసీ-2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ హెచ్చరించారు. బాల్యవివాహాల రహిత జిల్లాగా అనంతను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. మానవత్వంతో అనాథ పిల్లలకు సేవలందించాలనన్నారు. బాలల హక్కుల పరిరక్షణపై కలెక్టరేట్లోని తన చాంబర్లో ఐసీడీఏస్ పీడీ కృష్ణకుమారితో కలిసి జిల్లా ౖచెల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులతో గురువారం ఆయన సమీక్షించారు. పిల్లల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, ఆడపిల్లలపై వివక్ష, లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు, అనాథ పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. క్షేత్ర స్థాయిలో బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనాథ పిల్లల కోసం సదనాలు నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలు తప్పని సరిగా ఈ నెల 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించకోవాలని లేకుంటే బాలల న్యాయ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వివాహాలు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నిర్బంధ వివాహాల నమోదు చట్టం 2002 క్రింద నమోదు అయ్యేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్, భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణాధికారి సుబ్రహ్మణ్యం, సంరక్షణాధికారి వెంకటేశ్వరి, కౌన్సిలర్ చంద్రకళ, సోషల్ వర్కర్లు నాగలక్ష్మి, మురళీధర్, శ్రీలక్ష్మీ, భార్గవి, రామాంజినమ్మ, షామీర్, రాజేష్ పాల్గొన్నారు. -
చేతకాకపోతే వెళ్లిపోండి
- విద్యాశాఖ అధికారులపై ఇన్చార్జ్ జేసీ ఆగ్రహం అనంతపురం అర్బన్ : ‘ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవాలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి. ఉదాసీంగా వ్యవహరించడానికి వీల్లేదు. చర్యలు తీసుకోవడం చేతకాకపోతే బదిలీ చేయించుకోండి.’ అని అధికారులను ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఏ విధంగా ఉల్లంగిస్తున్నాయనే విషయాన్ని ఒక్కొక్కటిగా ఇన్చార్జ్ జేసీకి విద్యార్థి సంఘాల నాయకులు వివరించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను డీఈఓకి ఇచ్చామన్నారు. వాటిని పరిశీలించిన జేసీ అధికారులను ఉద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే అన్నారు. నిబంధనలు ఉల్లఘిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే సహించేది లేదని కలెక్టర్ స్వయంగా చెప్పారన్నారు. చర్యలు తీసుకోవడం చేతకాని పక్షంలో ఇక్కడి నుంచి వేరేచోటికి బదిలీ చేయించుకోండని ఆదేశించారు. అంతే తప్ప చూస్తూ ఊరుకుంటామంటే సహించబోమన్నారు. విద్యాసంస్థల ప్రతినిధులను ఉద్ధేశించి మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. కరువు జిల్లాలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఫీజు నిర్ణయించాలని, ఆ వివరాలను ఒక ఫ్లెక్సీలో పొందపరిచి విద్యాసంస్థలో ప్రదర్శనకు ఉంచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాం విక్రయాలు జరపకూడదన్నారు. నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ పగడాల లక్ష్మినారాయణ, ఆర్ఐఓ వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు బండిపరశురాం, మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్‌బాబు, నరేశ్, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు సాకే నరేష్, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నెహ్రూ యువ కేంద్రం అనంతపురం వారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ–2, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రంగస్వామి, నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయకర్త శివకుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి అనంతపురం జిల్లాలో ఉత్తమ సంఘసేవ కార్యక్రమాలను పాల్గొని, నిర్వహించి విజయవంతం చేసినందుకు కమ్యూనిటీ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలు బేగంకు రూ.25 వేల నగదును జేసీ–2 చేతుల మీదుగా అందించారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీడీలు వెంకటనాయుడు, నెహ్రూ యువ కేంద్రం డీడీఓ శ్రీనివాసులు, జాతీయ యువ కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పురుషుల విభాగంలో విన్నర్స్‌గా నార్పల జట్టు, రన్నర్స్‌గా అనంతపురం పాతూరు జట్టు, మహిళల విభాగంలో విన్నర్స్‌గా ఎస్ఎస్బీఎన్ జట్టు, రన్నర్స్‌గా పీటీసీ జట్టు, 100 మీటర్ల పరుగు పందెం పురుషుల విభాగంలో ప్రథమ స్థానం వినయ్‌కుమార్‌రెడ్డి, ద్వితీయ స్థానం షెక్షావలి, లాంగ్ జంప్ పురుషుల విభాగంలో వినయ్‌కుమార్‌రెడ్డి, మహిళల విభాగంలో లావణ్య విజేతలుగా నిలిచారు. -
యు«ద్ధ క్రీడలతో ఆత్మరక్షణ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తైక్వాండో లాంటి యుద్ధ క్రీడలు ఆత్మరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని జేసీ-2 ఖాజామోహిద్దీన్ అన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను ఆయన ప్రారంభించారు. శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి ఇలాంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బాలికలు ఇలాంటి రక్షణ క్రీడలు నేర్చుకోవడం చాలా అవసరమన్నారు. డీఎస్డీఓ బాషామోహిద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో తైక్వాండో చాలా అభివృ«ద్ధి చెందుతోందన్నారు. 2016 సంవత్సరానికి సబ్-జూనియర్, క్యాడెట్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షుడు గురుస్వామి మాట్లాడుతూ తైక్వాండో పోటీలు సోమవారం కూడా ఉంటాయన్నారు. మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ వెంకటేశులు, కోచ్ రామాంజినేయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు సబ్ జూనియర్ విభాగంలో బాలుర అండర్-11 పోటీల్లో 18 కేజీల విభాగంలో లిఖిత్, గుణసతీష్, ప్రశాంత్ వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. 21 కేజీల విభాగంలో గౌతంకృష్ణ, లక్షిత్, సాయితేజ, భువన్‌సాయి.., 23 కేజీల విభాగంలో రవికిషోర్, మహిత్ జీవన్, జ్ఞానేశ్వర్‌రెడ్డి, రాజ్‌కిరణ్‌రెడ్డి.., 25 కేజీల విభాగంలో కార్తీక్, మాలిక్‌బాషా, పవన్, సాయిఫణిరాం.., 27 కేజీల విభాగంలో సోహర్బాబా, విజయ్, సబర్బాషా, జై విష్ణు వరుసగా బంగారు, వెండి, కాంస్య(చివరి ఇద్దరు) పతకాలు సాధించారు. అలాగే 29 కేజీల విభాగంలో ధృవణ్, నరేంద్ర, కౌషిక్, నిఖిత్‌రెడ్డి.., 32 కేజీల విభాగంలో మణికంఠ, ప్రేమణ్కర్, వర్ధన్‌రెడ్డి, అలెన్ మ్యాథ్యూస్.., 35 కేజీల విభాగంలో ఆనంద్, లోకేష్‌కుమార్, సందీప్, ప్రేమ్‌సాయి.., 38 కేజీల విభాగంలో సోమసుందర్, అఖిల్, వంశీకుమార్, పుష్కర్ వరుసగా బంగారు, వెండి, కాంస్య(చివరి ఇద్దరు) పతకాలు సాధించారు.